మొదటిసారి ఎర్రటి స్టిక్కర్ ని నుదుటికి అంటించుకున్నప్పుడు కాంక్షజ్వాలిత హృదయాన్ని ఆదిత్యకు చూపించడానికి పెట్టుకున్నట్లు తోచింది.
మరో వారం రోజులకు ఆదిత్య చిన్నాన్న సుబ్బారాయుడు మూలస్థానం దేవతకు మొక్కుకుంటారని తెలిసింది. ఇదే మంచి ఛాన్స్ అనుకున్నాను.
మాకు పదిహేనుమైళ్ళ దూరంలో ఓ పాతబడిన కోట వుంది. విజయనగరం రాజులు పరిపాలించైనా కోట అని చెప్పుకుంటారు. అక్కడ ఓ పెద్ద మర్రిచెట్టు వుంది. ఆ చెట్టు మొదట్లో మూలస్థానం అమ్మవారి విగ్రహముంది రాజులు యుద్దాలకు పోయేప్పుడు ఆ దేవతకి మొక్కుకునే వారట.
ఇప్పుడు కూడా ఆ దేవత కోరుకున్న వాటన్నిటినీ ఇస్తుందనీ మా చుట్టు పక్కలవారి నమ్మకం. సుబ్బారాయుడికి కోర్టు వాజ్యంలో ఆస్థి కలిసొచ్చింది. దాంతో మూలస్తాహ్నం అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి బయల్దేరుతున్నాడన్న మాట.
ఆదిత్య కూడా దీనికి వస్తాడని తెలుసు. అందుకే వెళదామని నిర్ణయించుకున్నాను.
మూల స్థానానికి వెళ్ళాల్సిన రోజు వచ్చింది. ఆ రాత్రి మూడు గంటలకి మా ప్రయాణం మూడు ఎద్దుబళ్ళను కట్టారు. ఓ బండిలో నరకాల్సిన పొట్టేలు, వంట సామగ్రిని పెట్టారు. రెండు, మూడు బళ్ళల్లో సుబ్బారాయుడి బంధువులు ఇరుగూ పొరుగూ ఎక్కారు.
నేను బయలుదేరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. లాంతర్ల వెలుగులో నేను ప్రత్యేకంగా కనిపిస్తున్నాను. కనకాంబరం రంగు కోటాచీర గంజి పెట్టుకొని నీలుగుతున్నట్లుంది. పొందికగా కట్టుకున్నచీరలో నన్ను చూసి ఆదిత్య కళ్ళు మెరవటం నేను గుర్తించాను.
"నువ్వుకూడా మాతో పాటు వస్తున్నావా?' అనడిగాడు ఆదిత్య నా దగ్గరికొచ్చి.
'నీకోసం' అన్నా వినీ-వినపడనట్లు.
'థాంక్యూ'
థాంక్స్ కంటే కూడా పెద్ద విలువయిన నవ్వే నవ్వాను సమాధానంగా.
బండి ఎక్కటానికి ఎదురింట్లోంచి స్టూల్ తెచ్చి వేశాడు. ఎక్కి కూర్చున్నాను.
మా బండిలో సుబ్బారాయుడి భార్యా పిల్లలూ ఎక్కారు. వెనుక బండిలో ఎవరొస్తున్నారో తెలియదు. ఆదిత్య భార్య నీరజ రాకుండా ఉంటే బావుండుననిపించింది. మరి ఆమె వస్తుందో రాదో తెలీడం లేదు.
'నీరజ ఎక్కడా కనబడటం లేదే' సుబ్బారాయుడి పెద్ద కూతుర్ని అడిగాను.
'వదిన రాకూడదు. మూడురోజులు ఇబ్బంది' అని నవ్వింది ఆ పిల్ల.
మూలస్థానం దేవత వున్నట్లనిపించింది నాకు. మనసులోనే ఆమెను ప్రార్దించాను.
మరో అరగంటకు బయలుదేరాయి బళ్ళు.
తప్పెట్లు ఏల పదాలు, ఆడడం అన్నీ ఊరి మొదట్లో ఆగిపోయాయి. బళ్ళు మాత్రం ముందుకు సాగాయి.
రాత్రి పలచబడుతోంది. ఉదయం చొచ్చుకొస్తోంది. నల్లటి ఆకాశం పగుళ్ళు బారుతున్నట్లు అక్కడక్కడా వెలుగుగీతలు కనిపిస్తున్నాయి.
ఉదయం ఏడు గంటలకి మూలస్థానం దగ్గరికి చేరిపోయాం. మగవాళ్ళంతా బలిచ్చే కార్యక్రమంలో మునిగిపోతే స్త్రీలు వంటలో లీనమై పోయారు.
నేనూ, మరికొంతమంది పైపై పనులు చేస్తున్నాం పూలమాలలు అల్లడం, పసుపూ కుంకుమలు కలపడం లాంటి చిన్ని చిన్ని పనులు చేసి పెడుతున్నాను.
అప్పుడప్పుడూ ఆదిత్య నావేపు చూడటం, నేను పెదవి విడీ-విడవనట్లు నవ్వడం జరుగుతూనే వుంది.
మధ్యాహ్నం భోజనాలకి కూర్చున్నాం. ఆదిత్యకి వడ్డించవచ్చు గదా అని నేను సాంబార్ బకెట్ అందుకున్నాను. పరిహాసాలు, ఛలోక్తుల మధ్య అందరి భోజనాలయ్యేటప్పటికి నాలుగు గంటలైంది. మూలస్థానం అమ్మవారి దగ్గర రాత్రి నిద్ర చెయ్యాలి. అది సంకల్పం.
మా తిరుగు ప్రయాణం తెల్లవారుజామున నాలుగు గంటలకి. దాంతో మగాళ్ళలో చాలామంది బావిలో ఈత కొట్టడానికి వెళ్ళారు.
ఆ కోటకి దగ్గరగా చిన్న టౌన్ వుంది. అందులో ఓ టూరింగ్ టాకీస్ వుంది. మగవాళ్ళు వచ్చాక అందరం కలిసి ఫస్ట్ షో సినిమాకెళ్ళాం.
మొదటిసారి రీలు మార్చేటప్పుడు గాలి ఆడుతుందని బయటకొచ్చి నిలబడ్డాను. నన్ను చూసి ఆదిత్య కూడా బయటకొచ్చాడు.
'రాత్రి అందరు నిద్రపోయాక కుడివైపునున్న కోటలోకి వచ్చేయ్. నీతో మాట్లాడాలి' ఇక ఏమీ మాట్లాడడానికి లేనట్లు లోపలికి వెళ్ళిపోయాడు.
తిరిగి సినిమా స్టార్ట్ కావడంతో నేను కూడా లోపలికి వెళ్ళాను.
కాంతారావు సినిమా, మాయలు, మంత్రాలతో యమా థ్రిల్లింగ్ గా వుంది. చాలారోజుల తరువాత మొదటిసారి సినిమాని ఎంజాయ్ చేస్తున్నాను.
సినిమా వదిలాక ఇక అంతా పబ్లిక్ అన్నట్లు ఆదిత్య నా పక్కన నడుస్తూ ఏదేదో మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు చేతిని నా నడుం మడతలకో, భుజానికో, చేతికో తగిలిస్తున్నాడు. నిజానికి ఇలాంటి స్పర్శ ఎంత బావుంటుందో అనుభవించాల్సిందే, తగులుతున్నది కొనవేళ్ళే అయినా హృదయం పౌర్ణమినాటి సముద్రమే అవుతోంది. ముందు ముందు జరిగే మహోత్సవానికి ఇవన్నీ చాటింపు వేస్తారు. ఫలానారోజు జాతర జరుగుతుందని వారం రోజుల ముందు చాటింపు వేస్తారు. ఆ చాటింపు వేయడంతోనే జాతర ఉత్సాహం ప్ర్రారంభమవుతుంది. అలాగన్న మాట.
ఆ చీకట్లో కోరికతో గుండెంతా బరువెక్కిపోయి నడుస్తుంటే, ఎంత అద్భుతంగా వుందో మాటల్లో చెప్పలేను.
శరీరం పులకించిపోవడాన్ని ఏ పదాల్లో చెప్పగలం?
అందరం తిరిగి మూలస్థానం దగ్గరికి చేరుకున్నాం. రోజంతా అలిసిపోవడం వల్ల చెట్టుకింద, అటూ ఇటూ స్త్రీలు, పురుషులూ పడుకున్నారు. మధ్యలో లేచిపోవడానికి సులభంగా వుంటుందని నేను చివర పడుకున్నాను. ఆదిత్య ఎక్కడ పడుకున్నాడో తెలియదు.
ఆకాశంలో సన్నటి చంద్రవంక వెండితీగలా కదులుతోంది. రాత్రి భయాన్ని తగ్గించడానికన్నట్లు గూర్ఖాలాగా తిరుగుతోంది గాలి. అక్కడక్కడా వున్న గుబురు చెట్లు చీకటి కొలనులో జలకాలాడుతున్న వింత జంతువుల్లా కనిపిస్తున్నాయి.
నా ఫస్ట్ నైట్ కూడా అంత అద్భుతంగా ఫీల్ కాలేదు నేను ఒళ్ళంతా సన్నజాజుల పూలదండయి పోయింది. ఏదో కావాలన్న కోరిక క్షణక్షణానికి పెరిగిపోతోంది. ఎరీనాలో ఇద్దరు మల్లయోధులు కుస్తీపడుతున్నట్లు గుండెలు జాకెట్టుకేసి ఒరుసుకుంటున్నాయి. బ్రా ఎలాస్టిక్ ఎప్పుడో సాగిపోయింది ఏదో కావాలన్నంత తొందర కాలాన్ని ముద్దగా పిసికేస్తోంది.
అందుకే టైమ్ జరగడం లేదు.
తీరని తాపంతో అటూ ఇటూ పొర్లుతూంటే ఎద చాపకు గుచ్చుకుపోతూ అదో విధమయిన మాధుర్యాన్ని శరీరానికంతా పంచుతోంది.
చంద్రవంక నడినెత్తి మీద కొచ్చింది.
పక్కకు చూస్తే అందరూ గాఢనిద్రలో వున్నారు.
మెల్లగా పైకి లేచాను.


