Home » vaddera chandidas » ప్రేమతో ....వడ్డెర చండీదాస్


                                                                                                    
                                                                                                          తిరుపతి      
                                                                                                       30-8-03
    రఘుగారికి నమస్తే,
    కిశోరి అమోన్ కర్  రాగేశ్రీ  రాగం వక గంటసెపు పాడింది. మొత్తం ఆలాపన. అద్బుతంగా వుంది.  (వెనక హ్తేదరాబాద్ రేడియోలో రాగం తానం పల్లవి అని వక రాగం గంట సెపు పాడేవారు)
    కర్నాటక  గాత్రం, వెనకటి కాలంలో రేడియోలో  యేప్పడూ  వింటుండేవాడిని. చాలా బావుండేది. బాలమురళికృష్ణ, యం.యస్. సుబ్బలక్ష్మి యం.యల్. వసంత కుమారి వంటివాళ్ళు  యిప్పుడు రావటం లేదు. రికార్డులు కూడా లభ్యం కావటం లేదు.
    యీమని  శంకరశాస్త్రి  వీణ, భ్రమరగితితో సహా  చాలా రేడియోలో విన్నాను. యిప్పుడు కూడా రేడియోలో  సంగీతం వొస్తుంది గాని ప్రతిభవంతులు కారు.
    ప్రభుత్వంలో పాలసీలో చేసేవాళ్ళు అతి తెలివిగలవాళ్ళో అతి తెలివితక్కువ వాళ్ళో వుంటారనుకుంటాను. చిన్న  వుదాహరణ -రూపాయి నాణేంకీ రెండు  రూపాయల నాణేంకి తేడా తెలియదు. రెండు రూపాయల నాణేంకి వకవ్తెపు నవున్న 2అంకె  చూసి తెలుసుకోవాలి.(గుడ్డివాళ్ళు తప మామూలుగా  యెవరూ పోల్చుకోలేరు!)
    మన దేశం వెధవ గొప్పలు పోతుంది గాని, కనీసం, మన డబ్బుకి కరెన్సీనోట్లు ఇవ్వలేని బికారిది. ఐదు రూపాయలవరకూ  నాణేలు తెచ్చారు. యింక చేటుగాలమొస్తే పదిరూపయలకి  నాణే లు తేస్తామంటున్నారు.
    నిన్నా మొన్నంతా మీనాకుమారి చూశాను. నాకు చాలా యిష్టం. ఆమె పాటలు, వివిధ చానల్స్ లో ఆమె కనిపిస్తున్న మేరకు సినిమాలు.
    మీనాకుమారి, వ్తెజయంతిమాల, రేఖ లాంటి వాళ్ళు యిప్పడేక్కడోస్తున్నారు! వుత్త  చేమ్కి బొమ్మలు.
    మొన్న ఆదివారం వుదయం హ్తేదరాబాద్ రేడియోలో అనూహ్యంగా యెవరో వీణ బాగా వాయించారు. కాజ సుభాషిని శాస్త్రి అట. మెచ్చుకుంటూ  వొ ముక్క రాయాలనిపించింది. కాని రేడియోవాళ్ళు  విజ్ఞతభిప్రాయానికి బదిరుల కదా! రేడియోలో యిటివాలి వాళ్ళలో వినబుల్ గా వుండటం అసాధారణ విషయం. నూతన  ఆశాకిరణ వ్తెణికి! (ఆరంభంలో, మ్తేసూర్ దొర్తేస్వామి అయ్యంగార్ ధోరణిలోనూ, చినర్లో గాయత్రిగారి ధోరణిలోనూ వాయించింది) గాయత్రిగారిప్రత్యేకత:   vocal    effect.  కిర్తనలలోని మాటలను  పలికించటం.
    సినిమా పాటల్లో, దాశరధి, శ్రీ శ్రీ ఆరుద్రలు, నాసికరం.
    DD తెలుగు న్యూస్ యిష్టం. సాయంత్రాలు వింటాను. AIR 9 PM న్యూస్ , యింగ్లిషు న్యూస్ చానళ్ళతో  పాటు న్యూస్  రిడర్లలో ETV లో ప్రగతి - నిర్దుష్టంగా నిర్దిష్టగా మృదువుగా  స్పూటంగా, ధృడంగా వుంటుంది, గొంతు.
    మా బంగాళాకి  తూర్పు వ్తెపున  పడమరవ్తెపునా  ఐదంతస్తుల బంగళాలు  లేచాయి. దాంతో -సూర్యోదయం సూర్తాస్తమయాలు  చంద్రోదయలూ లేవింక. వూటిలో  అరకులోయలో  ఆ అనుభవాలతో  గడపటమే యింక. రయిల్లో వెడుతున్నప్పుడు , అల్లిబిల్లి తిరిగే కొండల మధ్యలోంచి  సూర్యోదయం  మరుపురాని అనుభవం.
    వీణ కర్నాటకానికి లాగా, బాసురి హిందూస్తానికే  యెక్కువ బావుంటుంది. అలవాటు పడటం వల్లనేమో! ఆ రకంగా నేర్పున్న  వాళ్ళు లేకపోవటం వల్లనో!
    హిమాలయ సంగీతం; గ్రహ గోళాలతో  అనుసంధానించి  వింటే, యెవరూ  పలికించని  రాగాలు వినిపిస్తాయి. యెప్పడో  యెడదులకోకసారి వినగలుగుతుంటాను. వినేదాన్ని పలికించలేనివాణ్ని.
   సాధారణంగా రేడియోలో  సంగీతం. రేడియో టివిలో ఏది లేకపోతే NDTV 24X7 చానల్ పెట్టి నిర్వ్యిపకంగా చూస్తుంటాను. అది విసుగుగా అనిపిస్తే Tape Recorder  పెడతాను.
    కిశోరి అమోన్ కర్ బాగా పాడటమే కాదు, గొంతుకూడా  బావుంటుంది.
    అన్ని tests లూ negative వొచ్చాయి. నాకు అంతుపట్టటం లేదు అని ఫిజిషిన్  అన్నాక, హొమియోపతి  తీసుకుంటున్నాను. (కొద్దిగా జ్వరం వోరు చెదు). యిది  రాస్తుంటే తిరువనందపురం  నుంచి చక్కని వుచ్చరనతో యేమని వివరింతురా- యెంతని మొరలిడుదురా- అని ఆమె యెవరో చక్కగా పాడుతోంది.
    మీ నలుగురికి శుభాకాంక్షలు

                                                                                                     -వడ్డెర చండీదాస్.
                                                                         
                                                                                                      సాలిళ్ళ తిరుపతి
                                                                                                         4-9-03
    రఘుగారికి నమస్తే,
    నాలుగు నెలల క్రితం నోరు చేదు కొద్దిగా జ్వరం వొస్తే యేవో మందులు వేసుకున్నాను ఐదారు రోజులు.  తగ్గకపోతే ఫిజిషియన్ దగ్గిరికి వెళ్ళాను. నాలుగు రోజులకి prescription యిచ్చాడు. తగ్గలేదు. Blood tests  చేయించాడు. Mild typhoid అని తేలింది. 100 జ్వరం. బాగా నోరు చెదు. వారం రోజుల Medi-cines Course యిచ్చాడు. జ్వరం కొద్దిగా తగ్గింది. నోరు చేదు కూడా కొద్దిగా తగ్గింది. క్రమంగా అవే తగ్గిపోతాయి అన్నాడు. నెలరోజులు  చూశాను. తగ్గలేదు. మరో నెలకి జ్వరం పెరిగింది. నోరు చేదు పెరిగింది. మళ్ళి అన్ని tests లు  చేయించాడు. అన్ని negative వొచ్చాయి. నాకు అంతుపట్టటంలేదు -అన్నాడు. అప్పుడు హొమియోపతి డాక్టరు దగ్గరికి వెళ్ళాను. రిపోర్టులు అన్ని చూసి, cure గాని eliminate గాని అవ్వాలి -negative report వొచ్చింది కనుక since symptoms  continued it  is not cured or eliminated. That some times  happens with allopathy -  అన్నాడు it is called supressed typhoid, aggrevate చేసి తగ్గించాలి అని మందులిస్తున్నాడు - ఒక వారం ఐంది. నెల రోజులు పడుతుందిట. యిది నా ఆరోగ్య పరిస్ధితి. 99.5,నోరు  చేదు.
    వాయిద్యాలలో వీణ తరవాత బాసురి ఆ తరువాత సితార్ ఆ తరవాత వయొలిన్ ఆ తరవాత షహ్  నాయ్  యిష్టం.
    కాశ్మీర్ మిలిటన్ట లకు  ముఖ్యప్రేరణ, పాకిస్తాన్. రావణ కాష్టంలా మండుతోంది-యెంతకాలమో! యిరాక్ లోనూ బుష్  గెలవడనుకుంటాను.
    సోనియా గాంధికి అతి త్వరగా రాజకియపరిణతి వొచ్చింది.
    గాయత్రిగారు  చిన్న వయసులో (యేడేళ్ళ  వయసప్పటినుంచి ప్రారంభించి) యిప్పటికి ఐదు వేలకి ప్తెగా concerts లో పాల్గోన్నారట!
    శాస్త్రీయ సంగీతంలో డోలు యేవిటో! దుర్భరం.
    రేడియోలో కూడా మహానుభావులూంటారు! (వుదాహరణికి బుచ్చిబాబు, యీమని శంకరశాస్త్రి)
    నేను భరించలేని వాసనల్లో అతి ముఖ్యం, యేండు చాప కాల్చిన వాసన. అపర్న సేన్  నటిగా ధర్నకిగా యిష్టం.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                                         -వడ్డెర చండీదాస్.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.