Home » Dr. dasaradhi rangacharya » Atharva Veda

           
                                  మూడవ పర్యాయ సూక్తము - 10

    1. విద్వాంసుడగు వ్యాత్యుడు ఎటువంటి రాజునకు అతిథిగా వెళ్లవలెను?

    2. అట్టి శ్రేష్ఠుని ఆదరించిన రాజ్యము మరియు క్షాత్రశక్తి నశించకున్నవి.

    3. తదనంతరము బ్రహ్మము, క్షాత్రము లేచి 'మేము ఎందు ప్రవేశించవలెను' అని అడిగినవి.

    4. బృహస్పతి యందు బ్రహ్మ, ఇంద్రుని యందు క్షాత్రము అని చెప్పబడినది.

    5. అంతట బృహస్పతి యందు బ్రహ్మము, ఇంద్రుని యందు క్షాత్రము ప్రవేశించినవి.

    6. ఈ పృథివియే బృహస్పతి, ద్యు ఇంద్రుడు అయినారు.

    7. అగ్ని బ్రహ్మ, ఆదిత్యుడు క్షాత్రము అయినారు.

    8-9. పృథివిని, బృహస్పతిని, అగ్నిని, బ్రహ్మను తెలిసినవాడు బ్రహ్మ సాక్షాత్కారము పొంది బ్రహ్మవర్చస్వి యగుచున్నాడు.

    9-10. ఆదిత్యుని క్షాత్రునిగ, దివిని ఇంద్రునిగ ఎరింగినవాడు అవయవ పుష్టి గలవాడు అగుచున్నాడు.


                                 నాలుగవ పర్యాయ సూక్తము - 11

    1. విద్వాంసుడగు వ్రాత్యుడు ఎవరి ఇంటికి అతిథిగా వెళ్లవలెను?

    2. అతనికి ఎదురేగి ఇట్లనవలెను :-

    వ్రాత్యా ! నీవు ఎచట నివసింతువు? వ్రాత్యా! ఇదిగో జలము. వ్రాత్యా ! మా ఇంటివారు నిన్ను సంతృప్తుని చేయగలరు. వ్రాత్యా ! నీకు ఏది ప్రియమో అదే జరుగును. వ్రాత్యా ! నీ వశము ఎట్లో అట్లే జరుగును. ఎట్లు నీ నికామమో అట్లే జరుగును.

    3. వ్రాత్యా ! మీరు ఎచట ఉండెదరు అని అడిగిన వానికి దేవయాన మార్గములు వెల్లడి యగుచున్నవి.

    4. వ్రాత్యా ! ఇదిగో జలము అన్న వానికి జలము దర్శనమిచ్చుచున్నది.

    5. వ్రాత్యా ! మా వారు నిన్ను సంతృప్తుని చేయుదురు. అన్న వాని ప్రాణములు ప్రసన్నములగుచున్నవి.

    6. వ్రాత్యా ! నీకు ఏది ప్రియమో అదే జరుగును అన్న వానికి ప్రియములు కలుగుచున్నవి.

    7. దీనిని తెలిసికొన్న వానికి ప్రియజనులు లభించుచున్నారు - ప్రియాతిప్రియులు అగుచున్నారు.

    8. వ్రాత్యా ! నీకు ఏది వశమో అదే జరుగును అన్నవానికి వశము వెల్లడి యగుచున్నది.

    9. దీనిని తెలిసి కొనిన వానికి వశము ప్రాప్తించుచున్నది. వశములను వశపరచుకొనువాడు అగుచున్నాడు.

    10. వ్రాత్యా! నీ నికామము, అభిలాష, ఏట్లో అట్లే జరుగును అన్నవాడు అభిలాషను పొందుచున్నాడు.

    11. దీనిని తెలిసికొన్న వాని అభిలాషలు తీరుచున్నవి. అతడు అభిలాషలకు అభిలాష యగుచున్నాడు.


                                   అయిదవ పర్యాయ సూక్తము - 12.

    1. అగ్నిని ఉద్ధృతము చేసినపుడు, అగ్ని హోత్రము అధిశ్రితమైనపుడు విద్వాంసుడగు వ్రాత్యుడు అగ్ని హోత్రి ఇంటికి వచ్చినపుడు :-

    2. స్వయముగ అభ్యుత్థానము చేయించి 'వ్రాత్యా! ఆజ్ఞాపించండి. హోమము చేయుదును' అనవలెను.

    3. అతడు అనుమతించిననే ఆహుతులు ఇచ్చునది. అతడు అనుమతి ఇవ్వకున్న ఆహుతులు ఇవ్వకుండునది.

    4. విద్వాంసుడగు వ్రాత్యుని అనుజ్ఞ పొంది ఆహుతులు ఇచ్చునది.

    5. ఆ విధముగ చేసినవాడు పితృయాన, దేవయాన మార్గములను తెలియుచున్నాడు.

    6. అతని ఆహుతులు పతనము కాక దేవతలకు అందుచున్నవి.

    7. ఎవడు విద్వాంసుడగు వ్రాత్యుని అనుమతి చొప్పున ఆహుతులు ఇచ్చుచున్నాడో అతని ఆయతము నలు దిశలందు ప్రసిద్ధమగుచున్నది.

    8. విద్వాంసుడగు వ్రాత్యుడు అనుమతించకున్నను ఆహుతులిచ్చువాడు.

    9. పితృయాన మార్గమును తెలియకున్నాడు. దేవయాన మార్గమును తెలియకున్నాడు.

    10. విద్వాంస వ్రాత్యుడు అనుమతించకున్నను ఆహుతులు ఇచ్చువాని ఆహుతులు హుతములగుచున్నవి. అతడు దేవతల నుండి విడిపోవుచున్నాడు.


                                       ఆరవ పర్యాయ సూక్తము - 13

    1. విద్వాంస వ్రాత్యుడు ఒకని గృహమున ఒక రాత్రి అతిథిగా ఉన్నచో -

    2. దానిచే లోకమున గల సకల పుణ్యములను పొందుచున్నాడు.

    3. విద్వాంస వ్రాత్యుడు ఒకని గృహమున రెండవ రాత్రి అతిథిగా ఉన్నచో -

    4. దానిచే అంతరిక్షమున గల సకల పుణ్యములను పొందుచున్నాడు.

    5. విద్వాంస వ్రాత్యుడు ఒకని గృహమున మూడవ రాత్రి వసించినచో -

    7. విద్వాంస వ్రాత్యుడు ఒకని ఇంట నాలుగవ రాత్రి వసించినచో -

    8. దానిచే అతడు పుణ్యాత్ముల పుణ్యలోకములను జయించుచున్నాడు.

    9. విద్వాంస వ్రాత్యుడు ఒకని ఇంట అపరిమిత రాత్రులు వసించినచో -

    10. ఆ ఫల ప్రభావమున అతడు అపరిమిత పుణ్య లోకములను జయించుచున్నాడు.

    11. ఒకని ఇంటికి వాస్తవ అవ్రాత్యుడు వ్రాత్యుడనని చెప్పుకొని వచ్చినపుడు -

    12. వానిని గెంటి వేయునది. కాని వాస్తవ వ్రాత్యుని గెంటి వేయరాదు.

    13. 'నేను ఈ దేవతను జలము యాచించుచున్నాను. ఈ దేవతను నివసింపచేయుచున్నాను. ఈ దేవతకు వడ్డించుచున్నాను' అట్లనుకొని వడ్డించవలెను.

    14. ఇది తెలిసిన వాని ఆహుతి ఆ దేవత యందే హుతమగుచున్నది.


                                     ఏడవ పర్యాయ సూక్తము - 14

    1. అతడు ప్రాగ్దిశకు నడిచినాడు. వాయువును బలసంపన్నుని చేయుచు నడచినాడు. మనసున ఆనందము నడయాడ నడచినాడు.

    2. ఇది గ్రహించినవాడు ఆనంద మనస్కుడై అన్నమును భుజించుచున్నాడు.

    3. అతడు దక్షిణమునకు నడచినాడు. ఇంద్రునిగా నడచినాడు. ఆనంద బలమున నడచినాడు.

    4. ఇది గ్రహించినవాడు బలము ద్వారా అన్నమును భుజించుచున్నాడు.

    5. అతడు పశ్చిమ దిశకు నడచినాడు. వరుణరాజై నడచినాడు. జలములకు ఆనందము కలిగించుచు నడచినాడు.

    6. ఇది గ్రహించినవాడు జలము వలన ఆనందము పొంది అన్నము తినుచున్నాడు.

    7. అతడు ఉత్తరమునకు నడచినాడు. రాజాసోముడై నడచినాడు. సప్తర్షులు హోమించిన ఆహుతులు తినుచు నడచినాడు.

    8. ఇది గ్రహించిన వాడు అన్నభక్షణ చేయు ఆహుతులుగా అన్నము తినుచున్నాడు.

    9. అతడు ధ్రువ దిశకు నడచినాడు. విష్ణువై నడచినాడు. విరాట్టుని ఆనందముతో నడచినాడు.

    10. ఇది గ్రహించినవాడు అన్నభక్షక విరాట్టు ద్వారా అన్నము భక్షించుచున్నాడు.

    11. అతడు పశువుల దిశగా నడచినాడు. రుద్రుడై నడచినాడు. ఓషధుల అన్నము తినువాడై నడచినాడు.

    12. ఇది గ్రహించినవాడు అన్నభక్షణ చేయు ఓషధుల ద్వారా అన్నము తినుచున్నాడు.

    13. అతడు పితరుల దిశకు నడచినాడు. యముడై నడచినాడు. స్వధాకార ఆనందమున నడచినాడు.

    14. ఇది గ్రహించినవాడు స్వధాకార అన్నము ద్వారా అన్నము తినుచున్నాడు.

    15. అతడు మానవుల దిశకు నడచినాడు. స్వయం అగ్నియై నడచినాడు. స్వాహాకార ఆనందముగ నడచినాడు.

    16. ఇది గ్రహించినవాడు అన్నాద స్వాహాకారము ద్వారా అన్నము భుజించుచున్నాడు.

    17. అతడు ఊర్థ్వదిశకు అనుకూలముగ నడచినాడు. బృహస్పతికి అనుకూలముగ నడచినాడు. వషట్కారమును అన్నాదము చేయుచు నడచినాడు.

    18. ఇది గ్రహించినవాడు అన్నాదవషట్కారము ద్వారా అన్నము తినుచున్నాడు.

    19. అతడు దేవతలకు అనుకూలముగ నడిచినాడు. ఈశానునకు అనుకూలముగ నడిచినాడు. యజ్ఞమును అన్నాదమును చేయుచు నడిచినాడు.

    20. ఇది గ్రహించినవాడు అన్నాద యజ్ఞము ద్వారా అన్నము భక్షించుచున్నాడు.

    21. అతడు ప్రజలకు అనుకూలముగ నడిచినాడు. ప్రజాపతికి అనుకూలముగ నడిచినాడు. ప్రాణమును అన్నాదము చేసి నడిచినాడు.

    22. ఇది గ్రహించినవాడు అన్నాద ప్రాణము ద్వారా అన్నము భుజించుచున్నాడు.

    23. అతడు అన్ని అంతర్దిశలకు అనుకూలముగ నడిచినాడు. పరమేష్ఠియై నడిచినాడు. బ్రహ్మను అన్నాదుని చేసి నడిచినాడు.

    24. ఇది గ్రహించినవాడు అన్నాద బ్రహ్మ యొక్క అన్నమును భుజించుచున్నాడు.


                                     ఎనిమిదవ పర్యాయ సూక్తము - 15

    1,2. ఆ వ్రాత్యునకు ఏడు ప్రాణములు, ఏడు అపానములు ఏడు వ్యానములు కలిగినవి.

    3.  ఈ వ్రాత్ర్యుని ఊర్థ్వనామక మొదటి ప్రాణము అగ్ని అయినాడు.

    4.  వ్రాత్యుని రెండవ ప్రాణము ప్రౌఢ. ఇది ఆదిత్యుడు అయినాడు.

    5.  వ్రాత్యుని మూడవ ప్రాణము 'అభ్యూడ'. అది చంద్రుడు అయినాడు.

    6.  వ్రాత్యుని నాలుగవ ప్రాణము 'విభు' అయినది. అది పవమానమైనది.

    7.  వ్రాత్యుని అయిదవ ప్రాణమగు 'యోని' జలమైనది.

    8. వ్రాత్యుని ఆరవ ప్రాణమగు 'ప్రియ' పశువులైనవి.

    9. వ్రాత్యుని ఏడవ ప్రాణమగు ' అపరిమితము' ప్రజలు అయినారు.


                                    తొమ్మిదవ పర్యాయ సూక్తము - 16

    1. వ్రాత్యుని మొదటి అపానము 'పూర్ణిమ' అయినది.

    2. వ్రాత్యుని రెండవ అపానము 'అష్టక' అయినది.

    3. వ్రాత్యుని మూడడవ అపానము 'అమావస్య' అయినది.

    4. వ్రాత్యుని నాలుగవ అపానము 'శ్రద్ధ' అయినది.

    5. వ్రాత్యుని అయిదవ అపానము 'దీక్ష' అయినది.

    6. వ్రాత్యుని ఆరవ అపానము 'యజ్ఞము' అయినది.

    7. వ్రాత్యుని ఏడవ అపానము 'దక్షిణ' అయినది.


                                          పదవ పర్యాయ సూక్తము - 17

    1. వ్రాత్యుని మొదటి వ్యానము 'భూమి' అయినది.

    2. వ్రాత్యుని రెండవ వ్యానము 'అంతరిక్షము' అయినది.

    3. వ్రాత్యుని మూడవ వ్యానము 'ద్యు' అయినది.

    4. వ్రాత్యుని నాలుగవ వ్యానము 'నక్షత్రములు' అయినది.

    5. వ్రాత్యుని అయిదవ వ్యానము 'ఋతువులు' అయినది.

    6. వ్రాత్యుని ఆరవ వ్యానము 'ఆర్తనములు' అయినది.

    7. వ్రాత్యుని ఏడవ వ్యానము 'సంవత్సరము' అయినది.

    8. దేవతలు వ్రాత్యుని సమానార్థకులు కాగా సంవత్సరము, ఋతువులు వారిని అనుసరించుచున్నవి.

    9. పౌర్ణమి, అమావాస్యలందు ఆదిత్యుడు ప్రవేశించుట వ్రాత్యుడు ప్రవేశించుట యగుచున్నది.

    10. వ్రాత్యుడు సమర్పించిన ఒక్క ఆహుతియే వారి అమృతత్వము అగుచున్నది.


                                   పదకొండవ పర్యాయ సూక్తము - 18

    1,2. వ్రాత్యుని కుడి కన్ను ఆదిత్యుడు, ఎడమ కన్ను చంద్రుడు అగుచున్నారు.

    3.  అతని కుడి చెవి అగ్ని, ఎడమ చెవి పవమానము అగుచున్నారు.

    4.  అతనికి అహోరాత్రులు నాసిక, దితి అదితి శీర్షకపాలము - సంవత్సరము శిరము అగుచున్నవి.

    5. వ్రాత్యుని పగలు ప్రత్యేకముగను, రాత్రి విశేషముగను పూజించుచున్నవి. నమో వ్రాత్యాయ.


                  దాశరథి రంగాచార్య రచించిన
              శ్రీమదాంధ్ర వచన అథర్వవేద సంహిత
               యందలి పదిహేనవ కాండ సమాప్తము. 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra