Home » Dr. dasaradhi rangacharya » Krishna Yajurveda


    9. గుర్రము కొట్టము నుండి బయటపడి పచ్చిగడ్డి కొరకు మహాధ్వని చేయును. అగ్నియు జాజ్వల్యమానుడై ఆ అశ్వము వలె నినదించుచున్నాడు. అట్లు ధ్వనించుచు, జ్వలించుచున్న అగ్నికి గాలి తోడగుచున్నది.

    అగ్నీ! అట్లు అంటుకొని అడవికి నీవు తగిలినపుడు అరణ్యము మసి అగుచున్నది. నల్ల బారుచున్నది.

                                          నాలుగవ అనువాకము

    1. ఈ అగ్ని దివమున సూర్యరూపమున నిలిచి శీర్షప్రాయుడు అయినాడు. భూమిని పాలించుచున్నాడు. జలాధార స్థావర, జంగములకు ముదము కూర్చుచున్నాడు.

    2. అగ్నీ! నీవు శిరము వంటి ప్రశస్తుడవు. విశ్వములను భరించువాడవు. అథర్వుడు నిన్ను తామరాకు మీద మధించినాడు.

    3. ప్రజ్వలించు అగ్ని వందల, వేల అన్నములకు అధిపతి. తలవంటి ముఖ్యుడు. విద్వాంసుడు. అతడు ధనదాత అగునుగాక.

    4. అగ్ని భూలోకమును, యజ్ఞమును, యజ్ఞగుణమును నిర్వహించుచున్నాడు. దివియందున్న అగ్నియొక్క రథమునకు శుభప్రదములగు అశ్వములు కూర్చబడి ఉన్నవి. ఆ అగ్ని సర్వదా స్వర్గమందుండి శీర్షము వంటి ప్రథాన స్థానము కలిగిఉన్నాడు.

    అగ్నీ! నీవు హవ్యము వహించు నాలుకలు చాచుచున్నావు.

    5. ఉషః కాలమున పాలిచ్చు ఆవును వలె ఋత్విక్కులు సమిధలచే అగ్నిని మేల్కొలుపుచున్నారు. ఆ విధముగ మేల్కొనిన అగ్నిజ్వాలలు పక్షుల వలె పైకి ఎగురుచు, స్వర్గమును చేరుటకు వ్యాపించుచున్నవి.

    6. అగ్ని యజ్ఞయోగ్యుడు. కోరికలు తీర్చువాడు. భూమిమీద ఉన్నవాడు. విద్వాంసుడు. భూమిమీది ఈ అగ్నిని - ఆకాశమునందలి సూర్యుని స్తుతించిన రీతి - అగ్ని స్తుతులచే నమస్కరించుచున్నాము.

    7. అగ్ని ప్రాణిజాల రక్షకుడు. సుదక్షుడు. అప్రమత్తుడు. ఘృత ప్రతీక. అతడు వెలుగొందు కర్మకొరకు ఆవిర్భవించినాడు. అతని జ్వాలలు ద్యులోకమును అంటుచున్నవి. అతడు ద్యుమంతుడు, శుచిమంతుడు, పోషకుడై యజమానులందు ప్రకాశించుచున్నాడు.

    8. అగ్నీ! నీవు రహస్యస్థావరములందు, అరణ్యములందు ఉండినవాడవు. అంగిరసులు నీ కొరకు వెదకి కనుగొన్నారు. నీవు బలమున మధించుట వలన పుట్టుచున్నావు. అందుకే అందగాడవగు అగ్నీ! నిన్ను 'బలపుత్రుడు' అనుచున్నారు.

    9. దేవయజనములందు ఋత్విజులను, యజ్ఞమును ఎరింగినవాడును యాగప్రథముడు, పురోహితుడువగు అగ్ని దేదీప్యమానుడై ప్రజ్వలించుచున్నాడు. అతడు సుక్రతువై యాగసిద్ధికై దేవతలను ఆహ్వానించుచున్నాడు. అగ్ని ఇంద్రుడు, ఇతర దేవతలచే కూడినవాడై, రథయుక్తముగ ఈ యజ్ఞమును విరాజిల్లినాడు.

    10. అగ్నీ! నీవు విచిత్ర కీర్తివంతుడవు. యజమానులకు ప్రియుడవు. జంతువులందును, జనులందును ఉన్నవాడవు. హవిస్సులు వహించుమని నిన్ను ఆహ్వానించుచున్నాము.

    11. అగ్ని రక్షకులందు వరిష్ఠుడు. బలము తగ్గించనివాడు. స్వయముగా బలశాలి. ఋత్విగ్యజమానులారా! అట్టి అగ్నిని స్తుతించండి. అతడు మీకు అభీష్టఅన్నములను ప్రసాదించును గాక.

    12. అగ్ని! నీవు కోరికలు తీర్చువాడవు. సర్వఫలములను సంపాదించి యజమానికి అందించుచున్నావు. నీవు ఈశ్వరుడవు. విచ్చేయుము. వేదియందు ఆసీనుడవగుము. చక్కగా జ్వలింపుము. మాకు ధనములను తెచ్చి ఇమ్ము.

    13. అగ్ని అన్నమును నశింపచేయనివాడు. యజమానులకు ప్రియము కలిగించువాడు. ఎంతో తెలిసినవాడు. రోగరహితుడు. అధ్వరము జరిపించువాడు. విశ్వదూత. అమరుడు. ఋత్విగ్యజమానులారా! అగ్నికి నమస్కరించి స్తుతించండి.

    14. అగ్ని దోషరహితుడు. విశ్వభుక్కు. స్వాహుతుడు. సుబ్రహ్మ. యజనీయుడు. పాపములను శమింపచేయువాడు. అతడు ఈ యజ్ఞమును సమకూర్చుచున్నాడు. అట్టి అగ్ని నివాసములు కోరు జనులకు లోకకళ్యాణకరమగు అన్నమును ప్రసాదించునుగాత.

    15. అగ్ని సర్వత్ర హోమనిష్పాదకుడు. వర్షము కలిగించువాడు. అతని దీప్తులు పైకి ఎగసినవి. పొగలు పైకి లేచినవి. అవి దోషరహితములు. ఆకాశమును అంటుచున్నవి.

    అట్టి అగ్నిని ఋత్విక్కులు, యజమానులు ప్రజ్వలింపచేయుచున్నారు.

    16. అగ్నీ! నీవు బలపుత్రుడవు. జాతవేదివి. గోవులు గల అన్నములకు అధిపతివి. మాకు మహా కీర్తిని కలిగించుము.

    17. అగ్నీ! నీవు బహుసైన్యముల వాడవు. దీప్తుడవు. గృహదాతవు. యజ్ఞాగ్రణివి. మంత్రస్తుత్యుడవు. మాకు ధనమును, గృహక్షేత్రాదులను కలిగించుము.

    18. అగ్నీ! అహస్సులను, ఉషస్సులను క్షీణింపచేయుము. నీవు దీపించువాడవు. స్వయముగ క్షీణించుము. జ్వాలారూప అగ్నీ! రాక్షసులను భస్మము చేయుము.

    19. అగ్నీ! జరారహితుడవగు నిన్ను అచేతనమగు సమిధ ప్రజ్వలింప చేయుచున్నది. మేము చేతనులమై నిన్ను ప్రదీప్తముగా ప్రజ్వలింపచేయుచున్నామని చెప్పనక్కరలేదు కదా! నిన్ను స్తుతించు వారికి అన్నము కలిగించుము.

    20. అగ్నీ! నీవు విశుద్ధజ్యోతులకు పాలకుడవు. ఆనందకారకుడవు. పాపక్షయకర్తవు. విశ్వపాలకుడవు. హవ్యవాహనుడవు. ఋక్కులతో కూడిన హవిస్సులతో నిన్ను అంతటను ఆహ్వానించుచున్నారు. నిన్ను స్తుతించు వారికి అన్నము కలిగించుము.

    21. అగ్నీ! నీవు ఆహ్లాదకారకుడవు. నోటినిండ నేయి కలవాడవు. బలాధిపతివి. మంత్రయుక్త యజ్ఞములందు ఫలములు కలిగించుము. ఇషగం స్తోతృభ్య ఆభర - నిన్ను స్తుతించువారికి అన్నము కలిగించుము.

    22. అగ్నీ! నీవు మనసును తాకువాడవు. మంగళ స్వరూపుడవు. నిన్ను స్తోత్రసమూహము చేత యజ్ఞమును వలెను, అశ్వమును వలెను సమృద్ధుని చేయుచున్నాము.

    23. అగ్నీ! తదుపరి భద్రము, దక్షము, సాధువు, ఋతము, బృహత్తము - అగు యజ్ఞమునకు సారధ్యము వహించినావు.

    24. అగ్నీ! ఈనాటి యజ్ఞమున మేము నిన్ను మంత్రరూపమున స్తుతించుచున్నాము. హవిస్సులు అర్పించుచున్నాము. నీ జ్వాలలు ఉరుముల వలె ధ్వనించుచున్నవి.

    25. అగ్నీ! సమస్త సైన్యసమేతుడవై సుమనస్కుడవై మా అర్చనలను అందుకొనుము. ఆకాశము నందలి ఆదిత్యునివలె మాకు దగ్గరివాడవు అగుము.

    26. ధనప్రదుడు, బలసూనుడు, విద్వాంసునివలె పుట్టిన దానినెల్ల ఎరిగినవాడునగు అగ్నిని హోతగా ధ్యానించుచున్నాను. దేవతలను చేరనున్న అతని మహాజ్వాలలచే అగ్ని యజ్ఞ నిర్వాహకుడు అగుచున్నాడు. పరిశుద్ధదీప్తి కలదియు, యాగార్హమును అగు ఆజ్యముచే అగ్ని ఎంతో ప్రకాశించుచున్నాడు!

    27. అగ్నీ! నీవు మాకు దగ్గరివాడవు అగుము. రక్షకుడవగుము. శుభప్రదుడవగుము. నిత్యము మా ఇంటియందు వసించుము.

    28. అగ్నీ! నీవు పరిశుద్ధుడవు. దీప్తుడవు. మేము నీకు మిత్రులము. మాకు నిశ్చయసుఖములు కలిగించుమని నిన్ను చేరుకొనుచున్నాము.

    29. అగ్నీ! నీవు ధనవంతుడవు. వసురుద్రాదులు నీ మాటను కాదనజాలరు. నీవు మా వద్దకు విచ్చేయుము. మాకు దీప్తివంతమగు ధనమును ప్రసాదించుము.

                                        అయిదవ అనువాకము

    1. ఇష్టకా! నీవు ఇంద్రాగ్ని సంబంధివి. త్వా = నిన్ను యునజ్మి = చేర్చుచున్నాను - వారితో. ఆయురాభ్యాం త్వా యునజ్మి. తేజసా త్వా యునజ్మి. వర్చసా త్వా యునజ్మి. ఉక్దేభిః త్వా యునజ్మి. స్తోమేభిః త్వా యునజ్మి. ఛందోభిః త్వా యునజ్మి.

    నాకు ధనపుష్టి కలుగుటకును, నా వారిలో ప్రాముఖ్యత కలుగుటకును, నీకు నాతో ఉన్నసంబంధము కారణముగ నిన్ను ఇచట చేర్చుచున్నాను.

    2. కృత్తికలకు అమ్బ, దుల, నితత్ని, అభ్రయన్తి, మేఘయన్తి, వర్షయంతి అను పేర్లు కలవు. ఇష్టకా! నీవు అట్టి కృత్తికా స్వరూపవు. ప్రజాపతి ప్రేరణ కలిగించిన మనసుచే నిన్ను ఉపధానము చేయుచున్నాను.

    3. ఇష్టకా! ఈ పృథివి అన్నపూర్ణ, జలపూర్ణ. ఈ భూమిమీద అగ్నియు, మానవులును నీకు రక్షకులు అగుచున్నారు. పృథివీ రూపమగు నిన్ను ఆశ్రయించుచున్నాను. నీవు నాకు గృహస్థానము, కవచస్థానము అగుదువుగాక.

    4. ఇష్టకా! అంతరిక్షము దివిని మించినది. మహామహులు ఉన్నట్టిది. ఈ అంతరిక్షమున మరుత్తులు, వాయువు నీకు రక్షకులు అగుచున్నారు. "తామహం ప్రసద్యే సామే శర్మచ వర్మచాస్తు" అట్టి నిన్ను ఆశ్రయించుచున్నాను. నాకు గృహస్థానము, కవచస్థానము అగుదువుగాక.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra