Home » vaddera chandidas » Anukshanikam 2



                                                       85

    డిశంబరు ఆఖరి వారపు రాత్రి చలిలో రగ్గు కప్పుకుని పడుకుంది సీత. నిద్ర వచ్చేలా వుంది. నిద్రపోనూ వచ్చు. గానీ భర్త విజయ్ కుమార్ వచ్చేసరికి మెలుకువగా వుండకపోతే అతనికి కోపం వస్తుంది. సీతకి విజయ్ కుమార్ తో గత అక్టోబర్ లో పెళ్ళయింది.
    పెళ్ళికి ముందు, విజయ్ కుమార్ బంధువు విజయ్ కుమార్ తో _ మీ నాన్నా మా వాళ్ళూ కలిసి నీకు పెళ్ళి సంబంధం చూస్తున్నారు ఏమంటావు? పెళ్ళిచూపువేళకి ఉత్తరం రాస్తాం_అని అంటే; "మనకి ఒకటి యెట్లాగూ చాలదు. ఏదొకటి వాళ్ళిష్టం. ఖాయపరచమను. పెళ్ళిచూపులూ గిల్లిచూపులూ ఏం అక్కర్లా" అన్నాడు విజయ్ కుమార్.
    విజయ్ కుమార్ తండ్రి కనకారావు ఓ సంబంధంవైపు మొగ్గుచూపాడు. వాళ్ళ వూరి దగ్గిర్లో వారే. పదిలక్షల దాకా కట్నం యిస్తారు. పెళ్ళిలో ఐదు లక్షలు రొఖ్కం యిచ్చేటట్లు, మిగతా ఐదు లక్షలు బొంబాయిలో ఒక మిల్లులో వాళ్ళకున్న వాటాల్లోంచి పిల్ల పేర రాస్తారట. పెళ్ళి హైదరాబాద్ లో వాళ్ళ అన్నవన్ రూప గార్డెన్ లో జరపాలనుకున్నాడు కనకారావు. కానీ తమ్ముడితో సంప్రదించిన మీదట _ "అక్కడైతే బోలెడు డబ్బు తగలేసి అట్టహాసంగా పెళ్ళి జరిపించాలి. అందువల్ల ఒరిగేదేం లేదు. ఐనా కొడుకులందరూ మనదగ్గిర బాగా మింగే కూర్చున్నారు. మింగుతానూ వుంటారు." అని వూళ్ళోనే ఘనంగా జరపదలిచాడు. వూళ్ళో అయితే యెంత ఘనంగా జరిపినా ఆ ఖర్చు యేమంత లెక్కలోకి రాదు.
    సీత యేమంత బాగోదు. అలా అని వికృతంగానూ అనిపించదు. ఓ రకంగా బాగానే వుంటుంది. పరస్పరం మనసులు కలిస్తే అదో సమస్యే అవదు. బాగానే అనిపిస్తుంది. ఇంటర్ దాకా చదువుకుంది వూళ్ళోనే.
    అలా విజయ్ కుమార్ పెళ్ళి జరిగింది. పెళ్ళి జరిగిన వెంటనే శోభనం. అదీ వూళ్ళోనే ఏర్పాటు చేశారు.
    సీత శోభనం లాగా సీత సీత శోభనమే వుంటుంది. అలా యింకొకరి శోభనం వుండదని కాదుగానీ చాలా అరుదుగా వుంటుంటాయి అలాంటి శోభనాలు. వెళ్ళి గట్టిగా కావిలించుకున్నాడు_ఎముకలు విరిగిపోతాయేమోనన్నంత గట్టిగా, ఆమె బాధ, "వూఁ" అన్న సవ్వడితో కలిసింది.
    పెదాలమీద గంటుపడేలా ముద్దుపెట్టుకున్నాడు. బుగ్గ కొరికాడు. గంటుపడి_గంటు, నెత్తుటిజీరతో మెరుస్తోంది. ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    యివన్నీ తలుపుకివతల రెండు నిమిషాల్లో జరిగిపోయాయి.
    అతను యే స్త్రీతో అయినా యిలాగే ప్రవర్తిస్తాడు. యిప్పుడు సీతతోను అంతే. సీతేం పైనుంచి దిగిరాలేదు. ఆ మాటకొస్తే సీతకంటే అతనికి "పరిచయం" వున్న స్త్రీలలో కొందరు చాలా బావుంటారు.
    ఆ వెంటనే మంచం దగ్గిరికి నడిపించుకొచ్చాడు. ఎంతైనా సిగ్గుపడుతూ తడబడుతూన్న శోభనపు పెళ్ళికూతురుగా....అందుకని నడిపించుకొచ్చాడు.
    మంచంమీద కూచోబెట్టి, పరుపుమీదకి వంచి పడుకోబెట్టాడు.
    ఆమె బట్టలు వొలుస్తున్నాడు. చేతులతో అడ్డగించినట్లుగా సిగ్గుగా చేతులు జరిపి రెప్పలు మూసుకుంది.
    ఆమె చేతులను తోసేసి, బ్లౌజు హుక్కులు తెంచినట్లుగా లాగేశాడు. హుక్కుల దగ్గిర బట్ట పిగిలింది. ఆమెను అటూ యిటూ తిప్పుతూ బట్టలన్నీ పీకి పారేశాడు. ఆమెపైకి జరిగాడు.
    "అమ్మో...." అని గట్టిగా అరిచింది.
    తను యెంత మొరటుగా ప్రవర్తించిందీ గమనించుకోకుండా, "యేం పీక నులిమి చంపినట్లు అరిచ్చస్తావే" అని చీదరించుకున్నాడు.  
    పని ముగించుకుని తృప్తిగా ఫీలయ్యాడు.
    "బాగుందా" అన్నాడు.
    ఆమె మౌనంగా వుండిపోయింది.
    "ఏం మాట్లాడవేం?"
    "వూఁ" అంది.
    సిగరెట్టు వెలిగించుకుని రెండు దమ్ములు లాగాడు. ఒకసారి చనుమొనకి అంటించాడు. యెర్రటి సిగరెట్ కొస. అదిరిపడింది_ బాధతో భయంగా.
    పకపకా నవ్వి, "తమాషాగా అనిపించలా" అన్నాడు.
    మరో నిమిషానికి సిగరెట్ కొసతో తొడమీద అంటించాడు.
    బాధని యోగశ్వాశలోంచి పీల్చింది.
    మరో రెండు నిమిషాలకి, విజయ్ కుమార్ గాఢంగా నిద్రపోతున్నాడు.
    ఐదు నిమిషాలకి_అతను నిద్రపోతున్నాడని గమనించింది సీత. లేచి నేలమీద పడివున్న తన బట్టలమీద కూలబడి, పైకి వినిపించకుండా భారం దిగిపోయేలా యేడ్చి యేడ్చి అలిసిపోయి _ తెలియకుండా అక్కడే నిద్రపోయింది.
    తొలిరేయే కాదు మలి రేయే కాదు _ అన్ని రాత్రులూ, వున్న అన్న రాత్రులు _ కొంచెం అటూయిటుగా అలాగే వుంటాయి సీతకి.
    మూడు రాత్రుల తరవాత హైదరాబాదు పంపించారు.
    ఐదోరోజుకి జ్వరంగానూ యెలాగో అనిపించింది. ఒళ్ళంతా బాధగా. ఒప్పు నొప్పులు బాధ ఐతే సరే_ తెలుస్తూనే వుంది జ్వరంగా వుందనిపించింది.
    విజయ్ కుమార్ తండ్రి వాళ్ళ వూళ్ళోనే వుంటుంటాడు. యెక్కువగా అతని తల్లి కూడా అక్కడే వుంటుంది. అక్కడా గుంటూర్లోనూ వ్యవహారాలు చూసుకుంటూ వుంటాడు. అప్పుడప్పుడూ హైదరాబాద్ వచ్చి వ్యవహారాలు గమనించుకు పోతుంటాడు. యిక్కడ పినతండ్రి ఉంటాడు. పినతండ్రికి పిల్లలు లేరు. ఆ విధంగా అన్నదమ్ములిద్దరికీ విజయ్ కుమార్ ఒక్కడే కొడుకు.
    సీత వొంట్లో బావుండలేదన్నట్లు గమనించిన అతని పినతండ్రి భార్య పరామర్శించి, వాళ్ళ డాక్టరు దగ్గిరికి వెళ్ళమని కారులో పంపించింది. రెండురోజుల క్రితం డాక్టరు యింటికి వచ్చినప్పుడు మా కోడలు విజయ్ భార్య అని చూపెట్టి చెప్పింది.
    డాక్టరు సీతని పరిశీలించి ఓ ఇంజక్షన్ చేసి మందులిచ్చి "రేపు వచ్చి ఇంజక్షన్ చేయించుకోమ్మా. రావటానికి వీలుకాకపోతే ఫోన్ చేసి చెప్తే నర్సుని పంపిస్తాను" అన్నాడు.
    ఆ తరవాత రెండు గంటలకి, రాత్రి తొమ్మిదింటికి ఫోను చేసి విజయ్ కుమార్ కోసం అడిగాడు డాక్టరు. విజయ్ కుమార్ అప్పుడే బయటనుంచి వచ్చాడు. ఇంకా బట్టలైనా మార్చుకోలేదు.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.