Home » Dr. dasaradhi rangacharya » Krishna Yajurveda


    5. ఇష్టకా! ద్యులోకము అమృతమయము. అపరాజిత. ద్యులోకమునందు ఆదిత్యులు, సూర్యులు నీకు రక్షకులు అగుచున్నారు. తామహం ప్రపద్యే సామే శర్మచ వర్మచాస్తు.

                                          ఆరవ అనువాకము

    1. ఇష్టకా! త్వా జ్యోతిష్మతీ = నీవు జ్యోతిష్మతివి. బృహస్పతిః విశ్వస్మై = బృహస్పతి జగములందలి జీవుల ప్రాణాయ, అపానాయ పృథివ్యాః పృష్ఠే = భూమిమీద స్థాపించునుగాక. విశ్వమ్ = గొప్ప, జ్యోతిః = జ్యోతిని, యచ్చ = నియంత్రించుము. తే అగ్నిః అధిపతిః

    2. విశ్వకర్మా త్వా సాదయత్వన్తరిక్షస్య పృష్ఠే జ్యోతిష్మతీం విశ్వస్మై ప్రాణాయాపానాయ విశ్వం జ్యోతిర్యచ్చ వాయుస్తే అధిపతిః

    3. ప్రజాపతి స్త్వా సాదయతు దివః పృష్ఠే జ్యోతిష్మతీం విశ్వస్మై ప్రాణాయాపానాయ విశ్వం జ్యోతి ర్యచ్చ పరమేష్ఠీ త్కేధిపతిః 

    4. ఇష్టకా! నీవు తూర్పుగాలిని ఇచ్చుదానవు అగుచున్నావు. మేఘమును ఇచ్చుదానవు అగుచున్నావు. మెరుపును ఇచ్చుదానవు అగుచున్నావు. ఉరుమును ఇచ్చుదానవు అగుచున్నావు. వర్షమును ఇచ్చుదానవు అగుచున్నావు.

    5. ఇష్టకా! త్వం = నీవు, అగ్నీః యానీ = అగ్నిని అందించుదానవు, అసి = అగుచున్నావు. ఇష్టకే! త్వం = నీవు, దేవానామ్ = దేవతలకు, అగ్నీయానీ అసి.

    6. వాయోర్యానసి దేవానాం వాయోయాన్యసి

    7. అంతరిక్షస్య యాన్యసి దేవానా మన్తరిక్షయాన్యసి.

    8. ఇష్టకా! నీవు అంతరిక్షస్వరూపవు. అంతరిక్షప్రీతి కొరకు నిన్ను ఉపధానము చేయుచున్నాను.

    9. ఇష్టకా! సలిలాయ త్వా ఉపదధామి. సర్జీకమను జలముకొరకు త్వా ఉపదధామి - సతీకమను జలము కొరకు త్వా ఉపదధామి. వివస్వతే త్వా ఉపదధామి. దివః జ్యోతిషే త్వా ఉపదధామి. ఆదిత్యేభ్యః త్వా ఉపదధామి.

    10. ఇష్టకా! ఋక్కుల కొరకు త్వా ఉపదధామి. ఆదిత్య ప్రకాశము కొరకు త్వా ఉపదధామి. అగ్ని దీప్తి కొరకు త్వా ఉపదధామి. నక్షత్ర ప్రకాశము కొరకు త్వా ఉపదధామి.

    11. ఇష్టకా! నీవు యశస్సు కలిగించుదానవు. నేను నిన్ను నీ అభిమాన ఋషితోను, నిన్ను ప్రతిపాదించు మంత్రముతోను, నీ అభిమాన దేవతతోను - నా కీర్తికొరకు - పూర్వము అంగిరసులు స్థాపించినట్లు - స్థాపించుచున్నాను.

    ఇష్టకా! నీవు తేజస్సు నిచ్చుదానవు. త్వా తేజసి తేన ఋషిణా, తేన బ్రహ్మణా, తయో దేవతయా, అంగిరస్వత్ సాదయామి.

    ఇష్టకా! నీవు క్షీరములొసగుదానవు. త్వాక్షీరాయ, తేన ఋషిణా, తేన బ్రహ్మణా, తయో దేవతయా, అంగిరస్వత్ సాదయామి.

    ఇష్టకా! నీవు వర్చస్సు కలిగించుదానవు. త్వావర్చసి, తేన ఋషిణా, తేన బ్రహ్మణా, తయో దేవతయా, అంగిరస్వత్ సాదయామి.

    ఇష్టకా! నీవు ధనము నొసగుదానవు. త్వాద్రవిణే, తేన ఋషిణా, తేన బ్రహ్మణా, తయో దేవతయా, అంగిరస్వత్ సాదయామి.

    ధ్రువాసీద - స్థిరముగా ఆసీనవగుము.

                                           ఏడవ అనువాకము

    1. ఇష్టకా! నీవు ఎంతో పెంచుదానవు, గౌరవము కలిగించుదానవు, తూర్పుదిక్కువు, పై దిక్కువు అగుచున్నావు. అంతరిక్షమునందు ఉండునట్టి నీవు అంతరిక్షమున నిలువుము.

    2. ఇష్టకా! నీవు ఉదకములందున్న అగ్ని, డేగ యందున్న అగ్ని, గద్దయందున్న అగ్ని, గరుడ మందున్న అగ్ని స్వరూపవు అగుచున్నావు. నీవే స్వర్గమందున్న అగ్ని స్వరూపము అగుచున్నావు.

    3. ఇష్టకా! త్వా పృథివ్యాః ద్రవిణే = ధనమునందు, సాదయామి. త్వా, అన్తరిక్షస్య ద్రవిణే సాదయామి. త్వా దివః ద్రవిణే సాదయామి. త్వా దిశాం ద్రవిణే సాదయామి. ధనము నొసంగునట్టి నిన్ను ద్రవిణే సాదయామి.

    4. ఇష్టకా! మే ప్రాణం పాహి. మే అపానం పాహి. మే వ్యానం పాహి. మే ఆయుః పాహి. మే విశ్వాయుః పాహి. మే సర్వాయుః పాహి.

    5. అగ్నీ! నీకు 'హృత్' అను గొప్ప పేరు గలదు. ఆ పేరుతో నా వద్దకు రమ్ము. ఈ కర్మను మనము ఉభయులము కలిసి చేయుచున్నాము. నీవు అయిదు చితుల అన్ని స్థానములందు ఉండుము.

    6. ఇష్టకా! నీవు వసంత స్వరూపవు, గ్రీష్మ స్వరూపవు, వర్ష స్వరూపవు. శరత్తు స్వరూపవు, హేమంత స్వరూపవు, శిశిర స్వరూపవు అగుచున్నావు. సంవత్సర స్వరూపవు అగుచున్నావు.

                                        ఎనిమిదవ అనువాకము

    1. ఇష్టకా! అగ్నితో కూడిన లోకములను పాలించు ఇంద్ర స్వరూపము అగుచున్నావు. సూర్యునితో కూడిన స్వరాట్ ఇంద్ర స్వరూపము అగుచున్నావు. యజ్ఞముతో కూడిన శచీపతి రూపము అగుచున్నావు. వర్షించు స్వభావముగల త్వష్ట రూప ఇంద్ర స్వరూపము అగుచున్నావు. పాక యజ్ఞముతో కూడిన ఇంద్ర స్వరూపము అగుచున్నావు. క్రోధముతో కూడి వృత్రుని చంపిన ఇంద్ర స్వరూపము అగుచున్నావు.

    ఇష్టకా! స్నేహము నిండిన దేహము గల ఇంద్ర స్వరూపము అగుచున్నావు. అన్నము నిండిన గృహ రూపుడగు ఇంద్ర స్వరూపము అగుచున్నావు. భూమితో కూడి ధనములు దానము చేయు ఇంద్ర స్వరూపము అగుచున్నావు. మంత్రయుక్త అన్నమును ఆరగించు ఇంద్ర స్వరూపము అగుచున్నావు. హవిస్సుల కారణముగ సమృద్దుడగు ఇంద్రుని స్వరూపము అగుచున్నావు. సామ గానములచే శరీరమును పాలించు ఇంద్ర స్వరూపము అగుచున్నావు. విరాజఛందస్సుతో ప్రకాశించు ఇంద్ర స్వరూపము అగుచున్నావు. ఋత్విజులందు బ్రహ్మతోడి, సోమ పాన కర్తయగు ఇంద్ర స్వరూపము అగుచున్నావు.

    ఇష్టకా! గోవులతో యజ్ఞమును ధరించిన ఇంద్ర స్వరూపము అగుచున్నావు. క్షాత్రముతో మానవులను ధరించు ఇంద్ర స్వరూపము అగుచున్నావు. అశ్వము, రథము వజ్రము గల ఇంద్ర స్వరూపము అగుచున్నావు. ఋతువులతో కూడిన ప్రభువగు ఇంద్ర స్వరూపము అగుచున్నావు. తపస్సుతో కూడి ఎంతటి వానికి లొంగని ఇంద్ర స్వరూపము అగుచున్నావు. ద్వాదశమూర్తుల సూర్యుడగు ఇంద్ర స్వరూపము అగుచున్నావు.

                                        తొమ్మిదవ అనువాకము

    1. మనసు చేత అన్నహేతువగు యజ్ఞమును సంకల్పించువాడు ప్రజాపతి అగుచున్నాడు. ఇష్టకే, త్వం = నీవు, తద్రూపా అసి = అతని రూపము అగుచున్నావు. దీక్ష యందున్న వాడు ధాతయగుచున్నాడు. ఇష్టకే త్వం తద్రూపా అసి. యజ్ఞ భిక్షయందున్నవాడు సవిత అగుచున్నాడు. ఇష్టకే! త్వం తద్రూపా అసి. సోమక్రయణి యందున్నవాడు పూష యగుచున్నాడు. ఇష్టకే త్వం తద్రూపా అసి. బట్టలో సోమమును మూటగట్టు ఉపసిద్ధుడు వరుణుడు అగుచున్నాడు. ఇష్టకే త్వం తద్రూపా అసి క్రీయమాణము ఇంద్రుడు అగుచున్నాడు. ఇష్టకే త్వం తద్రూపా అసి. యజమాని రొమ్మున ఉంచునట్టు ఆసాదితము విష్ణువు అగుచున్నాడు. ఇష్టకే త్వం తద్రూపా అసి. బండి మీద యజ్ఞమునకు తీసికొని పోబడు ప్రోహ్యమానము అగ్ని అగుచున్నాడు. ఇష్టకే! త్వం తద్రూపాసి యజ్ఞశాలకు వచ్చిన "ఆగతము" ఆహవనీయాగ్ని అగుచున్నాడు. ఇష్టకే! త్వం తద్రూపాసి. యజ్ఞశాల నుండి అగ్నీధ్రమునకు చేర్చిన "ప్రణీయమానము" ప్రజాపతి అగుచున్నాడు. ఇష్టకే త్వం తద్రూపా అసి. అగ్నీధ్రము నందలి సోమము అగ్ని అగుచున్నాడు. ఇష్టకే త్వం తద్రూపాసి. అగ్నీధ్రము నుండి హవిర్ధానమునకు చేరిన సోమము బృహస్పతి అగుచున్నాడు. 'ఇష్టకే త్వం తద్రూపా అసి. హవిర్ధానమునకు చేరిన సోమము ఇంద్రుడు అగుచున్నాడు. ఇష్టకే! త్వం తద్రూపా అసి. అసంది యందు స్థాపించిన సోమము అదితి అగుచున్నది. ఇష్టకే త్వం తద్రూపా అసి. బండి నుంచి రాతి మీదకు చేర్చిన "ఉపావహ్రియమాణ" సోమము విష్ణువు అగుచున్నాడు. ఇష్టకే త్వం తద్రూపా అసి. వసతీ నదీ జలముచే తడుపబడిన 'ఉప్తోత' మను సోమము అథర్వర్షి అగుచున్నాడు. ఇష్టకే త్వం తద్రూపా అసి. పొడి చేయబడిన 'అభిషుత' సోమము యముడు అగుచున్నాడు. ఇష్టకే త్వం తద్రూపా అసి. ఆధూయమానము ఆదిత్యుడు అగుచున్నాడు. ఇష్టకే త్వం తద్రూపా అసి. పూతంవాయుః. ఇష్టకే త్వం తద్రూపా అసి. క్షీరశ్రీః మిత్రః ఇష్టకే త్వం తద్రూపా అసి. సక్తుశ్రీః మన్థీ. ఇష్టకే త్వం తద్రూపా అసి.వైశ్వ దేవ ఉన్నతః ఇష్టకే త్వం తద్రూపా అసి. రుద్ర ఆహుతో. ఇష్టకే త్వం తద్రూపా అసి. వాయురా వృత్తః ఇష్టకే త్వం తద్రూపా అసి. నృచక్షాః ప్రతి ఖ్యాతో. ఇష్టకే త్వం తద్రూపా అసి. భక్ష ఆగతః ఇష్టకే త్వం తద్రూపా అసి. పితృణాం నరాశంసః ఇష్టకే త్వం తద్రూపా అసి. అసురాత్తః సిన్ధుః. ఇష్టకే త్వం తద్రూపా అసి. అవగతః సముద్రః ఇష్టకే త్వం తద్రూపా అసి. సలిలః ప్రప్లుతః ఇష్టకే త్వం తద్రూపా అసి. సువరుదృచంగతః. ఇష్టకే త్వం తద్రూపా అసి. 

                                           పదవ అనువాకము

    1. కృత్తికలు ఒక నక్షత్రము. దానికి అగ్ని దేవత. హే కృత్తికాః! మీరు అగ్నేః ప్రజాపతేః ధాతుః, సోమునికి దీప్తులుగా ఉంటున్నారు. ఇష్టకే! ఋక్కు కొరకు త్వా ఉపదధామి. కాంతి కొరకు త్వా ఉపదధామి. అగ్ని దీప్తి కొరకు త్వా ఉపదధామి. సూర్య దీప్తి కొరకు త్వా ఉపదధామి. చంద్ర దీప్తి కొరకు త్వా ఉపదధామి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra