Home » vaddera chandidas » ప్రేమతో ....వడ్డెర చండీదాస్


                                                                 
                                                                                                             14-1-04
    రఘుగారికి నమస్తే,

    మనకిప్పడున్నది వొక్క బెంగాలే కదా -యింకా వెస్ట్ బూస్ట్ దేనికి; కేవలం బెంగాల్ అనేస్తే పోతుంది కదా!
    నెలకొకసారి సీలింగ్ ఫాన్ తుడవాలి. చాలా చిరాకు పని;   మ్పనిమనిశికి అప్పగిస్తే మంచం మిద అంతటా పడేలా తుడుస్తుంది.
    అన్నమాచార్యుని - అదిగో అల్లదిగో అందరిలాగానే గాయత్రిగారు కూడా హిందోళంలో పలికించారు. అంతేకాక, మధ్యమావతిలో  కూడా  పలికించారు!
    I have strong likes and dislikes -  సాధారణంగా సకారణంగా.
    యీ పూట, సప్తపదిలో జానకి పాడిన,  మరుగేలరా రాఘవా - వింటున్నాను. యిష్టం. చాలా పాటలు. యిష్టం. డజన్ల కి  డజన్లు, వందలు.
    అన్యోన్య దంపత్యలు నాకిష్టం. జన్మజన్మల బంధం.
    AIR రాత్రి   తొమ్మిదికి  హిందీ వార్తలు ముగిస్తూ సమాచార్ సంధ్యకాల్ - అంటారు. ఉభయ సంధ్యలు తెలుసు. అదేమీ సంధ్యో!
    శుద్ద్ కళ్యాణ్, నాకిష్టమ్తెన  రాగాలలో వొకటి. రామాఘోష్  గాత్రం విన్నాను ఆ మున్న బాగా పాడింది. కాని  హార్మోనియంకి  గాత్రం పక్కవాధ్యంగా వినిపించింది. యింక హిందూస్తాని కొత్త   cassettes  కొనదలచలేదు.
     యిదే శుద్ద్  కళ్యాణ్ ,    London concert లో,తన డెబ్బయ్యో యేట కిశోరి అమోన్ కర్  పాడింది.  గొంతూ, పాడటం అధ్బుతం. పక్కవాధ్యం,  హర్మోనియమే. కాని పూర్తిగా అదుపులో వుంచుకుంది. (మన బాలమురళికృష్ణ గొంతు యిప్పటికే మారిపోయింది  బాగోకండా!)
గిత్ గాయా పత్తరోంనే సినిమా టైటిల్ సాంగ్ కిశోరి అమోన్ కర్  పాడింది.
    ఆ మొన్న హ్తేదరాబాద్  రేడియోలో టియాన్  శేషగోపాలన్,  రారా రాజీవలోచన రామా-  చాలా బాగా పాడాడు. అరగంట మోహనం -  వెనకేప్పడో  మద్రాసు రేడియోలో విన్నాను- యం.యస్. సుబ్బలక్ష్మి యింకా గొప్పగా పాడింది. ఆమెకి ఆమె సాటి.
    మెహల్  లో  లతామంగేష్కర్  పాడిన - ఆయేగా  ఆనేవాలా ఆయేగా - పాటకంటే తియ్యనిది ప్రపంచంలో మరోకటుండదు.
    మీ నలుగురికి శుభాకాంక్షలు

                                                                                                -వడ్డెర చండీదాస్.
                                                                 
                                                                                                    తిరుపతి
                                                                                                  16-1-04
    రఘుగారికి నమస్తే,

    యీ క్షణంలో పేరు గుర్తురావడం లేదు; వొ ప్రముఖుడే అన్నాడు -సరోజినీ నాయుడుని  భారత కోకిల అని, కోకిల రూపం ఆమెకి  సరిపడదు. కోకిల గొంతూ ఆమెకి సరిపడదు. కవిత్వమూ  గాన ప్రాముఖ్యత కలది కాదు. భారతకోకిల; లతామంగేష్కర్.  దిలీప్  కుమార్  ప్యాసాలో నటించటానికి వోప్పకునుంటే చాలా పేరొచ్చేది. ( డాక్టర్ల సలహా మేరకి ట్రాజేడి రోల్స్ నటించటం మానుకున్నాడట).
    స్త్రీ విద్య నాకిష్టం. స్త్రీ విద్య ముఖ్యం. స్త్రీ విద్య పెరగాలి.  స్త్రీ స్వశక్తి మిద ఆధారపడాలి.
    అతి సునిశితమైనందుకు  చిన్నప్పటి నుంచి జీవితాంతం యితరులవల్ల వర్రీ అవుతున్నాను.
    గాయత్రిగారి MADHAVA cassette బాగో లేదని మీకు రాశాననుకుంటాను. A side విని అలా అన్నాను. Recent 'B' side విన్నాను. లక్షణంగా  వుంది. 'A'  side recording fault.
    కొన్ని విషయాలు అంగీకరించకపోయినా, మహాత్మాగాంధీ  యిష్టం, గౌరవం. అక్షరాలా జాతిపిత అనటం సబబు. మా నాన్న ఆయన పిలుపు మేరకు క్విట్  యిండియా వుద్యమంలో  పాల్గొని జ్తేలుకి వెళ్ళాడు. గాంధీ పటానికి రోజూ పూలదండ వేసేవాడు.
    అమితాబ్ బచ్చన్ సీరియస్ గా వుంటే; గొంతూ తిరు యెంత బావుంటుందో, కామెడి వేషం చేస్తే అంత ఘోరంగా వుంటుంది.
    గాయత్రిగారు, పాలించు -మధ్యమావతి అధ్బుతంగా పలికించారు.  యం.యస్. సుబ్బలక్ష్మి పాడింది గాని గొప్పగా లేదు.
    గాయత్రిగారికి రావాల్సినంత  పేరు రాలేదు. చిన్నవయసనెమో!
    65యేళ్ళు  వచ్చాయంటే నమ్మలేకండా వున్నాను. యింకేన్నాళ్ళు బతుకుతానో  యేమో.  దీర్ఘ  ప్రాణాంతక వ్యాది యేది లేనందున యెప్పడో సడన్ గా పోవొచ్చు.
    తెలుగు సినికవులు, బహుచతురుల సమర్ధులు.
    బెంగాలిలకు హిందూస్తానిలో సమర్ధప్రవేశం వుంది.
    కర్నాటకకి పక్కవాద్యాల హొరు వుండదు.
    మా నాన్న పోయాక,  మా అమ్మ నా దగ్గరే వుండేది. గ్లకోమా ముదరబెట్టు కొచ్చింది. చూపు పోయింది.  మా అమ్మాయి గ్తెనకాలజి  చేస్తుండేది. యిద్దరమూ చూసుకుంటుండేవాళ్ళం .  తరవాత 70 యేళ్ళకి గుండె ఆగిపోయింది.
    మీ నలుగురికి శుభాకాంక్షలు

                                                                                                 -వడ్డెర చండీదాస్.   

                                                                                                       తిరుపతి
                                                                                                    20-1-04
    రఘుగారికి, నమస్తే,

    సోనియాగాంధీ ఎలక్షన్  ఆందోళన పడుతోంది, విపరీతంగా,  దొరికిన అడ్డమ్తెన వాళ్ళని  ఆబగా కలుపుకుంటోంది. తనను విధవరాలిని చేసిన శ్రీ లంక LTTEని అభిమానించే DMK తో పొత్తుకు కుతూహలపడుతోంది. ఇందిరాగాంధీ  హుందాతనం లేదు. విస్తరాకులా యేగురుతోంది.
    కాంగ్రెస్ లో రోగ్స్ యెక్కువ మంది వున్నా నెహ్రు వంశం డబ్బు తినలేదు.
    యిందిరాగాంధీ  రాజీవ్ గాంధిల  మరణాల స్వయంకృతాలు.
    యింగ్లిషు లో హిందిలో న్యూస్ చానల్స్  వున్నాయి. అలాగే తెలుగు లో  న్యూస్  చానల్ మొదల్తెంది. బావుంది. tv 9- అని ప్రారంభమ్తెంది.
    మేజర్ చంద్రకాంత్  లో పుణ్యభూమి నాదేశం నమో నమామి పాట యస్. పి. బాలసుబ్రహ్మణ్యం బాగా పాడాడు.  కాని ఘంటసాల లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది.
    లతామంగేష్కర్, సాహిర్ లుద్ యాన్విలు  లేని వొ.పి. నయ్యర్ ను  అంగికరించాలును.
    I do not subcribe to the so-called Body-Language  ?(న్యాటంలో  అంగీకానయానికి శాస్త్రం  వుంది)
    హిమజ్వాల సిరియాల్తేజవుతున్నప్పడు  వారం వారం మా అమ్మ, మా నాన్నకి చదివి వినిపిస్తుండేది.
    వివిధ భారతిలో నిమ్మిమిశ్రా  గొంతూ నవ్వూ బావుంటాయి.
    వెనక,  తెలుగు రేడియో నాటకాల్లో శారదా శ్రీ నివాసాన్ అధ్బుతం.
    లతామంగేష్కర్ సెహగల్ ని మెచ్చుకుంటూ,  అతనిది సుగమ్ సంగీత్ అంది. నాకు సుగమ్ సంగీతం యిష్టంలేదు. శాస్త్రీయ సంగీతం యిష్టం. సినిమా సంగీతం యిష్టం. శాస్త్రీయ సంగీతం మొద ఆధారపడిన సినిట్యూన్లు  యిష్టం.
    ఆదివారాలు, రాత్రి 7.45 - 9.౦౦ గంటంపావు  శ్రీలంక రేడియో తప్పక వినండి. యింట్లో వుంటే మధ్యనాలు 2.30 - 3.15 వివిధభారతి.
    ఏది మారినా నడకమారదు. సోనియా గాంధిది యూరోపియన్  నడక. యిండియా ఆడవాళ్ళ  నడకకాదు. (2000లో) జూల్తే లో  న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడ వేసవి.  నయగారా అంత బాగా లేదు.  మారిలిన్ మన్రో సినిమా "నయాగరా" సినిమాలో నయాగరా జలపాతం అధ్బుతంగా వుంది. 
    గాయత్రిగారి  అన్నమాచార్య కేసెట్ కొని; దాన్లోని  కీర్తన దగ్గిన పెట్టుకుని శ్రద్దగా వినండి.  రాగంతో పాటు మాటకూడా యెంత accurate బాగా పలికిస్తారో తెలుస్తుంది. అంత బాగా రాగం పలికించే వాళ్ళున్నారు గాని మాట పలికించే వాళ్ళెవరూ లేరు.
    మీ నలుగురికి శుభాకాంక్షలు

                                                                                                            -వడ్డెర చండీదాస్.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.