Home » Dr c. ananda ramam » Eenati Sakunthala

    రాజవల్లి అంది.    
    "మన రమేష్ అక్కడి వాళ్ళతో చాలా చనువుగా వుంటాడు కదా! వాళ్ళందరూ ఇతని స్నేహితులుకదా ఇతడు చెప్పలేదా!"    
    "అమ్మా! నేను చదువులూ, గిదువులూ అననంతవరకే వాళ్ళ స్నేహితున్ని వాల్లపిల్లలకేదో కూలిచూపిస్తాననీ, వాళ్ళసరుకులూ, వంటలూ బేరంచేసి పెడతాననీ నాతో స్నేహంగా వుంటారు. అంతే. వాళ్ళ మాటకుఎదురు చెప్పానా ప్రాణాలతో బయటపడనక్కరలేదు.    
    "భయం నటిస్తూ అన్నాడు రమేష్.    
    "వాళ్ళు ఎంత క్రూరంగా వున్నా కొన్ని నియమాలున్నాయి. వాళ్ళు ఆడవాళ్ళనేమీ చెయ్యరు. వాళ్ళ ఆడవాళ్ళను ఏమైనా చేస్తే బతకనియ్యరు" అన్నాడు రాబర్ట్.    
    "అయితే మన శకుంతలే వెళ్ళి చదువు చెప్పితే బాగుటుందంటారా!" అందరి ముఖాలూ, చూస్తూ అంది రాజవల్లి.    
    "నో! నో? బేబి ఆ అరణ్యాలలోకి కొండజనుల మధ్యకి వెళ్ళటానికి వీల్లేదు. ఇంకేదైనా ఏర్పాటు ఆలోచించండి."    
    తీవ్రంగా అడ్డుపడ్డాడు శర్మ. రాజవల్లి ముఖంమీద చిరునవ్వు కనిపించింది. ఆవిడకూ శకుంతలను పంపటం ఇష్టంలేదనీ, కేవలం తమను పరీక్షించడానికే అలా అందనీ అప్పుడర్ధమయ్యింది.    
    "ఈ సమస్య క్షణాలలో పరిష్కారమయ్యేది కాదు, స్థిమితంగా ఆలోచిద్దాం;" అని లేచాడు రాబర్ట్, ఆ సమయంలో ఎవరూ చూడకుండా రమేష్, రాబర్ట్ కి సైగ చేశాడు.    
    "మేడమ్, మన ఫ్యాక్టరీలో కూలీల వర్కుపైన సూపర్ వైజరు అవసరమనుకుంటున్నాను. మిగిలిన ఫ్యాక్టరీలలో అలావున్నారు" అన్నాడు రాబర్ట్.        
"ఆ విషయం ఆలోచిద్దాం లెండి. మిగిలిన ఫ్యాక్టరీలలో అసిస్టెంట్ మేనేజరు కూడా వున్నారని విన్నాను మన ఫ్యాక్టరీలో అవసరంలేదా?"    
    "అఫ్ కోర్సు__అవసరమే అనుకోండి కానీ దానికి మేనేజ్ మెంట్ లో డిగ్రీగాని, డిప్లమోగాని అవసరం__"    
    "మనవడుగారూ? మీకు బిజినెస్ మేనేజిమెంట్ లో డిప్లమో తీసుకోవటానికి ఎంతకాలం పడుతుంది? అలాంటి డిప్లమోలు ప్రైవేటుగా చదివిపొందవచ్చంటకదా? నేను పేపర్ లలో చూస్తువుంటాను."    
    "నేనా! డిప్లమో తీసుకోవాలా?__" విభ్రాంతితో అన్నాడు శర్మ.    
    "అవునండి, మీరు త్వరలో ఇక్కడికి మా అసిస్టెంట్ మేనేజర్ గా రావాలి. ముసలిదాన్ని ఈ వ్యవహారాలన్నీ ఒక్కదాన్ని చూసుకోలేకపోతున్నాను."    
    "అన్నా! ముసలిదీ!" అని రాబర్ట్ రమేష్లిద్దరూ గుండెబాదుకున్నారు లోలోపల.    
    "ప్రయత్నిస్తానండి మాట ఇవ్వలేను నేను రేపే వెళ్ళిపోవాలి, అక్కడ మా అమ్మా, నాన్నగారు ఇద్దరూ ఆరోగ్యంగా లేరు" అన్నాడు శర్మ.    
    అమ్మమ్మ సూచనకు పొంగిపోయిన శకుంతల, శర్మ సమాదానానికి కృంగిపోయింది.    
    "డాడీ__" అంది బ్రతిమాలుతున్నట్లు.    
    "బేబీ! నేను త్వరలో వస్తాను, నానమ్మను వదలి ఇక్కడే ఉండి పొమ్మంటావా? తప్పుకదూ?"    
    శకుంతల మాట్లాడలేదు.    
    శర్మ వెళుతున్నప్పుడు శకుంతల తనూ స్టేషన్ కి వెళ్ళింది. ట్రైన్ ఆగగానే అందులోంచి దిగాడు రాజు. ఆనందాశ్చర్యాలతో మతి పోయి నట్లయింది శకుంతలకి "రాజూ!" అని ఒక కేక పెట్టింది. రాజు ఇటు తిరిగి చూశాడు. కానీ శకుంతలను చూడనట్లే తల తిప్పీసుకుని చక చక ముందుకు నడిచాడు. అక్కడ ఇద్దరు గర్ల్ గైడ్స్ అతని కోసం ఎదురుచూస్తున్నట్లే నిలబడి ఉన్నారు. అతడు వాళ్ళను కల్సుకున్నాడు. ముగ్గురూ ఏదో మాట్లాడుకున్నారు. అతడు వాళ్ళతో కలసి ప్లాట్ ఫారం బయటికి వెళ్ళి పోయాడు- ఒక్కసారైనా వెనుతిరిగి చూడకుండా.    
    మర బొమ్మలా నిలబడిపోయిన శకుంతల ఇటు తిరిగేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. 'చిత్రం! రైలు కూతగాని, చక్రాల చప్పుడుగాని తనకు వినిపించనేలేదు. డాడీకి వీడ్కోలుగా చెయ్యి ఊపలేదు. ఏమనుకుంటారో డాడీ?'    
    రాజు ఎక్కడికి వెళ్తున్నాడో చూడటానికి చక చకా తను ఫ్లాట్ ఫారం బయటికి వచ్చింది. కానీ అక్కడ అప్పటికే జీప్ రెడీగావుంది. చేతిలో తుపాకీతో నిలబడివున్నాడు కాకీయూనిఫారంలో గూర్ఖా అలాంటి గూండాలను పదిమందిని పోషిస్తుంది రాజవల్లి. వాళ్ళకి నెల జీతాలుకూడా బాగా ఎక్కువ. ఒకడు ఎప్పుడూ సీటు ముందు వుంటాడు. మరొక ఇద్దరు వంతుల వారీగా రాజవల్లికి అంగరక్షకులుగా వుంటారు. ఇప్పుడు శకుంతల ఎప్పుడు బయటకు వెళ్ళినా వెంట ఉడేందుకు క్రొత్తగా మరొకడ్ని నియమించింది రాజవల్లి. ఇదంతా శకుంతలకు చాలా చికాకు కలిగించగా, తీవ్రంగా ప్రతిఘటించింది. కానీ రాజవల్లి చెప్పినది విని ఆశ్చర్య పోయింది.    
    "మన చుట్టూ శత్రువులు ఎప్పుడూ పొంచి వుంటారమ్మా! సరిగ్గా పోయిన నెలలోనే మన మేనేజింగ్ పార్టనర్ సుదర్శనంగార్ని ఎవరో హత్యచేశారు. ఆయన దగ్గర రివాల్వర్ వుంది. అయినా ప్రయోజనం లేక పోయింది. అరణ్య ప్రాంతాలలో వుండటం వల్లా, ఫ్యాక్టరీలు నడుపుతుండటం వల్లా గూర్ఖాలను దించుకోవటానికీ, రివాల్వర్ లు వాడటానికీ ప్రభుత్వం మనకి అనుమతి ఇచ్చింది. ఎప్పుడూ మన జాగ్రత్తలో మనం వుండాలి."    
    శకుంతల ప్రతి సమాధానం చెప్పలేకపోయింది.    
    రాజవల్లి తనను ఎంతగా ప్రేమిస్తుందో అర్ధం చేసుకున్న శకుంతల మనసు కృతజ్ఞతతో నిండిపోయి ఏ విషయంలోనయినా ప్రతిఘటించ లేకపోతోంది. అదీగాక శకుంతల మనసు కేమాత్రం కష్టం కల్గించినా, ముందు రాజవల్లి తనే సహించలేదు. ఆ కారణాన ఆమెను తిరస్కరించ వలసిన అవసరంకూడా శకుంతలకు కలగటంలేదు. ఈఫ్యాక్టరీ విషయాలు ఇక్కడి గొడవలు ఆమెకు అయోమయంగా వున్నాయి. ముఖ్యంగా పసిపిల్లలచేత చాకిరీ చేయించుకునే అమానుష పరిస్థితి తొలగించాలని తీవ్రంగా న్సిచయించుకుంది. అందుకు మార్గమే కనిపించటంలేదు. చిన్న పిల్లలను కూలీలుగా తీసుకోవటం మానేస్తే, ఫ్యాక్టరీ మూసేసే ప్రమాదం ఉంటుందంటున్నాడు మేనేజర్.
    'ఇంతకూ రాజు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆ గర్ల్ గైడ్స్ తో ఎక్కడికెళ్ళాడు? తనను చూసికూడా చూడనట్లు ఎందుకు వెళ్ళిపోయాడు? నిజంగా తనను అసహ్యించు కుంటున్నాడా?'
    
                                                                18
    
    రాజవల్లి మేడ పై భాగం మీదనుంచుని చూస్తే మొత్తం రాజవల్లి నగర్ నతా కనిపిస్తుంది, కొండలతో, గుట్టలతో, ఎగుడు దిగుడురోడ్లతో అందంగా వుండకపోయినా తమాషాగా ఉంటుంది ఆటౌన్ మేడలలోనూ, ఒకటిరెండు డాబా యిళ్ళల్లోనూ తప్ప ఎలక్ట్రిక్ దీపాలే కనపడవు. కిరసనాయిలు ఖర్చుని కాబోలు - చాలా ఇళ్ళల్లో దీపాలే వుండవు. అంతటా అంధకారమే!

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra