Home » Yandamuri veerendranath » మరో హిరోషిమా


    కొంతమంది అమ్మాయిల కళ్ళలోకి చూస్తే, తమకంగా, ఆర్థ్రంగా, భావుకంగా- అలా అలా చూస్తూనే వుండిపోవాలనిపిస్తుంది. మరికొందరు కంజాతదళ నేత్రుల్ని చూస్తూంటే, ఆ రెప్పలమధ్య నిద్రపోవాలన్పిస్తుంది. ఎద గుండ్రము లెత్తున్న వాళ్ళని చూస్తే ఎదుటినుండి లక్షణంగా కౌగలించుకోవాలనిపిస్తుంది. వెన్ను చివర గుండ్రము లెత్తున వాళ్ళని చూస్తే వెనకనించి విలక్షణంగా వాటేసుకోవాలనిపిస్తుంది.

    కానీ ఆ అమ్మాయిని చూస్తే అడుగు వెనక్కి వెయ్యాలని పిస్తుంది.

    బెదురుతో కాదు....

    ఆ అమ్మాయే వచ్చి మీదపడుతుందేమోనని!

    భయంతో కాదు....

    అలా పడితే మగతనం నిరూపించుకోగలనా అని!!

    ఆత్మన్యూనతతో కాదు......

    అంత అందమయిన సౌష్టవం ముందు ఆరక్షణమైనా ఆగగలనా అని!!!

    జీన్స్ ఫాంట్ లోకి బుష్ షర్ట్ దోపి, బెల్ట్ పెట్టింది. మెడ చుట్టూ స్పార్ఫ్ కట్టింది.

    గాలికి బాబ్డ్ హేర్ నిర్లక్ష్యంగా ఎగురుతోంది. ఎన్ని వందల మైళ్ళ దూరంనుంచో ప్రయాణం చేసి వచ్చినా, మొహంలో అలసట కనపడడం లేదు. రెండు చేతులూ నడుముకి ఆన్చుకుని, 'తుఫాన్ మెయిల్' సినిమాలో హీరోయిన్ నాడియాలా- సమాధానం చెప్పమన్నట్లు చూస్తోంది.

    "నా పేరే బృహస్పతి. నువ్వెవరు?" అన్నాడు.

    "మై మద్రాసీ అజరోమత్ నమీ ఉత్థే"

    "అంటే?"

    "మద్రాసీ నహీ- మద్రాసీ నహీ"

    "అవును. ఇది మద్రాసు కాదు హైదరాబాద్. ఇదే రోడ్ మీద ఇంకో పన్నెండు గంటలు ప్రయాణం చేస్తేకానీ మద్రాసు రాదు."

    "తుమ్హెరే మద్రాసీ నవుడరో సర్దోషి"

    "సర్దోషీ లేదు నిర్దోషీ లేదు. నీకేం కావాలో అది చెప్పు."

    శ్రీహర్ష కల్పించుకున్నాడు. "నువ్వు మాట్లాడేది మద్రాసీ అనుకుంటోంది. ఆ భాష తనకు రాదు అంటోంది."

    "ఇది ఆంధ్రప్రదేశ్ అనీ, ఇక్కడ మాట్లాడేది తెలుగనీ తనకి చెప్పక్కర్లేదు కానీ తనకేం కావాలో అది కనుక్కో."

    శ్రీహర్ష ఆమెతో ఒక నిముషం మాట్లాడాడు. ఆ అమ్మాయి ఆగకుండా ఏదో చెబుతూనే వుంది. శ్రీహర్ష హావభావాలు చూస్తే బృహస్పతి కెందుకో భయమేసింది. ఆమెవేపు భయం భయంగానూ, తనవేపు జాలిగానో చూస్తున్నాడు. అయితే అందులో 'కంగ్రాచ్యులేషన్స్' అన్న భావం కూడా వుంది. కాసేపు కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటున్నాడు. మధ్యలో నవ్వుతున్నాడు.

    ఆమె ఏదయినా సినిమా కథ చెబుతోందేమో అనుకున్నాడు బృహస్పతి.

    ఆమె చెప్పినదంతా విని శ్రీహర్ష బృహస్పతివేపు తిరిగాడు. "ఈవిడ ఏ భాష మాట్లాడుతోందో నా కర్ధం కావడంలేదు కాని, అక్కడక్కడ తెలిసిన దాన్ని బట్టి నాకర్ధమైందేమిటంటే ఈ అమ్మాయి నీ మరదలు" అన్నాడు.

    బృహస్పతి అదిరిపడి "మ....ర....ద....లా?" అన్నాడు.

    "ఔను. డాకూ మంగళ్ సింగ్ కి వరసకి కోడలట ఈ అమ్మాయి. నువ్వక్కడ చచ్చి ఇక్కడ పుట్టావని తెలిసి వెతుక్కుంటూ వచ్చింది. నిన్ను తప్ప ఇంకెవర్నీ చేసుకోదట."

    బృహస్పతికి శ్రీహర్ష చెప్పేది కొంచెంసేపు అర్ధంకాలేదు. "నాకు కోడలైతే నన్ను వెతుక్కుంటూ రావడమేమిటీ?" అన్నాడు.

    "తొరె మామా పుత్రః గతిరో చద్దా మారి కంజరీ సమారేమెరె భోసో" అందా పిల్ల.

    "ఒకసారి మరణించి మరుజన్మ ఎత్తినవాడు- మరణించిన వాడికి పుత్రుడవుతాడట. కాబట్టి తనకి నువ్వు బావవౌతావని అంటోంది. కాబట్టి మీ ఇద్దరి మధ్యా నేనుండడం ఇంక అనవసరం. నువ్వూ, ఆవిడా మాట్లాడుకోండి" అంటూ బృహస్పతి వారిస్తున్నా వినకుండా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ఈ లోపులో ఆ అమ్మాయి లారీ దగ్గరకెళ్ళి ఏదో మాట్లాడి పంపించేసింది. బృహస్పతి కంగారుగా "ఏమిటీ దాన్ని ఎక్కడికి పంపించేస్తున్నావ్?" అని అరుస్తుండగానే లారీ వెళ్ళిపోయింది.

    "కమరేచ్చి నరొంగేహీ సరో-గమ్మబాంక" అన్నదా అమ్మాయి దగ్గరికోస్తూ.

    "గమ్మబాంక కాదు. తుమ్మబంక! ఆ లారీని పంపించేసేవ్. ఏమిటీ నీ ఉద్దేశ్యం?"

    "మై ఉత్థ్రీయా సెట్లీ"

    "ఏమిటక్కడ సెటిల్ అయిపోదామనా?"

    "అవ్వా!"

    తనకి తెలిసిన కాస్త పంజాబీలో మాట్లాడడానికి ప్రయత్నించాడు బృహస్పతి. "కీ ఆల్ హై?"

    ఆ అమ్మాయి మొహం విప్పారింది. "చంగాహై" అంది.

    "తెరా నామ్?"

    "పఠాణీ?"

    "బఠాణీ?"

    "నై.... పఠాణీ...." అంటూ కన్ను కొట్టింది.

    ఆ తర్వాత చనువుగా పాకలోకి వెళ్ళి క్లీనర్ తో సహా అందరినీ పలకరించింది.

    అతడు వెనకే వెళ్లి వచ్చీరాని పంజాబీ మిళితమై హిందీలో "ఇదిగో! నీ వ్యవహారం మేం బాలేదు. నువ్వు మంగళ్ సింగ్ మరదలివో, మదర్ వో నా కనవసరం. కేవలం ఆ ఒక్క అర్హత ఆధారంగా నువ్విక్కడ వుండిపోదల్చుకుంటే అది చాలా అత్యాశ అని హెచ్చరిస్తున్నాను. నాకూ, మంగళ్ సింగ్ కీ ఏ సంబంధమూ లేదు. మీ అత్తమ్మ రత్నాబాయికి కూడా ఆ విషయమే చెప్పాను. వెంటనే మీ ఊరెళ్లిపో! కావాలంటే ఖర్చులిస్తాను" అన్నాడు. 

    "నువ్వు చెప్పేది నాకు ఒకటీ అర్ధంగావడంలేదు" అన్నదామె వచ్చీరాని ఇంగ్లీషులో.

    బృహస్పతికి నెత్తిన పాలు పోసినట్టయింది. "నీకు ఇంగ్లీషు వచ్చా? మరా సంగతి చెప్పవేం?" అన్నాడు తలమీద బరువు దిగినట్టు.

    "థోడా ఇంగ్లీష్....నో.... ఐ...." అంది. ".... మద్రాసీ....ఐ....లర్న్...."

    "మాది మద్రాసీ కాదమ్మా! దీన్ని తెలుగు అంటారు."

    "అయితే తెలుగు నేర్చుకుంటాను" ఇంగ్లీషులో అంది.

    "నీతో సంసారం పెట్టడానికి! ఇక్కడికి వచ్చేవరకూ కాస్త సందిగ్ధంగా వుండేది. నిన్ను చూసిన తర్వాత అది పూర్తిగా పోయింది. భగవంతుడు అందుకే నా మనసులో ఆ సంకల్పం కలిగించాడు. అది నా తప్పుకాదు...." వచ్చీ రాని ఇంగ్లీషులో ఆమె మాట్లాడేది ఒక్క ముక్క కూడా అర్ధంకాక.... "ఏది తప్పు కాదు?" అనడిగాడు బృహస్పతి.

    "నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకోవడం!" తన్మయంగా అంది. "ఎన్ కౌంటర్ లో నువ్వు చచ్చిపోయావని తెలిశాక, మన ఉమ్మడి కుటుంబం మొత్తం విచ్చిన్నమై పోయిందట! ఆ తర్వాత కొన్నాళ్ళకి నేను పుట్టాను. అమ్మా, నాన్నా పోయారు. అమ్మ చస్తూ, నాకీ ఫ్లాష్ బాక్ చెప్పింది. ఎన్నో కష్టాలుపడి లారీ డ్రైవర్ ని అయ్యాను. 'మంగళ్ సింగ్ మరుజన్మ' అని పేపర్ లో చదివాను. దేవుడే మనిద్దర్నీ కలిపాడనుకుని అష్టకష్టాలూ పడి వెతుక్కుంటూ వచ్చాను. ఏ శక్తీ మనని విడదీయలేదు."

    "ఇదేదో ఇంటర్వెల్ వరకూ వచ్చిన సినిమా కథలా వుంది." అన్నాడు బృహస్పతి.


                    *    *    *


    ఇంటర్వెల్ తర్వాత సిట్యుయేషన్ ఆ రాత్రి జరిగింది. గాఢనిద్రలో వున్న బృహస్పతి పక్కలో ఎవరో కదిలినట్టయి మేలుకొన్నాడు. ఇద్దరూ మంచి పర్సనాలిటీస్ అవడంతో నులకమంచం అడుగు నేలకి తగులుతోంది. బృహస్పతి గింజుకోకుండా కాళ్ళతో కాళ్ళనీ- చేతుల్తో ఛాతీని అదిమిపట్టింది.

    "పెళ్ళికాకుండా ఇదంతా తప్పుకాదా?" అన్నాడు బృహస్పతి.

    "తప్పేముందీ? వరసయిన వాళ్ళం- పెళ్ళి చేసుకోబోతున్నాం."

    "కాని నేను పైసాకి ఠికాణాలేనివాణ్ణి- ఈ ధాబాకి కస్టమర్లు తప్ప మిగతా అందరూ వస్తున్నారు. నన్ను చేసుకుని నువ్వేం సుఖపడతావ్?"

    దాన్ని నాకొదిలెయ్ బాస్! మనిద్దరం సుఖపడడానికి నులకమంచం చాలు!"

    "నిజంగా పవిత్రమైన వివాహ ఆశయంతోనే వచ్చావా నువ్వు?"

    "ఏం, అనుమానంగా వుందా?"

    "లేదు, కాబోయే పెళ్ళాంతో మందుకొట్టాలనుంది."

    "రాత్రి పన్నెండవుతోంది. ఈ ఊరిబయట టైమ్ లో మందెక్కడ దొరుకుతుంది బాసూ?"

    "ప్రొహిబిషన్ ధర్మమాని అది వరదలై ప్రవహిస్తోంది. మనం ధాబాలో ఉన్నామన్న విషయం మర్చిపోతున్నావ్! అయితే రమ్ము మాత్రమే వుంది. ఆడదానివి తాగి నిభాయించుకోగలవా?"

    "చంబల్ వాలీ దొంగల వంశస్తురాలిని అవమానం చేస్తున్నావ్"

    ఇద్దరూ మందుమీద కూర్చున్న మూడుగంటల తర్వాత బృహస్పతి తూలి ముందుకు పడి, అతికష్టం మీద నిభాయించుకుంటూ "అబ్బో! మంగళ్ గిరి పానకేశ్వరీ! నీతో పెట్టుకోలేను" అన్నాడు.

    "ఇంకో పెగ్గు తాగు. మొత్తం దిగిపోద్ది" అంది పఠాణీ పంజాబీలో.

    ఇంకో అరగంట తాగాక బృహస్పతి వికృతంగా గొంతెత్తి పాడసాగాడు. నేషనల్ హైవేమీద వున్న ధాబా కాబట్టీ, పొద్దున్నించీ పనిచేసిన వర్కర్లు గాఢనిద్రలో వుండబట్టీ ఎవరికీ అభ్యంతరం లేకపోయింది. అయిదు నిముషాలు అలా పాడాక వున్నట్టుండి ఏడవడం మొదలుపెట్టాడు. పఠాణీ కంగారుపడి ".... ఎందుకేడుస్తున్నావ్?" అనడిగింది.

    "నాకు మా అమ్మ గుర్తొచ్చింది" అన్నాడు.

    "అమ్మ గుర్తొస్తే ఏడవడం దేనికి? మీ అమ్మగారు చచ్చిపోయారా?" అనడిగింది.

    "అమ్మంటే అమ్మకాదు.... మాత!"

    "మాత ఎవరు?"

    "భరతమాత ఇప్పుడెందుకు గుర్తొచ్చింది?"

    "మూడు రంగుల నీ నైటీ చూస్తే త్రివర్ణపతాకం గుర్తొచ్చింది." అంటూ మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు.

    "నువ్వేం మాట్లాడుతున్నావో నీ కసలు అర్ధమవుతోందా? హాఫ్ బాటిల్ కొట్టి అర్ధంలేని మాటలు మాట్లాడుతున్నావ్!"

    "అవును. మాటలేకాదు.... అర్ధంలేకుండా ప్రవర్తిస్తున్నాను కూడా! నాకు అప్పజెప్పినదేమిటీ.... నేను చేస్తున్న పనేమిటి?"

    "ఎవరు అప్పజెప్పారు? ఏమి అప్పజెప్పారు?"

    "సి.బి.ఐ. చీఫ్.... వాళ్ళ డిపార్ట్ మెంట్ కి ఇన్ ఫార్మర్ గా పని చేయమన్నాడు. రాంభరత్, హరిస్వామి కలిసి ఒక కాంట్రాక్టులో పదికోట్లకి పైగా కొట్టేసారు. వాళ్ళిద్దర్నీ ఎలాగయినా విడగొట్టి- రాంభరత్ ఆ డబ్బు ఎక్కడ దాచాడో తెలుసుకోవలసిన బాధ్యత నా కప్పజెప్పారు. నేనేమో ఇలా మందుకొట్టి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాను...." అంటూ ముందుకి తూలిపోయాడు. మరుక్షణం అతడికి స్పృహ తప్పింది.


                   *    *    *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra