Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



        సమహం ప్రజయా సం మయాప్రజా !
        సమహగం రాయస్వోషేణ సం మయా రాయస్వోషః ||           

                                        అయిదవ ప్రపాఠకము
                                         మొదటి అనువాకము

    ఇది శతరుద్రీయము. దీనిని నమకము అందురు.

    1. రుద్రదేవా! నీ కోపమునకు నమస్సు. నీ బాణమునకు నమస్సు. నీ ధనస్సుకు నమస్సు. నీ బాహువులకు నమస్సు.

    2. రుద్రదేవా! నీ బాణములు శివతమములు అయినవి. నీ ధనువు శాంతియుతమైనది. నీ శరములు శాంతములైనవి. శాంతమగు బాణముల చేతను, శాంతమగు ధనువు చేతను, శాంతములగు బాణముల చేతను మమ్ము సుఖపెట్టుము.

    3. రుద్రదేవా! నీ తనువు శివము. అహింసము. పాపములను వెల్లడి కానివ్వనిది. శాంతమయమగు ఆ తనువుచే మమ్ము కటాక్షించుము. ప్రకాశము కలిగించుము.

    4. కైలాసవాసా! నీ చేత బాణము పట్టినావు కదా! ఆ హస్తము మా విషయమున శాంతము అగును గాక. మానవులను, అన్య ప్రాణులను హింసించకుము.

    5. గిరీశా! నిన్ను మంగళకర స్తుతి రూప వచనములచే ప్రార్థించుచున్నాను. మమ్ము, సమస్త ప్రాణిజాలమును రోగరహితులను, మంచి మనసుకల వారిని చేయుము.

    6. రుద్రుడు దేవతలందు ముఖ్యుడు. దేవతలను పాలించువాడు. అధివక్త. సమస్త క్రూర జంతువులను, రాక్షసులను నాశము చేయువాడు. భిషక్కు. ఆ దేవుడు నన్ను గురించి పలికినంతనే నేను సర్వాధిక్యుడను అగుచున్నాను.

    7. ఈ రుద్రుడు ఆదిత్యుడు అగును. అతడు ఉదయమున తామ్ర వర్ణుడు. తదుపరి అరుణ వర్ణుడు. పిమ్మట బభ్రువర్ణుడై మంగళ స్వరూపుడు అగుచున్నాడు. ఏ రుద్రులు భూమి యందంతటను, దిశలన్నింటను తమ వేనవేల క్రోధ కిరణములతో ప్రజ్వరిల్లుచున్నారో వానిని భక్తి పూర్వక నమస్కారాములచే శాంతింపచేయుచున్నాము.

    8. ఇతడు నీలగ్రీవుడు. విలోహితుడు. ఆదిత్య మండల వర్తియై ఉన్నాడు. అట్టి రుద్రుని గోపాలురు దర్శించుచున్నారు. నీటి కడవలు గల అతివలు దర్శించుచున్నారు. సర్వ ప్రాణులు దర్శించుచున్నవి. ఆ విధముగా అందరిచే దర్శించబడు రుద్రుడు మమ్ము సుఖవంతులను చేయునుగాత.

    9. నీలగ్రీవునకు, ఇంద్ర స్వరూపునకు, పర్జన్య మూర్తికి నమస్కరించు చున్నాను. రుద్రుని భృత్యులందరకు నమస్కరించుచున్నాను.

    10. భగవాన్! నీ చేతి యందున్న ధనువు యొక్క రెండు కొనల అల్లె త్రాళ్లను విప్పుము. నీ చేతి యందలి అమ్ములను విడువుము.

    11. శివస్వామీ! నీవు సహస్రాక్షుడవు. దేవా! నీ ధనువుయొక్క అల్లె త్రాటివి విప్పుము. నీ బాణముల లోహాగ్రములను విశీర్యము చేయుము. మమ్ము అనుగ్రహించుము. శాంతమూర్తివి అగుము.

    12. కపర్ది యొక్క ధనస్సునకు అల్లెత్రాడు లేకుండును గాక. అతని శరధి యందలి బాణములు లోహాగ్రాములు కాకుండును గాక. అతని బాణములు బాధింపనశక్యములగునుగాక. అతని అమ్ముల పొది అతిసమర్ధము కాకుండును గాక.

    13. రుద్రదేవా! నీవు ఎన్నో కోరికలు తీర్చగలవాడవు. నీ చేతియందు ఖడ్గాది ఆయుధములు ఉన్నవి. ధనుస్సు ఉన్నది. అవి నిరుపద్రవములు అగును గాత. అట్టి నిరుప్రదవ ఆయుధములతో మమ్ము ఎల్లెడల పాలించుము. పోషించుము.

    14. నీలకంధరా! లక్ష్యమును భేదించగలట్టి, ఎక్కు పెట్టని నీ ఆయుధమునకు నమః. నీ ఉభయబాహువులందున్న ధనువునకు నమః

    15. రుద్రదేవా! గురి పెట్ట బడిన నీ బాణము లోకమున ఎచటను మాకు తాకకుండును గాక. నీ యొక్క అమ్ముల పొదిని మాకు దూరముగా ఉంచుము.

                                       రెండవ అనువాకము

    1. నమో హిరణ్య బాహవే సేనాన్యే. దిశాం చ పతయే నమః

    2. నమో వృక్షేభ్యో హరికేశేభ్యః. పశూనాం పతయే నమః

    3. నమః సస్పిఞ్జరాయ - లేత గడ్డి రంగు వానికి. త్విషీమతే పథీనాం - దీప్తిమంతునకు - నమః

    4. నమో బభ్లుశాయ - ఎద్దు మీద ఉండువానికి, వివ్యాధినే - శత్రువును బాగా వేధించు వానికి - అన్నానాం పతయే నమః.

    5. నమో హరికేశాయోపవీతినే. పుష్పానాం పతయే నమః.

    6. నమో భవస్య హేత్యై - పాపముల పాలిటి ఆయుధమైన వానికి - జగతాం పతయే నమః

    7. నమో రుద్రాయ్క్కాతతావినే - గొప్ప ధనుస్సుచే రక్షించునట్టి వానికి. క్షేత్రాణాం పతయే నమః.

    8. నమః సూతాయాహన్త్యాయ - సారధియు, వధించనలవి కాని వానికి. వనానాం పతయే నమః.

    9. నమః రోహితాయ స్థపతయే - లోహిత వర్ణ రుద్రునకు, వృక్షాణాం పతయే నమః.

    10. నమో మన్త్రిణే వాణిజాయ. మంత్రా లోచన పరునకు, వాణిజ్య స్వామికి, కక్షాణాం - పొదల యొక్క - పతయే నమః.

    11. నమో భువన్తయే - భూమికి పెంచువానికి వారి వస్కృతాయ - ధనముల కర్తకు. ఓషధీనాం పతయే నమః.

    12. నమ ఉచ్చైర్ఘో షాయ్క్కాక్రన్దయతే. పత్తీనామ్. కాల్బలముల - పతయే నమః.

    13. నమః కృత్స్న వీతాయ - సేవలచే చుట్టబడిన వానికి, ధావతే - పారి పోవు వారిని వెంబడించు వానికి, సత్వనాం - సాత్వికుల, పతయే నమః.

                                         మూడవ అనువాకము

    1. నమః సహమానాయ - శత్రువులను అభిభవించు వానికి, నివ్యాధిన - విరోధులను బాధించువానికి. అవ్యాధినీనామ్ - శూరసేనకు, పతయే నమః.

    2. నమః కకుభాయ - శిఖర ప్రాయమునకు, విహఙ్గిణే- ఖడ్గ హస్తునకు, స్తేనానామ్ - గుప్తా చోరులకు, పతయే నమః.

    3. నమో నిషఙ్గి, ఇషుధిమతే - వీపున అమ్ముల పొది గలవానికి. తస్కరాణాం - ప్రకట చోరులకు, పతయే నమః.

    4. నమోవఞ్చతే పరివఞ్చితే - వంచన, పరివంచన చేయువానికి, స్తాయునాం - దొంగల, పతయే నమః.

    5. నమోనిచేరవే పరిచరాయ. అరణ్యానాం పతయే నమః.

    6. నమః సృకావిభ్యో - వజ్ర రక్షణ కలవానికి, జిఘాగం సద్భ్యో - ప్రాణులను వధించు వానికి. ముష్ణతాం పతయే నమః.

    7. నమ్కో సిమద్భ్యో నక్తంచరద్భ్యః. పృకృన్తానాం పతయేనమః.

    8. నమ ఉష్ణీషిణే గిరిచరాయ. కులుఞ్చౌనాం పతయే నమః.

    9. నమః ఇషు మద్భ్యో ధన్వాదిభ్యశ్చ వో - మీకు నమః.

    10. నమ ఆతన్వానేభ్యః - ధనస్సును లాగువారును, ప్రతి దధానేభయశ్చ - బాణము సంధించువారలగు వో నమః.

    11. నమ ఆయుచ్చద్భ్యో - అల్లెత్రాటిని లాగువారలు, విస్తదభ్యశ్చ - సంధించి విడుచువారలగు, వోనమః.

    12. నమ్కోస్యద్భ్యో - బాణమును లక్ష్యము చేరునట్లు చేయువారలగు, విద్యభృశ్చ - లక్ష్యమును భేదించు వారలగు వోనమః.

    13. నమ ఆసీనేభ్యః - కూర్చున్న వారలు, శయనేభ్యశ్చ వోనమః.

    14. నమః స్వపద్భ్యో - నిద్రించువారలగు, జాగ్రద్భ్యశ్చవో నమో.

    15. నమస్తిష్ఠద్భ్యో - స్తిరులైన వారలు ధావద్భ్యశ్చ వోనమో.

    16. నమః సభాభ్యః. సభాపతిభ్యశ్చ వో నమో

    17. నమో అశ్వేభ్య్కోశ్వపతి భ్య శ్చ వోనమః

                                            నాలుగవ అనువాకము

    1. నమ ఆన్యాధినీభ్యో - అంతటను బాధించు స్త్రీలగు. వివిధ్యన్తీభ్యశ్చ - ఎక్కువ బాధించు స్త్రీలగు వోనమః - నీకు నమస్కారము.

    2. నమ ఉగణాభ్యః - గణములు గల స్త్రీ దేవతలగు, దృగంహతీభ్యః - ఉగ్ర రూప స్త్రీలగు, వో నమో.

    3. నమోగృత్సేభ్యో - విషయలంపటులగు, గృత్సపతి భ్యశ్చ - వారి పాలకులగు వోనమో.

    4. నమో వ్రాతేభ్యో - నానా జాతుల వారలగు, వ్రాతపతిభ్యశ్చ - వోనమో.

    5. నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వోనమో.

    6. నమో విరూపేభ్యో - విశ్వ రూపేభ్యశ్చ వో నమో.

    7. నమో మహద్భ్యః - క్షుల్ల కేభ్యశ్చ వోనమో.

    8. నమో రథిభ్యో - రథే భ్యశ్చ వో నమో.

    9. నమో రథేభ్యః - రథపతి భ్యశ్చ వో నమో.

    10. నమో సేనాభ్యః - సేనాని భ్యశ్చ వో నమో.

    11. నమః క్షత్తృభ్యః - ద్వారపాలకులగు, సంగ్రహీతృభ్యశ్చ - సంగ్రహ స్వరూపులగు వో నమో.

    12. నమస్తక్షభ్యో - వడ్రంగులగు, రథకారేభ్యశ్చ వో నమః.

    13. నమః కులాలేభ్యః - కుమ్మరి వారలగు, కర్మారేభ్యశ్చ - కమ్మర వారలగు వో నమో.

    14. నమః పుఞ్జిష్టేభ్యో - పిట్టలను చంపువారలగు, నిషాదేభ్యశ్చ - చేపలు చంపువారలగు, వో నమో.

    15. నమ ఇషు కృద్భ్యో - బాణము చేయువారలగు, ధన్వకృద్భ్యశ్చ - ధనువులు చేయువారలగు, వో నమో.

    16. నమో మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో.

    17. నమః శ్వభ్యః - కుక్కలగు, శ్వపతిభ్యశ్చ వో నమః

                                             అయిదవ అనువాకము

    1. నమోభవాయ చ రుద్రాయ చ నమః. శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయచ. శితికణ్ఠాయచ నమః కపర్దినే చ వ్యుప్త కేశాయ చ నమః. సహస్రాక్షాయచ శత ధన్వనేచ నమోగిరిశాయ శిపి విష్టాయ చ. నమో మీఢుష్టమాయ చేషుమతేచ. నమోహ్రస్వాయ చ వామ నాయ చ. నమో బృహతేచ వర్షీయసే చ నమో వృద్దాయచ సంవృధ్వనేచ నమో అగ్రి యాయ చ ప్రథమాయచ నమ ఆశనే జాబిరాయ చ నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ. నమ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయచ.

                                              ఆరవ అనువాకము

    1. నమో జ్యేష్ఠాయ చ కనిష్టాయ చ. నమః పూర్వజాయ చ నమో మధ్యమాయ చాపగల్భాయ చ. నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ. నమః సోభ్యాయ చ ప్రతి సర్వాయచ నమో యామ్యాయచ క్షేమ్యాయ చ. నమ ఉర్వర్యాయాచ ఖల్యాయచ. నమః శ్లోక్యాయ చావసాన్యాయచ. నమో వన్యాయ చ కక్ష్యాయ. నమః శ్రవాయచ ప్రతి శ్రవాయచ నమ ఆశుషేణాయచ్క్కా శురథాయ చ. నమః శూరాయ చావభిన్దతే చ. నమో వర్మిణేచ వరూథినేచ. నమో బల్మినే చ కవచినే చ నమః శ్రుతాయచ శ్రుతసేనాయ చ.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.