మీరేమీ మాట్లాడరు. మాట్లాడటమంటే, "అన్నం వడ్డించు. నా షర్ట్ ఎక్కడుంది?" లాంటివి కాదు. మనసుతో మాట్లాడటం. ఆస్కార్ వైల్డ్ (ఈయన నాకెలా తెలుసు అని భృకుటి ముడవకండి) అన్నట్టు దాంపత్యంలోనూ. స్నేహంలోనూ మాటలు ముఖ్యంకదా! మీరు ఏ.....మీ మాట్లాడరు. అదే స్నేహితులతోనో బంధువులతో అయితే మాటలు వరదలా వస్తాయి. కోపగించుకోకండి ప్లీజ్. ఇద్దరం ఒకరి భావాలు ఒకరు చెప్పుకోకపోతే ఇక అర్థం చేసుకునేదెలా?

    మన పెళ్ళయిన కొత్తలో నేను హార్ట్ అయిందెక్కడో తెలుసా? నాకు విశ్వనాథ్ సినిమాలూ ముఖేష్ పాటలూ ఇష్టమన్నప్పుడు, మీరూ మీ చదువుకున్న చెల్లెలూ.....నన్నో జంతువుని చూసినట్టు చూసారు. రాక మ్యూజిక్ వినని, ఇంగ్లీషు నవలలు చదవ(లే)ని భార్య వచ్చినందుకు మీ చెల్లెలు మీకు ఇంగ్లీషులో  కండొలెన్సెస్ చెప్పింది. నాకాక్షణం జేమ్స్ జాయేస్ గుర్తొచ్చాడు. స్త్రీ తొందరతోనూ, పురుషుడు తప్పనిసరి అయినప్పుడూ వివాహం చేసుకుంటార్ట. రెండూ నిరర్థకమైన భవిష్యత్తుకే దారి తీస్తాయట. ఆ చాలామందిలో మనం ఒకటి కాకూడదనే ఈ వుత్తరం.

    కొన్ని కొన్ని మాటలు.....అసలు మీరా మాటలు అన్నట్టే నిముషాల్లో మర్చిపోతారు. అవి మాత్రం శ్మశానంలో శిలాఫలాకాల్లా శాశ్వతంగా మనసులో నాటుకుపోయి ఎంత వేదనకి గురిచేస్తాయో మీకు తెలీదు. నాలుగైదుసార్లు కాఫీ తాగే మీరు, పొద్దున్న ఒకేసారి గ్లాసునిండా తాగేవాళ్ళని చూసి, "ఇంత కాఫీయా? అందుకే నువ్వలా వున్నావ్" అంటే  ఒళ్ళు మండదూ. ఇది చిన్న విషయమనుకోండి. ఏ ఎగ్జిబిషన్ కో హొటల్ కో వెళ్తే, భార్యని తప్ప అందర్నీ ఏం  కావాలని అడిగే  భర్తని చూస్తే మనసు మయామాలవగౌళమవదూ? అలాగే..... ప్రయాణాల్లో మన  సామాన్లు వదిలేసి, వాడిననీ చెల్లెళ్ళవీ పట్టించుకోవటం గోప్పకోసమా? లేక  నిజంగా అంత ప్రేమ వుందా? అయినా నాకు తెలీక అడుగుతానూ......'నీ చీరెల సెలక్షన్ చెత్తగా వుంటుంది..... ఈసారి మా అమ్మతోనో చెల్లితోనో వెళ్ళు' అనే బదులు మీరు రావొచ్చుకదండీ!

    సరే వాళ్ళ సంగతి వదిలెయ్యండి. ఈ స్నేహితుల సంగతేమిటి? భార్యకంటే వీళ్ళే ఎక్కువ దగ్గిరవుతారు దేనికి?.....మీ దృష్టిలో వీళ్ళకీ, వీళ్ళ భార్యలకీ వున్నంత తెలివితేటలూ, విజ్ఞానమూ మీ భార్యకి లేవు. ఆ విషయం వాళ్ళముందు వెల్లడించటానికి కూడా వెనుదియ్యరు మీరు. అవునా.

    ఆ వెటకారం గుండెల్ని రంపంలా కోస్తుందండీ. చీరె కట్టకుని అద్దంలో చూసుకుంటూంటే వెనుకనుంచి ఎగతాళిగా, "చాల్లే, అందంగా వున్నావ్" అన్నా, "ఈ రోజు ఈ చీరె కట్టుకోనా" అని వుత్సాహంగా దగ్గిరకొస్తే, "లేదు, విప్పుకొని తిరుగు" అని, ఆ జోకుకి మీలో మీరే నవ్వుకున్నా.....ఒక రోజు తలనొప్పిగా వుందంటే, "ఇంట్లో హాయిగా కూర్చున్నా వస్తాయా తలనొప్పులు? బయటకొచ్చి సంపాదించు తెలుస్తుంది అసలు నొప్పి" అని విషయం చెప్పనా? మీకు సంతోషం ఇవ్వని ఇల్లు నాకూ సంతోషం ఇవ్వదు. మీరు లేని ఒంటరితనం నాకు చాలా నిర్లిప్తంగా వుంటుంది ఈ ఇంట్లో. ఉన్న వొక్క అడివారమూ కూడా మీరు నాతో గడపరు. భార్యలో లేని ఆకర్షణ స్నేహితుల్లో కనపడటం దారుణం కదూ! సాయంత్రం వరకూ వాళ్ళతో పేకాడటంకోసం, "రాత్రికి రావటం ఆలస్యం అవుతుందేమో. నా కోసం వెయిట్ చెయ్యకు" అని ఒకమాట అనేసి వెళ్ళిపోతే నాకు ఎలా వుంటుందో ఒక్కసారి వూహించండి. స్నేహితుల్తో ఎన్ని సినిమాలయినా చూడొచ్చుగానీ భార్యతో రావాలంటే మాత్రం తీరికుండదు. అవునా. ఏవండీ, ఒక్కమాట చెప్పండి. ఇంట్లోంచి బయటకు వెళ్ళాలని మాకు మాత్రం వుండదూ? రెండురోజులు.....అక్షరాలా నలభై ఎనిమిది గంటలు ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా ఒకసారి గడిపి చూడండి మీకు తెలుస్తుంది.

    ఇదంతా నరకమండీ!

    మనం సృష్టించుకున్న నరకం!

    మనం మన చేతుల్తో స్వయంగా నాశనం చేసుకుంటూన్న పూలవనం. ప్రోద్దున్నా, మధ్యాహ్నం, సాయంత్రం....అంతా రొటీన్. రొటీన్ గానే రాత్రి కూడా వస్తుంది. అదీ ఒక నరకమే......ఎప్పుడో తెలుసా? అలసిపోయివుంటే, " చేసి అలసిపోయావ్?" అని ముందో అయిదు నిముషాలు దెప్పిపొడిచి, ఆపైన అరగంట బ్రతిమిలాడి ఒప్పించి, మూడు నిమిషాల తరువాత, ఇటైతే చిరాకని అటుతిరిగి పడుకోవటం.....ఎంత దిగులుగా వుంటుందో మాటల్లో చెప్పలేనండీ.

    WHEN YOU HOLD ME AND SLEEP - EVEN AFTER A GOOD LOVE -MAKING', ......IT IS REAL LOVE.

    WHEN YOU STLL HOLD ME AFTER AWAKENING FROM SLEEP...IT IS BEYOND LOVE.


    అలాటి 'బియాండ్ లవ్' కోసం నేనేం చేయాలో , నాతరపున నుంచి ఏయే తప్పులు సరిదిద్దుకోవాలో చెప్పండి. మీరేం చెప్పినా చేస్తాను. మీ.....నేను"

    ఆమె మళ్ళీ ఒకసారి చదువుకుంది. తను వ్రాసిన చివరి వాక్యాలు తనకే బాగా నచ్చినట్టు అనిపించాయి.

    మంచి శృంగారపుటనుభవం తర్వాత కూడా నువ్వు నన్ను కౌగలించుకుని నిద్రపోతే అది నిజమైన ప్రేమ. నిద్రలేచిన తరువాత కూడా అలాగే కౌగిలిలో వుంచుకోగల్గితే అది ప్రేమకన్నా ఎక్కువ.

    ఆమె సంతృప్తి చెందింది. ఆ వుత్తరం తన భర్తకి ఎలా అందజేయాలా అని ఆలోచించింది. అతనికి అందేలా ఎక్కడన్నా పెడితే బావుణ్ణు అనిపించింది. అంతలోనే అతడా సాయంత్రం వూరెళ్తూన్నానని, బ్రీఫ్ కేస్ సర్ధమని చెప్పటం గుర్తొచ్చింది.

    విష్ణు నెలకొకసారి ఆఫీసు పనిమీద బ్రాంచికి వెళ్తూంటాడు. ఒకరోజు పని వుంటుంది. బ్రాంచి వుండేది వరంగల్ లో.

    వుత్తరం ఆ బ్రీఫ్ కేస్ లో పెడ్తే?......అనుకుంది. అదే సరిఅయిన ఆలోచనగా తోచింది. అతడేలాగూ బట్టలు సర్ధమని చెప్పాడు.

    ఆమె తన వుత్తరాన్ని తీసుకుని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళింది. అద్దం పక్కన దాన్నిపెట్టి క్రిందనుంచి బ్రీఫ్ కేస్ తీసింది. అతడు బ్రాంచి ఆఫీస్ కి వెళ్తే వుండేది ఒకరోజే కాబట్టి రెండు జతల బట్టలు, నైట్ డ్రస్ చాలు.

    అవి తీసి  అద్దం పక్కన పెట్టి , బాత్ రూమ్ లోకి వెళ్ళింది. టూత్ పేస్ట్, బ్రష్ తీసుకొచ్చి బ్రీఫ్ కేస్ లో సర్దింది. ఆ తరువాత బట్టలు వరుసగా పేర్చింది. అన్నిటికన్నా పైగా టవల్, సోప్ పెట్టింది.

    చివరికి తను వ్రాసిన వుత్తరం మిగిలింది!

    ప్రొద్దున్న ఫ్రెష్ గా చదివితే బావుంటుంది. అందుకని....టూత్ పేస్ట్ చుట్టూ ఆ వుత్తరాన్ని చుట్టింది. ఆమె పెదవులమీద అప్రయత్నంగా చిరునవ్వు కదలాడింది. టూత్ పేస్ట్ బ్రీఫ్ కేస్ పై తోలు అరలో పెడ్తూండగా, అందులో మరికొన్ని కాగితాలు తగిలాయి. తీసిచూస్తే అవి హొటల్ బిల్లులు. బిల్లుమీద ఎమ్మీ మూర్తి అని వుంది.

    ఆమెవాటికి తిరిగి లోపల పెట్టెయ్యబోతూ ఆగింది. హొటల్ బిల్స్ తో పాటు మరో బిల్ వుంది, పైనే పెద్ద అక్షరాల్తో ఆ షాపు పేరుంది.

    'ఇంటాక్సికేషన్స్'

    అప్పుడామె ఆ హొటల్ బిల్స్ చూసింది. అవి  తమవూరి స్టార్ హొటల్ బిల్సు! 'ఇంటాక్సికేషన్స్' అన్నది ఆ హొటల్ క్రింది అంతస్తులో వున్న బట్టలషాపు. ఆమెకొక క్షణం అర్థం కాలేదు. బిల్ మీద చూసింది.

    '1నెం. గార్డెన్ వెరైలీ సారీ రూ.350' అనివుంది. అతడు తనకి స్వయంగా చీరె కొనితెచ్చి రెండు సంవత్సరాలకు పైగా అవుతుంది! ఆమె  ఆ బిల్ మీదవున్న తేదీ చూసింది. హొటల్ బిల్ మీదవున్న తేదీ కూడా అదే......ఆగస్టు....12. సరిగ్గా నెలక్రితం పన్నెండో తారీఖు ఈ వూళ్ళోనే.....అతడా హొటల్లో వున్నట్టు బిల్లు! అతడు క్రితం నేల బ్రాంచి ఆఫీసుకి వెళ్ళిన రోజు అది!!! మధ్యాహ్నం రెండింటికి విష్ణు వచ్చాడు. ట్రెయిన్ కి ఇంకో అరగంటే టైమ్ వుండటంతో హడావుడిగా, బ్రీఫ్ కేస్ సర్దావా?" అని అడిగాడు.

    ఆమె తలూపింది. అతడు తెరిచి చూసాడు. రైల్లో తిరుగు ప్రయాణానికి పెట్టిన  జత తీసి లోపల పెట్టేసి, మరో మం.చి జత బట్టలు లోపల పెట్టుకున్నాడు. ఆమె అతడికోసం కాఫీ తయారు చేసి తీసుకోస్తూండగా, పెర్ ప్యూమ్ బాటిల్ బ్రీఫ్ కేస్ లో పెట్టుకోవటం కనిపించింది.

    అయిదు నిముషాల్లో అతడు తయారై వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ 'ఎల్లుండి ప్రొద్దున్న వస్తా'నని చెప్పాడు. ఆమె తలూపింది. అతడు వెళ్ళాక ఆమె  సాయంత్రం వరకూ అలాగే కూర్చుండిపోయింది. ఏ పనీ చేయలేదు. ఆమె కళ్ళముందు ఒక వాక్యం కదలాడుతోంది.

    గార్డెన్ వెరైలీ. మూడొందల యాభై రూపాయలు....

    సాయంత్రమయ్యాక ఆమె ఇల్లు తాళం వేసి బయటకొచ్చింది. సెప్టెంబరు మాసమవటంతో కొద్ది కొద్దిగా చలి అప్పుడే ప్రారంభమయింది.

    ఆమె హొటల్ దాశ్ ప్రకాష్ కి  చేరుకునేసరికి బాగా చీకటిపడింది. లోపలికి ప్రవేశించింది. రిసెప్షన్ పక్కనే విశాలమైన వరండా. వరండా చివర షాపు రష్ గా వుంది. 'ఇంటాక్సి కేషన్స్.'

    ఆమె రిసెప్షనిస్ట్ దగ్గిర ఆగి, "మిస్టర్ ఏమ్మీ మూర్తి రూమ్ నెంబర్ చెప్తారా?" అని అడిగింది. రిసెప్షనిస్టు చిరునవ్వుతో, "ఎప్పుడొచ్చారో చెప్పగలరా మాడమ్?" అని అడిగింది.

    "ఈరోజు మధ్యాహ్నం"   

    ఆమె రికార్డ్  చూసి, రూమ్ నెంబర్ 314"  అంది.

    లక్ష్మి లిప్ట్ దగ్గరకివెళ్ళి "థర్డ్ ఫ్లోర్" అని చెప్పింది.

    రెండు నిముషాల తరువాత లిప్ట్ మూడో అంతస్థులో ఆగింది. విశాలమైన వరండా.

    310....311...312....313....314...

`    ఆమె ఆగింది. గది ముందు నిలబడి, గాఢంగా లోపలికి ఒకసారి శ్వాస పీల్చుకుని కాలింగ్ బెల్ మీద వేలు ఆన్చి నొక్కింది. లోపల బెల్ మ్రోగుతున్న శబ్దం. ఎవరో తలుపుదగ్గరకి వస్తున్న అలికిడి.

    తలుపు నెమ్మదిగా  తెరుచుకుంటూండగా ఆమె కళ్ళు మూసుకుంది.

    ఎందుకో తెలీదు. కళ్ళు మూసుకుంది. అలా ఎంతసేపుందో తెలీదు. క్షణమో.....నిముషమో....కళ్ళు తెరిచేసరికి తననే చూస్తూ ఎదురుగా విష్ణు వున్నాడు. అప్పటివరకూ కళ్ళు మూసుకుని వుండటంవలన తనని చూడగానే అతడి ఫీలింగ్ ఏమిటో తెలియలేదు.

    అతడు తలుపు తెరిచి, అడుగు వెనక్కివేసి, 'కమిన్' అన్నాడు. క్షణంపాటు అతడేం చెప్పాడో అర్థం కాక ఆమె బ్లాంక్ గా చూసింది. అతడు మళ్ళీ "కమిన్......" అన్నాడు లోపలికి నడుస్తూ....

    ఆమె అప్రయత్నంగా అతడిని అనుసరించింది.

    సోడాలింకా ఓపెన్ చేయలేదు. వాటితోపాటు బల్లమీద లిమ్కా జిన్ వున్నాయి. సెంట్రల్లీ ఎయిర్.....కండిషన్డ్ అవటం వల్ల  శబ్దం లేకపోయినా, గది చల్లగా వుంది. ఛానల్ టి.వి.లో సన్నగా పాట వస్తోంది.

    బాత్ రూమ్ పక్కనుంచి దారి. ఆ తరువాత విశాలమైన హాలు, హల్లో.... సోఫాలో కూర్చునివుంది ఆమె. వయసు పాతిక వుంటుంది. ఆధునికంగా వుంది.

    "నా భార్య లక్ష్మి" అంటూ ఆమెకి పరిచయం చేసాడు.

   
                                     3


    ఆ అమ్మాయికి విష్ణు చెపుతూన్నది మొదట అర్థం కాలేదు, అర్థమవగానే అదిరిపడి చూసింది. లక్ష్మి పరిస్థితి కూడా అలాగే వుంది.

    అతడు గ్లాసుల్లోకి విస్కీవంపుతూ, "........కూర్చో" అనగానే అసంకల్పితంగానే కూర్చుంది. అతడు అవసరమైన దానికన్నా ఎక్కువ ఏకాగ్రతతో డ్రింక్ కలిపి ఒక గ్లాసు ఎదురుగా వున్న అమ్మాయికి అందించి, "బైదిబై" ఈమె సుచరిత. మా ఆఫీసే" అన్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra