Home » Ravulapalli sunitha » Death Sentence


    పదినిమిషాల్లో చెప్పాడు వైద్య, "వాళ్ళు ఒప్పుకున్నారు. జరగరానిది జరిగితే నీ దోషం కాదని మాకు తెలుసు. గో ఎ హెడ్ శరత్ చంద్రా!"

 

    రిస్క్ కేసులకి ఆపరేషన్ చేసేప్పుడు తనకి అసిస్ట్ చెయ్యడానికి రవళినే ప్రిఫర్ చేస్తాడు శరత్ చంద్ర. కానీ ఈ రెండురోజులు నిద్రలేక చాలా అలసిపోయింది ఇవాళ కూడా ఆమె నిద్రలేకుండా చేయడం ఇష్టంలేక పోయిందతనికి.

 

    టైమ్ పదికావస్తోంది. కిరణ్ ని వెంటనే రమ్మని ఫోన్ చేసి ఆపరేషన్ ఏర్పాట్లలో మునిగిపోయాడు.

 

    పేషెంట్ ని ఆపరేషన్ థియేటర్ లోకి తీసికెళ్తున్నప్పుడు వైద్య భార్య విజయ పరుగుపరుగున వచ్చింది.

 

    "అన్నయ్యా! నాన్నగారిని మీ చేతుల్లో పెడుతున్నాం. తిరిగి మాకెలా ఇస్తారో" ఎర్రగా కందిన కళ్ళలోంచి టపటపా రాలుతున్న కన్నీటిని అద్దుకుంటూ అంది.

 

    ఏం చెప్పాలో అర్ధంకాలేదు శరత్ కి.

 

    "ప్రయత్నిస్తానమ్మా!" అన్నాడు నెమ్మదిగా. అలా అనడంలో అతని గొంతు గాంభీర్యాన్ని కోల్పోయింది.

 

    దూరం నుండి చూసి విషయం అర్ధం చేసికొన్న వైద్య పరుగు పరుగున వస్తూ, "అందుకే ఈ ఆడవాళ్ళని కొన్ని కొన్ని చోట్లకి తీసుకురాకూడదు. ఎక్కడబడితే అక్కడ - ఎప్పుడుబడితే అప్పుడు రెండు కుళాయిలూ విప్పేస్తారు" అన్నాడు.

 

    "విజ్జూ నువ్వ ఇవతలకొచ్చెయ్! సర్జరీ చెయ్యడాని కెళుతున్న వాళ్ళని అలా ఏడుపులతో డిస్టర్బ్ చేస్తే ఎలా" అని భార్యను విసుక్కున్నాడు.

 

    "పర్వాలేదులే వైద్యా! ఆవిడనేమీ అనకు" అని శరత్ చంద్ర అనబోతుండగా -

 

    "నేను థియేటర్ లోకి వచ్చి సర్జరీ చూడవచ్చా బాబు" అన్నాడు అప్పుడే వచ్చిన గోపాలకృష్ణ.

 

    రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడూ థియేటర్ లోకి అడుగు పెట్టలేదు.

 

    అంత పెద్ద డాక్టరుగా పేరున్న ఆయన అలా అడగడం ఏదోలా అనిపించింది శరత్ చంద్రకు. కానీ అలా అడగడం ఆయన సంస్కారం.

 

    "ఎంత మాటన్నారు సార్! మీరు నన్ను పర్నిషన్ అడగడమా" నొచ్చుకుంటూ అన్నాడు. "అసలు మీరు చేస్తానంటే నైఫ్ ను మీ చేతికొచ్చి నేను ప్రక్కన నిలబడతాను."

 

    "నో.... శరత్ చంద్రా పద వెళదాం" అంటూ థియేటర్ లోకి దారి తీశాడు ఆయన.

 

    ఆపరేషన్ కు అంతా తయారయ్యాక మత్తివ్వడానికి ముందు రోగులతో నవ్వుతూ నాలుగుమాటలు మాట్లాడటం గోపాలకృష్ణ నుండే నేర్చుకుని ఆచరిస్తున్నాడు శరత్ చంద్ర.

 

    తమ ప్రాణాలతో బయటపడతాడో లేదో, మళ్ళీ తన వాళ్ళను చూస్తాడో లేదోనని ఆశ నిరాశల మధ్య నలిగిపోయే స్థితిలో ఉన్న రోగికి డాక్టర్ చిర్నవ్వు. ఆత్మీయమైన మాటెంతో చెబుతుండేవారు గోపాలకృష్ణ.

 

    కానీ ఇప్పుడు ఈ రోగి తనమాటలు వినే స్థితిలో లేడు. తనకి ఆపరేషన్ జరగబోతోందన్న విషయం కూడా తెలీని స్థితిలో ఉన్నాడు.

 

    చాకచక్యంగా పని చేసుకుపోతున్న శరత్ చేతివేళ్ళమీద గోపాలకృష్ణ చూపు నిలిచి ఉంది. అతని పనితీరులోని నైపుణ్యానికి అబ్బురపడి పోతున్నాడాయన.

 

    పిల్లలకోసం చాలామంది తల్లులు స్వెట్టర్లు అల్లుతారు. కానీ కొందరు అల్లిన స్వెట్టర్లు చూడటంతోనే వాటిలో ఏదో ప్రత్యేకత కన్పిస్తుంటుంది.

 

    పీచురాకుండా ఒకసారి అల్లి, విప్పి మళ్ళీ అల్లిన ముడతలు రాకుండా పోగులు లేకుండా శుభ్రంగా అందంగా కనిపించి పనితనంలోని నైపుణ్యాన్ని వెల్లడిస్తాయి. అలా వుంది శరత్ చంద్ర చేస్తున్నపని.

 

    'ఇతడు నా శిష్యుడే' అతన్నే చూస్తూ గర్వంగా మళ్ళీ అనుకున్నాడు గోపాలకృష్ణ.

 

    ఇలా అనుకోవడం ఆయనకి కొత్తేం కాదు.

 

    తామన్నీ పుట్టకతో వచ్చిన జబ్బులకీ, ఆ తర్వాత వచ్చిన జబ్బులకే ఎక్కువ ఆపరేషన్లు చేస్తుండేవాళ్ళు. బైపాస్ కావాలంటే అమెరికా వెళ్లొల్సొచ్చేది.

 

    అసలప్పుడు యిన్ని గుండెపోటు కేసులు ఎక్కడివీ. ఐదేళ్ళలో ఎన్నెన్ని మార్పులు.

 

    జీవితంలో శరీరానికి శ్రమ తగ్గి, మనస్సుకు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ పెరిగిపోయింది!

 

    శరీరం కదలకుండా రోజంతా కూర్చుని మెదడుతో పనిచేయడం పనిలో వత్తిళ్ళు - బ్రతుకులో వేగం - ఇంక మనిషికి మానసిక విశ్రాంతి ఎక్కడ.

 

    శరీరంలో పేరుకుపోయే క్రొవ్వు నిత్యం మనసుని కలవరపెట్టే టెన్షన్ ఇవి చాలవూ గుండె పోటులు పెరగడానికి.

 

    "సార్ మీరొక్కసారి చూడండి!"

 

    శరత్ చంద్ర పిలుపుతో ఆలోచనల్లోంచి బయటికొచ్చాడు గోపాలకృష్ణ.

 

    పూర్తిచేసిన పనిని గురువుగారిని చూడమంటున్నాడు శరత్ చంద్ర. ఆయన కూడా చూస్తే అతనికి సంతృప్తి!

 

    చూసి - "ఎక్స్ లెంట్ వర్క్!" మెచ్చుకోలుగా అన్నాడు ఆయన.

 

    మిగిలిన ముఖ్యమైన పని గుండె స్పందింపకుండా పంపిస్తున్న మందును ఆపి గుండెను మళ్ళీ కొట్టుకునేలా చేయడం. మందు సప్లయ్ ఆగిపోయింది.

 

    స్టీలు అట్లకాడలా ఉండి వైరు కనెక్షన్ కలిగిన రెండు వస్తువులను అందించాడు శివాజీ.

 

    కాడలు రెండు చేతుల్లో ఉంచుకుని వెడల్పుగా ఉన్న వైపుని గుండెకు రెండువేపులా పూర్తిగా అదిమి ఊపిరి బిగపట్టి "ఊ....!" అన్నాడు శరత్ చంద్ర.

 

    ఈ స్టెప్ దగ్గర ప్రతిసారీ చాలా టెన్షన్ కు గురవుతుంటారు సర్జన్లు ఈ షాక్ తో గుండె కొట్టుకోవడం జరగకపోతే ఎవరు చెయ్యగలిగేదీ ఏమీ ఉండదు.

 

    ఈ సూచన విన్న అనస్థటిస్టు ఒక్కసారి స్విచ్ వేసి తీశాడు. షాక్ తగిలిన గుండె ఒక్క కుదుపుతో మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టింది. రిలీఫ్ గా ఊపిరి పీల్చుకున్నాడు.

 

    కానీ మరో క్షణంలోనే దాని స్పీడ్ బలహీనంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది.

 

    "సార్!" టెన్షన్ తో అన్నాడు కిరణ్. అతని భయం పెరిగిపోసాగింది.

 

    "డ్యూటీలో ఉన్న కార్డియాలజిస్టుని పిలుచుకురండి" ఆదేశించాడు శరత్ చంద్ర. మనసులోని టెన్షన్ గా గొంతులో వెల్లడి కాకుండా జాగ్రత్త పడుతూ.

 

    ఈలోగా జరగవలసిన పనులు ఆపలేదతను. గాయంనుండీ కారిన రక్తం గుండె చుట్టూ నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు బయటికి రావడానికి ప్రక్కటెముకుల దగ్గర చూపుడు వేలంత రంధ్రం చేసి ప్లాస్టిక్ ట్యూబ్ లు అమరుస్తూ ఏవేవో మందుల పేర్లు చెపుతున్నాడు శరత్ చంద్ర.

 

    అవన్నీ ఇంజెక్టు చేస్తున్నాడు అనస్థటిస్టు. గుండె పరిస్థితిలో మార్పులేదు. "బి.పి. ఫేలయ్యింది!" ఆందోళనగా అన్నాడు అనస్థటిస్టు శ్రీవర్మ.

 

    మరో పదినిమిషాల్లో కార్డియాలజిస్టు కి విషయాలు గోపాల్ వచ్చాడు. ఎదురుగా ఉన్న టీవీలాంటి స్క్రీన్ మీద అతని గుండ పరిస్థితిని తెలిసే గ్రాఫ్ లో గీతలో పైకి అవడం లేదు.

 

    గ్రాఫ్ చూస్తున్న గోపాలకృష్ణ భృకుటి ముడిపడింది.

 

    కార్డియాలజిస్టుకి విషయాలు క్లుప్తంగా చెప్పి కార్డియాక్ సపోర్టు అసరం అవుతుందని చెప్పాడు శరత్ చంద్ర. వెంటనే చేతులు స్క్రబ్ చేసికొని, థియేటర్ డ్రస్ లోకి మారి, పని మొదలెట్టాడు గోపాల్?

 

    తొడ పై భాగంలోని నరంలోంచి ఓ ట్యూబ్ ని గుండెవరకూ జొనిపి, ట్యూబ్ మొదట్లో ముడుచుకుని ఉన్న బెలూన్ లాంటి బ్యాగ్ తో గుండెకు సపోర్టు ఇచ్చాడు.

 

    మరో అయిదు నిమిషాల్లో గ్రాఫులో గీతలు పైకిలేవడం మొదలెట్టాయి. క్రమంగా.... క్రమక్రమంగా అవి నార్మల్ స్థితికి చేరుకున్నాయి. దానితోపాటు బిపి కూడా మామూలు స్థాయికి రావడం మొదలెట్టింది. గొప్ప ఆనందం కలిగింది శరత్ చంద్రకి, గోపాలకృష్ణకీ. అక్కడున్న అందరూ ఎంతో రిలీఫ్ ఫీలయ్యారు.

 

    "సర్! ఇంత ఫాస్టుగా రికవర్ అవుతుందనుకోలేదు!" అన్నాడు కిరణ్.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra