Read more!
 Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 4

    10    తోం తోం తాధ,  తోం తోం తద్ధి!!

        (రెండు కాళ్ళతో  రెండుదెబ్బలు  ఒకేసారి  యెగిరి నేలనుతట్టి  కుడిచెయ్యి  కుడికాలు  ప్రక్కకు చాచుట, ముందు కటాముఖములు  హస్తము, చాచినప్పుడు చాచిన చెయ్యి  పద్మకోశము, అదేవిధంగా  రెండవకాలికి కూడా  ఆచరించవలయును.)

    11    తైతాకిట తక తతై హిత్తతో! తాతాకిటతకతతై హిత్తతో !!
   
        (ఇవి  నాల్గురకములు) పొడుపులు. తోతుమంగలు, మున్నగువాటితో, 4x3=12 రకములుగా నున్నవి) అడుగు నెం 1,

    12    తైతాకిటతక తతై హిత్తతో! తాతా కిటతక  తతై  హిత్తతో!!

        (కుడికాలుతో  ఒక ఘాతకొట్టి, ఎడమకాలు ప్రక్కకు కొంచెము  దూరము వేసుకొని. మరల కుడికాలుతో వ్రేళ్ళపైనకొట్టి  అదేవిధంగా  రెండవసారి  చేయవలయును, అట్లే యెడమకాలితో  ఒకదెబ్బకొట్టి  కుడికాలు జరిపి, మరల ఎడమకాలు  కుడికాలివద్దకు చేర్చి అదేవిధంగా  రెండవసారిచేయుట). రెండుచేతులు  పతాకహస్తములు  భుజసమములు  చేయవలయును.)

    13    తై తాకిటతక  తతై హిత్తతో! తాతాకిటతక తతై  హిత్తతో!!

        (పై అడుగువిధముగానే  పాదముతో దెబ్బలు కొట్టుట. చేతులుమాత్రం 
శిఖరహస్తములతో, కుడిప్రక్కకు  బోవునపుడు, కుడిహస్తము, ఎడమకు బోవునపుడు ఎడమ హస్తముతో పోవలయును.)

    14    తై తాకిటతక తతై హిత్తతో! తాతాకిటతక తతై హిత్తతో!!

        (రెండుచేతులు  కటకాముఖములుబట్టి, పై విధముగా  అడుగులు వేయుచు, రెండుచేతులు ఒకేసారి పై కెత్తుట, మరల ఒకేసారి  క్రిందకు దించుట)

    15    తై తాకిట తక తతై హిత్తతో! తాతాకిటతకతతై హిత్తతో!!

        (పైన వ్రాసిన అడుగులు ప్రకారం  అడుగులు వేయుచు  కటకాముఖహస్తముతో ఒకే చెయ్యి పైకెత్తి మరల దించుట.)
        (పై నచెప్పిన విధముగా  అడుగులు  నాల్గురకములకు, తితైతైల అడుగులు తోతుమంగ అడుగులు కూడా జతచేసినచో, 4x3=12 రకములు తై తాకిటతకలు, అడుగులు వచ్చును.)

    16    తాం తత్త దింద _ తత్తదింద! తాం తత్త దింద _ తత్త దింద!!
   
        (ఇవికూడా  నాల్గురకములు, 4x3=12 రకములు.)
        దద్దితైలు, తోతుమంగలు, కలసి 12 రకములు.


    అడుగు నెం. 1
    (హస్తములు కటకాముఖములుబట్టి, ఎగిరి మునివ్రేళ్ళపై  కూర్చుని  ఉసిలో లేచి, కుడికాలు ప్రక్కకు మడమపై నుంచి. కుడిచెయ్యి కూడా కాలికి సూటిగా  చందంశహస్తములో చాచి. ఎడమచెయ్యి చందంశముతో  పైకి ఎత్తి ఉంచుట, అదేవిధంబుగా, రెండవవైపు కూడా ఆచరించవలెను.) దద్దితైలు, తోతుమంగలు కలిపిన 3 రకములు అడుగులు వచ్చును.)

    అడుగు నెం. 2
    (హస్తములు కటకాముఖముబట్టి, ఎగిరి మునివ్రేళ్ళపై కూర్చుని ఉసిలో లేచి కుడికాలు వెనకకు పోనిచ్చి, అదే చెయ్యి పైకెత్తి, మృగశీర్షంగా ఉంచుట,) తోతు మంగలు, దిద్దితైలుతో, 4x3=12 రకములు.

    అడుగు నెం. 3
    (హస్తములు కటకాముఖములు చేసి, ఎగిరి మునివ్రేళ్ళపై  కూర్చుని, ఉసిలో లేచి, ఒకకాలు ప్రక్కకు పొడవుగా చాచుట. మరల ఎగిరి మండిపై కూర్చుని. రెండవకాలు చాచుట. చేతులు, ముందు కటకాముఖములుబట్టి, తదుపరి చందంశములు చేయవలయును.) 4x3-12 రకములు)

    అడుగు నెం. 4
    (హస్తములు కటకాముఖములుచేసి, మండిపై ఎగిరి కూర్చుని, మరల ఉసిలో లేచి రెండుకాళ్ళు ఒకేసారి ఎగిరి  మడమలపై నిలబడవలయును.) 4x3=12 రకములు.
   
    17    దిద్దితై దిద్దితై దిద్దితై దిద్దితై ! దిద్దితై దిద్దితై దిద్దితై దిద్దితై !!
   
        (హస్తములు కటకాముఖములు చేసి  రొమ్ము కెదురుగాబట్టి  కుడికాలుతో మడమదెబ్బ, మరల ఎడమకాలు పాదమంతా  ఒకదెబ్బ, మరల కుడికాలు పాదమంతా  ఒకదెబ్బ చేతులుకూడా, కుడిచెయ్యిది) అన్నప్పుడు చందం హస్తముతో చాచుట_ (దిద్ది) అన్నప్పుడు ఎడమచెయ్యి  కటకాముఖముతో  రొమ్మువద్దనే ఉంచుట (తై) అన్నప్పుడు కుడిచెయ్యి మరల రొమ్మువద్దకు చేర్చి  కటకాముఖములు చేయుట, అదేమాదిరి రెండవ వైపు కూడా  ఆచరించవలయును.)
   
           దిద్దితైలు, (మరివకపద్ధతి)
        (ముందు చెప్పిన రీతిగా అడుగులు వేయుచు, హస్తములు మాత్రం పతాకములు చూపవలయును.)

                    చుట్టడుగులు
    18    తాం తతై తైహిత్త! తాతై హిహిదా !!
       
        (హస్తములు పతాకములు చేసి, కుడికాలు మడమతో  ఒకదెబ్బ, అదే పాదముకు
పూర్తిపాదం దెబ్బ, ఎడమకాలు వ్రేళ్ళపై దెబ్బ, మరల కుడికాలు పూర్తి దెబ్బ, ఈ రకంగా రెండు పాదములతో ఆచరించవలయును) చందంశములతో ఒకటి, అలపద్మహస్తములతో ఒకటి, కటకాముఖములతో  చేతులు వెనుకకు ద్రిప్పుచ్చు ఒకటి. వరుసగా ఆచరించవచ్చును. (4 రకములు.)

                    కత్తెరనాటు వరసలు
    19    తాంతతై ! తై హిత్త ! తాతై హిహిదా!!

        (హస్తములు పద్మకోశంబట్టి  కుడికాలితో ఒక ఘాత, ఎడమకాలు ప్రక్కకు జరిపి ఒక ఘాత. మరల కుడికాలు వ్రేళ్ళపై ఒకదెబ్బ. రెండుకాళ్ళు ఒకదెబ్బ అదేవిధంగా రెండవవైపుకు  కూడా  ఆచరించవలయును) పై విధంగా, ఒకటి పద్మకోశహస్తముతోను, 2) చందంశముపైకి  బట్టుచును, 3) మృగశీర్షహస్తము, ఫాలభాగమున ఉంచియు, 4) కటిప్రదేశమునందు ముష్టిహస్తములుంచి ఆచరించవలెను. (4 రకములు)  

 Previous Page Next Page