Home » Dr s v s kishore kumar » First Crush

 

సర్. ఇక్కడ సర్ వాళ్ళ ఇంట్లో టి వి లో లైవ్ టెలికాస్ట్ సెట్ చేసాను. ఓ కే అయ్యింది అన్నాడు ఆనందంగా. 
స్పీకర్ ఆన్ చేసి రాజుగారు ముందు పెట్టాడు పి ఏ. ఆయన కూడా ఆనందంగా థాంక్స్ చెప్పాడు వినీల్ కి.
వినీల్ ఫోన్ విజితకి ఇచ్చాడు.
డాడీ మాట్లాడటం విని ఆనందంగా హాయ్ డాడ్ అంది విజిత.
ఆయన మాట్లాడుతూ లైవ్ టెలికాస్ట్ సెట్ చెయ్యడం, అందుకు వినీల్ హెల్ప్ చెయ్యడం అన్నీ చెప్పాడు. నేను, మమ్మీ  ఇక్కడ లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాము. మన స్టాఫ్ కూడా కొంతమంది ఇక్కడున్నారు. మిగతా వాళ్ళు ఫ్యాక్టరీ లో బిగ్ స్క్రీన్ పెట్టి అక్కడ చూస్తున్నారు అని చెప్పాడు. వినీల్ మన టెక్నికల్ స్టాఫ్ ని పొద్దున్నుంచి ట్రైన్ చేసి ఇవన్నీ చేయించాడు అన్నాడు. బెస్ట్ విషెస్ విజ్జీ. ఎంజాయ్ ది పార్టీ అమ్మలూ అని బై చెప్పాడు.
థాంక్స్ వినీల్ అంది అతని మొహం వైపు చూస్తూ.
కోపం ఛాయలు మచ్చుకు కనపడలేదు.
వినీల్ కి పని దొరికితే పండగే. అందులో పరకాయ ప్రవేశం చేసి లీనమై పోతాడు.
అమ్మయ్య అనుకుంది అతన్నే చూస్తూ.  
వినీల్ దగ్గరికి వ్యాఖ్యాత గా వ్యవహరించే లేడీ వచ్చి మాట్లాడుతోంది.
వినీల్ ఆమెకు అన్నీ వివరంగా చెప్తున్నాడు. థాంక్స్ సర్ అని ఆవిడ డయాస్ వైపు వెళ్ళింది.
ఆరు గంటల కల్లా మంత్రిగారు, ఛాంబర్ అఫ్ కామర్స్ పెద్దలు అందరూ వచ్చేసారు.
డయాస్ పై తమకు కేటాయించిన కుర్చీలలో కూర్చున్నారు. 
ఫంక్షన్ కు పిలిచిన వాళ్ళందరూ వచ్చినట్లున్నారు. హాలు బాగానే నిండింది.
విజితకు సన్నగా వణుకు మొదలయ్యింది.
వినీల్ తో చెప్పింది డయాస్ పైకి నువ్వు కూడా రా నాతో అంటూ. ప్లీజ్ రా అంది రిక్వెస్ట్ చేస్తూ అతని చెయ్యి పట్టుకుని.
నీకేం భయం లేదు విజ్జీ. నేను అన్నీ చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు.
ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. అందరూ ఒక్కొక్కరే మాట్లాడుతున్నారు.
ఛాంబర్ అఫ్ కామర్స్ చైర్మన్ విజి ఇండస్ట్రీస్ వెంకటరాజు గారి గురించి గొప్పగా చెప్పారు.
ఆయన గురించి ఆడియో వీడియో ప్రెసెంటేషన్ మనవాళ్ళు ప్లే చేస్తారు అని వ్యాఖ్యాతవైపు చూసాడు.
డయాస్ పై లైట్స్ ఆఫ్ చేసి వెంకటరాజు గారి గురించి, ఆయన చిన్ననాటి ఫొటోస్, ఫామిలీ ఫొటోస్, మాధవి, విజితలతో ఆయన ఫొటోస్, ఆయన ఇండస్ట్రీస్ గురించి, అకుంఠిత దీక్ష, కష్టపడటం, బిజినెస్ ని అభివృద్ధి చేయడం ఇలా పలు అంశాల గురించి  పదిహేను నిముషాలు చక్కటి  వీడియో వేశారు.
ఆ వీడియో మొత్తం వినీల్ ఓపికగా తయారు చేసాడు. 
ఆ వీడియోకు బాక్గ్రౌండ్ వాయిస్ గా వినీల్ ఫారిన్ యాసతో ఇంగ్లీష్ లో అద్భుతంగా చెప్పాడు.
వీడియో  అయిపోగానే కరతాళధ్వనులు హాలులో మారు మ్రోగాయి.  అందరూ మెచ్చుకున్నారు. ఇలా ఏ వీ (ఆడియో వీడియో) తయారు చేసి వేయడం కొత్తగా అనిపించింది అందరికి. 
చైర్మన్ కు కూడా అది ఎంతో నచ్చింది. అది తయారు చేసి పంపిన వినీల్ ని చాలా అభినందించాడు.
ఇలాంటివి మున్ముందు  ప్లే చేస్తే అవార్డు గ్రహీతల గొప్పతనం కళ్ళకు కట్టినట్లు ఉంటుందని ప్రశంసించాడు. 
విజితను అవార్డు తీసుకునేందుకు స్టేజి పైకి ఆహ్వానించారు.
విజిత కళ్ళలో భీతి చూసి వినీల్ ఆమె దగ్గరికి వెళ్లి పద నేనూ నీతో వస్తాను అన్నాడు.
నేను నీ పక్కనే ఉంటాను అని చెప్పాడు. ఆమె చేతిలో ఒక పేపర్ ఉంచాడు. అది చూసింది. చిన్న రైట్  అప్ అది అక్కడ మాట్లాడేందుకు.
విజిత తో పాటు వెనకాలే వినీల్ కూడా డయాస్ పైకి వెళ్ళాడు.
విజిత వెనక్కు తిరిగి అతన్ని తనతో పాటు అవార్డు తీసుకునేందుకు రమ్మన్నట్లు పిలిచింది.
ఫరవాలేదు వెళ్ళు నేను నీ వెనకాలే ఉంటాను గా అని కళ్ళతోనే ధైర్యం చెప్పాడు.
అతనిచ్చిన ధైర్యం తో విజిత మంత్రి గారి ద్వారా అవార్డు అందుకుంది.
వినీల్ ఆమె వెనుకనే ఉన్నాడు. అందరూ విజితను ప్రశంసించారు.
విజితను మాట్లాడమని చైర్మన్ రిక్వెస్ట్ చేసాడు. వినీల్ ఇచ్చిన  తన చేతిలో స్లిప్ చూసుకుంది. 
ఆ స్లిప్ చూసి చదవడం విజితకి ఇబ్బంది అవుతుందేమోనని గ్రహించి వినీల్ చక చక తన లాప్ టాప్ తెచ్చి పోడియం మీద పెట్టాడు ఓపెన్ చేసి.
విజిత పోడియం దగ్గరికి వచ్చింది మాట్లాడేందుకు.
ఆమె చేతిలోని స్లిప్ తీసుకుని లాప్ టాప్ లో చూసి చెప్పమని సైగ చేసాడు వినీల్. 
తన ముందు తెరచి ఉన్న లాప్ టాప్ లో ఉన్న మేటర్ ని తన ఇంగ్లీష్ శైలి లో చక్కగా చెప్పింది.
ఆమె మాటలు అందరూ ఆసక్తిగా విన్నారు.
విజిత మాట్లాడేంతవరకు వినీల్ ఆమె వెనుకనే నిల్చుని ఉన్నాడు.
అతను వెనుకే  ఉండటం  విజితకి కొండంత ధైర్యం కలిగించింది. 
అందరికీ కృతజ్ఞతలు చెప్పి కిందకు వచ్చింది విజిత.
ఆమె వెనుకనే వినీల్ డయాస్ దిగాడు.
థాంక్స్ వినీల్ అంది విజిత చాలా సంతోషంగా అతని చేతులు పట్టి ఊపేస్తూ.
అతను లేకుంటే తనకు అంత ధైర్యం ఉండేది కాదు. 
రాజుగారు లైవ్ టెలికాస్ట్ లో ఇవన్నీ చూస్తూ ఎంతో ఉప్పొంగిపోయాడు. అతని కళ్ళలో ఆనందం తొణికిసలాడింది. వినీల్ ని రాజుగారు నిశితంగా గమనిస్తున్నారు. ఇతను మాహా మేధావి, స్ఫుర ద్రూపి అనుకున్నాడు . ఈ రోజు నా పరువు ప్రతిష్టలు ఇనుమడింపచేసాడు అని చాలా సంతోషించాడు.
తొమ్మిదికల్లా మీటింగ్ ముగిసింది.
అందరికీ డిన్నర్ సర్వ్ చేశారు.
అవన్నీ పూర్తయ్యేసరికి రాత్రి పదయింది. వినీల్ అక్కడి కొచ్చిన వారితో కలిసిపోయి చక్కగా మాట్లాడేస్తున్నాడు.  అందరూ అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు. పెద్ద వ్యాపారస్తులు తమ కంపెనీలో చేరమని ఆఫర్స్ ఇచ్చారు కూడా. అబ్బో వీడు గట్టివాడే అని మనసులో పొంగిపోయింది విజిత.     
అందరికీ థాంక్స్ చెప్పి ఇద్దరూ రూమ్ కొచ్చారు. 
వెంకటరాజుగారు ఫోన్ చేసి వినీల్ ని పొగడ్తలతో ముంచెత్తాడు.  ఆయన ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నాడు. చాలా సేపు వినీల్ తో మాట్లాడి పెట్టేసాడు.
మా డాడీ నీతోనే ఎక్కువ మాట్లాడుతున్నాడు చూసావా. ఆయనకు నువ్వే ఎక్కువయిపోయావు అంది కినుకగా విజిత.
అయ్యో అది కాదు విజ్జీ మీటింగ్ గురించి మాట్లాడారు అన్నాడు వినీల్.
సరే అయితే వినీల్ నా రూమ్ కి రా కాసేపు నీతో మాట్లాడాలి అని పిలిచింది విజిత. 
ఊహూ నీ మీద కోపం తగ్గలేదు నేను రాను అన్నాడు చిన్నపిల్లాడిలా.
మళ్ళీ మధ్యాన్నం సంగతులు గుర్తుకొచ్చి కోపం మూడ్ లోకి మారి పోయాడు వినీల్. 
ప్లీజ్ రా నీల్ అని బ్రతిమాలింది విజిత. 
కోపంగా ఉన్నా, పట్టు పట్టిందంటే ఇక వదలదు అని విజిత రూమ్ కెళ్ళాడు వినీల్.
నీల్ ఏమైంది మన జాతకాల గురించి. మీ నాన్నగారు ఏమైనా చెప్పారా అంది.
ప్రొద్దున నాన్నగారు ఫోన్ చేసిన విషయం అప్పుడు గుర్తుకొచ్చింది వినీల్ కి. 
సారీ విజ్జీ. మన జాతకాలు కుదరలేదు అని చెప్పాడు.
అవునా ! అంటూ బిగ్గరగా ఏడుపు మొదలు పెట్టింది విజిత. 
హే ! దానికోసం ఎందుకు ఏడుపు అన్నాడు కంగారుపడుతూ .
నీకోసం ఇప్పటివరకు వేచి చూసాను. జాతకాలు కుదురుతాయేమో అని ఆశగా ఉన్నాను. నీ మాటలు నాకు బాగా ఏడుపు తెప్పిస్తున్నాయి నీల్. నువ్వు లేకుండా నేను నా జీవితం ఊహించుకోలేను అంది నిరాశగా. 
ఇపుడేమయ్యింది విజ్జీ. నువ్వు కూడా జాతకాలు కుదిరిన అబ్బాయినే పెళ్లి చేసుకోవచ్చుగా అన్నాడు.
అతని మాటలకు విజిత ఏడుపు ఇంకా ఎక్కువయ్యింది. అది ఇప్పట్లో ఆగేట్లు కనపడలేదు వినీల్ కి . 
ఆమ్మో ఇదేంటి ఇప్పుడు ఏడుపు మొదలుపెట్టింది అని విజిత దగ్గరికెళ్లి కూర్చున్నాడు. ఆమె వాలకం చూస్తుంటే ఇప్పట్లో ఏడుపు ఆగేట్లు కనపడలేదు. 
ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని కూడా భయపడ్డాడు వినీల్.
ఎలాగైనా ఓదార్చాలి. తనని బాగా కూల్ చెయ్యాలి. పాపం తన మాటలతో బాగా ఇబ్బందిపెట్టాను అని ఫీల్ అవుతూ ఆమె చుబుకం పైకెత్తి మా బుజ్జివి కదూ అన్నాడు.
విజ్జీ ప్లీజ్ ఏడుపు మాను మా తల్లివి కదూ అని బుజ్జగిస్తున్నాడు.
ఆ క్రమంలో విజిత మొహం వినీల్ కి దగ్గరగా వచ్చింది.
రెండు చేతులతో ఆమె మొహం పట్టుకుని ఓదారుస్తున్న వినీల్ ఆమె  పెదవుల సహజ గులాబీ రంగు చూసాడు.
అందమైన విజిత మొహం, మరింత అందంగా మెరుస్తున్న ఆమె నల్లని కురులు, అమాయకంగా అల్లరి చేస్తున్న ఆమె అందం తాలూకు ప్రతి అణువు దగ్గరగా చూస్తున్న వినీల్  మోహపరవశుడయ్యాడు. 
ఆమె శరీర పరిమళం అతన్ని గాఢమైన మత్తులోకి నెట్టింది.
విజితకి బాగా దగ్గరగా కూర్చున్న అతనికి ఆమె అందం పిచ్చెక్కిస్తోంది. 
ఒక్క క్షణం మైకం కమ్మినట్లయ్యింది అతనికి.
మైండ్ పూర్తిగా బ్లాంక్ అయ్యింది.
విచక్షణ కోల్పోయాడు.
తన పెదవులతో ఆమె పెదవులను గాఢంగా చుంబించాడు.
ఆమె లేత పెదవులు సన్నగా వణుకుతున్నాయి.   
ఆమె పెదవుల తడి ఎంతో రుచిగా అనిపించి పదే పదే అలా చేసాడు.
వినీల్  హఠాత్ చర్యకు విజిత ఒక్కమారు ఆశ్చర్యపోయి అతని వైపు చూసింది.
అతని పెదవులు ఇంకా అక్కడే ఉన్నాయి ఏదో  కావాలన్నట్లు.
అతను దాహార్తిగా ఉన్నట్లు అర్ధమయ్యింది ఆమెకు. 
ఆమెకు అప్రయత్నంగా అతని మీదున్న ప్రేమ హృదయాంతరాలలో ఉవ్వెత్తున ఎగసింది.
ఆ మధుర క్షణం కోసమే ఆమె ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోంది.
అతని జుట్టులోకి చేతులు పోనిస్తూ దగ్గరకు తీసుకుని తను కూడా అతని పెదవులను ముద్దాడింది.
ఆమె చర్యకు ఇక ఆగలేక పోయాడు వినీల్.
అతనిలోని బ్రహ్మచర్యం మారుమూల నక్కి చూస్తున్నదల్లా ఇక అతను కంట్రోల్ తప్పుతున్నాడని గ్రహించి మూటా ముల్లె సర్దుకుని కాశీకి పలాయనం చిత్తగించింది వీడిక మన మాట వినే స్థితిలో లేడు అని సణుక్కుంటూ. 
విజితను మరింత పొదివి పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు వినీల్.
నీల్ అంది విజిత మార్దవంగా అతన్ని అల్లుకుపోతూ.
ఆమె ఊపిరిలోని వెచ్చదనం అతన్ని నిలువునా కాల్చేస్తోంది. 
అతని బాహువుల్లో ఆమె కరిగిపోతోంది.
ఇక ఆగలేకపోయాడు వినీల్. 
మన్మధుడు వినీల్ పై పూల బాణం వేద్దాం అనుకున్నవాడల్లా వినీల్ ఆవేశం చూసి ఆగిపోయాడు ఒక బాణం ఎందుకులే వేస్ట్ అని.
అందులోనూ పూల ఖరీదు బోలెడు పెరిగిపోయింది కూడా అనుకుంటూ వినీల్, విజితని ఇద్దరినీ ఆశీర్వదించాడు సుఖాల సాగరంలో మునిగి తేలమని.
వినీల్, విజిత ఓ గంట పాటు హైరానా పడ్డారు.
ఆనందపు శిఖరాలను అధిరోహించి ప్రేమ బావుటాను విజయకేతనంగా ఎగురవేశారు.
ఇద్దరికీ ఆ తొలి అనుభవం ఎంతో సుఖంగా, హాయిగా అనిపించింది. 
ఆ గంటలో జరగాల్సిందంతా జరిగిపోయింది.
ఇద్దరికీ తీపి గురుతులు మిగిల్చింది. 
మొదటగా తేరుకున్న వినీల్ కి ఏం జరిగిందో ఇంకా అర్ధం కావట్లేదు.
అతను ఇంకా ఆమె మైకంలోనే ఉన్నాడు. 
అతని పెదవులు అతని మాటలు వినటల్లేదు.
ఆమె పెదవులు వీడనని మొరాయిస్తున్నాయి.
ఆమెనుంచి విడివడటానికి సందేహిస్తున్నాయి.
ఇంకా మకరందమేదో అక్కడ మిగిలి ఉంది అన్నట్లు ఆమె పెదవుల జుంటి తేనెలు పదే పదే ఆస్వాదిస్తున్నాయి. 
విజిత మత్తుగా అతని బాహువుల్లోనే ఒదిగిపోయి ఉంది.
ఆమె చేతులు అతన్ని గాఢంగా చుట్టుకుని ఉన్నాయి. 
కాసేపటికి మైకం నుంచి పూర్తిగా బయటకొచ్చాడు వినీల్.
తన ఒంటిపై బట్టలు  కనిపించలేదు.
అబ్బా అనుకుంటూ ఒక్కసారి తలవిదిలించాడు.

 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra