Home » M d sowjanya » Soujanya Saahithi

           
                                     మంత్రం
             
                                                                      ----కె. రవీంద్రప్రసాద్
    "నమస్కారమండీ!" వినయంగా అన్నాడా యువకుడు చేతులెత్తి.
    'నమస్కారం! రండి. కూర్చోండి. ఇంతకీ మీపేరేమన్నారూ!' అంటూ ఆ యువకుడ్ని లోపలకు ఆహ్వానించి, కుర్చీచూపెట్టి కూర్చోమన్నారాయన పేరు - ఎడిటర్ రంగారావు గారు.
     ఆయువకుడు కూర్చుంటూ 'నాపేరు ప్రేమ - శేఖర మండీ. నేను రచయితనండీ. నేను కథ, నవల, నాటకం, చిన్నకధ, మినీకధ, కవితలు వ్రాస్తుంటానండి. అప్పుడప్పుడు బొమ్మలుగూడా వేస్తుంటానండి.  నన్ను అంతా ప్రేమ - శేఖర్ కధ, నవల, నాటక రచయితగా ఎరుగుదురండీ.... 'అన్నాడు.
    'మంచిది. మీ అన్ని ప్రక్రియ రచనలూ అన్ని పత్రికల్లో ప్రచురిత మయ్యాయా!'అని అడిగారు రంగారావుగారు.
     'కాలేదండి. అందుకేనండి మీదర్శనభాగ్యం చేసుకొంటున్నది. నేరుగా ఇంటికే వద్దామనుకొన్నానండి. తీరా మీరు ఆఫీసులో ఉంటారని ఇక్కడకే వచ్చానండి....'
    'మంచిపని చేశారు. ఇప్పుడు నేనేంచేయాలి మీకు?'అడిగారు రంగారావుగారు.
    'అదేనండి. మీదయ మా మీద ఉండాలండి. నా అన్నిప్రక్రియలూ మీరు మీ పత్రికద్వారా ఆంధ్రప్రజానీకానికి అందజేయాలండీ.....'
    'తప్పకుండా అందజేస్తాం, మీ రచనలు అన్నీ మా ఆపీసులో ఇచ్చి వెళ్లండి. ....'
    'ఎవరికి ఇవ్వమంటారండి....'
    "అక్కడ అసిస్టెంట్లు వుంటారు. ఏ విబాగానికి ఆ విభాగం వారుంటారు. మీ  రకరకాల ప్రక్రియలన్నీ ఆయా విభాగాలకు ఇచ్చి వెళ్లండి....."
    "అలా వెళ్తే ఎలాగండీ..... అవన్నీ చిత్తుబుట్టలకు ఎర వేస్తారండి వారు......'అని వాపోయాడు ప్రేమ - శేఖర్.
     "అలా బుట్టదాఖలు కాకుండా వుండాలంటే స్టాంపు లుంచిన కవర్లుయిచ్చి మీ అడ్రసు వాటిపై వ్రాసి వెళ్లండి. ప్రింటుకాకపోతే నేరుగా మీకే చేరతాయి...." అన్నారు.
     రంగారావుగారు ఆ వారం శ్రీమతి ఆలోచనాదేవి గారి సీరియల్ ఎక్కడ సశేషం వుంచాలా అని ఆలోచిస్తూ.
     ప్రేమశేఖర్ నిరుత్సాహంతో లేచి, ఆయా విభాగాలకేసి నడిచాడు.
                                                          *    *    *    *    *
    'అన్నీ తిరిగివచ్చాయి! ఇలా ఐతే ఎప్పటికి మహా రచయితను కాగలను?' అని ఆలోచించుకొంటున్నాడు ప్రేమశేఖర్.
    'ఏమిటండీ! అంతగా ఆలోచిస్తున్నారు. మీర చనలన్నీ తిరిగి వచ్చాయనేనా?' అని ప్రశ్నించింది అతని బార్య ప్రేమ.
    "మరే.... చూడు నీపేరు ముందుంచుకొని రచనలు పంపినాగూడా తిరిగివస్తున్నాయి ఈ ఆంధ్రదేశానికి ఏదో కీడు రాసిపెట్టినట్లున్నది. లేకపోతే నారచనలు ప్రింటుచేయక త్రిప్పిపంపుతారా?" అని మండిపడ్డాడు ఆవిడ మీద.
     దానికి ప్రేమ నిరసనగా 'నా పేరు ముందుంచుకొని మీరే రచనలు చేస్తున్నారని చెప్పుకుంటే మీ రచనలు ఎలా ప్రింటు అవుతాయి...? నా బార్య రనచచేసింది, తనపేరు చివర భర్తగా నన్ను తగిలించుకొంది అని మీరు ఎడిటర్లకు చెప్తే, తప్పక అన్ని కథలు ప్రింటు అవుతాయి....' అంది.
     'ఇది అందరూ చేసేపనే. పెళ్లాలపేర కధలు వ్రాసి, ప్రింటుచేయించి, పెళ్లాలే వ్రాశారని వాళ్లపేర్లు, వాళ్ల బొమ్మలు ప్రింటు చేయించుకోవటం, వాళ్లకు సమ్మానాలైతే వీళ్ళు మురిసిపోవటం...' అన్నాడు శేఖర్ ఉద్వేగంగా.
    'అంటే మీఉద్దేశ్యం.....'
    'నా ఉద్దేశ్యమా - నా పేరు శేఖర్. నీ ప్రేమ. మీవు నా జీవిత భాగస్వామివి అయ్యావు కాబట్టి - నిన్ను నా పేరులో ముందుంచాను. అసలు వెనకే వుంచుదును. వుంటే బావులేదని అదోకధ పేరు  అవుతుందని  తెలిసి ముందుంచాను. ఇక , రచనలు చేసేది నేను. నీవు రచనలు చేయవు, చేయలేవు. నీకు అస్సలు 'ఆ' అంటే 'నా' రాదు . నీవు రచనలు చేశావని ఆంధ్రులను ఎలా నమ్మించను.....?' అని గట్టిగా అన్నాడు.
     "అందుకే కదా - అక్షరంముక్క రాకపోయినా, ఖరీదైన చీరలతో, స్లీవ్ లెస్ జాకెట్లతో , నాగరికతనంతా నేను నేర్చుకొంటున్నాను. నన్ను చూసిన వారెవరైనా చదువు లేని దద్దమ్మననుకొంటారా?" అంది ఇంకొంచెంగట్టిగా ప్రేమ.
    "అనుకోరు.  అదే ఆంధ్రుల గొప్పతనం. కాషాయి గుడ్డలు ధరిస్తే సాధువని నమ్మి దణ్ణాలు పెట్టె ఈ దేశంలో నీ లాంటివాళ్లు బ్రహ్మాండంగా చలామణీ అవుతారు....  "అని అరిచాడు ప్రేమ -శేఖర్.
     "మీరు ఎక్కువగా మాట్లాడకండి. ఈనాడు పత్రికల్లో మేం వ్రాయబట్టికదా వాళ్లు పుస్తకాలు అమ్ముకొని సొమ్ము చేసుకొంటున్నారు. మేమే లేకపోతే.... పత్రికాఫీసు లన్నీ మూతపడేవి...." అంది ప్రేమ.
     "నిజమే. ఆడమొగరచయితల రచనలవల్లె - నేటి పత్రికలన్నీ మూసపోసినట్లుగా తయారయినాయి...." అన్నాడు ఇంకాస్త అక్కసుగా శేఖర్.
     "ఇంతకీ ఏమిటి మీరనేది?" ప్రశ్నవేసి కోపంగా చూసింది ప్రేమ.
     "ఏమిటా? నీలాంటి వాళ్లను కట్టుకొన్న మహావీరులు ఆడే నాటకం ఆగిపోయేదాకా - నాలాంటి విజ్ఞానులు రచనలు ప్రింటుకావు. ....'
    'అంటే.....'
    "అంటే ఏముందే పిచ్చి మొఖమా!  పెళ్లాలపేర కథలు వ్రాసి, వాళ్లబొమ్మలు ప్రింటుచేయించీ, వాళ్లకు సమ్మానాలు చేయించే మహామహులున్నంత కాలం దేశం - అదే మనదేశం బాగుపడదు. వాళ్లున్నంతకాలం నీలాంటిపప్పుసుద్దలంతా విజ్ఞానరాసులుగా, విజ్ఞానఖనులుగా వెల్గుతున్నంతకాలం - నాలాంటి పిచ్చిసన్నాసులు పైకిరాలేరు." ఖండితంగా చెప్పేశాడు శేఖర్.
     'ఏం - మీరూ అలా చెయొచ్చుగా.' అని చురక వేసింది ప్రేమ.
     'ఏం ... ఎందుకు పంపాలి! రచన నది. పేరు నీకూనా? శ్రమనాదీ.... సమ్మానాలు నీకూనా? ఇదే ఈ దేశంలో జరుగుతున్న ఘోర అన్యాయం....'
    "అంటే మీ వుద్దేశ్యం - మాలో నిజంగా వ్రాసే రచయిత్రులు లేరంటారా?"
    'అమ్మోమ్మో! లేరంటానా? వున్నారు... .వున్నారు.ఎందుకులేరూ.... ఏపత్రిక తీసినా వారు మనకు కన్పడుతూనే వున్నారు - వారూ వారికధలూ - నవల్లూ- పాతసినిమా కాఫీల్లా."
    "ఛీ... ఛీ... మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేను ఈ విషయాన్ని మా మహిళా మండలిలో వుంచి మీచేత క్షమాపణలు చెప్పించాల్సి వస్తుంది...." అంది వచ్చేకన్నీళ్లు నాపుకొంటూ ప్రేమ.
     "నీకా ప్రెసిడెంటు షిప్పు ఎట్లావచ్చిందీ? నీ తెలివి తేటలు చూశనుకొంటున్నావా? కాదు... నీవిచ్చిన విరాళాన్ని చూసి. నేను ఇంకాస్త ఎక్కువ విరాళమిస్తే - మీ మహిళా మండలికి ఈమగాడ్ని ఎడ్వయిజర్ గా వేస్తారు తెలుసా?"అని అవహేళన చేశాడు శేఖర్.
     'అయితే నేను వాకౌట్ చేస్తాను...' అంది లేస్తూ ప్రేమ.
     'అవును మంత్రుల నుండి పామరలవరకూ మనకు తెల్సింది అదొక్కటే.... శుభం.... వెళ్లిరా... 'అన్నాడు చిరాకుగా శేఖర్.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra