Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



                                     శ్రీ భీమన్న, బోయి

    విశ్వేశ్వరునికి హెచ్చరిక

    ఎవరులోపల? గడియబిగించుకొని, ప
    రుండినాడవె, శివశివా, ఒడలు,మరచి?
    భరతభువి నెత్తిమీద కుంపట్లు మండ,
    గుబులుపుట్టుట లేదొకో గుండెలోన?

    "ఇల్లును వాకిలిన్ కలుగ,
        దేర్పడ రూపము కూడలేదు, మా
    యల్లున" కన్నదేయనుము,
        అత్త! పరాయిదె? కోపమూనగా
    చెల్లునె? నీవు పోవగని,
        ఛీ నరహట్టులు నీదు అత్త వా
    రిల్లును ముట్టడించిరి! స
        హింతువె? పార్వతి నూరడించవే?

    అలిగివచ్చి కాశి నదివసిస్తివె కాని
    హిమగిరీంద్రుడన్న హితవులేదె?
    ఏది పాశుపతము? ఏది త్రిశూలమ్ము?
    పారవైచినావె ప్రాతవనుచు?

    ధరణిన్ గల్గిన సర్వ మానవులకున్
        తత్త్వామృతమ్మిచ్చి, ని
    ర్జర తేజస్వుల జేసినట్టి హిమవత్
        క్ష్మాదేవి రక్షింప నీ
    వురుకంగావలెగాని-సాధనములే
        దో? ముష్టి వీబూదిలో
    పరమూణ్వాయుధ కోటి పుట్టదో? రిపు
        వ్రాతమ్ము గోల్మాలదో?

    వేద వేదాంత సుధలుద్భవించె నిందు,
    బ్రహ్మ విష్ణీశ్వరాశ్రయారామమిద్ది,
    సర్వ చైతన్యశక్తి నీ సతికి వసతి
    ఈ హిమాలయ శ్రేణి, రక్షించుకొమ్ము!

    కాశిని వీడనక్కరయు
        కల్గదు; మేల్కొని, నీ లలాట స
    ర్వాశనభూతి కొంచెమిటు
        రాల్పుము; కైకొని, వీరభద్రులై
    దేశములోని మేటి యువ
        తీయువకోటి సమస్త ఛీనులన్
    నాశముచేసి వత్తురు, ఘ
        నమ్ముగ నీ విభుతన్ భజించుచున్!

                                                                *  *  *  *




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.