Home » Bollimuntha nageswara rao » లేటెస్ట్ లవ్ �

అంబరీషుడి భవంతి!
ఆయన భార్య రుక్మిణి మెల్లగాలేచింది. అప్పటికే ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది.
తనకు కోటిరూపాయలు కావాలి.
అది ఒక చిలుక పీక నొక్కటంవలన జరిగితే...అది కొంత నష్టానికి దారితీస్తే...అదేమంత పరిగణలోకి తీసుకోతగ్గదికాదు.
ఆమ్లేటు కావాలంటే కోడిగుడ్డు పగులకొట్టాలి.
ఒక మంచి జరగాలంటే ఒక అలజడి తప్పదు.
ఆమె అనుకుంటూ పంజరం దగ్గరకొచ్చింది. చిలుక అలాగే వుంది. ప్రానంలేకపోయినా సహజంగా, అందంగా వుంది. టెక్నికల్ చిలుక. ఇది ఏ సంఘటనలకు దారితీస్తుందో....
కోటిరూపాయల అవుసరం తనకుందిగనుక-ఈ చర్యతో తనను ఎవరూ ఫూల్ చేయటంలేదు కదా?!
ఆమె ఆ ఆలోచనతో క్షణకాలం అలా ఆగిపోయింది. తరువాత అయితే అయిందనుకుని....
మెల్లిగా పంజరం తలుపు తెరిచింది.
చిలుకను మెల్లిగా బయటకు తీసింది.
చేతికి మెత్తగా వుంది. లోపల కఠినంగా వుంటుంది. దీని కంఠం ఖరీదు కోటిరూపాయలు.
దీని పీక నొక్కితే కోటిరూపాయలు...
ఎంత విచిత్రం!?
రుక్మిణి తన చేతివ్రేళ్ళను మెల్లిగా దాని మెడ దగ్గరకు తీసుకుపోయింది. అక్కడ మెల్లగా తడిమింది. లోపల ఏదో బటన్స్ లాంటి పరికరాలు....దాని మెడ పట్టుకున్న చేతి రెండువ్రేళ్ళకూ తగిలాయి.
వీటిని నొక్కిన క్షణం...ఇది బాంబులా పేలి, తను చనిపోవటం జరిగితే....
రుక్మిణికి కొద్దిగా భయం పట్టుకుంది.
తరువాత ఒక తెగింపుకు చేరింది.
అయినా తన బ్రతుక్కి ఏమంత విలువ వుందిగనుక తను బ్రతకాలి. దీని పీక నొక్కటంవలన కోటిరూపాయలు చేతికి రావటంకాక.....అనుకున్న విధంగా యిది పేలి చనిపోవటమే జరిగితే....
అదే మంచిది.
తనంటే భర్తకూ విసుగు వచ్చింది.
మాస్టారుకు అడిగిన మనీ ఇవ్వలేని అసహాయత తనను రోజుకో విధంగా ముందు ముందు చంపుతుంది. ఆయన్ను జీవచ్చవంలా చూడాలి.
ఆ తరువాత రుక్మిణి ఏమాత్రం ఆలస్యం చేయలేదు.
చిలుక గొంతును గట్టిగా నొక్కింది.
అంతే....
చిలుక నోరు తెరిచింది. అది నోరు తెరిచిన క్షణాలకు...సరిగ్గా అక్కడ....
                       *    *    *    *
పావన్ని గట్టిగా చేతుల్లోకి తీసుకున్న అంబరీషుడు.
ఎవరో లాగి తన్నినట్టు.....
ఎగిరి-అంత ఎత్తుకులేచి దభీమని అరుచుకుంటూ క్రిందపడ్డాడు.
అతని శరీరంలోని గుండె....బ్లాస్టయి, అతని నోటిలోంచి, ముక్కుల్లోంచి నెత్తురు బయటకువచ్చింది.
ఈ అనూహ్యమైన పరిణామానికి పావని ఆనందపడి-మరోసారి నేలకు కప్పలా అతుక్కుపోయిన అంబరీషుడ్ని చూసింది.
"ఇడియట్ కు ఏమయింది? ఏదో ఒక అదృశ్యశక్తి తనను రక్షించినట్టు ఎగిరిపడి ఇలా నేలకు చచ్చి అతుక్కుపోయాడేమిటి?! వీడి చావుకు తనే కారణమని....బయటవున్న వీడి గూండాలు ఈ క్షణంలో తనను చంపకుండా వదిలిపెట్టరు. తను ఈ భవంతి నుండి బయటపడాలి" అనుకుంటూ ఆమె భవంతి వెనుకవైపు తలుపు తెరిచింది. అన్నీచెట్లు, మసక మసక వెలుతురు.
ఆకాశంనిండా నల్లటి మబ్బులు.
వర్షం మొదలయ్యే సూచనలు...చల్లటిగాలిలో డ్రిజిలింగ్ లా నీటి బిందువులు!!
అలాగే కాసేపు భయంగా నిలబడింది.
బయట ఎత్తైన ప్రహరీ. ప్రహరీనానుకుని, ఎక్కటానికి అనువుగా కొమ్మల్ని మొదలునుండే విస్తరించిన ఓ చెట్టు-
ఆమె మరలా లోపలికొచ్చి చూసింది.
అంబరీషుడు అలాగే నేలమీద పడివున్నాడు. నెత్తురు తెల్లటి పాలరాతి గచ్చుమీద ఎర్రటి మృత్యునాలికలా ముందుకు సాగుతుంది. పావనికి మరింత భయం పట్టుకుంది. తను సాధ్యమయినంత త్వరగా ఈ భవంతి నుండి బయటపడాలి.
బయట వర్షం మరింతగా హెచ్చింది.
ఆమె గబగబా నడుచుకుంటూ ప్రహరీ దగ్గరున్న చెట్టు దగ్గరకు వెళ్ళింది. కట్టుకున్న కొకను పైకిలాగి బొడ్డులో సర్దుకుంది. పైటచెంగును నడుంచుట్టూ బిగించింది.
చెట్టు సగంవరకూ కొమ్మల ఆధారంగా ఎక్కింది.
ప్రహరీగోడ పైభాగం కాలికి అందింది. చెట్టును వదలి-గోడమీద నిలబడింది.
అవతల అంతా గడ్డి....
ఒక్కసారిగా లోపల లోపల....బ్రతుకుజీవుడా అనుకుంటూ ఎగిరిదూకింది.
మెత్తటి గడ్డిమీద ఏం దెబ్బతగల్లేదు. కానీ నడుములు కదిలినట్టు కొద్దిగా పెయిన్ అలుముకుంది. అయినా ఆమె లెక్కచేయలేదు. భవంతి వేనుగ్గా, ధారగాపడే వర్షంలో.....అదేపనిగా చెట్ల మధ్యగా ఆమె నడుచుకుంటూ పోయింది.
కొంతదూరం అలా వెళ్ళాకే  ఆమెకు తనెక్కడుందీ విషయం అర్ధం అయింది.
తిరిగి ఘాట్ రోడ్ వైపుగా నడవటం మొదలెట్టింది. కుండపోతగా వర్షం.

                        *    *    *    *
ఘాట్ రోడ్ హేస్ట్ హౌస్ లో అంబరీషుడి మరణం....సిటీలో ఒక సంచలనమయింది.
ఆయన తన ప్రోగ్రాంను అక్కడికెందుకు మార్చుకున్నట్టు? సెక్యూరిటీకి పెద్దగా తెలీకుండా అక్కడ ఏం చేయటానికి వెళ్లినట్టు? ముఖ్యమంత్రిగారికి ఎంత ఆలోచించినా తెలీలేదు. ఆయన మరణానికి కారణాలు వెదికేందుకు సి.బి.ఐ ని రంగంలోకి దించుతానని మాత్రం అన్నారు.
అంబరీషుడు ఈ మధ్య పరువుతక్కువ పనులు చాలా చేయటం మొదలుపెట్టాడు.
పాపాలు చేసేప్పుడు తీయగానే వుంటాయి. పరిణామాలు చాలా చేదుగా వుంటాయి. అంబరీషుడి విషయంలో అదే జరిగింది.
ముఖ్యమంత్రికి చికాకు కలిగింది.
ఆ రోజు అంబరీషుడి మనుష్యులూ, పార్టీ మనుష్యులూ కొంత అలజడిని క్రియేట్ చేశారు. ప్రత్యర్ధుల దుకాణాలని పగులకొట్టారు. పోలీస్ ఫోర్స్ కు వారిని అదుపుచేయటం కొంత కష్టమే అయింది.
ముఖ్యమంత్రిగారి పిలుపు మేరకు కొంత కంట్రోల్ అయింది.
జరిగిందంతా ఒక ఎత్తయితే....
రుక్మిణి ఘనీభవించిన ఒక ఆశ్చర్యంగా మారిపోయింది.
తను హైటెక్ చిలుక పీక నొక్కగానే జరిగే పరిస్థితుల్ని ఆనాడు చిలుకతోపాటు వుంచిన కాగితంలో వ్రాయటం జరిగింది. కానీ ఆ పరిణామాలన్నీ తన భర్త మరణంతో ముడిపడి వుంటాయని ఆమె వూహించలేకపోయింది.
ఆమె మరింత ఆశ్చర్యపోయేట్టు...మరో పరిణామం జరిగింది.
ఫోన్ రింగయితే ఆమే ఎత్తింది.
అవతలినుండి యల్.ఐ.సి. మెయిన్ బ్రాంచ్ నుండి మేనేజర్ మాట్లాడటం మొదలెట్టాడు.
"సారీ మేడమ్! అంబరీషుడిగారి మరణం ఒక ఆశనిపాతంలాంటిది. ఆయన మాకు ఒక కోటి రూపాయలకు పాలసీ హోల్డర్. అందులో నామినీ తమరే....బహుశా ఆ విషయం మీకు తెలిసే వుంటుంది.
ఆయన మరణించటం జరిగింది గనుక.....

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra