Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



                                         శ్రీ శశాంక, వి.

    దండోరా

    రండోయి రండోయి దండోర మ్రోగేను
    రండి చేరండోయి రణభూమిలోను

        పెరవాడు పగబూని పైన బడుతుంటేను
        పందలై తలయొగ్గి బ్రతుకు లీడ్వగలేము
        మన తల్లి బ్రతు కిటుల మలిన మౌతుంటేను
        నెత్తు రురకలువేయ నిలుపోపగా లేము!

        జాతిపిత గాంధీజి చేతికిచ్చిన స్వేచ్ఛ
        చేతులారగ జారవిడిచి మనగాలేము
        దేశ స్వాతంత్ర్యము బుగ్గిపా లౌతుంటె
        దిక్కుమాలిన యటుల బిక్క వోవగలేము
            శత్రువుల నిర్జింప సైనికులవలె కదలి
            చావొ బ్రతుకో నేడు తేల్చుకోవలె రండు!

        మన శాంతిమయ పథము సైనిక శ్రేణిగా
        నిర్మాణ యత్నమే సమర సంరంభముగ
        మార్చె చైనీయ రాక్షస దురాక్రమణమ్ము
        మారవలె వీరులుగ కవులు గాయకులెల్ల
            పలుకులే బళ్ళెములు పాటలే బాణాలు
            రండి పగతుర గుండె చీల్చి చెండాడండి!

        పర్జన్య గర్జనలు గాయకుల కంఠాలు
        ప్రళయతాండవ మొకటి నాట్య విన్యాసమ్ము
        రణకౌశలమె కళా కౌశలము మనకిపుడు
        సమర సన్నాహమే నిజ రసాస్వాదనము
            ప్రాణాల నొడ్డి పోరాడుటే ప్రతిభగా
            పాడండి, ఆడండి ప్రళయ రుద్రులవోలె!

        శాంతిజీవిక నిషాదుల పాలబడి చెడగ
        శాపాల నురలించి రాకాసులను దునుమ
        వాల్మీకిముని వంశగౌరవము నిలుపంగ
        పాడాలి నవ్య సంగ్రామాయణ మ్మిపుడు
            శోకమును శ్లోకముగ మార్చి పఠియించండి
            లోకమున సుఖ శాంతులను నిలుపగా రండి!

        ఎగు భుజమ్ముల హిమాలయ మియ్యదే లేచి
        ఇక్ష్వాకు కులతిలకు భీకరాకృతి దాల్చి
        శత్రువుల నిశ్శేష మొనరింప సమకట్టి
        రామబాణము బట్ట; తిరుగు లేదిక మనకు
            జయము జయమని పూలవాన కురిసేను
            శాంతి జగతినికోరి వచ్చి వలచేను.

                                                              *  *  *  *   




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.