"రాధమ్మ పడిపోయింది.అమ్మ తవర్ని ఆడున్నట్టు రమ్మన్నది బాంచను-" అన్నాడు.
"రాధిక పడిపోయిందా-" శ్వేత చేయి వదిలిపెట్టి పరుగుపెట్టాడు సిద్దార్ధ
" నేనూ వస్తాను."
" నో.... ఇది సమయంకాదు-" అన్నాడు .ఆమె అతడినే చూస్తూ నిలబడిపోయింది.
8
ఊరంతా అట్టుడికినట్టు ఉడుకుతుంది. రాములు ఉరిపోసుకుని చనిపోయాడట. అతనికి అంత పెద్ద కష్టాలు లేవు.
రాధిక ఇంకా నిదుర మత్తులోనే వుంది. రాత్రి వున్నట్టుండి, ఫిట్ లా వచ్చి అరుస్తుంది. అదేమిటో అర్ధంకాలేదు.
రాత్రంతా సిద్ధార్ధ తల్లితోపాటు చెల్లెలి గదిలోనే వున్నాడు. తెల్లవారుజామున కునుకు పట్టింది.
బయట పనిమనిషి తల్లిమాటలు గోలగా వినిపించాయి.అంతే ఒక్కగంటలో లేచాడు.
!అమ్మా!-ఏమిటి?"
"రాములు-అదేరా ఒకప్పుడు మీ నాన్న గారి దగ్గర వసూళ్ళకు వుండేవాడు. త్రాగుబోతేకాని యెవరి జోలికి వెళ్ళేవాడు కాదు. ఏమొచ్చిందో!ఉరి పోసుకుని చచ్చిపోయాడట."
"అం-" అతని నవనాడులు కృంగిపోయాయి.
" ఏమన్నావు-ఏమిటమ్మా!"
" అదేరా- అతను ఉరిపోసుకు చనిపోయాడట."
అతను చనిపోలేదు.చంపబడ్డాడని తెలుసు. యెంత మందిలా చనిపోతారు... కాదు చంపబడతారు.
రాత్రి వేసుకున్న పైజామా లుంచుకునే వీధిలోకి వచ్చేశాడు.
" బాబూ!"
" వస్తానమ్మా...."
అతను వచ్చేవరకే రాములి శవాన్ని వాకిట్లో పడుకెబెట్టారు. అతని భార్య గుండెలు బాదుకుని ఏడుస్తుంది.
"రాత్రి సంతోషంగా ఉన్నాడు..." యెవరో అన్నారు.
" అవునయ్యా!" రొయ్యలు తెచ్చి వండించుకున్నాడు- నాదేవుడో నన్నెందుకు మాయచేసినవు తండ్రో..." అతని భార్య శోకాలు తీస్తుంది.
సిద్దార్ధ గాంఢంగా నిట్టూర్చాడు.
శ్రీనివాస్ ను హత్య చేసారు. అది రాములు చూచాడు..... లేదా ఇంకా వివరాలు తెలుసు.అందుకే రాముల్ని చంపారు. రాములు ఉరిపోసుకోలేదు.
అతను దారిలో హాస్పత్రి పేరు కనిపించగానే లోపలికి వెళ్ళాడు. అక్కడ రుద్రయ్య శవంలా పడి ఉన్నాడు.
బాలరాజు మాత్రం యెటో చూస్తూ కూర్చున్నాడు.
"బాలూ!"
"రారా సిద్ధూ!" అన్నాడు.
సిద్దార్ధ స్టూల్ లాక్కుని కుర్చున్నాడు.
అప్పుడే అర్జున్ టీ తీసుకుని వచ్చాడు.
" నాన్న దినానికి ఉండటం లేదని అమ్మ ఏడుస్తుందిరా." అన్నాడు అర్జున్.
"ఉండక ఎక్కడికి వెళ్తాడు." సిద్దార్ధ ఆశ్చర్యంగా అడిగాడు.
" సిద్దూ! న నా ఆశయం నీకు మూర్ఖంగా ,పిచ్చిగా కనిపించవచ్చు గాని నాకు గొప్ప మంత్రగాడిని కావాలని ఉం రా. అందుకే రేపు కేరళ వెళ్దాం అనుకుంటున్నాను. " అన్నాడు బాలరాజు.
"బాలూ!"
" అంత ఆశ్చర్యం దేనికి.?"
" ఆశ్చర్యం కాదురా. చదువుకున్న మనకు ఈ ఖర్మ ఏమిటని!"
"నువ్వు ఏమయినా అనుకో. నేను సాధించి తీరుతాను. ఈ డబ్బు గలవారంతా నా చుట్టూ తిరగాలి."
" రాములు చనిపోయాడు తెలుసా!"
" అందరం ఒకనాడు చనిపోయే వారమే."
"కాని అతను దారుణంగా హత్య చేయబడ్డాడు."


