Home » Adivishnu » Adivishnu Kathanikalu


    "ఈ మధ్యనే తెలిసింది."
    "ఏవైనా అన్నాడా?"
    "లేదు అసలా విషయం నా ముందెప్పుడూ ఎత్తలేదు.
    మావాడి వ్యవహారం తాడోపేడో తేల్చుకోవడం మంచిది ఇలాటి వాటిల్లో ఓ పక్క మబ్బులు క్రమ్ముకుంటున్నా, జాప్యం చెయ్యడం పనికిరాదు. ఏమైనా సరే నాన్నగారితో జగన్నాధం గురించి చెప్పాలి. ఎలాగైనా ఆయన్ని వొప్పించి, ముసలయ్యతో మాట్లాడాలి, తప్పదు.
    అక్కడా కాలువగట్టున మా జగన్నాథం పక్కనే కూర్చుని ఆలోచించి ఈ నిర్ణయానికి వొచ్చాను.
    ఆ మరుసటిరోజు మా నాన్నగారితో ఈ విషయం కదిపాను.
    "జగన్నాతానికి సీతంటే ప్రాణం."
    "తెలుసు. తిరునాళ్ళలో దాన్ని వెంటేసుకు తిరగాడటగా నువ్వు వాళ్ళకి అతిధి మర్యాదలూ చేశావుట. నాకన్నీ తెలిశాయి" అన్నారాయన.
    ఉలిక్కిపడ్డాను. మళ్ళీ అంతలోనే సర్దుకున్నాను.
    "జగన్నాథం పెళ్ళి సీతతోనే జరగాలి."
    "అంటే నీ ఉద్దేశం"
    ఆయన నా ఉద్దేశం తెలుసుకోవాలని అడిగేసరికి కాస్త భయపడిన మాట నిజమే. కానీ అన్నీ ఆలోచించి ఒక నిర్ణయానికి వొచ్చిన తర్వాత వెనక్కి తగ్గడం ఏం బావుంటుందీ? ధైర్యం పుంజుకుని అన్నాను :
    "వాళ్ళ పెళ్ళి జరగడమే మంచిది. లేకపోతే జగన్నాథం మనకి దక్కడు."
    ఆయన ఉగ్రులయ్యారు. సాక్ష్యంగా ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి.
    "అయితే ఎవడికోయ్ నష్టం? ఎవడికి చెప్పి ప్రేమించాడూ! అయినా యీ వెధవకి ప్రేమేవిటోయ్ ప్రేమ. ప్రతి అడ్డమైన వాడూ అడ్డమైన దానినీ ప్రేమిస్తే దానికి బాధ్యులెవరు? నేను వాడి గురించి వినదలుచుకోలేదు."
    "జగన్నాథం మనకు పరాయిమనిషికాడు. నేను మీకెలాగో వాడూ అంతే."
    "చాల్లే మాటలు నేర్చావ్. నోరు మూసుకుని నీ పని నువ్వు చూచుకో. అనవసరమైన వాటిల్లో తల దూర్చకు."
    "ఇది అనవసరమైనది కాదు"  (నా ధైర్యానికి నేనే భయపడ్డాను) ఆయన నావైపు ఎగాదిగా చూసేరు. ఏదో అనబోయి ఆగిపోయారు. మళ్ళీ కాసేపటికి అనేశారు ముక్తసరిగా-
    "అయితే మీరంతా ఏ గంగలోనైనా దూకి చావండి"
    ఈ సలహా చెప్పి వెళ్ళిపోయారు. ఆయనలా వెళ్ళగానే యిటు జగన్నాథం వొచ్చాడు. తల వొంచుకుని గుమ్మం దగ్గిరే వుండిపోయాడు. గబగబా వాడి దగ్గరికి వెళ్ళాను.
    "భయపడకూరా! ఇదెంతవరకొస్తుందో నేనూ చూస్తాను" అన్నాను.
    వాడు తలెత్తి నావంక చూసేడు.
    "నాకు లేని ధైర్యం నీకెక్కడ్నుంచి వొచ్చిందిరా చిన్నా!" అన్నాడు.
    "లేకపోతే యిన్నేళ్ళు వొచ్చినా యింకా కుర్రకుంకలూ, చేతకాని సన్నాసులూ అని అనిపించుకోమంటావా? మర్యాదకోసం, ఆయన మీద గౌరవం కొద్దీ చెప్పి చూశాం. తర్వాత చేసే పనేదో చేసి చూపిస్తాం" అన్నాను.
    జగన్నాథం నా చేతులు పట్టుకున్నాడు. నా కళ్ళల్లోకి తిన్నగా చూస్తున్నాడే గాని, వాడి కనుకొసల నీరు నిండుకోవడం వాడు గమనించలేదు. గమనించిన నేను కలత చెందేను. ఏదో కీడు శంకించేను.
    "ఇంత చొరవ ముందేవుంటే పరిస్థితి యింతవరకూ వొచ్చేదే గాదు" అన్నాడు బాధగా.
    "ఇప్పుడు మాత్రం మించిపోయిందేముందిలే. రేపు ముసలయ్య యింటికి వెడదాం. అన్నీ చెప్తాం. వింటాడా వింటాడు. ఎదురు తిరుగుతాడా - వుండనే వుంది గాంధర్వ వివాహం. ఏది ఏమైనా మీ యిద్దరి పెళ్ళి చేసే బాధ్యత నాది" అన్నాను ఉద్రేకంగా.
    వాడు ఏడుస్తూంటే అదిరిపడ్డాను. ఏమిటి వీడూ?
    "నీతో చాలా విషయాలు చెప్పలేదురా చిన్నా అంతా అయిపోయింది. పదిరోజుల క్రితం నన్ను ముసలయ్య తిట్టాడు. నేను దిక్కులేనివాడినట. కాణీ విలువ చెయ్యని వాడినట. చాలా అన్నాడు. చెప్పరా నువ్వు చెప్పు... మీరందరూ వుండగా నాకు దిక్కులేదా, కాణీ విలువ చెయ్యనా?"
    "..............."
    "ఆరు నూరైనా నూరు ఆరైనా సీత పెళ్ళి వసంతరావుతో చేస్తానన్నాడు. సీత దగ్గరకెళ్ళి అడిగేను. ఏడ్చి ఊరుకుంది" అన్నాడు జగన్నాధం.
    నా తల కొట్టేసినంత పనయ్యింది. నా నవనాడులూ కృంగిపోయాయి. కుప్పలా కూలబడ్డాను.
    "కానీ, నువ్వు ఈ మాత్రం మాట సాయం చేస్తావని తెలిస్తే ఆ వసంతరావుగాడు రాకముందే మా పెళ్ళి జరిగుండేది. అయిపోయిందిరా చిన్నా! నే వొట్టి దద్దమ్మని" అనేసి గబగబా వెళ్ళిపోయాడు జగన్నాధం.
    జగన్నాధం భగ్నప్రేమికుడయ్యాడు. మరొకడూ మరొకడూ అయితే నాకంత దిగులుండేది కాదు. సాక్షాత్తూ మా జగన్నాధం. ఒక అమాయకుడు. ఒక అభాగ్యుడు. ప్రేమించాడు, ప్రేమించిన పిల్లతోనే స్వర్గమనుకున్నాడు. అలాటి వాడికి ఎదురు దెబ్బేమిటి?
    నాకు చాలామంది ప్రేమికులు తెలుసు ననే మాట ముందే మనవి చేసుకున్నాను. మా క్లాసుమేటు బుచ్చినాయన (వాడి అసలు పేరు వెంకట్రావ్) ప్రేమించి వాళ్ళింట్లోనూ ప్రియురాలి తాలూకు వాళ్ళింట్లోనూ గోలపడి భగ్నప్రేమికుడయ్యాడు. ఆ దరిమిలా ప్రియురాలి నాన్నగార్కి ట్రాన్స్ఫరైతే మరో వూరికి వెళ్ళిపోయారు వాళ్ళు. బుచ్చినాయన బ్రతకడనుకున్నాం. ఖర్చురాసే అవసరం వొచ్చిందనుకున్నాం. మా పిచ్చి కాకపోతే వాడు విశాల హృదయుడన్న విషయం గుర్తించకపోవడం అన్యాయమే మరి. ఆ అమ్మడు దూరమైన తర్వాత మరి కొన్నాళ్ళకి బుచ్చినాయన మరి అమ్మడితో హృదయమనీ, అదనీ యిదనీ భాష మాటాడాడు. ఈ వరస బుచ్చినాయన నాన్నగార్కి నచ్చక, వాడి చదువు మాన్పించి, పెళ్ళి చేసి ఒక యింటివాడిని చేసేడు. మొన్ననే తెలిసింది వాడొక తండ్రి అయ్యాడని.
    ఈ రకం ప్రేమలైతే నేను వర్రీకాను. జగన్నాధం బుచ్చినాన్నలా కాలేడు. మరలాంటప్పుడు జగన్నాధానికి దారేమిటి?    
    ఆ రాత్రి భోజనాల దగ్గర నాన్న అమ్మతో అన్నాడు.
    "రేపు రాజారావు గారికి ఖబురు పెట్టించాలి. కాస్త కనుమరుగైతే చాలు మనకే బుద్దులు చెప్పడం మొదలు పెట్టేడు సుపుత్రుడు. ఎవడో ప్రేమించం ఏమిటి? వాడిని వీడు వెనకేసుకు రావడమేమిటి? తన పెళ్ళి, తన బాగూ లేదుగానీ ఎవడి పెళ్ళో ఎవడిబాగో కావలసి ఒచ్చిందట హుఁ!"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra