Home » Suryadevara rammohan rao » మయసభ

    "రిషి గోవిందరాజులమనిషిని .... అదే అలక్ నిరంజన్ ని అరెస్టు చేసాడు. వారం రోజులుగా ఏదో స్కూఫ్ ని పసిగట్టాడు. ఇపుడు అలాక నిరంజన్ ఖైతరాబాద్ పోలీస్ స్టేషన్ లాకఫ్ లో బంధించబడి వున్నాడు. ఇంటరాగేషన్ జరుగుతోందట" తన సి. ఏ. మాటలు పూర్తవుతూనే చూడప్ప చటుక్కున తల ఎత్తి చూసాడు.

    అయన కళ్ళలో ఆశ్చర్యం.... అనందం ... ఉద్వేగం ....

    ఎంతో సాహసం వుంటే తప్ప ఏ పోలీసాఫీసర్ చేయలేని పని అది.....

    "గోవిందరాజుల మనిషిని అరెస్ట్ చేయడమంటే కొంచెం ప్రమాదకరమైన స్టేప్స్ సార్ ...." పి.ఏ నసిగాడు.

    చూడప్ప మందహాసం చేసాడు.

    "ఎవరి మనిషయినా ఏం భయం లేదు. మనకు నేరస్తుల కార్యాకలాపాలపైనే దృష్టి ఉండాలి తప్ప __ వాళ్ళ చరిత్రల్లో దాగుండే ఘరానా వ్యక్తులపై కాదు. ఇంతకీ విషయమేమిటి....?"

    "అలక్ నిరంజన్ ఉరఫ్ ప్రిన్స్ గురించి మన డిపార్ట్ మెంట్ కి ఎన్నో అనుమానాలున్నాయి. అతను 'పిక్చర్' అనే అనుమానం మనకు ఎంతోకాలంగా వుంది కాంట్రాక్ట్ క్రయిమ్స్ ని ఆరెంజ్ చేస్తుంటాడని అనుమానం. అతనికి బొంబాయి అండర్ వరల్డ్ క్రయిం కారిడార్స్ తో మంచి సంబంధాలున్నాయని చెప్పుకుంటుంటారు. అయితే ఇంతవరకు సరయిన ఆధారాలు దొరక్కపోవటంతో మన డిపార్ట్ మెంట్ అతన్నేం చేయలేక పోయింది....."

    పి.ఏ చెప్పడం ముగించాడు.

    రిషి  తన మనిషిని __ అతను  ప్రమాదకరమైన వ్యక్తుల జోలికి వెలుతున్నాడని __అది రిషికి బష్టం కలిగిస్తుందని తన మీద గౌరవంతో తన పి.ఏ చెబుతున్నాడని చూడప్ప గ్రహించాడు.

    ఆపైన సీట్లోంచి లేచాడు.

    "డోంట్ వర్రీ! రిషి చేస్తున్నది మంచిపనే __ భయపడవలసిన పనిలేదు. అతను నిజంగా ఏదయినా స్కూఫ్ ని బయట పెట్టె ప్రయత్నంలో వుంటే మనం హర్షించాలి. షాపు లో వున్న పండు  చెడిపోయిందనుకుంటే చెట్టునుండే డైరెక్ట గా కొసుకోవాలి.

    ఈ మధ్యనే డిపార్ట్ మెంట్ లో చేరాడు గదా __ ఇంకా చేడిపోలేదు. అందుకే తన వృత్తి ధర్మాన్ని నిభాయమ్గా, నిస్సంకోచంగా నెరవేర్చుకు పోతున్నాడు. ఆ తెగుగా, ధైర్యం లేకే కేసుల్ని పరిష్కరించలేక పోతున్నారు. ఆ తెగువ, ధైర్యం లేకే కేసుల్ని పరిష్కరించలేక పోతున్నారు మన అధికారులు . కానివ్వు .... ఏమైతే అదే అవుతుంది. ఆ పైన నేనెలాగూ వున్నానుగదా!" అంటూ చూడప్ప బయటకు వెళ్ళి రడీగా వున్న కార్లో ఎక్కి కూర్చున్నాడు.

    ఆ మరుక్షణం కారు ముందుకు దూకింది అలక్ నిరంజన్ .... ఉరఫ్ ప్రిన్స్ .......

    రిషి దృష్టిలోకి ఎలా వచ్చాడు.......?

    అసలు ఎలా తెలిసాడు....?

    "వెరీ కాన్ఫిడేన్షియల్ ఫార్ యువర్ ఐస్ ఒన్ లీ' ఫిల్ లోనే ఉండే అలక్ నిరంజన్ రిషి చేజ్ చేయటం ... శోధించటం..... అనుమానించటం, ఆరాతీయటం ... జాబ్ లో చేరిన మొదటి నెలలోనే తిమింగలానికి ఎర.....?

    ఇంతకీ రిషి అనుమానం దేని గురించి? ఎవరి మీద?

    ఆఫీసులో పి.ఏ తో అంత ఆసక్తి లేనట్లుగా మాట్లాడినా, దానికంత ప్రాముఖ్యం ఇవ్వకపోయినా, తరచి ఆలోచిస్తుంటే ఏవో పెద్ద కుంభకోణమే నిరంజన్ వెనుక దాగి ఉనట్ట్లు అనిపించసాగింది చూడప్పకి.

                                                                 *    *    *    *   

    రిషి ఎక్కినా జీఫ్ సికింద్రాబాద్ లోని గన్ రాక్ ఎంక్లేవ్ ఏరియాకు చేరుకుంది జీఫ్ డ్రయివర్ , వెనుక కూర్చున్న ఖైతరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. ఆపైన ఎటు అన్నట్లు చూసారు.

    రిషి అదే నిరంజన్ ఇల్లని చెప్పటంతో ఎస్.ఐ. జీఫ్ దిగాడు.

    ఇద్దరూ తలుపు దగ్గరకు వెళ్ళారు.

    నిరంజన్ ని లాకఫ్ లో పెట్టె ముందు అతని బిలాంగింగ్స్ ని తీసి సపరేట్ గా పెట్టారు. వాటిల్లోంచి ఇంటి కీని తీసుకొచ్చాడు రిషి. దాంతో ఎస్.ఐ. ఆ యింటి తలుపుల్ని తెరిచారు.

    లోపల చీకటిగా వుంది.

    ఎస్.ఐ. చీకట్లోనె గోడల్ని తడిమి స్విచ్ వేసాడు. లైట్ వెలిగింది.

    వెంటనే ఖరీదయిన పరికరాలు కనిపించాయి.

    వాటిని చూస్తూనే యిద్దరూ ఆశ్చర్యపోయారు.

    బయటకు మామోలుగా కనిపించే ఆ యింటి లోపల అంత ఖరీదయిన గృహోపకరాణాలు ఉంటాయని ఆ ఇద్దరూ ఊహించలేదు.

    కలర్ టి.వి. .....

    జి 20 వి.సి.ఆర్ ....

    డబల్ డోర్ ఫ్రిజ్ .....

    గార్రెజ్ అత్మారాలు......

    ఖరీదయిన సోఫా సెట్ కనిపించాయి.

    రిషి తన దగ్గరున్న కొనికా మినీ కేమరాతో ఆ గదిని నాలుగాయిదు కోణాల్లో ఎక్స్ పోజ్  చేసుకున్నాడు.

    ఆ పైన ఇద్దరూ నెమ్మదిగా లోపల గదివేపు కదులుతుండగా ఎస్సై ప్రక్కకు చూసి మరింత ఆశ్చర్యపోయి అతనికి సైగ చేసాడు.

    రిషి ఏమిటన్నట్లు కనుబొమ్మలు ఎగురవేసాడు.

    "హిటా ఛీ టూ టన్ ఏసీ మెషీన్ " అన్నాడు గోడలో బిగించి వున్న ఏసి మెషీన్ ని చూపిస్తూ.

    రిషీ విస్మయపడ్డాడు.

    ఒక మామూలు వ్యక్తికీ __

    క్లబ్ లో డ్రమ్స్ వాయిస్తూ నేలకు పదిహేనువందలు మాత్రమె సంపాదించుకునే వ్యక్తి యింటికి ముప్ఫయ్, నలభయ్ వేలు ఖరీదుచేసే ఇంపోర్దేట్ ఏసీ మెషిన్.....?!

    రిషి ఉలిక్కిపడ్డాడు అతనిలోని అనుమానం మరింత బలపడసాగింది. మరో నాలుగు అడుగులు వేసి ఆ గాడికి, వెనుక గాడికి మధ్యనున్న తలుపుల్ని ఎస్.ఐ.రిషి ఆ గదిలోకి వెళ్ళి చుట్టూ పరిశీలించి చూసాడు.

    వాటర్ ఫిల్టర్, గ్యాస్ స్టౌ , ఖరీదయిన కిచెన్ కేబినేట్ , ఓ మూలగా వీడియోకాన్ వాషింగ్ మిషన్, ప్రేస్టేజీ ప్రెషర్ కుక్కర్స్, హాట్ కేరియన్ , ప్లాస్క్ డిన్నర్, సెట్స్......

    రిషి మరింత వేగంగా కదిలి ఆ గాడికి వున్న మరో తలుపుని తీసాడు. అదో పెద్ద బాత్ రూమ్ ... స్పార్ టెక్ టైల్స్ తో యూరోపియన్ కమాడ్ టైఫ్ లో  నిర్మించిన లావేట్రీన్ ... నిరంజన్ అంత రిచ్ గా బ్రతుకు తున్నాడని ఏమాత్రం ఊహించని రిషి విస్తుపోయాడు.

    ఎస్ . ఐ. కై. తే మతిపోయింది.

    "నా అనుమానం మరింత బలబడుతోంది కమాన్...... లెటజ్ చెక్ అల్ థింక్స్ ...." అంటూ రిషి తిరిగి మధ్య గదిలోకి వచ్చి టేబుల్ సోరుగుల్ని , బీరువాల్ని  వేటకనారంభించాడు.

    క్షణాలు.... నిశ్శబ్దంలో కరిగిపోతూ నిముషాలయిపోతున్నాయి.

    చిన్నది..... కేవలం చిన్నది అయినా ఒక్క ఆధారం దొరికితే చాలు... కేసు కదిలిపోతుంది......

    రిశిలో ఉత్సాహం రెట్టింపయింది.

    ఎస్.ఐ. కూడా క్షున్నంగా ప్రతి వస్తువుని పరిశీలించసాగాడు.

                                                                     *    *    *    *   

    న్యూడీల్లీ........

    నేషనల్ డెమోక్రటిక్ పార్టీ కేంద్ర కార్యాలయం .....

    పార్టీ అధిష్టానవర్గ సభ్యులు డిన్నర్ తీసుకోకుండా చర్చించుకుంటున్నారు.

    "మన పార్టీ ఆ రాష్ట్రంలో బ్రతికి బట్టకట్టాలంటే నందకిషోర్ ని పదవిలోంచి డింపక తప్పదు " అని ఒకరన్నారు.

    నాకూ అదే పరిష్కారమనిపిస్తో౦ది మరీ లంచగోండి అయిపోయాడు కిషోర్ జీ. కొంతయినా పార్టీకి పంపించటం లేదు. ఏదో కంటి తడువుగా లక్షలు పంపిస్తూ కోట్లు దాచేసుకుంటున్నాడు. భవిష్యత్తులో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మన పార్టీ గెలవాలంటే తప్పదు మరి" అని అన్నారు మరొకరు.

    "మనం నందకిషోర్ జీని దించి మాణిక్యంని పదవిలోకి తీసుకురాక పోతే శంభుప్రసాద్ కి కోపం రావచ్చు. మనపట్ల కినుక వహించవచ్చు. అలా అయితే ఆయన్ని ఎంతో  అభిమానించే పి.ఎమ్ కూడా ఆగ్రహించెందవచ్చు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే కిషోర్ జీని దింపటమే క్షేమం " అని ఇంకొకరన్నారు.

    క్రమంగా చర్చలు వేడిని పుంజుకుంటున్నాయి.

    "కిషోర్ జీని అంత తక్కువ వేయకండి . తనను కాదంటే పార్టీనే నాశనం చేసేందుకు పూనుకోవచ్చు."

    "నిజమే __ నందకిషోర్ విషసర్పం లాంటివాడు __ జాగ్రత్తగా ఆ పని చేయాలి "

    "పార్టీకి నష్టం కలగకుండా, ప్రజల్లో మనం బ్యాడ్ కాకుండా ఈ పని జరిపోవాలి"

    మొత్తానికి మెజారిటీ సభ్యులు నందకిషోర్ అభ్యర్ధిత్వంపట్ల అసంతృప్తిని వ్యక్తం చేసారు.

    ఇక నిర్ణయం తీసుకోవాలి __ అదే మిగిలి వుంది.

                              *    *    *    *   

    ఎస్.ఐ నిరంజన్ ఇంటిలో ఒక బీరువాలోని లోపల అరలో కనిపించిన ఫైల్ ని చూసి షాక్ తిన్నాడు.

    అతని మెదడు కొద్ది క్షణాలు పని చేయటం మానివేసింది.

    అది గమనించి, రిషి వేగంగా ఎస్.ఐ దగ్గరకు వచ్చి తెరచి వున్న ఫైల్ లోని మొదటి పేజీని, అందులో అతికించి ఉన్న మైఖల్ రాజు పేపర్ ఫోటోని చూసి ఉలిక్కిపడ్డాడు.

    రిషి వెంటనే ఎస్.ఐ చేతిలోని ఫైల్ ని తీసుకుని అందులోని మొదటి పేజీని పరిశీలనగా చూసాడు.
 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra