Read more!
 Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 3

                                 

                                              ఉద్ఘట్టితపాదలక్షణము, వినియోగము

    పాదాగ్రముచేత  నిలచి, మడమను  ఒకసారి  లేక చాలాసార్లు  భూమిపై తట్టినచో "ఉద్ఘట్టితపాద" మగును. దీనికి (ఒంటి పెట్టడవు) అని పేరుగలదు.

                                     ఏకపాదలక్షణము, వినియోగము

    నాట్య విశేషణాదులయందు  ఒకపాదము నేలపై  మోపి నిలచుట.
   
                                      వినివర్తితము పాదలక్షణము, వినియోగము
        
                అనగా పాదములు మార్చుట
            గతాగతపాదలక్షణము. వినియోగము
                అనగా ముందు వెనకకు  బోవుచు వచ్చుట
             వళితము
                అనగా తిరుగుట
            వైశాఖ మండలము
                అనగా నిరుప్రక్కలకు  తిరుగుట
            త్రిభంగి
    పాత్రరేఖా ప్రమాణముమీద నిలుచునప్పుడు, నడుము, రొమ్ము, శిరస్సు, నివి వంపుగా నిలపుట.
   
            అగ్రగము   
    ఇది మునివ్రేళ్ళ  మోపు  మీదనొక  పాదముకంటే  నొకపాదమును  ముందు ముందుగా వడివడిగా నుంచుట.

            మర్ధితము
    నిది నిలచినచోటనే  పాదముతో తట్టుట.
   
            పార్ష్ణిగము
    నిది మునవ్రేళ్ళు  మోపి, మడమలెత్తియుండి, తిరుగామడమలు  ఆన్చి, మొనవ్రేళ్ళు  యెత్తుట.

            ఘట్టితము
    అనగా మడమలతో తట్టుట.
   
            ఘట్టితోత్సేదము
    అనగా అరికాళ్ళు నేల  తగలకుండా  ముడుచుకొని  మడమలు, కొనవ్రేళ్ళు  భూమిని తట్టుట.
   
            తాడితము   
    అనగా మడమలపై నిలచి, మునిపాదములు పైకెత్తి  ఆ మునపాదములతో భూమిని తట్టుట.

            పార్శ్వగము
    అనగా పాదముల యొక్క  వ్రేలి ప్రక్కలు నేలనాన్చి, లోప్రక్కలు  తగలకుండా  నిల్చి, అలాగే  ముందుకు అడుగులు నుంచుచు, యుండుట.

                                          కూచిపూడి, పాదచలన భేదములు

    1    తాంతతై, తైహిత్త! తాతై హిహిదా !!

        (నడుమును ముష్టిహస్తములుంచి ,కుంగుట, మరల లేచుట, ఆవిధముగా త్రికాలములు చేయవలెను.)

    2    తాంతతైతై హిత్త ! తాతై హిహిదా !!

        (కుడిపాదముతో ఒక ఘాత. (అనగా దెబ్బ) ఎడమపాదము  జరుపుట అట్లు  త్రికాలములు)

    3    తై హిహిదాత్తాం ! తతై తై హి త్తతా !!

        (చేతులతో  పతాకహస్తములు  భుజములకు  సమానముగాబట్టి  కుడికాలి మడమతో ఒక దెబ్బ మరల అదే కాలితో  పాదమంతయు నేలమీద తట్టుట.) ఆ విధముగా రెండవకాలు కూడా, చేయవలయును, చేతుకు కూడా, కుడికాలి  మొదటి  మడమదెబ్బకు  చెయ్యి  వెలికిలవేయుట, రెండవదెబ్బకు  బోర్లవేయుట, అట్లే రెండవకాలు కూడా  చేయవలయును.) (త్రికాలములు)

    4    తాం దిగిదిగి దిగిదిగి దిగిదిగి ! దిగిదిగి దిగిదిగి దిగిదిగి తా!!

        (అగ్రగముపాదముతో, మునివ్రేళ్ళపై  నిలబడి  ఒక కాలి కంటే  మరియొకకాలు మునివ్రేళ్ళతోనే  నేలపై కొట్టుచునడచుట.)

    5    దిగిదిగి దిగిదిగి దిగిదిగి దిగిదిగి !
        దిగిదిగి దిగిదిగి దిగిదిగి తై !!

        (ఘట్టి తపాదముతో  మడమలు నేలపై కాన్చి  వెనకకు బోవుట).

    6    దాకిట కిటతక, కిటకిట తక !
        ఝె కిట కిటతక, కిటకిట తక !!

        (రెండు చేతులతో  పద్మకోశహస్తములు  అభిముఖములుగా బట్టి, వక్షస్థలము దగ్గర వుంచి కుడికాలితో  ఒక ఘాత. మరల మూడు అగ్రగమపాదములు, మరల రెండవకాలితో  ఒక ఘాత రెండవకాలుతో మూడు అగ్రగమపాదములు. (త్రికాలములు) (ప్రతిపాదఘాతపు  ఆ వైపు చెయ్యికూడా  క్రిందకు_వచ్చి మరల యధాస్తానమునకు వెళ్ళుచుండవలెను.)

    7    తోధిమ్మి తోధిమ్మి ! తా తదీంతక్క !!

        (హంసాశ్యములు  భుజముల  సమానంగా వుంచి  కుడికాలితో  మునివ్రేళ్ళపై ఒక ఝాత. మరల ఆ కాలికే పాదమంతయు  ఒక ఘాత, ఆవిధముగా  రెండవకాలు కూడా  ఆచరించవలయును.) చేతులు హంసాశ్యములు  గావించి. "చలమణి" బంధములు"గా  వించుచుండవలెను.)

    8    తోదిమ్మి తోధిమ్మి ! తా తదీంతక్క !!

        (మృగశీర్షహస్తము  ముఖమువద్ద నుంచి, అగ్రగము, ఘట్టితములు, వరుసగా  ఆచరించవలయును.)
   
    9    తోధిమ్మి తోధిమ్మి ! తా తదీంతక్క !!

        (రెండు చేతులతో  కాటకాముఖములుబట్టి. కుడిప్రక్కకు దుమికి మరల యెడమ ప్రక్కకు దుముకుట, పాదములు  మునివ్రేళ్ళపై  నుంచుచుండవలయును, చేతులు చాచినపుడు పద్మకోశహస్తము  వినియోగించవలెను)

 Previous Page Next Page