Home » Yandamuri veerendranath » అతడు ఆమె ప్రియుడు

 

      సిరిచందన చిరుకోపంతో "సర్లెండి, చీకట్లో మీ మీదేమైనా హఠాత్తుగా పడితే అప్పుడు తెలుస్తుంది" అంది.

    "చీకట్లో ఏమిటి..... నాకు పగలైనా రాత్రైనా చీకటేగా" అన్నాడు రవితేజ.

    ఆమె మొహంలో నవ్వు మాయమైంది "మీరు మాటిమాటికీ ఇలా ఆ విషయం గుర్తుచేస్తే నాకు బాధగా వుంటుంది" అంది.

    "ఐయాం సారీ!" ఆమె టాపిక్  ఛేంజ్ చేస్తూ "నేను స్నానం చేసి వస్తాను" అంది.

    "ఇంత అర్థరాత్రి స్నానమా?" అన్నాడు ఆశ్చర్యంగా.

    "అవును. లేకపోతే భయంతో నిద్రపట్టదు" అంటూ టవల్ తీసుకొని బాత్ రూంకి వెళ్ళింది.

    రవితేజ బెడ్ రూం తలుపు గడియ వేశాడు.

    ఈలోపు మహర్షి తన పక్కబట్టలు తీసుకొని గెస్ట్ హౌస్ లోకి ప్రవేశించాడు.

    బాత్ రూంలో స్టాండుమీద టవల్ వేసి, సిరిచందన మళ్ళీ బయటికి వచ్చింది. గెస్ట్ హౌస్  మెయిన్ తలుపు వేసి, తిరిగి బెడ్ రూంలోకి వెళ్ళింది. గెస్ట్హౌస్ లో వున్నది తామిద్దరే అన్న ఉద్దేశ్యంతో ఆమె బెడ్ రూమ్ తలుపు వేయలేదు.

    "స్నానం అయిపోయిందా? అని అడిగాడు రవితేజ.

    "లేదు, వెళుతున్నాను" అంటూ ఆమె బాత్ రూం లోకి ప్రవేశించ బోయింది.

    "నాదో చిన్న రిక్వెస్ట్! తీరుస్తావా?"

    "ఏమిటి?"

    "స్నానం చేసి నైటీ వేసుకోకుండా అలాగే వచ్చేయ్"

    సిరిచందన మొహం ఎర్రబడింది "ఛీ!" అంది సిగ్గుతో.

    "ఏం మనిద్దరం భార్యాభర్తలమేగా! అదీగాక, ఒకవేళ వెంటిలేటర్ లోంచి వెలుతురు పడుతున్న కూడా నేను నిన్ను ఎలాగూ చూడలేను."

    సిరిచందన మొహంలో బాధ తొంగి చూసింది. "అదుగో, మీరు మాటిమాటికి లా అనొద్దనే నేను కోరుకున్నది" అంది.

    "మరి నేనలా అనకుండా ఉండాలంటే నేను చెప్పిన పనులన్నీ నువ్వు చెయ్యాలి."

    ఆమె నిశ్శబ్దంగా బాత్ రూం లోకి ప్రవేశించింది. లోపల షవర్ నించి పడుతున్న నీళ్ళశబ్దం వింటూ  రవితేజ అలాగే కూర్చుండిపోయాడు.

    రెండు నిమిషాల్ తర్వాత బాత్ రూం తలుపు తెరుచుకుంది.

    ఆమె టవల్ చుట్టుకొని బయటికి వచ్చింది. ఆమె తెల్లటి శరీరంమీద బిందువులు అందంగా మెరుస్తున్నాయి. ఆమె దగ్గరగా వచ్చి పక్కమీద  కూర్చోబోతూ ఉండగా, అతడు ఆమె మెడమీద చెయ్యివేసి చేతిని కిందికి జరుపుతూ "టవలుంచుకున్నావు కదూ?" అన్నాడు.

    నునుసిగ్గుతో "ఊ!" అంది.

    అతడు నెమ్మదిగా టవలువిప్పి దూరంగా విసిరేశాడు. ఆమె  గువ్వలాగా  ముడుచుకుపోయింది. అప్రయత్నంగా బ్లాంకెట్ మీదకు లాక్కుంది.  అతను దాన్ని కూడా చేతులతో పక్కకు లాగేసాడు.

    "ప్లీజ్!" అన్నదామె.

    అతను ఆమెనలాగే పొదివి పట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు.

    బాత్ రూం లోంచి ఇంకా నీటిచప్పుడు వినబడుతూండటంతో, పంపు పూర్తిగా కట్టివేయబదలేదని ఆమె కర్థమైంది.

    మాములు పరిస్థితుల్లో అయితే భర్తముందు అంత నగ్నంగా అలా  నడిచి వుండేది కాదేమోకాని, అతను చూడలేదన్న వాస్తవం మనసులో ముద్రించుకుపోయి ఉండటం వల్ల - ఆమె మామూలుగానే లేచేళ్ళి, బాత్ రూం పైపు కట్టేసి,తలుపు దగ్గిరగా వేసి, తిరిగివచ్చి మంచంమీద అతనిపక్కన పడుకుంది. ఆమె అలా నగ్నంగా నడుస్తూంటే ఎల్లోరా శిల్పం కదులుతున్నట్టు వుంది. ఎత్తయిన  వక్షద్వయం జఘనానికి లయగా కదిలింది.

    ఆమె అలా వెల్లికిలా పడుకుని వుంటే, వెంటిలేటర్ లోంచి పడుతున్న వెన్నెల కాంతిలో ఆమె శారీరం ఒక బంగారం శిల్పంలా వుంది. అతడు నెమ్మదిగా ఆమె మీదకు వంగాడు.

    "ఇక.....ఇక నేను ఆగలేను సిరీ" అన్నాడు గుసగుసలాడుతున్నట్టు. ఆమె కూడా అంతకుముందు జరిగిన సంఘటన తాలూకు భయం వల్ల. ఆ తర్వాత స్నానం చేస్తూండగా కలిగిన చలివల్ల అతడిని నిరోధించలేదు. అప్రయత్నంగా  అతడి భుజాలచుట్టూ చేతులు వేసింది.

    ఆమె శరీరపు నగ్నత్వం అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అతడామెని పూర్తిగా ఆక్రమించుకున్నాడు.

    పూర్తిగా తీసివున్న బెడ్ రూం తలుపుకి అవతలివైపు, హాల్ కి అటుచివర మహర్షి పడుకొని ఉన్నాడని ఆమెకి తెలియదు.

    తను వేసిన బెడ్ రూం తలుపు తీసి బయటికొచ్చి, మళ్ళీ వేయలేదన్న విషయం అంధుడైన రవితేజకి తెలీదు.

    మహర్షి మాత్రం కళ్ళు గట్టిగా మూసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తను ఏమాత్రం కదిలినా ఇప్పటివరకూ తాను అక్కడే ఉన్నాడన్న విషయం ఆ దంపతులకి తేసుస్తుందని అతడికి తెలుసు. అందుకనే రాయిలాగా  బిగుసుకుపోయి అలాగే ఉండిపోయాడు.

    చాలా ఇబ్బందికరమైన పరిస్థితి.

    కనురెప్పల్నయితే మూయగలడు కానీ, అంతఃక్షువుల్ని ఎలా యూయగలడు?


                                                         7


    అతడికి ప్రతిరాత్రి ఒక నిద్రపట్టని రాత్రిలాగానే వుండాలని నుదుట వ్రాసిపెట్టి వున్నది కాబోలు.

    జైల్లో వుండగా- సిరిచందన గురించిన ఆలోచన్లతో, సిరిని చూశాక- ఆమె భర్త అంధుడవ్వటానికి తానే కారణమన్న వ్యధతో.....

    ఇప్పుడు........

    గతరాత్రి.......

    ఎవరి జీవితంలోనైనా అలాంటి సంఘటన జరుగుతుందా?

    ప్రియురాల్ని నగ్నంగా చూడటం..... భర్త చేతుల్లో......

    చుట్టూ ఎవరూ లేరన్న అభిప్రాయంతో ఆమె ఒంటరిగా వున్నట్లే ప్రవర్తించింది. ఆమె శరీరం మీద నీటి ముత్యాల్లా మెరిసే నీటి బిందువులు ఇంకా అతడి కళ్ళముందు కదలాడుతూనే వున్నాయి.

    మిణుగురు పురుగుల్లా మనసులో తిరుగుతున్నాయి.  అతడు తనని తాను సమీక్షించుకోవటం ప్రారంభించాడు.

    బయటకొచ్చి రాతి చప్టామీద కూర్చున్నాడు.

    అక్కడ వాతావరణమంతా నిశ్శబ్దంగా వుంది. మహర్షి మనసులో ఆలోచనలు తుఫాను సమయంలో సముద్రపు అలల్లాగా కొట్టుకుంటున్నాయి. జైల్లో వుండగా అక్కడ చదివిన వివేకానందుడి సూక్తులు గుర్తొచ్చాయి.

    "మానవులంతా అజ్ఞానంతో ...... సుఖమే పరమావధి అనుకోవటంవల్ల, లోకంలో వారు అనుభవించే దుఃఖాలన్నింటికి అది మూలమవుతోంది. మనుషుల్లోని కామక్రోధాది మనోభావాన్నీ వారి మనసునుండే వెలువడుతున్నాయి. ఎవరైతే పరిస్థితుల్లోనైనా ఒకే విధంగా ఉండగలడో, అతడే గొప్పవాడు" అని  వివేకానందుడు చెప్పిన మాటలు అతని మనసులో బలంగా నాటుకున్నా, ఆ రాత్రి హోటల్ పై అంతస్థుమీద రవిని చూసిన క్షణికోద్రేకంలో హత్యా చేయబోయాడు. మళ్ళీ ఈ రోజు సిరిచందన చూశాక, ఆ పుస్తకంలో వాక్యాలు "........ ఏది స్వార్థపరమో అధర్మం, అవినీతి! స్వార్థరహితమైనదేదో అదే ధర్మమూ..... నీతి!" అని పదే పదే అనుకోసాగాడు.

    అతడికి భర్తృహరి  కూడా గుర్తొచ్చాడు. స్త్రీని ప్రశాంసిస్తూ శృంగార శతకం వ్రాసిన భర్తృహరే, తర్వాత విషయ పరిత్యాగవిడంబనంలో వైరాగ్య  శతకం వ్రాశాడు.

    అతడి మనసు ఇప్పుడొక అద్దంలా సత్యాసత్యాల మధ్య  రేఖని సరిగ్గా  విడదీసినట్టు కనిపిస్తోంది.

    "గాజులయొక్క, వడ్డాణంయొక్క, కాళ్ళ అందెలయొక్క శబ్దాలచేత మనసుని డోలలూగించ గలిగిన స్త్రీ చూపులకి ఏ మగవాడు ప్రేమలో పడకుండా ఉండగలడు?" అని ప్రశంసించాడు భర్తృహరి. విల్లుని  అటూ  ఇటూ తిప్పుతూ బాణములు పరం పరంగా వేసి రాక్షసుల్ని సంహరించగల ఇంద్రడు కూడా  తమ కనుపాపల్ని ఇటూ అటూ తిప్పే స్త్రీలయొక్క చూపులకు  దాసోహ మనటమే  మోహం. అటువంటి మోహంనుంచి బయట పడినవాడు వేదాంతి అవుతాడు.

    ఇప్పుడతనికి అనుభవించాలనే కోరిక అడుగంటింది. కోరిక అనే సరస్సులో అభిలాష్ అనేది కెరటం. అనురాగం అనేది మొసలి. సందేహమనేది చేప. అజ్ఞానం అనేది సుడి.

    మనుషులు అవమానాల్నీ, భయాల్నీ, అపాయాల్నీ ఓదార్చుకుంటారు. కానీ అది నిస్సహాయతవల్లే తప్ప మునులవలె మనస్సుని జయించటం చేతకాదు. ఎదుర్కొనే శక్తిలేక, మరొక గతిలేక  ఓర్చుకున్నట్టు కనపడతారు తప్ప, నిరంతరం బాధపడుతూనే వుంటారు.  సుఖాలని వదులుకుంటారు కానీ, అది బుషులవలె వేదాంతం చేతకాదు. సర్వసంగ పరిత్యాగియైన వేదాంతి ఈ విధంగాఅనుకుంటాడట "అడవులలో, కొండలలో, నదులలో తిరగరాని ప్రదేశాలన్నీ తిరిగి విసిగాను. ఏ  మాత్రం  లాభం కలగలేదు. నిష్పలమైన జీవితాన్ని గడిపాను. కాకివలె ప్రపంచమంతా తిరిగాను. ఇలా తిరుగుతున్నకొద్దీ నా పాపము, వ్యధ ఎక్కువవుతున్నదే తప్ప తగ్గటం లేదుకదా!"

    మోహాన్ని ఓడించటం రెండు రకాలు.

    మాంసపు ముద్దలైన స్థనములను బంగారపు కొండలని, కఫము నిండిన మోహము చంద్రబింబమని, క్షుద్రావశక్తమైన జఘనస్థలం ఏనుగు కుంభస్థలమని భ్రమింపక వాస్తవాన్ని గ్రహించి, ఒకప్పటి తన మోహాన్ని వైరాగ్యంగా మార్చుకోవటం ఒక పద్ధతి. స్త్రీని స్త్రీగానే చూస్తూ, పూర్వపు శృంగార భావనని అలాగే ఉంచుకుంటూ, తను మాత్రం ఆ మోహం నుంచి బయట పడటం రెండో పద్ధతి.

    భోగభాగ్యాలన్నీ అనుభవించి ఓకే స్థాయి చేరుకొని, జీవిత కర్మలపట్ల ఏవగింపు ఏర్పరచుకొని చాలామంది వేదాంతులయ్యారు.

    కానీ ఇప్పుడు మహర్షి అవేమీ అనుభవించకుండానే తనని తాను తర్కించుకొని, ఆత్మవిమర్శ చేసుకొని నిజంగా మహర్షి అయ్యాడు.

    తను చేసిన తప్పుని సరిదిద్దుకోవటం కోసం అతడు మనసులోనే శపథం చేసుకున్నాడు. ఇప్పుడతనికి ఉరికంబం వెంటనే వెళ్ళి ఎక్కాలన్న కోరిక లేదు. తన కళ్ళముందు తాను చేసిన పాపఫలం..... తిరిగి మామూలు మనిషై, తను ప్రేమించిన స్త్రీ సుఖంగా వున్నట్టు కనపడితే తప్ప ఈ అశాంతి పోయేటట్లు లేదు.

    ఆమె భర్త నీచుడు అయ్యుండవచ్చు. కానీ ఈ ప్రపంచంలో నీచులు కాని వారు ఎవరు? అవసరంతో, అవకాశమొచ్చినప్పుడు ప్రతి మనిషీ తన లోపలినుంచి మరొక మనిషిని బైటకు తీస్తాడు. తన ప్రియురాలి భర్త కూడా  డానికి అతీతుడేమీ కాదు. అతడు మోసం చేసిన మాట నిజమే. మోసపోయింది తన భార్య అన్నమాటకూడా  యదార్థమే. కానీ ఈ విషయాలన్నీ తను బైటిప్రపంచానికి చెప్పకపోతే జరిగే నష్టమేమీ లేదు. సిరిచందనకి భవిష్యత్తులో ఇవేమీ తెలిసే అవకాశం కూడా లేదు. ఏమో, ఇప్పుడు రవితేజ పూర్తిగా మారిపోయాడేమో? సిరిచందన లాంటి భార్య దొరికిన  తర్వాత ఏ పురుషుడైనా, మారక తప్పదు. అటువంటప్పుడు తను ఈ విషయాలన్నీ తవ్వి తీసి చెప్పి ఆమె మనసు పాడుచేయటం దేనికి? భార్యగా  భవిష్యత్తులో ఆమె ఆనందించబోయే సుఖసంతోషాల్ని కాలరాసే హక్కు తన కేముంది?

    తను ఉరికంబం ఎక్కటానికి అతనే కారణమై యుండవచ్చు. కానీ, తనకి అపకారం చేసిన వాడికి ఉపకారం చెయ్యటమేగా మానవధర్మం.

    ......మహర్షి వేదాంతం చదువుకోలేదు. వేదాలు, ఉపనిషత్తులూ చదువుకోలేదు. మహా చదివితే వేమన శతకాలు , భర్తృహరి సుభాషితాలు చదివి ఉంటాడు. కానీ తనని తాను ప్రక్షాళించుకోవటానికి, తనలోనుంచి తను బయటపడి ఆత్మ విమర్శ చేసుకొని పునీతుడవటానికి వేదాలు, ఉపనిషత్తులే చదవనవసరం లేదు. జ్ఞానానికి మొదటి మెట్లయిన సుభాషితాలు, శతకాలు చాలు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra