Home » Kommuri venugopala rao » Aathma Jyothi

   

       ఒకవేళ కనిపిస్తే ఏం సహాయం ఆర్దిస్తుంది ఆయన్ని? పైగా తనమూలంగా ఆయన్ని కూడా యిబ్బందిలో పెట్టడం? "అయ్యో అనామా! ఇప్పుడేమిటే నీ గతి?" ఆమె కళ్ళల్లో నీళ్ళు నిండుకొచ్చాయి. "అబ్బా! యిదేం జీవితం!!"
    
    చప్పున ఆమె ప్రక్కకు జరిగి నిల్చుంది. గేటు తీసుకుని ఎవరో బయటకు వస్తున్నారు. ఒకవేళ....ఆమె ఆశగా చూస్తోంది. కాదు కాని....ఆమె గుండె ఝల్లుమంది. ఇతను యీ సాయంత్రం ఆయనతోపాటు యింటికి వచ్చిన స్నేహితుడు. కొన్ని రోజులుగా తన యింటిచుట్టూ పడిగాపులు గాస్తోన్న ప్రేమికుడు. ఇంతలో ఆమె మనసులో ఏదో ఆలోచన చటుక్కున మెరిసింది. వెంటనే అవమానంతో కుచించుకుపోతూ "అబ్బ! రాక్షసీ!" కానీ మరుక్షణంలోనే ఆ మనసే యిలా చెప్పింది. "పదవే పద. ఇప్పుడు ఏదో ఒక ఆధారం చూసుకోవాల్సిన తరుణం ఏర్పడింది. జాగుచేసి లాభంలేదు" ఆమె అతన్ని కొద్ది దూరంలో అనుసరించసాగింది.
    
    దాదాపు ఓ ఇరవై నిముషాలు ఆమె అలాగే అతనివెనక నడిచి ఓ ఇంట్లోకి పోతూండటం చూసింది. ఆ ఇల్లు గుర్తుపెట్టుకుని, నిట్టూర్పు విడిచి వెనక్కి తిరిగింది.
    
    కొంతసేపు గడిచాక అనామ తలనిండా ముసుగేసుకుని ఓ పాకముందు నిల్చుని 'లక్ష్మీ, లక్ష్మీ' అని పిలిచింది సన్నని కంఠంతో.
    
    "ఎవరూ?" అంది లోపలనుంచి ఆడగొంతు.
    
    "బయటకు రా లక్ష్మీ" అంది అనామ.
    
    లోపల్నుంచి చిన్న తలుపు తెరుచుకుని ఆమె యింట్లో పనిచేసే దాసీది బయటకొచ్చి, గుర్తుపట్టి "ఇదేమిటమ్మగారూ?" అంది ఆశ్చర్యంగా.
    
    అనామ ముదుగు కొంచెం సరిచేసుకుని "విపత్తు వచ్చిందే లక్ష్మీ ఈ రాత్రి నాకు కాస్త ఆశ్రయమివ్వగలవా?" అన్నది.
    
    దాసీది కళ్ళు పెద్దవి చేసుకుని "అదేమిటమ్మగారూ! అసలేం జరిగింది? ముందు లోపలకు రండి" అన్నది దిగులుపడుతూ.
    
    "ఇంటిలో నీ మొగుడు లేడా?"
    
    "మా వోడికి రాత్రిళ్ళు ఇంట్లో ఉండే అలవాటు లేదండి" అంటూ దాసీది నవ్వి యజమానురాల్ని చెయ్యిపట్టుకుని లోపలకు తీసుకువెళ్ళింది.
    
    పాకలో చాపమీద కూర్చుని, ఆ గ్రుడ్డిదీపం వెల్తురులో తన కథ అంతా చెప్పింది అనామ. దాసీదానికి యజమానురాలి యింట్లోని వ్యవహారమంతా తెలుసు. యజమాని దుష్టస్వభావం దానికి కొత్తగాదు. అంతావిని, నిట్టూర్చి "ఎంత కష్టంవచ్చింది అమ్మగారూ...? ఏమయినా సరే, మళ్ళా ఆ యింటి గుమ్మం తొక్కమాకండి. మీ బ్రతుకు మీరు చూసుకోలేరా?" అంది.
    
    "ఎలాగే?" అంది అనామ ఖేదంగా.
    
    దాసీది ఈ అపురూప సౌందర్యవతి వంక పరిశీలనాదృష్టితో చూసింది.
    
    ఈ వయస్సు, ఈ సౌందర్యం యిలా వట్టిపోవలసిందేనా అని దిగులుపడి తమాషాగా నవ్వింది.
    
    ఆ నవ్వులోని అర్ధం అనామకు బోధపడింది. కలవరపాటును అణచుకుంటూ "నాకో సహాయం చేసి పెట్టగలవా లక్ష్మీ" అంది సిగ్గు విడిచి.
    
    దాసీది తల ఊపింది.
    
    "ఇంక నీముందు దాపరికం ఏముంది? అంతా ఒక దరిద్రస్థితికి వచ్చింది. రోజూ సాయంత్రాలు మన ఇంటివైపు ఓ అబ్బాయి వస్తూండేవాడు గుర్తుందా? ఎర్రగా, బక్కపలుచగా, ఉంగరాల జుత్తూ అదీ. ఒకటి రెండుసార్లు నీకు చూపించానుకూడా. అతని ఇల్లు గుర్తు చెబుతాను. అతన్ని రేపు కలుసుకుని, నా దగ్గరకు తీసుకురావాలి."
    
    దాసీది అంతా గ్రహించింది "ఇక్కడికేనా అమ్మగారూ?" అంది.
    
    "కాదు. ఈ చుట్టుప్రక్కల పాకల్లోనివాళ్ళు నన్ను బ్రతకనివ్వరు. కనకదుర్గ కొండమీదకు తీసుకురా నేను ముందుగానే వెళ్ళి అక్కడ వుంటాను" అని అనామ ముఖం ప్రక్కకి త్రిప్పుకుంది.
    
    "మీరు భయపడకండి నేనంతా ఏర్పాటు చేస్తాగా అమ్మగారూ" అంది దాసీది.
    
    అనామ చాపమీద పడుకుని "నాకు నిద్రవస్తోంది. నన్నిక్కడ చూచి, యిక్కడ మనుషులంతా తెల్లబోరుకదా. అయినా ఎంత కాలంలే! ఒక్కరోజు" అని కళ్ళు మూసుకుంది. మూసుకున్న ఆమె కనురెప్పల మాటునుంచి కన్నీళ్ళు కారసాగాయి.
    
                                                                *    *    *
    
    ఉదయపు వేళలోకూడా కనకదుర్గ కొండకు చాలామంది ప్రజలు వస్తూ వుంటారు. పైన ఓ కోనేరు వుంది. కోనేటి నీళ్ళలో కాళ్ళు కడుక్కుని వచ్చి ఓ మెట్టుమీద నీడగా వున్న చోటు చూచుకుని కూర్చుంది అనామ. కొద్దిగా జనం అటుగా వచ్చి, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఆమె తల వంచుకుని కూర్చుంది. ఇంతలో ఎవరిదో నీడ ఆమెముందు పడింది. ఆ నీడ కదులుతుందేమోనని ఆమె చూడసాగింది. రెండు నిముషాలపాటు నిశ్చలంగా అలా వుండేసరికి 'తలత్రిప్పి' అసహ్యాన్ని దాచుకుంటూ నవ్వింది.
    
    కృష్ణ ఆమె కళ్ళలోకి చూచి, ఏదో గ్రహించడానికి యత్నిస్తూ 'ఇక్కడ మాట్లాడుకోవద్దు. అటు కొండమీదకి పోదాం రా' అన్నాడు.
    
    అనామ లేచి నిల్చుని 'పదండి' అంది.
    
    ఇద్దరూ మెట్లు దిగివచ్చి గుడిప్రక్కగా నడిచి, ఎడమవైపున వున్న కొండ మీదికి కొంతదూరం ఎక్కారు. అనామ ఒకచోట అలిసిపోయిన శరీరంతో కూలబడి, ముంగురుల్ని వెనక్కి తీసుకుంటూ నవ్వింది.
    
    కృష్ణ క్రిందనుంచి చిన్నరాయిని తీసుకుంటూ 'నన్నెందుకు పిలిపించావు?' అనడిగాడు.
    
    "నిన్న మీరిద్దరూ వెళ్ళిపోయాక మాఆయన నన్ను చావగొట్టి యింట్లోంచి బయటకు వెళ్ళగొట్టాడు. పుట్టింటికి పోలేను. నా భర్తకూ నాకూ యిహ ఋణం తీరిపోయింది.....మీరు రోజూ మా యింటికేసి ఎందుకు వచ్చేవారో చెప్పండి?" అంది అనామ.
    
    "నువ్వు ఆడదానివి, నేనో యువకుడ్ని."
    
    అనామ బలవంతాన నవ్వి "మీరు నన్ను ప్రేమించారా?' అనడిగింది.
    
    జీవితంలో భయమెరుగని కృష్ణ ఈ ప్రశ్నవిని కంపితుడైపోయాడు. 'తరువాత చెబుతాలే అన్నాడు.
    
    అనామ చేత్తో రాయిమీద ఏదో గీస్తూ 'నాకు ఎవరున్నారిక ప్రపంచంలో? నేనంటే మీకు చాలా అభిమానం, నన్నెక్కడికైనా లేవదీసుకువెళ్ళండి' అంది.
        
    మరో బాణం, అతను చకితుడై 'నిన్నా? లేవదీసుకుని వెళ్ళనా?' అన్నాడు.
    
    అనామ ముఖం కోపంతో కొంచెం ఎర్రబడింది. అప్పటికప్పుడు 'ఏం? భయమేస్తోందా అప్పుడే? ఇంత పిరికివారు ఓ ఆడదాని వెనుకెందుకు పడాలి? నా భర్తచాటునవుంటే నాతో రహస్యంగా సంబంధం పెట్టుకుందామనుకున్నారా?' అంది వణుకుతున్న గొంతుతో.
    
    "ఓ స్త్రీ చుట్టూ తిరిగినంతమాత్రాన ఆమెను లేవతీసుకుపోవాలని వుందా?" అన్నాడు కృష్ణ.
    
    "అయితే నా చుట్టూ ఊరికే తిరిగారా? నేనంటే ఏమీలేదా?" అన్నది అనామ.
    
    "ఏం? నేనంటే నీకేమైనా వుందా?"
    
    "ఆఁ వుంది....ప్రేమ."
    
    ఈ మాటలోని వెటకారం అతని గుండెల్లో పదిసార్లు ధ్వనించింది. అయినా నిర్లక్ష్యంగా 'నిజంగానా?' అన్నాడు.
    
    "ఎంత చులకన ఆడదంటే? ఓ పరాయి మొగవాడి భార్యగురించి ఏమనుకుంటున్నారు?...అంతా డంబం, పిరికితనం" అంది అనామ కోపంతో వణికిపోతూ.
    
    ఈసారి కృష్ణకి నిజంగా కోపంవచ్చింది. చేతిలోని రాయిని గట్టిగా క్రిందకు కొట్టి 'పిరికితనం అని ఊరికినే నోరు పారేసుకోకు. అదంటే యింతవరకూ అర్ధంకూడా తెలీదు. కనీవినీ ఎరుగని చిక్కులో యిరుక్కున్నాననే నా చింత'.
    
    అనామ పకపకా నవ్వింది 'ఏమిటా చిక్కు? నా విన్నపమా?'
    
    కృష్ణ ఆమెను నిజంగా ప్రేమించాడు. ఆ విషయం ఆమెకు తెలీదు. అందుకని అతన్ని బాధించసాగింది. తన స్థితిని వ్యక్తం చేసుకోలేకపోయాడు. తను మనసారా ప్రేమించిన యువతిని, ఆమె కోరికను మన్నించి ఎక్కడికో తీసుకుపోవటం అతనికి దుస్సాహసమనిపించింది. అతని గతజీవిత చరిత్ర ఆమెకు తెలీదు. తెలిస్తే ఆ సమయంలో పకపకమని నవ్వగలిగి వుండేది కాదు.
    
    ఈసారి మితిమీరిన ఆవేశంతో 'దా! నీకోసం నేనేమైనా చేస్తాను. ఇవాళే ఎటయినా పోదాం' అన్నాడు.
    
    అనామ ముఖం పాలిపోయింది. 'ఏమిటి?' అంది నమ్మకం లేనట్లుగా.
    
    "అదే అడిగావుగా పద, నీతో ప్రపంచంలో ఏమూలకి రమ్మన్నా వస్తాను" అన్నాడు కృష్ణ.
    
    ఒక్కక్షణం....ఒక్కక్షణంమట్టుకు స్తబ్దుగా ఊరుకుంది అనామ. 'పదండి' అంది లేచి నిల్చుని.
    
                                                                   *    *    *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra