Home » Yandamuri veerendranath » మరణ మృదంగం


    అనూష నవ్వి "కంగారేమీ లేదులెండి" అంది.

    "నీకు తెలీదు. ఇక్కడే తెలివితేటలు ముఖ్యం. సంవత్సరం తిరిగేసరికల్లా నేను చెపుతున్నాను చూడు- బ్రాల స్థానే ఈ ఎస్. ఎల్.బి.లు ప్రతీ వంటి మీద కనబడకపోతే చెవి కోసుకుంటాను.........."

    "మన భారతీయులు అంత తొందరగా మారరు"

    "సంవత్సరంలో కాకపోతే రెండు సంవత్సరాలలో మారుతారు. ఒకప్పుడు మనవాళ్ళు బాడీలు వేసుకునేవారు. బ్రాసరిలు వచ్చినకొత్తలో తటపటాయించారు. ఇప్పుడు చూడు. బజార్లో కాగడా పెట్టి చూసినా ఒక్క పాత కాలపు నాదీ కనపట్టం  లేదు. అసలు నా వూహ నిజమైతే ఆ పాటికే  ఆ 'రతీ కంపెనీ' షేర్ల ధర విపరీతంగా పెరిగివుండాలి".

    "కొత్త వస్తువు కనుక్కోగానే మరీ అంత తొందరగా ధర పెరగుదులెండి. అయినా చూద్దాం" అని ధరల విభాగానికి ఫోన్ చేసింది.

    "రతీ కంపెనీ షేర్ ధర ఎంత వుంది?"

    "పదకొండు రూపాయిలు మాడమ్"

    "నిన్న?"

    "పదిన్నర"

    ఆమె తలపంకించి ఫోన్ పెట్టేస్తూ "మీరు చెప్పింది నిజమే. ధర పెరిగింది" అంది.

    "అమ్మాయ్, నాకు ఓ లక్ష రూపాయల షేర్లు కొను".

    అనూష  ఆశ్చర్యంగా "లక్షా!" అంది.  "చాలా చిన్న కంపెనీ అది. పైగా దాని స్థితిగతులు అంత  బావున్నట్టు కూడా లేదు. ఇంకో రెండు రోజులు ఆగితే?"

    "అప్పటికి ధర మరీ పెరుగుతుంది. మారే ఆడవాళ్ళ అభిరుచుల గురించి నీకన్నా నాకు ఎక్కువ తెలుసు. కాదంటావా? మార్కెట్ లో రేపట్నుంచీ ఈ ఎస్.ఎల్. బ్రాసరీలు రావడం మొదలు పెట్టినాయనుకో. నీ లెక్క ప్రకారం, వచ్చే ఏడాదికి ఎంతమంది ఈ రకం వాడతారు. లెక్క కట్టి చెప్పు. అమ్మాకాలు ఎలా  వుంటాయి?"

    ఆమె కాలిక్యులేటర్ తీసుకుని పేపర్ మీద అయిదు  నిమిషాలు లెక్కలు వేసింది. మారే అభిరుచులు..... రిస్క్ ఎలిమెంటు.........జనాభా ....... అన్నీ చేసి, "కంపెనీ బ్యాలెన్స్ షీటు నేను చూడలేదు. కేవలం మార్కెట్  ఒక్కటే లెక్కలోకి తీసుకున్నట్టయితే వచ్చే ఏడాదికి ఈ లక్షమీదా లాభం కనీసం నలభైవేలుండవచ్చు" అంది.

    "ఒకవేళ మన భారతస్త్రీలు ఈ జారే బ్రాలని ఆదరించలేదనుకో. మనకొచ్చే నష్టం ఎంత?

    ఆమె నవ్వి "ఐదు వేలు" అంది.

    "నలభై వేల లాభం కోసం అయిదువేలు రిస్కు తీసుకోలేనివాడు వ్యాపారవేత్త  కాడు".

    ఆమె ఫారం అతడి ముందుకు తోసింది. అతడు సంతకం పెట్టాడు. లక్ష రూపాయిల దాకా అరువు మీద అమ్మే అధికారం ఆమెకుంది. ఆమె మిగతా ఫారం  అంతా పూర్తిచేసి మరో డిపార్ట్ మెంట్ కి పంపింది.

    అతడు లేస్తూ "రేపటికి మరో అర్ధరూపాయి పెరిగింది అనుకో - నువ్వూ, మీ  ఛైర్మనూ డిన్నర్ కి రావాలి" అన్నాడు.

    "రేపటికే పెరగాలనుకోవడం అత్యాశ. కానీ మీ డిన్నర్ కోసమైనా అలా  అవ్వాలని  కోరుకుంటున్నాను" అంది. ఆయన వెళ్ళిపోయాడు.

    రామసుబ్బారావు వెళ్ళిపోయిన అయిదు నిమిషాలకి తలుపు దగ్గిర చప్పుడయింది.

    ఉత్పలమాల!

    "బిజీగా వున్నారా?"

    "లేదు లేదు. రా" ఆహ్వానించింది అనూష.

    ఉత్పల మొహం ఏదో అడగాలన్న ఉత్సకతో మెరిసిపోతోంది. వచ్చి కుర్చీలో కూర్చుంటూ, "నాకు మీరెలా  చెప్పారో ఇప్పటికీ అర్థం కావడంలేదు". ఈ పది రోజుల్లోనూ కనీసం యాభైసార్లన్నా ప్రయాణం చేసివుంటాను. దాదాపు నలభైసార్లు లైబ్రరీ వైపు వెళ్లాను. పదిసార్లు మాత్రమే బ్రహ్మం ఇంటివైపు వెళ్ళాను. ఇదెలా సాధ్యమైంది?" అని అడిగింది.

    "మొత్తం మీద ఏం నిర్ణయించుకున్నావు?"

    "లైబ్రరీ వైపు వెళ్ళటానికే.........."

    "గుడ్. నీ జీవిత గమ్యాన్ని సిటీ బస్ నిర్ణయించిందన్నమాట" అంది అనూష.

    "గమ్యం సంగతి సరే....... మీరింత ఖచ్చితంగా ఎలా చెప్పారో అర్థం కావడంలేదు. అంది ఉత్పల పదిరోజుల క్రితం జరిగిన సంగతి గుర్తుతెచ్చుకుంటూ......

    పది రోజుల క్రితం జరిగినది........


                                                    *    *    *

    "మీరడిగినట్టు ఆ రోజు మేమేం మాట్లాడుకున్నామో కాగితం మీద వ్రాసి తీసుకొచ్చాను" అంది ఉత్పల హ్యాండ్ బ్యాగ్ లో చెయ్యి పెడుతూ.

    "కాగితం ఏమిటి?"

    "అదే..... నేనూ రామబ్రహ్మం - ఆ  రోజు పార్కులో ఏం మాట్లాడుకున్నామో అది- అతడితో మాట్లాడుతూనే మనసులోనే నోట్ చేసుకున్నాను".

    "ఏది ఆ కాగితం?" అని అందుకుని చూసింది. ఒక వ్యాసంగా వుందది. వరుసగా పాయింట్లుగా వాటిని మారిస్తే- అవి ఇలా వున్నాయి.

    1. కలుసుకోగానే మాట్లాడుకున్నది- కొత్త ఉద్యోగం ఇంటర్వ్యూ గురించి (పదినిమిషాలు) -తనకింకా ఉద్యోగం రాకపోవడం గురించి- నిస్పృహ వెలిబుచ్చాడు తను.

    2. కొత్తగా రిలీజయిన మిథున్ చక్రవర్తి సినిమా - జితేంద్రకి ఈ మధ్య మార్కెట్ తగ్గిపోతుందని అన్నాడు. (పది నిమిషాలు) మధ్యలో ఇళయరాజా గురించి మాట్లాడుకున్నారు.

    3. తన ఇంట్లో తనని అన్నయ్యలు సరిగ్గా  చూడరని- రెండో వదినొక్కతే మంచిదనీ, ఆ మంచితనం గురించి చెప్పాడు. తన చిన్నక్కయ్య ఎంత మంచిదో తను చెప్పింది. మొత్తం దాదాపు పదకొండు నిమిషాలు ఈ సంభాషణ జరిగింది.

    4. కటావ్ వాయిల్స్ చీరెల ప్రసక్తి వచ్చింది. తన  కిష్టమంది తను. ఆడవాళ్ళ లేటెస్ట్ ఫ్యాషన్స్ మీద ఇద్దరూ మాట్లాడుకున్నారు. (లేక పరస్పరం విచారం వెలిబుచ్చారు. సంస్కృతి పోతున్నందుకు బాధపడ్డారు అయిదు నిమిషాలు.)

    5. తనకి చిన్నప్పుడు జరిగిన ట్రాన్సిల్స్ ఆపరేషన్ గురించి చెప్పింది. స్నేహితుడి స్కూటర్ మీద వెళుతుంటే జరిగిన యాక్సిడెంట్ గురించి అతడు చెప్పాడు.

    6. స్నేహితుడి పెదనాన్న కొడుకు ఇంటికి 'టీ' కి వచ్చిన ఒక రచయిత, అక్కడ ఎంత గర్వంగా ప్రవర్తించిందీ-ఆ పెద్దనాన్న కొడుకు తన స్నేహితుడికి చెపితే- ఆ స్నేహితుడు తనకి చెపితే- అది అతడు ఆమెకి చెప్పాడు.

    7. చిన్న వదిన మ్యాచింగ్ ఫాల్  తెమ్మందని- తోడు రమ్మని అతడు  కోరాడు. మరుసటి రోజు పార్కులో కలుసుకోకుండా గాంధీ బొమ్మ దగ్గర కలుసుకుంటే అట్నుంచి షాపింగ్ కి వెళ్ళి ఒక ఫాల్ - అయిదు రూపాయిలకు మించకుండా కొనాలని నిర్ణయించారు. ఒకవేళ ఈ లోపులో ఉద్యోగం గురించి పిలుపోస్తే తొందరగా వెళ్ళిపోవలసి వస్తుందనీ- అరగంట కన్నా ఎక్కువసేపు షాపింగ్ కుదరదేమో అంది. తనకి ఉద్యోగం లేకపోవడం గురించి అతడు మళ్ళీ విచారం వెలిబుచ్చాడు. ఆమె ధైర్యం చెప్పింది. ఈ మాత్రం ఓదార్పు ఇచ్చేవాళ్ళు లేక ఇలా తయారయ్యానని అతడు అన్నాడు. పెళ్ళయ్యాక నన్ను మార్చిపోతానా ఉత్పలా అని అడిగాడు. పెళ్ళి గురించి ఆలోచన ఏమీ  లేదంది. ఈ లోపులో వేరుశనక్కాయల కుర్రవాడు వచ్చాడు.

    8. ఇద్దరూ లేచి బస్ స్టాప్ దగ్గరకి వచ్చారు. చాలాసేపటి వరకూ బస్సు రాలేదు. బస్సుల్ని కొంచెంసేపు తిట్టుకున్నారు. ఆలస్యమయిపోతే ఇంట్లో తిడతారని భయపడింది. (మొత్తం పదిహేను నిమిషాలు)

    గ్రాండ్ టోటల్ : రెండున్నర గంటలు

    అనూష కాగితం చదవడం పూర్తిచేసి తలెత్తింది "వున్నదున్నట్టు వ్రాసినట్టున్నావే" అంది.

    "అవును కాని నాకు అర్థం కాలేదు మీరెందుకు ఇలా వ్రాయమన్నారో-"

    "నేను నా జీవితంలో ఏమైనా మిస్ అయ్యానేమో తెలుసుకోవడానికి- కానీ ఇది చూసిన తరువాత నేనేం పోగొట్టుకోలేదని అర్థమైంది".

    "మీరేం మాట్లాడుతున్నారో నాకు  అర్థం కావడంలేదు."

    "జీవితం ఒక లెక్కలాంటిదయితే, చేసేసిన ప్రతి స్టెప్పూ మళ్లీ ఒక్కసారి పరిశీలించి చూసుకుంటే మొత్తం లెక్క తప్పటానికి వీలుండదు. అందుకే నిన్ను సాయంత్రం మనమెలా గడిపామో వెనక్కి తిరిగి పరిశీలిస్తే, రేపు  సాయంత్రం ఇంతకన్నా  బాగా ఎలా గడపొచ్చు అన్నది  ఆలోచించుకునే వీలుంటుంది. అలా పరిశీలించడం కోసమే  అదంతా నిన్ను వ్రాయమన్నాను. చెప్పు ఉత్పలా! బాగా ఆలోచించి చెప్పు. ఈ  రెండున్నర గంటల్లో - ఒక్కటి కనీసం ఒక్కటి- లాభసాటి అయినది-జ్ఞానాన్ని పెంపొందించేది- అంత పెద్ద మాటలు అక్కర్లేకపొతే- కనీసం  మనసుకి ఆహ్లాదం కలిగించేది-ఒక్కటి మాట్లాడుకున్నారా మీరు?"

    ఆమె అంత అకస్మాత్తుగా, సీరియస్ గా అలా అనేసరికి ఉత్పల బిత్తరపోయింది. కానీ  ఆమె కూడా అంత తెలివితక్కువది కాదు.

    "అయితే స్నేహమూ, ఒకరితో ఒకటి మాట్లాడుకోవడమూ అంతా తప్పంటారా?"

    "అతడిని నువ్వు పెళ్ళి చేసుకోబోతున్నావా?"

    "లేదు, ఇంకా ఆలోచించలేదు".

    "పెళ్ళి ప్రసక్తి లేకుండా అతడితో శారీరిక సంబంధం పెట్టుకోవాలను కుంటున్నావా?"

    ఉత్పల మొహం అసహ్యంగా మారింది. సిగ్గుతో ఎర్రబడిన మొహంతో "ఛీ......ఛీ...." అంది.

    అనూష మాత్రం  తాపీగా అంది.

    "-మరెందుకు ఉత్పలా అతడితో- ఇంట్లో తెలియకుండా- ఆలస్యమయితే ఇంట్లో తిడతారని అనుక్షణం భయపడుతూ- పార్కుల్లో దొంగతనంగా కలుసుకోవడం. మీ ఇంట్లోనే కలుసుకోవచ్చుగా. ఆగు నువ్వు చెప్పకు. నీ ప్రశ్న నాకు తెలుసు. మీ వాళ్ళకి ఆ స్నేహాన్ని అర్థంచేసుకునే సంస్కారం లేదు. ఎలా? అన్నదే నీ ప్రశ్న అయితే ఎందుకు ఒక మగవాడితోనే స్నేహం చేయడం? అన్న మరో ప్రశ్న నా దగ్గర సిద్ధంగా వుంది. చీరఫాల్స్ గురించీ, మిథున్ చక్రవర్తి మొదటి రోజు కలెక్షన్స్ గురించి మాట్లాడేవాళ్ళు అమ్మాయిల్లోనే మనకి దొరుకుతారుగా-"

    "ఎంత కాదనుకున్నా ఒక ఆకర్షణ వుంటుంది. ఒక వయసులో ఈ ఆకర్షణ నుంచి ఎవరూ తప్పించుకోలేరు".

    "కానీ ఎంత తొందరగా దాన్నించి బయటపడితే అంత తొందరగా ఎదుగుదల ప్రారంభమవుతుంది. దానికి రెండే మార్గాలు. చేతివేళ్ళ స్పర్శానుభవ పరవశం నుంచి అసలు విషయానికి తొందరగా వెళ్లిపోవడం- లేక శుభ్రంగా పెళ్ళిచేసుకోవడం".

    "పెళ్ళి చేసుకోవడానికి ముందు ఒకర్నొకరు తెలుసుకోవాలిగా!"

    "ఒకర్నొకరు తె......లు...సు....కో.....వ....టం! మూడో క్లాసు ఫేలయిన అమ్మాయిలా మాట్లాడక ఉత్పలా! ఏమిటి పార్కూల్లోనూ, హొటళ్ళలోనూ కూర్చొని గంటల తరబడి మాట్లాడి నువ్వు తెలుసుకునేది? Both of you will try to show the best part of faces to each other..... అంతేగా!"

    ఉత్పల చాలాసేపు మాట్లాడలేదు. చివరికి నెమ్మదిగా అంది. "నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. ఈ ఆకర్షణ అన్నది సృష్టిలోనే వున్నట్టుంది".

    అనూష నవ్వింది. "పోనీ లాటరీ వేస్తావా?"

    "లాటరీనా?"

    అనూష నవ్వుతూనే కాగితంమీద గీసింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra