శరభంగాశ్రమానికి ఇంద్రుడు రావణ వధ తరవాత రాముణ్ణి చూస్తాననడం ఎంత అతికించినా అతికేట్లులేదు. రాముడు రావణ సంహారానికే అడవికి వచ్చాడని నిరూపించడానికి అల్లిన కథలు తప్ప మరేమిలేదు. శరభంగుని ఆశ్రమానికి మునులంతా రావడం రాముని అభయం కోరడం, రాముడు అభయం ఇవ్వడం కూడా కట్టుకథలాగే ఉంది.
రాముడు సుతీక్ష్ణుని ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ రాక్షస బాధ ఉన్నట్లు ఋషి చెప్పాడు. ఆ తరవాత రాముడు చాల ఆశ్రమాలు తిరిగాడు పదేళ్లపాటు. ఎక్కడా రాక్షసులు ఎదురయినట్లుగాని, మునులను బాధించినట్లుగాని, రాముడు వారిని వధించినట్లుగాని కనిపించదు.
ఖరుడు రామునివెంట పడ్డాడని చిత్రకూటంలో ఒక ఋషి చెప్పాడు. పదేళ్లపాటు ఖరుడు ఎక్కడా కనిపించడు. రామునిమీద పగ పట్టినవాడయితే ఒక్కసారి అయినా కనిపించాలిగా. రామునితో తలపడాలిగా. కనిపించడా! శూర్ఫణఖ ముక్కూ, చెవులూ కోయబడి ఖరుని దగ్గరకు వెళ్లి మొరపెట్టుకునేదాకా ఖరునిమాట వినిపించదు. ఖరుడు అప్పుడే తొలిసారిగా రాముని పేరు వింటాడు. అంటే చిత్రకూటంలో వచ్చిన ఖరుని ప్రస్తావన కల్పితం అని తేలిపోతుంది. దానికి రాముని కథతో ఎలాంటి సంబంధమూలేదు.
వాల్మీకి చెప్పదలచుకున్నది రామకథను మాత్రమే. అతనికి అన్యంతో సంబంధం లేదు. వాల్మీకి రాముణ్ని బలమైన పాత్రగా సిద్ధం చేశాడు. రామునికి విశ్వఖ్యాతి వచ్చింది. దాన్ని వాడుకోవడానికి రాముడు మునిసేవ చేశాడనీ, అందుకోసం రాక్షసులను వధించాడనీ చెప్పి, అతని ఖ్యాతినితను స్వప్రయోజనానికి వాడుకోదలచినవారు చేర్చిన ఉదంతాలుగా కనిపిస్తాయి ఇవి.
రామాయణ కాలం నాటికి అసలు ఆర్య, అనార్య భేదాలు ఉన్నట్లు కనిపించదు. ఆర్యులకు అనార్యులతో ఆజన్మ శత్రుత్వం ఉన్నట్లూ కనిపించదు. రాక్షసులు పనికట్టుకొని మునులను బాధించినట్లూ కనిపించదు. రాముడు దర్శించిన ఆశ్రమాలన్నీ ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అడవులలో రాక్షసులూ ఉన్నారు, మునులూ ఉన్నారు. ఎవరిదారి వారు జీవిస్తున్నారు. అకారణ వైరం ఉభయులకు ఉన్నట్లు కనిపించదు. అలా ఉందని చెప్పడానికి కల్పించిన ఉదంతాలూ బలంగాలేవు.
ఆ నాటికి అసలు జానపదాలు బలపడినట్లు లేదు. జనులు ఆటవిక జీవనమే గడుపుతున్నారు. ఈనాడు మనంచూచే కోయగూడాలూ, చెంచుగూడాల్లాంటివే ముని ఆశ్రమాలు. ఒక మూల మునిపల్లెలూ, మరో మూల రాక్షస పల్లెలూ ఉండి ఉండాలి. బలమైన నాగరికత ఏర్పడి వైరివర్గాలు ఏర్పడిన కాలం కాదది.
అగస్త్యుని కథా రాక్షసులకూ, ఆర్యులకూ ఉన్న ఆజన్మవైరాన్ని తెలియపరిచేదే. వింధ్య తరువాత లోకం లేదనుకున్న జనానికి వింధ్య తరువాత కూడా లోకం ఉందని తెలియపరచినవాడు అగస్త్యుడు అయిఉండాలి. అతడు ఆర్యధర్మ ప్రచారానికి దక్షిణానికి వచ్చి ఉండాలి. మత ప్రచారానికి హింసను ఉపయోగించడం సాధారణమే. అగస్త్యుడూ తన బలంతో అనార్యులను అణచి ఆర్య ధర్మాన్ని ప్రచారం చేసిఉంటాడు.
రాముడు సుతీక్షుని ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ రాక్షస బాధ ఉన్నట్లు ఋషి చెప్పాడు. ఆ తరవాత రాముడు చాల ఆశ్రమాలు తిరిగాడు పదేళ్లపాటు. ఎక్కడా రాక్షసులు ఎదురయినట్లుగాని, మునులను బాధించినట్లుగాని, రాముడు వారిని వధించినట్లుగాని కనిపించదు.
ఖరుడు రామునివెంట పడ్డాడని చిత్రకూటంలో ఒక ఋషి చెప్పాడు. పదేళ్లపాటు ఖరుడు ఎక్కడా కనిపించడు. రామునిమీద పగ పట్టినవాడయితే ఒక్కసారి అయినా కనిపించాలిగా. రామునితో తలపడాలిగా. కనిపించడా! శూర్ఫణఖ ముక్కూ, చెవులూ కోయబడి ఖరుని దగ్గరకు వెళ్లి మొరపెట్టుకనేదాకా ఖరునిమాట వినిపించదు. ఖరుడు అప్పుడే తొలిసారిగా రాముని పేరు వింటాడు. అంటే చిత్రకూటంలో వచ్చిన ఖరుని ప్రస్తావన కల్పితం అని తేలిపోతుంది. దానికి రాముని కథతో ఎలాంటి సంబంధమూలేదు.
వాల్మీకి చెప్పదలచుకున్నది రామకథను మాత్రమే. అతనికి అన్యంతో సంబంధంలేదు. వాల్మీకి రాముణ్ని బలమైన పాత్రగా సిద్ధం చేసాడు. రామునికి విశ్వఖ్యాతి వచ్చింది. దాన్ని వాడుకోవడానికి రాముడు మునిసేవ చేశాడనీ, అందుకోసం రాక్షసులను వధించాడనీ చెప్పి, అతని ఖ్యాతినితను స్వప్రయోజనానికి వాడుకోదలచినవారు చేర్చిన ఉదంతాలుగా కనిపిస్తాయి ఇవి.
రామాయణ కాలం నాటికి అసలు ఆర్య, అనార్య భేదాలు ఉన్నట్లు కనిపించదు. ఆర్యులకు అనార్యులతో ఆజన్మ శత్రుత్వం ఉన్నట్లూ కనిపించదు. రాక్షసులు పనికట్టుకొని మునులను బాధించినట్లూ కనిపించదు. రాముడు దర్శించిన ఆశ్రమాలన్నీ ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అడవులలో రాక్షసులూ ఉన్నారు, మునులు ఉన్నారు. ఎవరిదారి వారు జీవిస్తున్నారు. అకారణ వైరం ఉభయులకు ఉన్నట్లు కనిపించదు. అలా ఉందని చెప్పడానికి కల్పించిన ఉదంతాలూ బలంగాలేవు.
ఆ నాటికి అసలు జానపదాలు బలపడినట్లు లేదు. జనులు ఆటవిక జీవనమే గడుపుతున్నారు. ఈనాడు మనం చూచే కోయగూడాలూ, చెంచుగూడాల్లాంటివే ముని ఆశ్రమాలు. ఒక మూల మునిపల్లెలూ, మరో మూల రాక్షస పల్లెలూ ఉండి ఉండాలి. బలమైన నాగరికత ఏర్పడి వైరివర్గాలూ ఏర్పడిన కాలం కాదది.
అగస్త్యుని కథా రాక్షసులకూ, ఆర్యులకూ ఉన్న ఆజన్మవైరాన్ని తెలియపరిచేదే. వింధ్య తరువాత లోకం లేదనుకున్న జనానికి వింధ్య తరువాత కూడా లోకం ఉందని తెలియపరచినవాడు అగస్త్యుడు అయిఉండాలి. అతడు ఆర్యధర్మ ప్రచారానికి దక్షిణానికి వచ్చి ఉండాలి. మత ప్రచారానికి హింసను ఉపయోగించడం సాధారణమే. అగస్త్యుడూ తన బలంతో అనార్యులను అణచి ఆర్య ధర్మాన్ని ప్రచారం చేసిఉంటాడు.
పదేళ్లకాలం గడిచిపోయిందంటున్నాడు వాల్మీకి. పదేళ్లకాలం చాల కొద్దిలో చెప్పి వదిలేశాడు. ఈ కాలంలో జరిగిన సంఘటనలేమి లేవు. కాబట్టి ముక్తసరిగా ముగించాడు. మిగతా నాలుగేళ్ల కథను అరణ్యకాండనుంచి యుద్ధకాండదాకా చెప్పాడు.
ఒక్కోజీవితంలో చెప్పుకోవాల్సింది ఏమీ ఉండకపోవచ్చు. ఒక్కో జీవితంలో ఏదో కొంత ఉండవచ్చు. సాంతం చెప్పుకోవలసింది చాల తక్కువ మందికి ఉంటుంది.
జీవితంలో చెప్పుకోవలిసింది కష్టాలే. కష్టాలకే కథలుంటాయి. సుఖంలో చెప్పుకునేదేమీ ఉండదు. పదేళ్లకాలం సుఖంగా గడిచిపోయింది. ఏం చెప్తాడు వాల్మీకి దాన్ని గురించి? అందుకే అంటాడు "నసుఖాలభతే సుఖం" అని. సుఖంలోంచి సుఖం పుట్టదంటాడు.
ఎప్పుడూ సుఖపడే వాడికి సుఖం విలువ ఏం తెలుస్తుంది? కష్టపడిన వాడికే సుఖం విలువ తెలుస్తుంది. అందుకే కథలన్నీ కష్టాలవే!
పంచవటి:
రాముడు పంచవటికి చేరుకున్నాడు. అక్కడ వారికి పెద్దమర్రి చెట్టు కనిపించింది. మర్రిచెట్టుమీద ఒక గద్ద ఉంది. దానిపేరు జటాయువు. అతడు వినత కొడుకు అరుణుని కుమారుడు.


