Read more!
 Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 3

 

    "మరోసారిలా డౌట్స్ అడిగి చివర 'ఎందుకంటావ్?" అని క్వచ్చనేస్తే హుస్సేన్ సాగర్ లో బుద్దవిగ్రహం పక్కన పెడతా" అన్నాడు వళ్ళు మండి శ్రీచంద్ర.


    "ఎందుకంటావ్?" అని అడగబోయి కామ్ అయిపోయాడు సత్తిపండు.


    "డిగ్రీ.....అతికష్టమ్మిద పాసయిన సత్తిపండుకు ఉద్యోగం దొరకలేదు గానీ, స్టయిల్ మాత్రం వీర లెవల్లో వచ్చి భుతద్దాల్లాంటి కళ్ళజోడు పెట్టుకునే స్థాయికి వచ్చింది.


    ఏ ఉద్యోగం చేయాలో తెలియని స్థితిలో శ్రీచంద్ర పరిచయమయ్యాడు. శ్రీచంద్ర ఫ్రేండ్లి నేచర్ చూసి ముగ్ధుడై అతనితో పాటు తిరగడం మొదలుపెట్టాడు ఎవర్ని ఎలా టాకిల్ చేయాలో శ్రీచంద్రకు బాగా తెలుసు.

 

                                                            * * *


     టాంక్ బండ్ రెయిలింగ్ ని అనుకుని నిలబడి ఉన్నాడు శ్రీచంద్ర. అతని పక్కనే సత్తిపండు.


    "ఓరే సత్తిపండు......" ఏదో ఆలోచిస్తూ పిలిచాడు శ్రీచంద్ర.


    "ఏంటి గురూ."


    "ఇవ్వాళ మన కార్యక్రమం ఏంటి?"


    "పొద్దున్నే రెండు బేవార్స్ ఆఫీసులకు వెళ్లాం. పని లేదన్నారు. ఇప్పుడు ఏం చేయాలో నువ్వు సెలవివ్వాల్సిందే."


    "పని మనకు దొరికనప్పుడు మనమే పని దగ్గరికి వెళ్ళాలి అని మహానుభావుడు స్వామి శ్రీచంద్ర అన్నాడు" తన్మయత్వంగా చెప్పాడు శ్రీచంద్ర.


    "నాకు తెలియని ఆ స్వామి శ్రీచంద్ర ఎవరు గురూ?" కుతూహలంగా అడిగాడు సత్తిపండు.


    "మనమే.....అంతే నేనే. పేరుకు ముందు వెరయిటిగా ఉంటుందని 'స్వామి' అని తగిలించుకున్నాను. ఇలాంటి జీవిత సత్యాలు నేను గాక ఇంకెవరు ఇలా విడమర్చి చెబుతారు" తన వీపు తనే చరుచుకుంటూ అన్నాడు శ్రీచంద్ర.


    రెండు చేతులు జోడించి అడిగాడు సత్తిపండు.


    "గురూ! నీ మెదడు మ్యూజియంలో పెడితే ఎలాగుంటుందంటావ్?"


    "ఇందాకే 'ఎందుకంటావ్?' అనోద్దన్నానని ఎలాగుంటుందని" మొదలెట్టావా?" సీరియస్ గా లుక్కేసి అన్నాడు శ్రీచంద్ర.


     "అది కాదు గురూ......నికిలాంటి సూక్తులు, ఆలోచనలు ఎలా వస్తాయంటావ్?" మళ్ళీ అమాయకంగా అడిగి శ్రీచంద్ర మొహం వైపు చూసి టక్కున నోరుమూసాడు.


    అప్పుడె ఓ విదేశీ జంట టాక్సీ దిగి వీళ్ళు నిలబడిన రెయిలింగ్ దగ్గరికి వచ్చారు.


    "వాటిజ్ దట్ స్టాట్యూ" ఇంగ్లీషులో ఆ లేడి భర్తని అడిగింది బుద్ద విగ్రహాన్ని చూపిస్తూ.


    "ఐ డోంట్ నో డాళింగ్" చెప్పాడతను.


    "ఇఫ్ ఏ కెన్ గెట్ ఎ గైడ్, ఇట్ ఉడ్ బి నైస్" అంటోందావిడ.


    "యస్.....యస్....బట్.....హౌ కెన్ వుయ్ ఫైండ్ హిమ్?" చుట్టూ చూస్తూ అన్నడామే భర్త.


    వాళ్ల మాటలు శ్రీచంద్ర చెవులకు చేరాయి.


    "సత్తిపండు....ఈరోజు మనకు ఫుడ్డు ప్రాబ్లం లేదు!" అన్నాడు ఆ ఇంగ్లీషు జంట వైపు చూస్తూ.


    "అదేంటి గురూ......ఆ జంటను చూస్తే మన ఆకలి ఎగిరిపోతుందా?" అమాయకంగా అడిగాడు.


    "ఒరే పండు.....ప్చ్..... ని మెదడు మోకాలిలో కూడా లేదు."


    "అవునా గురూ.....పోనీ మా ఇంట్లో వుందేమో వేదికేదా?" నెత్తిమీద ఠమని చరచి.....


    "ఈ ప్రపంచం మొత్తం మీదా ఎక్కడా లేదు కానీ ఆ జంటని చూశావా? ఎంతలా ముద్దోస్తున్నారో?"


    "ఆ ఇంగ్లిషామే బొద్దుగా బాగానే వుంది గానీ ఆవిడ మొగుడే గడ్డంతో


    ఆ ఇంగ్లిషు జంట వైపు చూస్తూ అసహ్యంగా ఉన్నాడు. నాకైతే ఆ ఇంగ్లిషాయన పెళ్ళాన్ని చూస్తే ఓసారి కిస్ చేయాలనిపిస్తోంది"


    "ఛా.....నిజమా.....వెళ్ళు......ఓ కిస్సిచ్చుకో" వళ్లు మండి అన్నాడు శ్రీచంద్ర.


    "కొట్టదా గురూ?" డౌట్ గా అడిగాడు సత్తిపండు.


    "ఉహూ.....వెంటనే నిన్ను హోటల్ కు లెక్కేళ్ళీ రాత్రంతా రేప్ చేసి రేపోద్దున్నే వదిలేస్తుంది" కసిగా అన్నాడు.


    "ఛ.....ఉత్తినే అన్నాను గురూ......" సత్తిపండు అన్నాడు.


    "కదా......ఇప్పుడు బుద్దోచ్చిండా? చూడు వాళ్ళకి ఈ సిటి కొత్త. ఈ టాంక్ బండ్ ని చూసి మురిసిపోతున్నారు. వాళ్ళకు నాలుగు ఫోటోలు తీసి టాంక్ బండ్ డిటెయిల్స్ చెప్పమంటే వీరలెవల్లో పొంగిపోయి డాలర్లు ఇస్తారు."


    "మనకు తెలిస్తేగా గురూ చెప్పడానికి?" అమాయకంగా అడిగాడు సత్తిపండు.


    "అదే మరి.....మనకు తెలీదని వాళ్ళుకు తెలిస్తేగా" అంటూ వాళ్ళ దగ్గరకు వెళ్లి "మే ఐ హెల్ప్ యూ" అని అడిగాడు.


    వాళ్లు ఆ మాత్రానికే పొంగిపోయారు.


    "మాకు గైడ్ దొరక్క ఇబ్బంది పడుతున్నాం. మీరు హెల్ప్ చేస్తే ఋణం ఉంచుకోం" అన్నాడతను ఇంగ్లీషులో.


    "తప్పకుండా......" అని బుద్దుడి విగ్రహం వైపు చూపించి " అతడు బుద్దుడు" అన్నాడు స్కూల్లో మాస్టారు పిల్లలకు పాఠాలు చెప్పినట్లు.


    "అలాగా......మరి నీళ్ళ ,మధ్యలో ఎందుకుంచారు?" అని అడిగింది ఆ లేడి టూరిస్ట్.


    "దొంగలు ఎత్తుకెళ్ళకుండా" టక్కున అన్నాడు సత్తిపండు.


    శ్రీచంద్ర కోపంగా చూశాడు సత్తిపండు వైపు. వాళ్ళు అనుమానంగా శ్రీచంద్ర వైపు చూసి "ఈత కొడుతూ వచ్చి ఎత్తికేల్లోచ్చుగా, నిజంగా దొంగలు ఎత్తుకేల్తాతారనే అక్కడనే పెట్టారా?" అనుమానంగా అడిగాడు గడ్డపాయన.


    జుట్టు పిక్కోవాలనిపించింది శ్రీచంద్రకు. అనవసరంగా తనని ఇరుకులో పెట్టిన సత్తిపండు వైపు కోపంగా చూశాడు.


    సత్తిపండు మెల్లగా అక్కడనుంచి తప్పుకొని ఓ సిమెంట్ బెంచి మిద సెటిలయ్యాడు.


    ఓ వెర్రి నవ్వు పులుముకుని శ్రీచంద్ర ఆ టూరిస్ట్ జంట వైపు తిరిగి బుద్దుడి టాపిక్ డైవర్ట్ చేస్తూ......


    "ఆ నీళ్ళు చూశారా?" అని అడిగాడు.


    "చూశాం. కంపు కొడుతున్నాయి. హారిబుల్.......అన్నారు ముక్కు మూసుకుంటూ ఆ జంట.


    "తప్పు.....అలా అనకూడదు. ఆ బుద్దుడికి కోపం వస్తుంది. ఆ నీళ్ళు చాలా పవిత్రమైనవి. ఆ నీళ్ళు తాగితే అన్ని జబ్బులూ పోతాయి." నోటికొచ్చిన అబద్దం చెప్పేశాడు శ్రీచంద్ర.


    "ఈజిట్.....నిజమా? ఆ నీళ్ళకు అంత శక్తి వుందా? ఆ నీళ్ళు ఎక్కడ్నుంచి వస్తాయి. " అడిగాడు ఆవిడ భర్త.


    "తెలుగు గంగ. అని హిమాలయాల్లో వుందిలే. అక్కడనుంచి ఇక్కడికి వస్తాయి." తన తెలివితేటలకు తనే మురిసిపోయి చెప్పాడు

 Previous Page Next Page