Home » vaddera chandidas » ప్రేమతో ....వడ్డెర చండీదాస్



                                                                                                 తిరుపతి
                                                                                               25-7-03

    రఘుగారికి నమస్తే,
    మీ వుత్తరం అందినాక మొన్న మీకు వుత్తరం రాశాను. యిప్పుడు మీ రెండో వుత్తరం (కవరు) వొచ్చింది. కోడూరు 26-27తేదిలలో  వొస్తున్నట్లు రాశారు. తిరుపతికి వొస్తున్నది లేనిది  రాయనందున వొచ్చే సమయం ఉండకపోవచ్చుననుకుని  యీ వుత్తరం రాస్తున్నాను.
    దేవదాస్ సినిమా గురించి మీరు యిప్పటికి మూడుసార్లు రాశారు, అది వార్తలో ప్రచురిస్తే  బావుంటుందని. మీరు అంతగా అంటుంటే మీ మాట కాదనలేక  పోతున్నాను. వాళ్ళకిచ్చిన ఆ రెండు  వుత్తరాలూ ప్రచురించనివ్వండి. (నాకు వక వుత్తరమే గుర్తుంది. యిన్ లాండ్  లెటరు గుర్తు లేదు)
    మీ నలుగురికి శుభాకాంక్షలు

                                                                                                  -వడ్డెర చండీదాస్.


                                                                                                      తిరుపతి
                                                                                       1-8-03
    రఘుగారికి నమస్తే,
    తెలుగు సిని నేపధ్యగానంలో ఘంటసాల యెలాంటివాడో హిందిలో మహ్మద్  రఫి అలాంటివాడు. సంగిత దర్శకులు యింధ్రధనుసులా రకరకాలుగా వాడుకున్నారు. రఫికి అసాధ్యమ్తెన  రితి గీతి లేవు. సవ్యసాచి  గళం, న్తెపున్యం అనితరసాధ్యం -హింది సిని నేపధ్యగాన జగత్తులో పోల్చతగిన మరొకరు లేరు. భారతరత్నకు  లతామంగేష్కర్ యెంత అర్హమో,  అంతగానూ రాఫి అర్హుడు.
    టివిలో వకప్పుడు  వుదయం 6నుంచి7 వరకు star plus చానల్ లో  శాస్త్రీయ సంగీతం యిచ్చేవాళ్ళు. అది మానేసి సినిమా పాటలివ్వటం మొదలెట్టారు. మొదలెట్టినప్పటి  నుంచి  అవే అవే వొ యిరవ్తే  పాటలు. star Gold  చానల్ లో  మధ్యాన్నం అరగంట వాళ్ళూ -అంతే  చూసిచూసి యింక వీళ్ళింతేనని చూడటం మానేశాను. మాటిమాటికి  చూడటానికి వినటానికి అదేమన్నా క్లాసికల్ నాట్యమా, సంగితమ!
    యిటీవల ప్రారంభమ్తెనా  Head  లైన్స్ Today  చానల్ బావుంది, బోర్ కొట్టకండ!
    అతి ప్రాచుర్యమున్న మృదంగంది  బోలుధ్వని. ఘటానికి  నాదం వుంది.
    సాహిత్యంలో లాగానే సంగీతంలో శ్తేలి వుంటుంది. వోక్కోక్కరిది వొక్కోశ్తెలి.
    సాహిత్యంలో లాగానే సంగీతంలో కూడా యే శ్తెలి లేని చచ్చూ పుచ్చూ రకం వుంటారు- యెక్కువగా.
    కర్నాటక శ్రీ రాగానికి  హిందూస్తాని శ్రీరాగానికి  పోలికుండదు. అన్ని వీణలే ఐనా, మంచి వ్తెణికుల విణల్లో  వొకరి వీణా  నాదమూ మరొకరి వీణా నాదమూ భిన్నంగా వుంటాయి. వోకరిది వొక వీణా  మరొకరిది మరొక వీణ కాకండా అందరివి తంజావూరు  వీణలె ఐనా. (తంజావూరు సంగిత బ్రహ్మ త్యాగయ్య  జన్మస్ధలం. తన కృతులు  తెలుగులో కూర్చి, దక్షిణాది భాషల వాళ్ళందరితో  బహుళంగా  పాడిస్తున్నాడు. ఆ నాదర్షి. తెలుగువాళ్ళు వేదవాయాలని   గిరీశం అన్న, తెలుగువాళ్ళు గర్వించటానికి యిదిక్కటి చాలు!)
    యెందరో కాదు  కొందరే వ్తెణిక  మహానుభావులు. వాళ్ళందరికీ వందనాలు.
    గాయత్రిగారు అరగంటకి  మూడునాలుగు రాగాలు వాయిస్తారు. అరగంట కోక రాగం వాయిస్తే బావుండును.
    బహుమతులు గెలుచుకునే  వుబికిన కండరాల మగవాళ్ళ ప్రదర్శన నాకు అసహ్యం. అనిస్ధటిక్  అనిపిస్తుంది.
    అరుదుగా కొందరు ఆడవాళ్ళ కళ్ళలోలాగా చర్మానికి మెరుపు (glow) వుంటుంది. (దీపావళి మతాబాలా వెలిగిపోతుంటారు)
    ప్రసిద్ద  వ్తెణికుడు  చిట్టిబాబు నాకిష్టంలేదు.
    నూర్ జహ గళం  అనితరసాధ్య అత్యంత  ఆకర్షణియం.
    మీ నలుగురికి శుభాకాంక్షలు

                                                                                                      -వడ్డెర చండీదాస్.

                                                                                                         తిరుపతి
                                                                                                      16-8-03
    యీ యూనివర్సిటిలో ముప్పయ్యేళ్ళు పాఠలు చెప్పాను. రిటైరయ్యక  యిక్కడే వుండిపోయాను. నాకు అన్ని ప్రాంతాలూ ప్రదేశాలూ  వూళ్ళు  వొకటే. జన్మస్ధలం  అంటూ ప్రత్యక అభిమానం లేదు.  వేసవిలో కాస్త వేడి యేక్కువని తప్ప యీ తిరుపతి బాగానే వుంటుంది. యీస్ధటిక్ గా చూస్తే యీ వుళ్ళేవీ  బాగోవు.యీస్ధటిక్ ప్రదేశంలో  వుండాలని వుండదు. వెళ్ళి నాల్రోజులు చూస్తూ వుండాలనీపిస్తుంది.
     చిన్నవయసులోనే గాయత్రిగారు అసాధారణ ప్రతిభాశాలి  అయ్యారు. ఆమె డబ్తేయేళ్ళు  జీవించాలని, వాయిస్తూ వుండాలని కోరుకుంటున్నాను. నా జీవిత కాలంలో చాలా cassettes వాయించి విడుదల చేస్తే విని ఆనందిస్తాను. (యింతకీ మిమ్మల్ని కొని వినమన్న గాయత్రి గారి Cassettes  కొని విన్నారా? తప్పక వెంటనే కొనండి.  వివరాలు T.series వారిది. Rs.35cassette పేరు veena.
    వీణ, సితార్ అడ్డమ్తెన  వాళ్ళూ వాయించకూడదు. వాటిలో న్తేపుణ్యం నూటికి కోటికి వోకళ్ళకి  సాధ్యపడుతుంది.
    మహ్మద్ రాఫి  యిష్టం. అంతకంటే చాలా చాలా యెక్కువగా ఘంటసాల గొంతుకకి సాటి లేదు. సంగీత దర్శకుడుగా  ఆయన కూర్చిన పాటల బాణీలు అధ్బుతం. భారత రత్నకు అర్హడు .
    అక్కడికి మనదోక్కటే అన్నట్లుగా మువ్వన్నెలజండా అంటూంటారు- ప్రపంచంలో  మువ్వన్నెల  జండాలున్న  దేశలింకా  వున్నాయి కదా! అశోక చక్రం మాత్రం మరెవరికి లేదు.
    హిందుస్తాని వోకల్ కి  హార్మోనియం పక్కవాద్యంగా పెడుతుంటారు, కొన్నిసార్లు గాత్రాన్ని కమ్మేస్తుంది  హార్మోనియం.
    మీ  వ్యాసం  బావుంది. శ్రీ శ్రీ వుదహరించిన ప్రెంచి పుస్తకాలు నాకు తెలియదు. విషయమూ, విషయాన్ని వివరించిన తీరూ బావుంది. యింతకి గోవర్ధనరెడ్డికి  స్వప్నరాగాలినకి  సంబంధం యేమిటి?
    యిక్కడి వరకు రాసే సరికి మీ వుత్తరం వొచ్చింది.
    మీరిక్కడికి వోచ్చినప్పు డు చెప్పాను  కదా నా రచనలు యెవరూ యేడిట్ చెయ్యకూడదని. నేను రాసేదేది Press Act కి అభ్యంతరకరంగా వుండదు, నేను రాసింది రాసినట్లుగా అచ్చవటం నాకు అలవాటు.
    "తను రాసింది ప్రతి అక్షరం యధాతధంగా  అచ్చావ్వాలట. యింతవరకూ యెవ్వరు యేడిట్ చెయ్యలేదట. చిన్న చిన్న చేర్పులు  గాని కూర్పులు గాని తొలగింపులు గాని లేకుండా వెయ్యాలి. అలా కాకపోతే అచ్చుకివ్వటానికి అంగికరించను. కాగా నేను రాసేది Press Actకి  వ్యతిరేకంగా వుండదు" అని అన్నానని చప్పండి.
    మీ నలుగురికి శుభాకాంక్షలు

                                                                                                              -వడ్డెర చండీదాస్.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.