Home » Mainanpati bhaskar » Yama Dootha


    
    రైలులో నకిలీ పోలీసుల బారినుండి దినకర్ సాయంతో తప్పించుకుని తన వజ్రాలు దక్కించుకున్న వైశాలి మెకానిక్ దగ్గరికి వెళ్ళింది.    
    
    ఖరీదైన రోసీ అండ్ మార్టినీ బాటిల్ చేతిలో పట్టుకుని ఉన్నాడు మెకానిక్. అతని మొహం మద్యం ఎఫెక్టు వల్ల ఎర్రబడి వుంది. అతని పక్కనే టీపాయ్ మీద రివాల్వర్ పెట్టి వుంది.
    
    అడుగుల చప్పుడు విని తల ఎత్తి చూశాడు మెకానిక్. వైశాలిని చూడగానే అతని మొహంలో నవ్వు కనబడింది.
    
    "డ్రింక్?" అన్నాడు గ్లాసు ఒకటి అందుకుంటూ ఆమె మద్యం ముట్టదని అతనికి బాగా తెలుసు. అయినా అలా కవ్విస్తున్నట్టు మాట్లాడటం అతని తత్వం.
    
    అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అంది వైశాలి.
    
    "మీరు చెప్పిన పని పూర్తి చేశాను"
    
    "ఏ పని? రత్నగిరి రాజా వజ్రాలు దొంగిలించే పనేనా? నువ్వా పనిని విజయవంతంగా పూర్తి చేసుకొస్తావని నాకు తెలుసు. నువ్వు పూనుకున్న తర్వాత మరోలా ఎలా అవుతుందీ?"
    
    "నేను మిసెస్ కపూర్ ని మోసం చేసి ఆ వజ్రాలని ఎత్తుకొచ్చాను. ఆ టైంలో బర్ గ్లర్ అలారం మోగింది. సెక్యూరిటీవాళ్ళు పరుగెత్తుకు వచ్చారు. మొహానికంతా దట్టంగా ఫేషియల్ ప్యాక్ పట్టించి మిసెస్ కపూర్ దే నైట్ గవున్ వేసుకుని వున్న నన్ను చూసి వాళ్ళు మిసెస్ కపూరే అని భ్రాంతిపడ్డారు.
    
    కానీ నా ఉద్దేశ్యంలో ఆ సెక్యూరిటీ వాళ్ళలో ఒకడు మాత్రం నేను మిసెస్ కపూర్ ని కాననీ, వజ్రాలు దొంగిలించడానికి వచ్చిన మనిషిననీ కనిపెట్టేసి వుండవచ్చు. కానీ వాడు అప్పటికి తెలివిగా నోర్మూసుకుని వుండిపోయి, నేను వజ్రాలతో సహా రైలెక్కేశాక తన మనుషులు కొంతమందితో సహా పోలీసు వేషాలు వేసుకుని వెంటబడి బెదిరించాడు" అంది.
    
    నకిలీ పోలీసులు తనని బెదిరిస్తున్నప్పుడు ఆ కంగారులో స్ఫురించలేదుగానీ, ఇప్పుడు నిదానంగా ఆలోచిస్తుంటే అనిపిస్తోంది.
    
    ఆ ఇన్ స్పెక్టర్ వేషంలో వున్నవాడు ఆ సెక్యూరితీ గార్డ్సులో ఒకడని! అందులో సందేహం లేదు!
    
    "కాని నువ్వు దొంగలకి దొంగవి! నిన్ను మోసగించడం ఎవరి తరం?" అన్నాడు మెకానిక్, 'దొంగ' అన్న పదాన్ని కావాలని నొక్కి పలుకుతూ.
    
    తనని మించిన దొంగలాంటి ఇంకో యువకుడు రైల్లో తనకు తారసపడి తనని రక్షించాడనీ, వజ్రాలని దక్కించాడని మెకానిక్ తో చెప్పలేదు వైశాలి. కటువుగా అంది మెకానిక్ తో.
    
    "అవును నేను దొంగనే! కానీ మర్యాదగా బతుకుతున్న నన్ను దొంగగా మార్చింది ఎవరు?"
    
    నవ్వాడు మెకానిక్.
    
    అతని నవ్వు చూస్తే ఒంటికి కారం రాసినట్లు మండిపోయింది వైశాలికి.
    
    "మిస్టర్ మెకానిక్! ఆ రోజు చదరంగం ఆటలో నిన్ను ఫూల్ ని చేశానని నామీద కచ్చ పెట్టుకున్నావు నువ్వు! అప్పటినుంచి నా వెనుకబడ్డావ్! నా జీవితం నాశనం చేసెయ్యడానికి కంకణం కట్టుకున్నావ్. బ్రహ్మ ప్రయత్నం చేసి మహాజన్ దగ్గర పెద్ద ఉద్యోగంలో చేరాను నేను. అతని బిజినెస్ ఎంఫైర్ లో ఎంతో వృద్దిలోకి రావచ్చని ఆశలు పెట్టుకున్నాను. నేను బాగా పైకి వచ్చి నాతమ్మున్ని పెద్ద పెద్ద చదువులు చదివించాలని ఆశలు పెట్టుకున్నాను. 'చదువులకి అంతం ఏమిటో నేను చూసేశానక్కా!' అని విక్కీ చెప్పగలిగే వరకూ వాణ్ణి చదివించాలనుకున్నాను. అమ్మా నాన్నా లేని విక్కీని అమ్మా నాన్నా కూడా నేనే అయి కంటికి రెప్పలా కాపాడుకుందామనుకున్నాను.
    
    కానీ నువ్వు శనిగ్రహంలాగా దాపరించావు నా బ్రతుక్కి! ఏవేవో దొంగ సాక్ష్యాలు సృష్టించీ, ఉత్తరాలు, ఫోటోలు నా రూంలో పెట్టి, నా అకౌంటులో నాకు తెలియకుండా లక్షలకి లక్షలు రకరకాల పేర్లతో డిపాజిట్లు చేసి, మహాజన్ కి నా మీద అనుమానం కలిగించావు. నా పొజిషన్ ని పాడు చేశావు."
    
    చిన్నగా నవ్వి అన్నాడు మెకానిక్.
    
    "నువ్వు చెబుతున్న వేవీ అబద్దాలని నేను బుకాయించను! కానీ నేను చేసిన మేలు గురించి ఒక్క ముక్క కూడా నువ్వు చెప్పకపోతే నాకు బాధగా వుండదూ?"
    
    "నీ బతుక్కి నువ్వు ఇంకోళ్ళకి సాయం చెయ్యడం కూడానా?" అంది వైశాలి హేళనగా.
    
    అది పట్టించుకోకుండా అన్నాడు మెకానిక్.
    
    "ఆ రోజు మహాజన్ నీతో ఏమన్నాడు? "వైశాలీ బాగా డ్రెస్ చేసుకుని రా! మన గెస్ట్ హవుస్ లో పార్టీ వుంది. ఆ పార్టీలో నీ ప్రమోషన్ గురించి అనౌన్స్ మెంట్ చేస్తాను" అన్నాడు. కానీ అతని ఉద్దేశ్యం వేరు. నీమీద అతనికి అప్పటికే పూర్తిగా అపనమ్మకం ఏర్పడిపోయింది. తనని మోసం చేసినందుకు ప్రతీకరంగా నిన్ను గెస్ట్ హవుస్ లో అనుభవించి, తర్వాత చంపేయదలుచుకున్నాడు మహాజన్. నీకు ఆ సంగతి తెలియక ఉత్సాహంగా వెళ్ళిపోతుంటే వెళ్ళవద్దని హెచ్చరించి నీ ప్రాణాలు కాపాడింది నేను కాదూ?"
    
    "నీ గ్రిప్ లో చిక్కుకుని, ఇలా నువ్వు ఆడించినట్లు ఆడుతూ నువ్వు చెయ్యమన్న దొంగతనాలన్నీ చేయడం కంటే చనిపోవడం ఎంతో మేలు! నా తమ్ముడు విక్కీని కూడా నువ్వు కిడ్నాప్ చేసుకురాకుండా వుంటే నా తమ్ముడు నీ అధీనంలో గనుక లేకపోతే, ఎప్పుడో నిశ్చింతగా నా ప్రాణాలు నా చేతులతోనే తీసేసుకునేదాన్ని" అంది వైశాలి స్థిరంగా.
    
    చిరునవ్వుతో ఆమె మాటలు వింటున్నాడు మెకానిక్.
    
    మళ్ళీ అన్నది వైశాలి.
    
    "నువ్వు మొన్న ఏం చెప్పావు? మిసెస్ కపూర్ ని గనుక మోసం చేసి వజ్రాలు ఎత్తుకొచ్చెయ్యగలిగితే ఇంక నన్ను, నా తమ్ముడినీ వదిలేస్తానని చెప్పలేదూ? నాకు అప్పగించే పనుల్లో ఇదే చివరిదని చెప్పలేదూ? ఇవిగో ఆ పాపిష్టి వజ్రాలు! నీకు చేతులు జోడించి నమస్కరిస్తాను. ఇక నన్ను, నా తమ్ముణ్ణి వదిలెయ్!"
    
    "అదెంతపని!" అని కాలింగ్ బజర్ నొక్కాడు మెకానిక్.
    
    క్షణాల్లో ప్రత్యక్షమయ్యాడు ఒక వ్యక్తి.
    
    "వెళ్ళి ఆ కుర్రాణ్ణి తీసుకురా!" అన్నాడు మెకానిక్.
    
    నమస్కరించి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి.
    
    మరునిమిషంలో బయట కారు కదిలిన శబ్దం అయింది.
    
    అప్పుడు కోర్కెతో వైశాలివైపు చూశాడు మెకానిక్.
    
    ఏం అందం! ఎంత అందం?
    
    కానీ ఏం లాభం!
    
    ఈ ప్రపంచంలో తనకి లొంగకుండా మొరాయిస్తున్న ఏకైక స్త్రీ ఈ వైశాలి!
    
    కానీ అతనికి తెలుసు!
    
    ఏదో ఒక రోజున ఈ వైశాలి కూడా తన కౌగిట్లోకి రాక తప్పదని!
    
    ఇవాళ కాకపోతే రేపు!
    
    అంతేగాని అసలు లొంగకపోవడం అన్నది లేదు.
    
    నెవర్! నెవర్!
    
    అది తనకి బాగా తెలుసు!
    
    నాలుగు నిమిషాలు గడవకముందే పోర్టికోలో కారు ఆగిన శబ్దం వినబడింది.
    
    మరునిమిషంలో వైశాలి తమ్ముడు విక్కీని తీసుకుని గదిలోకి అడుగు పెట్టాడు ఒకతను.
    
    చాలా రోజుల తర్వాత తమ్ముడిని చూడగానే ప్రాణం లేచివచ్చి నట్లయింది. అభిమానం ముంచుకొచ్చేస్తుండగా ఒక్క పరుగులో తమ్ముడి దగ్గరకు వెళ్ళిపోయి, "తమ్ముడూ! విక్కీ! నా విక్కీ!" అంది రుద్దమైపోతున్న గొంతుతో ఆమె కళ్ళలో నీటిపొర ఏర్పడింది.
    
    విక్కీ అంటే తనకి పంచప్రాణాలు! నిజం!
    
    ఆమె తన దగ్గరకి వస్తుంటే, ఒక్క అడుగు వెనక్కి వేశాడు విక్కీ అతని కళ్ళలో కన్ ఫ్యూజన్ కనబడుతోంది.
    
    ఇంకో అడుగు ముందుకు వేసింది వైశాలి. "తమ్ముడూ విక్కీ!" అంది.
    
    ఇంకాస్త వెనక్కి జరిగాడు విక్కీ జరిగి ఆమె వైపు భయంగా చూస్తూ అన్నాడు "నువ్వెవరో నాకు తెలియదు! న్నెఉ నీతమ్మున్ని కాదు"
    
    అతని మాటలు చెవిన బడగానే నిశ్చేష్టురాలయిపోయింది వైశాలి.
    
                                                                 * * *
    
    ఎవరో నెమ్మదిగా కిటికీలోనుంచి గదిలోకి దిగినట్లు అనిపిస్తే కళ్ళు తెరిచి చూసింది నిశాంత.
    
    కిటికీ దగ్గర నిలబడి ఉంది ఒక ఆకారం!
    
    కటిక చీకటిలో కూడా ఆ ఆకారాన్ని తక్షణం గుర్తుపట్టగలదు తను.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra