Home » Yandamuri veerendranath » పర్ణశాల


    "మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది" దక్షిణం ముసురుకొంటున్న మబ్బుల్ని చూస్తూ అన్నాడు. "రెండ్రోజుల్నుంచి ఈ చల్లగాలికీ, వర్షానికీ జ్వరం వచ్చి వుంటుంది!"

    ఆమె మాట్లాడలేదు. ఈ మౌనం అతడిని బాధ పెడుతోంది. విధి చేసిన దానికి తనెలా అపరాధి అవుతాడో అర్థం కాలేదు. వచ్చెయ్యటం తప్పుకాదని అతనికి తెలుసు. రాక చేసేది ఏమీలేదని తెలుసు. కానీ ఆ నిజాన్ని ఆమెకెలా నచ్చచెప్పాల్లో తెలియటంలేదు.

    ఈ ఆలోచనల్లో వుండగానే అతడి దృష్టి బాబుమీద పడి ఉలిక్కిపడ్డాడు. బాబు వణికిపోతున్నాడు. చప్పున తీసుకుని భుజం మీద  వేసుకున్నాడు.

    బడ్డీకొట్టువాడికి భార్య మంగళసూత్రం బలవంతంగా  యిచ్చినప్పుడున్న నిజాయితీ తాలూకు పట్టుదల, కొడుకు ఆరోగ్యం దగ్గర కొచ్చేసరికి ఇవ్వటానికి ఏమీలేక సడలిపోయింది.

    డాక్టర్ ఇంటిముందు నిలబడి తలుపు తట్టాడు. బాగా చీకటి పడింది. వీధి దీపాలు అప్పుడే వెలిగినయ్.

    "ఇవి విజిటింగ్ అవర్స్ కావు" తలుపు తీసిన డాక్టర్ అన్నాడు. అతడు భార్యతో కలిసి బయటికి వెళ్ళటానికి సిద్ధంగా వున్నాడు.

    "చాలా జ్వరంగా వుంది డాక్టర్" చైతన్య కంఠంలో ఆదుర్దా ధ్వనించింది. భుజంమీద బాబు తోటకూరకాడలా వేలాడుతున్నాడు.

    డాక్టర్ పరిస్థితి గమనించేడు. కన్సల్టింగ్ రూమ్ లోకి దారితీసేడు. అయిదు నిమిషాలు పరీక్షచేసి చెప్పేడు..... "న్యూమోనియా".

    చైతన్య ముఖంలో ఏ భావమూ లేదు. డాక్టర్ కాగితం మీద మూడు నాలుగు పేర్లు వ్రాసి, "ఈ ఇంజెక్షన్లూ, టాబ్లెట్లూ తీసుకురా..... అర్జంట్" అన్నాడు.

    చైతన్య ఆ కాగితంవేపు క్షణం చూసి నెమ్మదిగా తలెత్తాడు. "మా దగ్గర డబ్బుల్లేవు డాక్టరుగారూ....."

    డాక్టర్ మొహంలో భావాలు వెంటనే మారిపోయాయి. "అంటే - అంటే  కన్సల్టింగ్ ఫీజు కూడా లేదా?"

    "క్షమించండి డాక్టర్....." చైతన్య మాట పూర్తికాకుండానే "ఇడియెట్" అని అరిచేడు డాక్టర్.

    "పెద్ద డబ్బిచ్చేవాడిలా బయటికి వెళ్ళబోయేవాడ్ని లోపలికి పిల్చుకొస్తావా..... బిచ్చగాళ్ళకీ, ముష్టివాళ్ళకీ సేవ చెయ్యడానికి ఇదేం ధర్మాసుపత్రి అనుకొన్నావా? గెటౌట్" కోపంతో అతడి ముఖం ఎర్రబడింది. బయటికి వెళ్ళాలన్న ఆత్రంలో వున్నాడు.

    "మీ బుణం తప్పకుండా తీర్చుకుంటాను డాక్టర్. ఇప్పుడు మీ దగ్గరున్న మందేదైనా ఇవ్వండి. నా కొడుకుని రక్షించండి" చేతులు నులుముకొంటూ ప్రాధేయపడుతున్నాడు. వంగి కాళ్ళు స్పృశించటానికి సిద్ధంగా వున్నాడు.

    ఇలాంటి వాళ్ళని ఆ డాక్టరు చాలామందిని చూసేడు. అతడు కదలకపోవటం చూసి, బెదిరించాడు.

    "వెళతావా మా టైగర్ని పిలవమన్నావా?"

    చైతన్య గుండెల్లో ఎక్కడో ఆ మాట తాకింది. వంగి బాబుని భుజంమీద వేసుకున్నాడు.

    ఈ గొడవకి లోపల్నుంచి డాక్టరు భార్య వచ్చింది. "ఏమయిందండీ.....ఏమిటాలస్యం?"

    ఆమెకి ఇంగ్లీష్ లో వివరించాడు. "కొడుకుని తీసుకొచ్చి ఎగ్జామిన్ చెయ్యమన్నాడు. వెధవఫోజు. మందులకే డబ్బులేదట. దీజ్  ఫెలోస్ హ్వావ్ బికం మోర్ ఇంటలిజెంట్ నౌ ఎ డేస్..... ఏం చూచుకొని అంత ధీమాగా లోపలికి వచ్చేడో?"

    వెళ్ళబోతున్న చైతన్య క్షణం ఆగి వెనక్కి తిరక్కుండానే జవాబిచ్చేడు. "ధీమాయే డాక్టర్ .....కనీసం డాక్టర్ల లోనైనా మానవత్వం వుంటుందన్న ధీమా. బట్  యు హావ్ డిస్ట్రాయిడ్ మై ఫెయిత్ ఇన్ టోటల్ హ్యుమనిటీ ఇట్ సెల్ప్..... లెట్ ఎలోన్ డాక్టరింగ్"


                               *    *    *

    దూరంగా ఎనిమిది కొట్టారు.

    తుంపర పడుతూనే వుంది.

    కాంతిమతి వళ్ళో మూలుగుతున్నాడు.

    చైతన్య ఆందోళనగా అటే చూస్తున్నాడు. టెంపరేచర్ ఎంతుందో తెలియదు. దూరంగా కూర్చున్న బిచ్చగాళ్ళ పొయ్యిలో చితుకుల మంట కొద్దిగా వెలుగుని ప్రసాదిస్తోంది. స్తంభానికి అనుకొని ఎవరో సాధువు తత్వం పాడుకొంటున్నాడు.

    "ఊరికి ఉత్తరాన ఊరింకోటున్నది....

    ఆ ఊరికి పోయేటప్పుడు వూరికేపోవాలి మనసా...."

    వచ్చేపోయే యాత్రికులకి ఆరామం సత్రంలాంటి భూమి. పని పూర్తవ్వగానే ఖాళీ చెయ్యాలి. ఇంకో యిద్దరు వచ్చి మరోమూల చేరేరు. గోడకి అనుకొని శూన్యంలోకి చూస్తున్నాడు చైతన్య.

`    వంట చేసుకొంటున్న ఇద్దర్లో ఒకడు లేచి చైతన్య దగ్గరగా వచ్చేడు.

    "అన్నం వండుకోలేదా?....."

    చైతన్య తలెత్తి వెంటనే దించుకొంటూ "ఉహు" అన్నాడు.

    "ఇద్దరికీ సరిపడా బియ్యం వున్నాయి. కావాలా? పావులా యివ్వుచాలు."

    అంత వేదనలోనూ చైతన్యకి ఆశ్చర్యం వేసింది. అతడు బియ్యం  అమ్ముతున్నందుకు కాదు. బిచ్చగాడి దగ్గిర వున్నంతయినా తన దగ్గర లేకపోయి నందుకు.

    "పావులా లేదు" అన్నాడు చైతన్య.

    "బియ్యమూ లేవు, పావులా లేదు. పొద్దుట్నుంచీ యెక్కడ కూసున్నారేమిటి?"

    చైతన్యకీ ప్రశ్న అర్థంకాలేదు. తలెత్తి చూసేడు. బిచ్చగాడు దాన్ని ఇంకోలా అర్థం చేసుకొని, వివరిస్తూ "సత్తెన్నారాయణ కోవెల దగ్గర కూసుంటే డబ్బులూ, కొబ్బరి చిప్పలూ దొరుకుతాయి. ఇంటింటికి తిరిగితే అన్నమూఁ, బియ్యమూఁ దొరుకుతాయి. అయినా ఇద్దరున్నారుగా.....ఒకళ్ళు అదీ, ఇంకొకళ్ళిదీ చేసుకోవచ్చు" అని సలహా ఇచ్చేడు.

    చైతన్య గుప్పెట్లో కాంతి చెయ్యి వణికింది. అతడు తమ బట్టల వైపు చూసుకున్నాడు. చిరిగీ, మాసీ.... గెడ్డం పెరిగి.... "ఏ పనీ దొరక్కపోతే అడుక్కు తినొచ్చునన్నమాట. కనీసం ఆ అర్హతనిచ్చే ఆకారం అయినా వచ్చింది చాలు" అనుకున్నాడు.

    "మరేం చేస్తారిప్పుడు..... పస్తుంటారా?"

    చైత్యన మాట్లాడలేదు.

    "బియ్యమిస్తా వండుకోండి. రేపు బియ్యంగానీ, పావులాగానీ ఇచ్చెయ్యండి" అన్నాడు.

    "రేప్పొద్దున్న ఇక్కడుండం"

    బిచ్చగాడు ఈ సమాధానానికి తల గోక్కున్నాడు!..... "పెద్ద సిక్కొచ్చి పడిందే నీతో" అంటూ వెళ్ళేడు.

    నిముషం తర్వాత ఓ చిన్న బియ్యం మూట చైతన్య ఒళ్ళో పడింది. తలెత్తి చూసేసరికి అదే బిచ్చగాడు.

    "తీసుకోవయ్యా! ఏమీ తిరిగియ్యక్కర్లేదులే"

    "ఇదేమిటి?" ఆశ్చర్యంగా అడిగేడు.

    "ఆడదాన్ని పస్తుంచుతావటయ్యా- పోపో - ఆ మూల మా కుండ వుంది వండుకోండి పోయి"

    కళ్ళనీరు గిర్రున తిరిగింది చైతన్యకి.

    ఆ ఆప్యాయతకు చలించిపోయాడతడు. రెండు చేతులతోనూ ఆ రెండు పిడికిళ్ళ బియ్యాన్ని భద్రంగా పట్టుకుని భార్య కందించేడు. ఆమె అందుకోలేదు.

    శుష్కంగా నవ్వేడు. "ఏమిటి ఆలోచిస్తున్నావు కాంతీ! అడుక్కొనే వాడి దగ్గర  అడుక్కొనే స్థితికి జారిపోయిన నీ భర్త గురించా? డాక్టర్ లో కనబడకుండా పోయిన మానవత్వం ఇక్కడ బిచ్చగాడిలో కనబడుతుందేమిటా అనా? పద - వెళ్ళి కొంచెం ఎంగిలిపడు...."

    అప్పటివరకూ బిగపట్టి ఆపుకున్న ఏడుపు ఇక ఆపుకోలేక పోయింది. ఆమె. ఒక్కసారిగా బావురుమని..... "ఇక్కడ బాబుకి ఇలా వుంటే తిండెలా సహిస్తుందండీ" అంటూ రోదించసాగింది. ఆమె చేతినున్న మూటలోంచి తెల్లటి బియ్యపు గింజలు బాబు మీదకు జలజలా రాలాయి -కన్నీటి చుక్కలతో తడిసి.


                              *    *    *

    డైనింగ్ టేబుల్ మీదున్న డెక్ లాం షీటు పైన పడిన నీటి చుక్కని చూపుడు వేలితో గీస్తోంది. కిరణ్మయి టేబుల్ మీద  రకరకాల కూరలున్నాయి. అన్నం పొగలుగ్రక్కుతోంది. వంటమనిషి ఫ్రిజ్ తెరిచి పెరుగు గిన్నె తీసుకొచ్చి బల్లమీద పెట్టేడు.

    ఆమె ఇవేమీ గమనించే స్థితిలో లేదు. అంతలో రవి అక్కడికి వచ్చేడు.

    "గుడ్ ఈవెనింగ్ డియర్! ఏమిటీరోజు స్పెషల్?" అన్నాడు నేప్ కిన్ తీసుకొంటూ. ఆమె మాట్లాడలేదు.

    ఆ మౌనాన్ని అతడు గ్రహించకుండా అన్నం వడ్డించసాగేడు.

    "ఏమన్నా తెలిసిందా రవీ?" ఆమె నెమ్మదిగా అడిగింది. అతడు జాగ్రత్తగా గమనించి వుంటే ఆమె మనస్సులో ఉవ్వెత్తుగా  లేచిపడే ఆవేశాన్నీ, ఉద్వేగాన్నీ అతికష్టంమీద ఆపుకొని, మామూలుగా మాట్లాడ్డానికి ప్రయత్నిస్తూందని తెలిసి వుండేది. అతడు అదేమీ గమనించకుండా "లేదు! ఈ రోజు కూడా ఏమీ  ఉత్తరాలు రాలేదు" అన్నాడు.

    ఆమె చాలా కఠినమైన స్వరంతో "మనం ఒక్క ప్రకటన ఇవ్వగానే ఉత్తరాలు వచ్చి పడతాయనుకున్నావా?" అంది.

    అతడు తలెత్తిచూసి ఆమె మొహంలో కనబడుతూన్న ఉద్వేగానికి ఆశ్చర్యపోయి, "ఎక్కడున్నా తిరిగి రమ్మని పేపర్ లో ప్రకటించాము, అంతకన్నా ఏం చెయ్యాలి?" అన్నాడు.

    "అంతకన్నా ఏం చెయ్యాలా? మా గురించి కనుక్కోవటానికి మీ అన్నయ్య అదే చేసేడా?" అంది దాదాపు అరుస్తున్నట్టు.

    రవి కొంచెం విసుగుతో "నా స్థానంలో నువ్వేగానీ వుంటే ఏం చేసే దానివి?" అన్నాడు.

    "ఏం చేసేదానినా? ఈ ఇంట్లోనే వున్న కిరణ్మయి అనే పాపిష్టిదాని దగ్గరికి వెళ్ళేదాన్ని. 'ఒసేయ్- నువ్వు తినటానికి తిండిలేని స్థితిలో వున్నప్పుడు నిన్ను రక్షించిన  చైతన్య అనే మహనీయుడు ఇప్పుడు వూళ్ళుపట్టి పోయేడు. నీకున్న పది లక్షలు తగలెయ్యనా? ఒక లక్ష ఇవ్వు. ఇరవయ్ మంది మనుష్యుల్ని పెట్టి వెతికిస్తాను. దేశంలో వచ్చే ప్రతి పేపర్ లోనూ, వాళ్ళు దొరికేవరకూ ప్రతిరోజూ ప్రకటిస్తాను" అని వుండేదాన్ని. అంతేగానీ ఇలా సర్వసుఖాలూ  అనుభవిస్తూ కూర్చుండేదాన్ని మాత్రం కాదు" దుఃఖంతో  ఆమె కంఠం రుద్ధమైంది.

    రవి మొహంలో అవమానం ఛాయ ఏర్పడింది. "అన్నయ్యంటే నాకూ వుంది ప్రేమ. నేనేం చేతులు కట్టుకొని కూర్చోలేదు" అన్నాడు.

    ఆమె ఎర్రబడిన కళ్ళతో అతడివేపు సూటిగా చూస్తూ "చేసింది సరిపోదు" అంది.

    "ఎలా చెప్పగలవ్...."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra