Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
8. సామము 'ఆసాదము', 'ఉద్ గీథ' ఉపశయము అయినవి.
9. ఆ వ్రాత్యుడు ఆపన్ధిని ఆరోహించినాడు.
10. దేవతలు అతని పరిష్కందులు. సత్యసంకల్పము 'ప్రహాయ్య' ము సకల భూతములు 'ఉపసద' ము అయినవి.
11. ఈ విషయములు గ్రహించిన వానికి సకల భూతములు ఉపసదమగుచున్నవి.
నాలుగవ పర్యాయ సూక్తము - 4
1. అతనిది ప్రాచ్య దిశ అయినది.
2. వసంతర్తువు రెండు మాసములు అతనిని రక్షించినవి. బృహద్, రథంతరములు అతనిని అనుష్ఠాతను చేసినవి.
3. ఇది తెలిసిన వానిని పూర్వదిశన వసంతపు రెండు మాసములు రక్షించును. బృహద్, రథంతరములు అతనికి అనుకూలములు అగును.
4. అతనిది దక్షిణ దిశ అయినది.
5. గ్రీష్మపు రెండు మాసములు అతనిని రక్షించినవి. యాజ్ఞయజ్ఞి, వామదేవ్యములు అతనిని అనుష్ఠాతను చేసినవి.
6. ఇది తెలిసిన వానిని దక్షిణ దిశన గ్రీష్మపు రెండు మాసములు రక్షించును. యాజ్ఞ యజ్ఞయ వామదేవ్యములు అనుకూలము లగును.
7. అతనిది పశ్చిమ దిశ అయినది.
8. వర్షర్తువు రెండు మాసములు అతనిని రక్షించినవి. వైరూప, వైరాజములు అనుష్ఠాతను చేసినవి.
9. ఇది తెలిసిన వానిని పశ్చిమ దిశయందు వర్షర్తువు రెండు నెలలు రక్షించును. వైరూప, వైరాజములు అనుకూలములు అగును.
10. అతనిది ఉత్తర దిశ అయినది.
11. శరదృతువు రెండు నెలలు అతనిని రక్షించినవి. శ్యైత, నౌధసములు అనుష్ఠాతను చేసినవి.
12. ఇది తెలిసిన వానిని శరదృతువు రెండు నెలలు రక్షించినది. శ్యైత, నౌధసములు అనుకూలములు అగును.
13. అతనిది ధ్రువ దిశ అయినది.
14. హేమంతపు రెండు మాసములు అతనిని రక్షించినవి. భూమియు, అగ్నియు అనుష్ఠాతను చేసినవి.
15. ఇది తెలిసిన వానిని ధ్రువ దిశయందు హేమంతపు రెండు మాసములు రక్షించును. భూమి, అగ్ని అనుకూలములు అగును.
16. అతనిది ఊర్ధ్వ దిశ అయినది.
17. అతనిని శిశిరపు రెండు మాసములు రక్షించినవి. దివి, ఆదిత్యులు అనుష్ఠాతను చేసినారు.
18. ఇది తెలిసిన వానిని ఊర్ధ్వ దిశయందు హేమంతపు రెండు మాసములు రక్షించును. దివి, ఆదిత్యులు అనుకూలురు అగుదురు.
అయిదవ పర్యాయ సూక్తము - 5
1. అతని కొరకు పూర్వదిశ యొక్క అంతర్దిశ యందు బాణము వేయు భవుని అనుష్ఠాతను చేసినారు.
2. బాణము విడుచు భవుడు ప్రాగ్దిశ యొక్క అంతర్దిశ అనుష్ఠాత అయినాడు. అతనిని శర్వుడు, భవుడు, ఈశానుడు బాధించరు.
3. ఇది తెలిసిన వాని పశువులను, సమానులను సంహరించరు.
4. అతని కొరకు దక్షిణదిశ యందలి అంతర్దిశల బాణము విడుచు శర్వుని అనుష్ఠాతను చేసినారు.
5. ఇది తెలిసిన వానికి దక్షిణదిశ యొక్క అంతర్దిశ యందు బాణము వేయు శర్వుడు అనుకూలుడై ఉండును. అతనిని, అతని పశువులను, సమానులకు హింసించకున్నాడు.
6. అతని కొరకు పశ్చిమ దిశ యొక్క అంతర్దిశయందు బాణము వేయు పశుపతిని అనుష్ఠాతను చేసినారు.
7. ఇది తెలిసిన వానిని పశ్చిమ దిశ యొక్క అంతర్దిశకు అనుష్ఠాతమైన పశుపతి అనుకూలుడై ఉండును. అతనిని అతని పశువులను, సమానులను సంహరించకున్నాడు.
8. అతని కొరకు ఉత్తర దిశ యొక్క అంతర్దిశయందు బాణము వేయు ఉగ్రదేవతను అనుష్ఠాతను చేసినారు.
9. ఇది తెలిసిన వానికి ఉత్తర దిశ యొక్క అంతర్దిశయందు అనుష్ఠాతయైన బాణము వేయు ఉగ్రదేవత అనుకూలుడై ఉండును. అతనిని, అతని పశువులను, సమానులను సంహరించకున్నాడు.
10. అతని కొరకు ధ్రువ దిశ యొక్క అంతర్దిశ యందు బాణము వేయు రుద్రుని అనుష్ఠాతను చేసినారు.
11. ఇది తెలిసిన వానికి ధ్రువ దిశ యొక్క అంతర్దిశయందు అనుష్ఠాతయైన బాణము వేయు ఉగ్రదేవత అనుకూలుడై ఉండును. అతనిని, అతని పశువులను, అతని సమానులను సంహరించకున్నాడు.
12. అతని కొరకు ఊర్ధ్వ దిశ యొక్క అంతర్దిశ యందు బాణము వేయు మహాదేవుని అనుష్ఠాతను చేసినారు.
13. ఇది తెలిసిన వానికి ఊర్ధ్వదిశ యొక్క అంతర్దిశ యందు అనుష్ఠాతయైన బాణము వేయు మహాదేవుడు అనుకూలుడై ఉండును. అతనిని, అతని పశువులను, అతని సమానులను సంహరించకున్నాడు.
14. అతని కొరకు సర్వ దిశల అంతర్దిశలందు బాణము వేయు ఈశానుని అనుష్ఠాతను చేసినారు.
15, 16. ఇది తెలిసిన వానికి సర్వ దిశల అంతర్దిశలందు బాణము వేయు అనుష్ఠాత యగు ఈశానుడు అనుకూలుడై ఉండును. అతనిని భవ, శర్వ, ఈశానులు సంహరించకున్నారు. అతని పశువులను, అతని సమానులను సంహరించకున్నారు.
ఆరవ పర్యాయ సూక్తము - 6
1. స ధ్రువాం దిశమను వ్య చలత్ |
అతడు ధ్రువ దిశననుసరించి నడచినాడు.
2. తం భూమిశ్చాగ్నిశ్చౌషధయశ్చ వనస్పతయశ్చ వానస్పతయశ్చ వీరూధశ్చాను వ్యచలన్ ||
అతనిని అనుసరించి భూమి, అగ్ని, ఓషధులు, వనస్పతులు, వానస్పతులు, లతలు నడచినవి.
3. భూమిశ్చవైసోగ్నే శ్చౌషధీవాంచ వనస్పతీవాంచ వానస్పత్యానాం చ విరూధాం చ ప్రియం ధామ భవతి య ఏవం వేద ||
ఇది తెలిసిన వానికి భూమి, అగ్ని, ఓషధులు, వనస్పతులు, వానస్పతులు, లతలు ప్రియధామము అగుచున్నవి.
4. స ఊర్థ్వాం దిశామను వ్య చలత్ |
5. తం ఋతం చ సత్యం చ సూర్యః చ చంద్రః చ నక్షత్రాణి చ అనువ్యచలన్ ||
6. ఋతస్య చ వై స సత్యస్య చ సూర్యస్య చ చన్ద్రస్య చ నక్షత్రాణాం చ ప్రియంధామ భవతి య ఏవం వేద |
7. స ఉత్తమాం దిశమను వ్యచలత్ ||
8. తం ఋచశ్చ సామాని చ యజూంషి చ బ్రహ్మ చ అను వ్యచలన్
9. ఋచాం చ వై స సామ్నాం చ యజుషాం చ బ్రహ్మణశ్చ ప్రియం ధామ భవతి య ఏవం వేద ||
10. స బృహతీం దిశమను వ్యచలత్ ||
11. త మితిహాసాశ్చ పురాణం చ గాథాశ్చ వారాశంపీశ్చామవ్య చలన్ ||
12. ఇతిహాసస్య చవై స పురాణస్యచ గాథానాం చ |
నారశంసీనాం చ ప్రియం ధామ భవతి య ఏవం వేద ||
13. స పరమాం దిశమను వ్యచలత్ ||
14. తమాహనీయశ్చ గార్హ పత్యశ్చ దక్షిణాగ్నిశ్చ యజ్ఞశ్చ |
యజమానశ్చ పశవశ్చాను వ్యచలన్ ||
15. ఆహవనీయస్య చ వై ప గార్హ పత్యప్యచ దక్షిణాగ్నేశ్చ యజ్ఞస్య |
చ యజమానస్య చ పశూనాం చ ప్రియం ధామ భవతి య ఏవం వేద ||
16. సః అనాదిష్టాం దిశం అను వి అచలత్ !
17. తం ఋతవః చ ఆర్తవాః చ అహోరాత్రే చ అను వి అచలన్ ||
18. ఋతూనాం చ వై స ఆర్తవానాం చ లోకానాం చ మాసానాం |
చార్ధమాసానాం చాహోరాత్రయోశ్చ ప్రియంధామ భవతి య ఏవం వేద ||
19. అతడు అనువ్రత దిశను అనుసరించి నడిచినాడు. అచట ఉండరాదని భావించినాడు.
20. అతని వెంట దితి, అదితి, ఇడ, ఇంద్రాణి నడచినారు.
21. ఇది తెలిసిన వానికి దితి, అదితి, ఇడ, ఇంద్రాణి ప్రియధామములు అగుచున్నారు.
22. అతడు దిశలను అనుసరించి నడచినాడు. అతనిని అనుసరించి విరాట్టు, సకల దేవతలు నడచినారు.
23. ఇది తెలిసిన వారికి విరాట్టు సకల స్త్రీ, పురుషదేవతలు ప్రియధామము అగుచున్నది.
24. సః సర్వాన్ అంతర్దిశాన్ అను వి అచలత్ |
25. తం ప్రజాపతిశ్చ పరమేష్ఠీ చ పితా మహాశ్చను వ్య చలన్ ||
26. ప్రజాపతేశ్చ వై స పరమేష్ఠినశ్చ పితృశ్చ పితామహస్య |
చ ప్రియం ధామ భవతి య ఏవం వేద ||
ఏడవ పర్యాయ సూక్తము - 7
1. అతడు సద్రుమహిమ అయినాడు. భూమి అంతమునకు వెళ్లినాడు. సముద్రము అయినాడు.
2. ప్రజాపతి - పరమేష్ఠి - పిత - పితామహ - జలములు వర్షమై అతనికి అనుకూలముగ ప్రవర్తించసాగినవి.
3. ఇది తెలిసిన వానికి జలము, శ్రద్ధ, వర్షము లభించుచున్నవి.
4. శ్రద్ధ; యజ్ఞము, లోకము, అన్నము, అన్నాద్యము అతనిని చుట్టు ముట్టినవి.
5. ఇది తెలిసిన వానికి శ్రద్ధ, యజ్ఞము, అన్నము, అన్నాద్యము చేరుచున్నవి.
రెండవ అనువాకము
మొదటి పర్యాయ సూక్తము - 8
1. అతడు రజ్జించినాడు. రాజన్యుడుగ అవతరించినాడు.
2. అతడు ప్రజల, బంధువుల అన్నము, అన్నాద్యముల బలమునకు అనుకూలుడు అయినాడు.
3. ఇది తెలిసిన వానికి ప్రజలు, బంధువులు, అన్నము, అన్నాద్యము ప్రియధామము అగుచున్నవి.
రెండవ పర్యాయ సూక్తము - 9
1. అతడు ప్రజలకు అనుకూలముగ నడచినాడు.
2. అతనికి అనుకూలముగ సభ, సమితి, సేన, సుర నడచినవి.
3. ఇది తెలిసిన వానికి సభ, సమితి, సేన, సుర ప్రియధామము అగుచున్నవి.





