Home » Yandamuri veerendranath » పర్ణశాల


    సెంటిమెంట్ తప్ప నీకేమీ తెలీదు. మీ అందరికీ నేనో పెద్ద రాక్షసిలాగానో, భూతంలాగానో కనబడతానన్నా మాట నిజమైతే అయివుండొచ్చుగానీ, నీలా తను బాధపడుతూ ఇతరుల్ని బాధపెట్టటం కన్నా నాలా వుంటేనే మంచిదికదా!

    లేకపోతే ఏమిటి చెప్పు-

    నువ్వు నెమ్మదస్తురాల్లాగానూ, రవి తాలూకు బాధల్ని అర్థం చేసుకోగల దానిగానూ కనపడి వుండొచ్చు. దాంతో నువ్వు బెదిరిపోయి సినిమాల్లోలాగా ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లని వూహించుకొని వెళ్ళిపోవటం ఏమీ బాగోలేదు.

    రవి నన్ను కాదని ఎక్కడికీ పోలేడని నాకు బాగా తెలుసు. నాకు తెలియనిదల్లా ఇంత డబ్బొచ్చినా నాకు సంతోషం ఎందుకు లేదని? అంతే! కాకపోతే ఏమిటి చెప్పు?

    'నాలుగు లక్షల ఆస్థికి (ఆరు లక్షలు ఖర్చయ్యాయి) వారసురాలనయ్యుండీ.....చెల్లెలు ఎక్కడో మారుమూల గుమాస్తాగా పనిచేస్తూ వుంటే చూస్తూ ఊరుకోవటం ఏమిటి? నా ఆస్థి నీ ఆస్థి కాదా? అని రెండు మొట్టి ఇంటికి తీసుకురాక.

    కానీ నేనలా చెయ్యనే శారదా!

    నీ కుండాలి ఆ బుద్ధి. నేను బ్రతిమాలటం ఏమిటి! ఈ బ్రతిమాలటం అనేది ఇష్టంలేకే రవిమీద అధికారం చెలాయించే హక్కు, వచ్చే నెల మొదటి వారంలో సంపాదించుకొంటున్నాను.

    నువ్వు వెంటనే బయలుదేరి పెళ్ళికి పదిరోజుల ముందే రా.

    ఒసేయ్, నువ్వు కాకపోతే నా కెవరున్నారు చెప్పు.

    ఇంకో సంగతి. అతి తొందర్లోనే నేనూ రవీ, మనం పూర్వం అనుభవించిన బాధలలోకి (ఇప్పుడదే స్వర్గంలాగా కనబడుతోంది. ఉన్నరోజు తింటూ లేనిరోజు పస్తుండటం) వెళ్ళిపోతున్నాము. ఈ నాజూకు రాకుమారుడు, ఈ డబ్బు ప్రపంచంలోంచి బయటపడితే.... నిజం బాధలు తెలిసేక క్షణంలో మారతాడే! నాకు తెలుసు, ఆ నమ్మకంతోనే ఈ పెళ్ళి చేసుకొంటున్నాను. వస్తావు కదూ.

                                                                                                                  కిరణ్మయి."

    శారద మొహం ఆనందంతో వెలిగిపోయింది. చప్పున లేని హెడ్ క్లర్కు దగ్గరికి వడివడిగా వెళ్ళింది.

    "సర్. నాకో నెలరోజులు సెలవు కావాలి."

    ఆయన తలెత్తి కళ్ళజోడు సవరించుకుంటూ "ఎందుకమ్మా" అన్నాడు.

    "మా అక్కయ్య పెళ్ళికండీ."

    ఆయన నవ్వేడు. "సంవత్సరం పనిచేశావు కాబట్టి నెలరోజులు లీవ్ వుంటుందనుకో! కానీ, అదంతా అక్క పెళ్ళికే వాడేస్తే మరి నీ పెళ్ళికో?"

    ఆమె సిగ్గుతో తలదించుకొని..... "ఇప్పుడా ప్రసక్తేమీ లేదండీ" అంది.

    "పెళ్ళవటానికి ప్రసక్తి ఏమిటమ్మా - కళ్యాణ ఘడియ వస్తే నువ్వు ఆగమన్నా ఆగదు."


                              *    *    *


    లోపల ఎవరిదో పెళ్ళి ఘనంగా జరుగుతోంది. మంగళవాయిద్యాలు గట్టిగా వినబడుతున్నాయి. "ఇంకా ఆలస్యమేమిటి?" అన్నాడొకడు. నడుము మీద చిన్న గుడ్డపీలికతప్ప వాడికి ఇంకేమీ లేదు.

    మనకోసం తొందరగా చేస్తారేమిట్రా?' అన్నాడింకోడు. వాడి వంటినిండా బొల్లితప్ప ఇంకేమీ లేదు.

    ఈ మాటలలో పాల్గొనకుండా ఇంకొక వ్యక్తి చెత్తకుండీకి అనుకొని కళ్ళు మూసుకొని కూర్చొని వున్నాడు. ఎవరో దయతో ఇచ్చిన కోటు వేసుకున్నాడు. అదీ చిరిగి శిథిలావస్థలో వుంది. పైజామానో, పంచో తెలియకుండా లాగు పీలికలై వుంది. అతడికి రెండు రోజులనుంచీ భోజనం లేదు. అయినా ఆ విషయం అంతగా బాధించినట్టు లేదతన్ని. నిర్వికారంగా కూర్చొని వున్నాడు. అతను చైతన్య పాట్నా వదిలేక దేశమంతా తిరిగేడు.

    ఏదైనా దొరికితే తినటం, లేకపోతే పస్తుండడం- వర్షం వచ్చినప్పుడు తడవటం, ఎండొచ్చినప్పుడు ఎండటం. నిరాసక్తత అతడిని పూర్తిగా ఆక్రమించుకుంది. అది వేదాంతమూ కాదు, అలసట కాదు, ఒక విధమైన ట్రాన్స్.....

    భ్రాంతుల నిరూపణమే మిధ్యాత్వము (ఫాల్సిటీ). అంతా మిథ్యే! అనుభవం. డానికి సంబంధించిన విషయం 'శూన్యం' జ్ఞానం కూడా శూన్యమే.

    కానీ అతడికి తెలియని విషయం ఒకటుంది. అది.....

    -'మిథ్య' అత్యాధునమని!

    ..... పరమార్థము, నిత్యమూ అయిన ఒక పదార్థాన్ని అందంగా తీసుకొన్నప్పుడు మాత్రమే మిథ్య ప్రతిభాసమవుతుందని....

    ...................

    మొదటి బంతి భోజనం పూర్తయినట్టుంది.

    ఆకులు ప్రహరీగోడ మీద నుంచి వచ్చి ఇవతలివేపు పడ్డాయి. ఇద్దరు బిచ్చగాళ్ళు పరుగెత్తారు. కుక్కలతో దెబ్బలాడి వాటిని పారద్రోలి ఆకుల్ని స్వాధీన పర్చుకున్నారు. అందులో ఒకడు అతడిని పిలుస్తూ "రా" అన్నాడు. చైతన్య వెళ్ళలేదు.

    మనసులో ఏదో మారుమూల ఎక్కడో కొద్దిగా అహం అడ్డుపడుతోంది. వెళ్ళబుద్ధి కావటంలేదు. బిచ్చగాళ్ళు ఇద్దరూ ఆత్రంగా ఆకులు ఏరుకొని తింటున్నారు. పావుగంటలో ఆకులు ఖాళీ అయినయ్. ఆకలి తీరింది. వాళ్ళు వెళ్ళిపోయారు.

    రెండో బంతి తాలూకు ఆకుల్ని కుక్కలు ఖాళీచేసి వెళ్ళినయ్.

    చైతన్య ఒక్కడే మిగిలాడు. ఎదురుగా సగం నిండిన చెత్తకుండీ.

    మూడోసారి మళ్ళీ ఆకులుపడి పూర్తిగా నిండింది.

    కడుపు ఖాళీగా వుంది. ఆకలిగా వుంది. ఆకలి మనిషిని దిగజారుస్తుంది. చెత్తకుండీలోది తినటం దిగజారటం? బాలెన్స్ షీట్ లో లాభాలను తగ్గించి చూపించటం దిగజారటం కాదా?

    కాలే కడుపు కంట్రడిక్షన్ ని గుర్తించదు.

    కుండీ దగ్గరకు వెళ్ళి ఆకుని చేతులతో పట్టుకొంటూ అనుకున్నాడు......."నా మనస్సులో ఏ మూలో నా భార్యమీద అసహ్యముంటే ఇప్పుడది పోయింది. ఆకలి మనిషితో ఏదయినా చేస్తుందన్న సత్యం అర్థమయింది."

    వంగి, ఆత్రంగా ఆకులోది తినబోతూ విద్యుద్ఘాతం తగిలిన వాడిలా ఆగిపోయాడు. కుండీకి అవతలిపక్క ఎవరో పడిపోయున్నారు. ఆకలివల్ల వచ్చిన నిస్త్రాణతో మూల్గుతున్నాడు.

    చప్పున అటువెళ్ళి పక్కకి తిప్పేడు.

    అతడు.........

    తన కొడుకుని స్మశానంలో పాతిపెడుతున్నప్పుడు పక్కన కూర్చుని ఓదార్చిన వృద్ధుడు.


                              *    *    *


    "ఎందుకు నవ్వుతున్నావు నాయనా?" అడిగేడు వుద్ధుడు.

    "ఏం లేదు తాతా! సముద్రంలో రొయ్యలు నీటి ప్రవాహం లోపల గుంపులు గుంపులు వలస పోతుంటాయి. కాలప్రవాహంలో మనుష్యుడు కూడా అంతే అనుకొంటా? ఎక్కడ విడిపోయాం..... ఎక్కడ కలుసుకున్నాం!!"

    "ఏది ఏమైనా నన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు. నువ్వు తిండి పెట్టకపోతే అక్కడే చచ్చిపోయి వుండేవాణ్ణి."

    "నేను పెట్టింది ఎవరో పారేసింది"

    "చెప్పకు. చేదునిజం. మింగుడుపడదు" నవ్వుతూ లేచేడు వృద్ధుడు. "పదబాబూ పోదాం. కొండమీద వారం రోజులపాటు సంతర్పణ జరుగుతూందట. ఎక్కడెక్కడ్నించో మనలాంటివాళ్ళు వస్తున్నారు, దగ్గరుండి మనం వదలటం దేనికి?"

    వాళ్ళిద్దరూ కొండమీదకి ప్రయాణం సాగించేరు.


                                                              *    *    *


    "హనీమూన్  ఎక్కడికి వెళదాం-" హుషారుగా అడిగేడు రవి. కిరణ్మయి మాట్లాడలేదు, ఆలోచిస్తూ ఉండిపోయింది.

    "చెప్పు....."

    ఆమె అతడివేపు సాలోచనగా చూస్తూ "వెళ్ళాలంటావా?" అంది.

    అతడు దెబ్బతిన్నట్లు చూసి "అంటే?" అన్నాడు.

    "ఇక్కడ పరిస్థితులు నీకు తెలుసుకదా! ఇటువంటప్పుడు మనిద్దరం లేకపోతే ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నాను."

    "ఏం జరుగుతుంది? పదిహేనురోజులు - అంతేగా?"

    "ఏదైనా జరగటానికి పదిహేను క్షణాలు చాలు."

    రవి నవ్వటానికి ప్రయత్నం చేస్తూ "అంటే డబ్బున్న వాళ్ళు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకూడదా?" అన్నాడు.

    చాలాసేపు మౌనంగా వుండి అన్నది కిరణ్మయి..... "నిజమేనేమో. ఈ డబ్బు అన్నది మనిషిని నిద్రపోనివ్వకుండా చేస్తుంది. కడుపునిండా తిననివ్వకుండా చేస్తుంది. అది లేనిరోజుల్లో దాని కోసం..... అది ఉన్నాక ఇంకోదానికోసం...... దేనికోసమో...?? విశ్రాంతి అన్నది ఎక్కడ దొరుకుతుంది? డబ్బుకీ, దానికీ అసలు బాంధవ్యం లేదు."

    "కిరణ్!" దీనంగా అన్నాడు రవి. "ఈ డబ్బు కారణంగా దీన్ని నిలబెట్టుకునే విద్య రాణి కారణంగా నన్ను వదిలెయ్యవు కదూ?" చిన్న పిల్లాడిలా అడుగుతున్న ఆ పాతికేళ్ళ యువకుణ్ణి చూస్తుంటే ఆమె హృదయంలో ఏదో మాతృత్వపు స్పందన కలిగింది. అతడి తలని హృదయానికి హత్తుకుంటూ "లేదు రవీ....ఆ ఆలోచనని కలలోకి కూడా రానివ్వకు" అంది ఆర్ద్రంగా.

    ఆ రాగరంజిత రసానుబంధువు పరిష్వంగంలో చాలాసేపు మౌనంగా వుండి, వుండి, అతడు నెమ్మదిగా అన్నాడు ..... "నా మనస్సులోని బాధ మీకెవ్వరికీ తెలీదు కిరణ్! అటు అన్ననీ.... ఇటు చెల్లినీ.....వదులుకున్నానన్న బాధ నా మనస్సుని ఎంతలా కోసేస్తోందో నీకు తెలీదు." చైతన్య జ్ఞాపకం వచ్చేసరికి ఇద్దరి మనసులూ వ్యాకులమయ్యేయి.


                                    13


    "గోవిందా...... గోవిందా......గోవిందా..." గుంపు ముక్త కంఠంతో అరుస్తోంది. రాళ్ళనీ, రప్పల్నీ దాటుకొంటూ మెట్లెక్కుతున్నారు.

    "గోవిందా.....గో.....విందా" ఒకటే నాదం. కాళ్ళు పీకుతున్నాయి. గొంతు ఎండిపోతోంది. అయినా పయనం ఆగటం లేదు. ఏదో ఆవేశం ముందుకు తోస్తోంది. భక్తి పారవశ్యం బాధని తెలియనివ్వటంలేదు వాళ్ళకి.

    ఎదురుదెబ్బ తగిలి కాలినుంచి స్రవిస్తూన్న రక్తాన్ని తుడుచుకుంటూ "ఇంకా ఎంత దూరం తాతా?" అడిగేడు చైతన్య.

    "ఎంతో దూరంలేదు..... రెండు కొండలే ఇక!"

    జుట్టులోంచి చెమట ధారగా కారుతోంది. చెప్పులు  లేకకాళ్ళు కాలుతున్నాయి. మెట్లు ఎక్కుతూ పోవటం వల్ల మోకాలి చిప్పలు పట్టేసినయి.

    "ఇంకా ఎంతదూరం తాతా...."

    "ఇంకొక్క కొండే....."

    "గోవిందా..... గోవిందా..... గో..... విందా!"

    అదో ప్రవాహం........... వృద్ధులు ...... పిల్లలు .... ఆడవాళ్ళు..... డబ్బున్న వాళ్ళు ..... లేనివాళ్ళు.... అందరూ ఆ కేంద్రంవైపు సాగిపోతున్నారు. గంటలు గణగణా మ్రోగుతున్నాయి. ఎక్కడ చూసినా జనమే. బైట మనుష్యులు...... ధర్మదర్శనపు క్యూల్లో మనుష్యులు.    

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra