Home » Suryadevara rammohan rao » మోడల్


    "నువ్వు భలే ఘటికుడివి."

    "ఏం.....ఎందుకని?"

    "నీకు తెలియదా?"

    "తెలియదే" అమాయకంగా మొఖంపెట్టి అన్నాడు.

    "నిన్నూ......పళ్ళమధ్య నాలికపెట్టి కొరుకుతూ ఉక్రోషంగా అంది.

    "అదంతా కోపమే."

    "అబ్బ! నువ్వు భలే ఉడికిస్తావ్ మనూ! పందెం గురించి ఎంత అడుగుతున్నా చెప్పకుండా దాటేస్తున్నావ్."

    "కాఫీ లేదా?" గారంగా  అడిగాడు.

    "ఛస్తే ఇవ్వను, అది చెప్పేవరకూ" అంటూ  బాత్  రూంవైపువివ విసా నడుస్తూ వెళ్ళిపోయింది తెచ్చిపెట్టుకున్న కోపంతో.

    మనోహర్ నవ్వుకుంటూ కిచెన్ లోకి నడిచాడు. మంగళ మొఖం కడుక్కొని, విడిపోయిన జుత్తు ముడివేసుకుని వచ్చేసరికి  కమలిని ఎక్సర్  సైజ్ ముగించుకొని వచ్చింది.

    ట్రేలో మూడుకప్పుల కాఫీతో వారిదగ్గరకు వచ్చాడు మనోహర్.

    కమలిని వింతగా చూసింది మనోహర్ ని చూసి నవ్వింది. చేతులకి, మొఖానికి అక్కడక్కడా అంటిన మసినిచూసి. తెల్లటి మానోహార్  శరీరంపై  అంటుకున్న మసి అతనికి వింతఅందాన్ని సంతరింపజేసింది. ఆ అందాన్నే కన్నార్పకుండా చూస్తోంది మంగళ.

    "తీసుకోండి" అన్నాడు ట్రే టీపాయ్ మీద పెడుతూ.

    ఇద్దరూ చెరోకప్పు తీసుకున్నారు.

    అంతలోనే "మేడమ్ కాఫీ తాక్కండి.సస్పెన్స్ చెప్పే వరకూ మనం కాఫీ, గీఫీ నాన్తానై" అంది మంగళ.

    అప్పుడు గుర్తొచ్చింది కమలినికి రాత్రి మనోహర్ పందెం  విషయం చెప్పకుండానే దాటవేశాడని.

    మంగళతోపాటు కమలినికూడా కాఫీ కప్పు ట్రేలో పట్టేసింది.
   
    చెప్పక తప్పదా అన్నట్లు ఇబ్బందిగా చూశాడు మనోహర్ ఇద్దరి వైపూ.

    తప్పదన్నట్లు మొండిగా చూశారు ఇద్దరూ.

    "టిఫిన్ చేసి పెడితే చెబుతా" అంటూ మంగళను వెక్కిరిస్తూ తన  బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు మనోహర్.

    "అబ్బ....ఎంత.....మొండో......జగమొండి......ఈ మొండి మనిషితో ఎలా పడుతున్నారు మేడమ్!"

    "అదే చిత్రం. మామూలప్పుడు ఎంత సరదాగా వుంటాడో కెమేరా ముందుకివస్తే అంత సీరియస్ నెస్, డీప్ కాన్ షన్ ట్రేషన్, హైలీథింకింగ్, మోస్ట్ క్రియేటివ్. మా వృత్తికే ఎథిక్స్ నేర్పేంత ఉన్నత స్థాయిలో వుంటాడు. హి ఈజ్ ఎ నైస్ చాప్" అంది మనోహర్ పై తనకున్న అభిప్రాయాల్ని గుర్తుకు తెచ్చుకుంటూ.

    తన ప్రియుడి గురించి అంత గొప్పగా మరో స్త్రీ చెబుతుంటే ఏ  ప్రియురాలు మాత్రం సంతోషపడదు.

    తీయటి అనుభూతులు మనస్పంతా గిలిగింతలు పెడుతుండగా టిఫిన్ తయారు చేసేందుకు కిచెన్ లోకి వెళ్ళింది.

    మనోహర్  స్నానం కానిచ్చి వచ్చేసరికి మంగళ టిఫిన్ సిద్ధం చేసింది.

    కమలిని ఇంటికి వెళ్ళాలి అంటూ రెండు మూడుసార్లు ప్రయత్నించినా మంగళ ఆపుచేసింది. టిఫిన్ చేసి వెళుదురుగాని అంటూ.

    జీడిపప్పుతో చేసిన ఉప్మాని మూడు ప్లేట్లలో సర్దింది మంగళ.

    కమలిని, మనోహర్ తింటున్నా మంగళ తినకుండా మనోహర్ వైపు చూస్తూ కూర్చుంది.

    "ఎలా వుంది?" అడిగింది మంగళ.

    "ఏమిటది?" అడిగాడు పరధ్యానంగా.

    "ఎంతకోపం వస్తుందో నీమీద, డైనింగ్ టేబుల్ ముందున్నప్పుడుఎలా వుందని వేటి గురించి అడుగుతాం? వంటల గురించే కదా!"

    "ఏమో!" అన్నాడు తింటూనే.

    తన వంట బాగుందని ,మెచ్చుకుంటాడేమో అని ఆశగా ఎదురు చూస్తున్న మంగళకు వళ్ళెరగని కోపం వచ్చింది.

    "నాకు మాత్రం చాలా బావుంది" అంది కమలిని.

    "థాంక్యూ మేడమ్! ఎలా వుంది చెప్పవా మనూ!"  బ్రతిమిలాడుతూన్నట్లు అడిగింది మనోహర్ ని మరలా.

    "ఏమో నేనెప్పుడూ టేస్ట్ గురించి పెద్దగా పట్టించుకోను. విడిగా కారం సరిపోయిందా? ఉప్పు సరిపోయిందా అనేది కనిపెట్టడం మనవల్ల కానిపని."

    "అవునుమరి. ఎక్కడబడితే అక్కడ హొటల్స్ వెంటబడితింటే రుచులెలా తెలుస్తాయి?" ఉక్రోషంతో ఆమె ముక్కుపుటాలు అదిరిపడుతున్నాయి.

    "చాలా కష్టం బాబూ నీతో! నీకు కమ్మగా పండిపెట్టి, నీవు తినిబాగున్నాయంటే సంతోషపడదామని, పిచ్చిమొహంలా  వంటలు బాగా  చేయడం వచ్చిన వారందరి దగ్గరకువెళ్ళి చచ్చేట్లు నేర్చుకున్నాను ప్చ్........ ఉత్త మొద్దు" అంది నిట్టూరుస్తూ.

    "మాటవరసకైనా బావుందంటే నీ సొమ్మేం పోయింది? పెద్ద బోడి ఫోజు......గుటుక్కు గుటుక్కుమని మ్రింగుకుంటూ. నాకు వళ్ళు మండిపోతోంది."

    ఇద్దరివైపు మార్చి మార్చి చూస్తూ తనలో తానే  నవ్వుకుంటోంది కమలిని.

    "మాటవరసకి అనేవాడ్ని కాని, బావుందని అన్నానని మరలా పెడతావేమోనని భయం" అన్నాడు మనోహర్ భయం నటిస్తూ.

    విసురుగా లేచివచ్చి మనోహర్ బుగ్గను గట్టిగా పిండింది.

    అంతలోనే ఉలిక్కిపడి సిగ్గుపడిపోయింది. ఎదురుగా కమలిని చూసి. చప్పున వచ్చి కూర్చుంది, మనోహర్   బుగ్గ ఎర్రగా  కందిపోయి రక్తం చిమ్ముతున్నట్లుగా తయారయింది.

    మంగళకు బాధనిపించింది మనోహర్ బుగ్గ చూసి.

    "సారీ మనూ!" అంది బాధగా.

    మనోహర్ చేయి కడుక్కుని లేచి మంగళ ప్రక్కకు వచ్చి "నో సారీ.......నాకేం నొప్పిలేదు" అంటూ ఆమె జుత్తు నిమురుతూ "నువ్వు బుగ్గ పిండినా  నాకెందుకో నొప్పిగాలేదో తెలుసా?"

    తెలియదన్నట్టు భుజాలు ఎగురవేసింది.
 మంగళ అమాయకంగా చూస్తూ-నవ్వును పెదాలమాటున బిగపెట్టి.

    "నీ ఉప్మా తినేసరికి న శరీరం మొద్దుబారిపోయింది. ఇంక నొప్పెలా......"

    మనోహర్ మాటలు పూర్తికాలేదు. మంగళ చెంగునలేచి "యూ" అంటూ  అతని గుండెలపైన తన సుకుమారమైన చేతులతో బాదింది.

    ఆమె చిలిపితనం, కోపం, ఉక్రోషం మనోహర్ కి  నవ్వు తెప్పించాయి. మనోహర్ మంగళను తన గుండెలకేసి ప్రేమగా హత్తుకొని, ఆమె జుత్తుపై మృదువుగా ముద్దు పెట్టుకొని వదిలేస్తూ "నిన్నిలా ఉడికించడం, నీకు  కోపంవచ్చి చిన్నపిల్లలా గెంతటం, పిల్లిలా  రక్కటం నాకు ఎంతో ఆనందాన్ని కల్గిస్తుంది మంగళా" అన్నాడు ఆమె కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ.

    మంగళ మనస్సు ఓ క్షణం లయతతప్పింది.

    కమలిని వెళ్ళేందుకు లేచింది.

    మనోహర్ కావాలని పందెం విషయాన్ని దాస్తున్నాడా? చెప్పలేక దాస్తున్నాడా? ఎటూ తేల్సుకోకుండా వుంది కమలిని మనోహర్ ప్రమాదాల్లో ఇరుక్కోకుండా చూసుకోవాలని కమలిని ఆరాటం, తపన. కమలిని మనస్సులో ఏ ఆలోచనలున్నాయో ఎవరికీ తెలియదు. ఆమె చెప్పదు. గుంభనంగా, గంభీరంగా వుంటుంది. మోడల్ ప్రపంచంలో వున్న ప్రతిఒక్కరికి ఆమె ఒక  మిస్టరీ. మోడల్ వరల్డ్ లో వున్న ప్రతిఒక్కరిని కమర్షియల్ గా, తృణీకారంగా చూసే కమలిని ఒక్క మనోహర్ నే ఎందుకు గౌరవిస్తుంది, అతనిపై మాత్రమే ఎందుకు శ్రద్ధ కనబరుస్తుంది? ఎవరికీ అర్థంకావు. ఒక్క  కమలినికే అర్థం కావాలి. కారణం ఆమెను అర్థం చేసుకున్నవారు, చేసుకొనేందుకు ప్రయత్నించిన వారు ఒక్కరూ లేనందువల్ల.

    "కూర్చోండి కమలినిగారూ, పందెం విషయం చెబుతాను. ఇంత సేపూ ఎందుకు చెప్పలేదంటే ఆ విషయంపై మీకెంత శ్రద్ధ వుందో గమనిద్దామని." అన్నాడు నవ్వుతూ.

    "కెమేరా బుద్ధులు ఎక్కడికి పోతాయ్!" అంది కమలిని కూడా నవ్వుతూ.

    అప్పటివరకూ నవ్వుతూ, నవ్విస్తూ, చిన్నపిల్లాడిలా బిహేవ్ చేసిన మనోహర్ వెంటనే గంభీరంగా మారిపోయాడు. మొఖంలో మార్పు వచ్చింది కళ్ళు తీక్షణంగా మారిపోయాయి. అప్పుడతని మొఖంలో కసి పట్టుదల, సీరియస్ నెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.


                                                                     *    *    *


    "నేను బొంబాయిలో అప్రెంటిస్ పూర్తిచేసుకుని వచ్చిన తొలి రోజుల్లో చాలామంది నన్ను తమ ఏజెన్సీలలో పనిచేయమని అడిగారు. నాకెందుకో ఒకరి దగ్గర చెయ్యాలనిపించలేదు. విడిగా చేసుకుంటే నా  టేస్టుకి తగ్గట్టుగా వర్క్ చేసుకోవచ్చని ఏ ఏజెన్సీలోనూ చేరలేదు.

    ఇండియాన్ యాడ్ వరల్డ్ లో వున్న  జుగుప్స, నగ్నత్యం నాకు నచ్చేవికావు. స్త్రీలలోని అద్భుతమైన సౌందర్యాన్ని అపహాస్యం చేయటం జరుగుతోంది నేడు. అది బొత్తిగా నాకిష్టంలేదు. వారి అందాన్ని హుందాగా, కన్నుల పండుగగా, రమ్యమైన రీతిలో, ఇతివృత్తానికి తగినట్లుగా ప్రొడక్టుని  బాగా ప్రాజెక్టు చేసే సందర్భంలో, అవసరం మేరకే మోడల్స్ ని  ఉపయోగించుకోవాలని కలలు కంటుండేవాడిని. అప్పట్లో డాషింగ్ ఎడ్వర్టయిజింగ్ ఏజెన్సీకి గొప్ప పేరు ప్రతిష్టలుండేవి. దాని బాస్  ప్రదీప్  సక్సేనా మంచి సమర్ధుడని, పెద్ద పెద్ద కంపెనీల పబ్లిసిటీ ఆయన చేతిలో వుందని తెలిసి ఆయన దగ్గరకు వెళ్ళాను.

    అప్పటికే అతని దగ్గర ఐదారుగురు ఫోటోగ్రాఫర్స్  వున్నారు.

    మొదట్లో పేపర్  పబ్లిసిటీ (స్టిల్ ఫోటో గ్రఫీ), పీస్  వర్క్  బేసిస్ మీద  ఇచ్చేవాడు. ఒక కంపెనీ వర్క్ చేశాను. హాట్ షాట్  మోడల్ మోనికాదత్ యిచ్చిన సహకారంతో కాపీరైటర్ భావాలకు నూటికి నూరుశాతం న్యాయం చేకూర్చాను. ఆ యాడ్స్ చాలా పత్రికల్లో వచ్చి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఫస్ట్ వర్క్  సక్సెస్ పుల్ అయింది. క్రమంగా చాలా కంపెనీల వర్క్స్ నా కప్పగించేవాడు. ఓసారి ఓ యాడ్ ఫిల్మ్ కాంట్రాక్టు ఇచ్చాడు. దాని డ్యూరేషన్ 90 సెకండ్లు. ఫేమస్ మోడల్స్ తో తీయాలని చెప్పాడు.

    నేను బొంబాయిలో మా గురువుగారి దగ్గర పనిచేసేప్పుడు ఇండియన్ ఫేమస్ మోడల్స్ చాలా తరచూ వస్తూండేవారు ఆయన దగ్గరకు. అప్పుడు వారితో నాకు పరిచయమైంది. ఆ పరిచయంతో ప్రామిస్ టూత్ పేస్ట్ మోడల్ మాయా ఆలగ్, కాల్గేట్ చబ్బీ ధరీవాల్, పాండ్స్ సంగీతా బిజ్ లాని, ఆరతీగుప్త, అనితారెడ్డిని కాంటాక్టుచేసి పిలిపించాను. షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని లోకేషన్ కి వెళ్ళబోయే ముందు స్క్రిప్టు మారిందంటూ కబురుచేసాడు ప్రదీప్. క్రొత్త స్క్రిప్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. నేను పిలిపించిన మోడల్స్ బాగా ఫేమస్. హైలి చార్జ్ డ్. షూటింగ్ వాయిదా పడటంతో వాళ్ళను త్రిప్పిపంపాల్సి వచ్చింది. ఫ్లయిట్ చార్జెస్, స్టార్  హొటల్స్ ఖర్చులు చాలా అయిపోయాయి నాకు.

    మరో పదిరోజుల తర్వాత దాన్ని పూర్తిచేసాను. కాని అందులో బాగా నష్టం వచ్చింది. అదే విషయాన్ని ప్రదీప్ ని అడిగితే చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. మరో ఫిల్మ్ ఇచ్చాడు. దానిలో కొత్త మోడల్ ఉండాలన్నాడు. ఎంతో ఖర్చుపెట్టి మంచి ఫీచర్స్, ఫేస్, ప్రోపైల్ వున్న అమ్మాయిని తెచ్చి బాగా ట్రైనింగ్ ఇచ్చాను. మొత్తానికి పదివేలు ఖర్చయింది. ముందు మోడల్ సెలక్షన్ నాదేనని. ఆ తరువాత అతని కిష్టమైన మరో అమ్మాయిని తెచ్చి మోడల్ గా తీసుకోమన్నాడు ,మోడల్స్ ని పికప్ చేసేందుకు అతని ఏజెన్సీకి నలుగురు ఉమెన్ కో - ఆర్డినేటర్సున్నారు. సాదారణంగా వారే  మోడల్స్ ని డిస్కవర్ చేసి, ఏజెన్సీ బాస్ కి. ఫోటోగ్రాఫర్ కి నచ్చితే మోడల్స్ గా పరిచయం చేస్తారు. అదెవరు తప్పనరు. కాని ముందు నన్నే చూసుకోమని, తరువాత ఒక కో-ఆర్డినేటర్ పై వున్న ఇష్టంతో కెమేరా అంటే  బొత్తిగా తెలియని ఒక కొత్త అమ్మాయిని మోడల్  గా తీసుకోమని వత్తిడి చేసాడు. అయినా ఊరుకున్నాను. ఆ అమ్మాయికి పదిహేను రోజులు తర్ఫీదు ఇచ్చినా ఆమెలో ఆశించిన పర్ ఫెక్షన్ రాలేదు. దాంతో ఫిల్మ్ ప్లాప్ అయింది. అది నా తప్పేనంటూ ప్రచారం చేసాడు. నేనూ జరిగిన విషయాన్ని నలుగురి ముందుంచాను. అప్పటినుంచీ నామీద  పగబట్టాడు. 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra