Home » vaddera chandidas » ప్రేమతో ....వడ్డెర చండీదాస్


 

                                                                                                  తిరుపతి
                                                                                                 24-12-03
    రఘుగారికి నమస్తే,

    సద్దంహుస్సేన్  శావంకాక మనిషి దొరకటం పెద్ద సమస్య. తీర్పు వక పట్టాన తేలదు. వురిశిక్ష విధించకపోవొచ్చు. జీవితాంతం ఖ్తేదు విధించవొచ్చు.  కొత్తగా ఏర్పడే యిరాకి ప్రభుత్వానికి పెద్ద సమస్య. అతడిని అమెరికాలో వుంచితే అనువుగా వుంటుంది, యిరాక్ ప్రభుత్వానికి.
    యిక్కడ విది దిపాలు  సాయంత్రం వెలుతురుండగానే వేస్తారు! తెల్లవారుజామున  చికటుండగానే తీసేస్తారు!
    అన్నమాచార్యుని క్షీరాబ్ధికన్యకు; గాయత్రిగారు వీణ మిద అధ్బుతంగా పలికించారు. బాలమురళీకృష్ణ  కూడా చాలా గొప్పగా పాడాడు.
    సితార్ మిద ఆలాపనా మాత్రమే యిష్టం.
    మొనాలిస్టా అందానికి ప్రతికగా, తెలుగు సినిమాల పాటల్లో యితరత్రా వుదహరిస్తుంటారు.  ఆమె  అందంగా వుండదు (కనుబొమలు తీసేసి వుంటుంది. ఆ కాలంలో ;లాగా ) ఆమె ప్రత్యేకత చిత్రలేఖనానికి సంబందించింది. ఆమె ముఖంలోనిది. యే భావం అనేదో  సమస్య.
    హిందీ సిని గానం ఆరంభదశలో కానన్ దేవి యిష్టం. తెలుగులో  కాంచనమాల. కాంచనమాల కాలం నాటికి play-back రాలేదింకా. నటించేటప్పాడు  మాటలూ పాటలూ  రికార్డింగ్. ఘూటింగ్ తో పాటే, సౌండ్.
    మొన్న ఆదివారం రాత్రి వక గంటసెపు DD - 1  అధ్బుతం. మహానుభావుడు యేనభయ్యేళ్ళ నౌషాద్  తో ఆయన పాటలు చూస్తూ విన్నాను. అన్ని పాటలూ  విన్నవేగాని, సగం పాటలు చూడనివి. ఆ కార్యక్రమం తప్పిపోనందుకు  యెంతగా  సంతోషించానో! అద్బుత కాలఖండాలు. శాస్త్రీయ హిందూస్తాని యెంత అద్బుతంగా సినిగితాలు కూడా పలికిస్తుందో కదా! (మీరు చూసి వుంతారనుకుంటాను). మరతుమన్న మరపు రాణి గంట సమయం, అది.
    మహాగాయకుడు స్తెగల్ అన్ని పాటలూ వక్కలాగే పాడతాడేందుకో.
    శ్రీ లంక రేడియో రాత్రుళ్ళు (7-9) బావుంటుంది.
    ప్రతిరోజూ వివిధభారతి అనురంజనిలో (4.30-5) అరగంట సెపు శాస్త్రీయ సంగీతం వొస్తుంది. యింట్లో వున్న రోజులు వినండి.
    శిని ఆదివారాలు రాత్రుళ్ళు 10-11 గంట సెపు డిల్లి నుంచి శాస్త్రీయ సంగీతం వొస్తుంది. అప్పడప్పడు బావుంటాయి. హ్తేదరాబాద్ స్టేషను రిలే చేస్తుంది.
    కొత్తగా రిలీజయిన కేసేట్స్ - గాయత్రిగారి వి,  యం.యల్. వసంతకుమారివి. చేంబ్తే  వ్తేధ్యనాద బాగావతార్ వి  కొన్నాను.
    మీకు అక్కడికి తిరువందపురం చెన్త్నే రేడియోలు  రావనుకుంటాను. మాకిక్కడ హ్తేదరాబాద్ బాగా వొస్తుంది. మా చిన్న రేడియోలో  ౩౦ స్టేషన్లు వొస్తాయి.
    ఖవ్వాలి లాగే గజల్ నా మనసుకి అతకలేదు. (యీ రెండూ ముస్లిం సంస్కృతి జన్యం).
    మీ నలుగురికి శుభాకాంక్షలతో.

                                                                                                        -వడ్డెర చండీదాస్.

                                                                                                             తిరుపతి
                                                                                                           8-1-04
    రఘుగారికి నమస్తే,

     మీ వుత్తరం అందింది.
    dal పని ముఖ్యం.  మిహతావాన్ని తరవాత విలునుబట్టి.
    నాకు, గాయత్రిగారి  T. series  cassette అంత విలువ్తెంది ప్రపంచంలో మరింకేదిలేదు.
    యెప్పడూ  గోడమీద కనిపించే బల్లి నేలరోజుల్నుంచి కనిపించటం లేదు, సాలిళ్ళు పురుగుల కోసమే గూళ్ళు పెడతాయి అనిపించటం - పురుగులుండటానికి అవకాశం లేనిచోట్ల కూడ  విస్తారంగా బూజు అల్లుతాయి.  స్వభావం అనుకుంటాను. అంత అల్పప్రాణిలోంచి యెంత దారం వొస్తుందో!
    రుడాలి సినిమాలో లతామంగేష్కర్  పాడిన, "దిల్ భూమ్ కరే" పాటను యెవరూ అడగరు! సంగీతం, భూపేన్ హజారికా.
    టివిలో యీ మధ్య బ్తేజుబావరా  చూశాను.  యెన్నో కొన్నోసారి. అలాంటివి చూసిన కళ్ళతో చెవులతో; యిప్పడోస్తున్న సినిమాల చూడలేకపోవటానికి అర్ధం కనిపిస్తుంది.
    ఆ మొన్న తిరువనందపురం నుంచి పున్నాగవరాళి  రాగంలో గంధము పూయరుగా బాగా పాడాడు; అనురంజనిలో మాలిని రాజూర్ కర్ దాని రాగం బాగా పాడింది. నాకిష్టం. (అనురంజినిలో కచేరి వుండదు. రికార్డులు వేస్తారు).
    Videocon Bazooka లో -Fashion TV music బావుంటుంది; DD-1 audio బావుంటుంది. (cable లో DD -1బాగా రాదు).
    మా రేడియోలో నాకు అక్కరలేని తెలియని; అమెరికన్ బ్రిటిష్, జర్మన్, మిడిల్ యిస్ట్, ఫార్ యిస్ట్, సౌత్ యిస్ట్ యేషియా స్టేషన్ల హొరు,వాటి మధ్యలో పక్కలా, యిండియా స్టేషన్లు నలిగిపోతుంటాయి.
    మంచి సంగీతం రేడియోలోనూ కేసెట్లలోనూ వింటున్నాను, తృప్తిగా, మంచి కూచిపూడి  నాట్యం కోసం మనసు పరితపిస్తోంది. యే కాలమ్తెందో చూసి, వాపోవటం తప్ప  చెయ్యగలిగిందిలేదు!
    ఆ రాగాల లిస్టులోని, నాటకురంజి -శివ దీక్షాపరురాలనురా; నేనేప్పడూ  వినలేదు. చదివాను. యెవరిద్తెనా  పరవాలేదు.
    (యిప్పటి ) హిందూస్తాని వాళ్ళు హార్మోనియన్ని  నిషేధిస్తే చాలా బావుంటుంది. హిందూస్తాని కూడా పక్క వాద్యంగా వయొలిన్ ని అంతర్జాతీయ ఖ్యాతి, వాడుకా.  శాస్త్రీయ సంగీతం భక్తి పూరితం. ముఖ్యంగా కర్నాటక సంగితం పూర్తిగా భక్తి  పూరితం. యేలాంటి భక్తిలేని నన్ను అమితంగా పరవశుణ్ని చేసే శక్తి వుంది!
    అతి సున్నితమైన  సితార్ కి హార్మోనియం హొరుగాని తబలామోతగాని వుండకూడదు. వినిపించి వినిపించనట్లుగా  తాన్  పురా వుండాలి.
    కష్ మీర్ లో యిండియాలాగా,  యిరాక్ లో అమెరికా మిలిటంట్లను యెదుర్కుంటోంది.
    2003 సంవత్సరపు  అతి ముఖ్యవ్యక్తి , సద్దాంహుస్సెన్,
    మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                                   -వడ్దర్ చండీదాస్.   




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.