Home » Vasundhara » Vasundhara Kadhalu - 3


    "తప్పు నాదమ్మా! నాతో వస్తానన్న నిన్ను కాదని ఇంట్లో వదిలివెళ్ళాను. ఆ దుర్మార్గుడే అఘాయిత్యమూ చేయకుండా నిన్ను వదిలిపెట్టాడు. అదే గొప్ప అదృష్టం మనకు...." అన్నాడు గురవయ్య.
    "చేతికి చిక్కిన దుర్మార్గున్ని చేజేతులా వదిలిపెట్టేను. వాడి మూలంగా మన యువతరమంతా నాశనమవుతోందంటే నా గుండె మండిపోతోంది-" అంది గులాబి.
    "వాడు నా కత్తుల బోన్నించీ తప్పించుకున్నాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.....బాధగానూ ఉంది-" అన్నాడు గురవయ్య.
    ఆ తండ్రీ కూతుళ్ళు కాసేపు బాధపడి నిద్రపోదామనుకునేటంతలో యింటిముందు పోలీసు జీపాగింది.
    ఇనస్పెక్టర్ హడావుడిగా వాళ్ళను కలుసుకుని-"మీ రిప్పుడే నాతో రావాలి...." అన్నాడు.
    "ఏమయిందిసార్?" అన్నాడు గురవయ్య.
    "ఒక రాత్రివేళ మీ యింటినుంచి బైటపడ్డ బ్రీఫ్ కేసు యువకుణ్ణి మా పోలీసు మనిషొకడు చూసి అనుమానించి వెంటాడాడు. వాడు అరుణాహోటల్లో ఇరవై రెండో నంబర్లో దూరాడు. వాడు బైటకు పారిపోకుండా కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటుచేసి- మా మనిషి నాకు కబురందించాడు. వాడే నేరస్థుడని నా కర్ధమైపోయింది. అయితే అతణ్ణి గుర్తించడానికి మీరు రావాలి..."
    "మీ పోలీసు రికార్డుల్లో వాడి ఫోటోలేదా?" అన్నాడు గురవయ్య.
    "లేదు అయినా నిముషానికో వేషం వేసేవాడి వివరాలు పట్టుకొనడం ఎలా అవకాశం వచ్చింది...." అన్నాడినస్పెక్టర్.
    ఆ నేరస్తుణ్ణి గుర్తుపట్టడానికి గులాబి కూడా ఆత్రపడింది.
    ముగ్గురూ జీపులో అరుణాహోటలుకు వెళ్ళారు.
    "అ మనిషి గదిలోంచి బైటకురాలేదు సార్!" అన్నాడు హోటల్ దగ్గర కాపలావున్న మనిషి.
    "గుడ్ వర్క్!" అని ఇనస్పెక్టరతన్ని మెచ్చుకున్నాడు.
    రిసెప్షన్లో అతడి గురించి వివరాలు సేకరించాడినస్పెక్టరు.
    అక్కడ అతడిపేరు రాజకుమార్ అని నమోదయింది. వచ్చి నాలుగు రోజులయింది. రోజూ అతణ్ణి కలుసుకొనేందుకెందరో వచ్చి వెడుతున్నారు. అతడు గది తాళం రిసెప్షన్ కౌంటర్లో యివ్వడు. ఎప్పుడో బైటకు వెళ్ళి ఎప్పుడో లోపలకు వెడుతూంటాడు. కాసేపటి కితం అతడు చాలా హడావుడిగా తన గాహ్డికి వెళ్ళిపోయాడు. పోలీసు మనిషతన్ననుసరించి రావడంవల్లనే రిసెప్షనిస్టు కతడి రాక గురించిన స్పృహ కలిగింది.
    "ఒక్క రూం నంబరిరవై రెండు తప్ప తక్కిన తాగాలన్నీ మా దగ్గిరేనా ఉన్నాయి-లేదా కస్టమర్సు బైటకు వెళ్ళలేదు. దాన్నిబట్టి వచ్చినదతడేనని అనుకున్నాను తప్ప-అప్పుడు నేనతడి ముఖంకూడా చూడలేదు-" అన్నాడు రిసెప్షనిస్టు.
    అతడు జాగ్రత్తపడుతున్నాడని ఇన స్పెక్టరు కర్ధమయింది.
    అది సహజం కూడా! పోలీసులే ఈ నేరస్థుడి దాటికి తట్టుకోలేనప్పుడు సామాన్యుడు తట్టుకోగలడా?
    ......గురవయ్య గులాబీ అతడి ననుసరించి వెళ్ళారు.
    ఇనస్పెక్టరు తటపటాయించకుండా ఇరవై రెండో నంబరు గది తలుపు తట్టాడు.
    తలుపు తెరుచుకుందు కెంతోసేపు పట్టలేదు.
    విసుగ్గా తలుపు తీశాడోవ్యక్తి.
    అతణ్ణి చూస్తూనే గులాబి తెల్లబోయింది.
    ఆమెకతడు బాగా గుర్తున్నాడు. కానీ యితడు ఆకారమంతా అదేకానీ-మనిషి ముఖం వేరుగా ఉంది.
    "ఎవరుకావాలి?" అన్నాడతడు.
    అతఃదిమాట బొంగురుగా అదోలాగుంది.
    "మీరేనా రాజకుమార్?" అన్నాడినస్పెక్టర్.
    "ఊఁ" అన్నాడతడు.
    "ఇనస్పెక్టర్-నాకు తెలిసిన రాజకుమార్ ఇతడు కాడు...." అంది గులాబి.
    ఆమె అతణ్ణి రక్షించడానికి ప్రయత్నిస్తోందేమోనని ఇనస్పెక్టర్ కనుమానంవచ్చి గురవయ్యవంక ప్రశ్నార్ధకంగా చూశాడు. అతడుకూడా గులాబితో ఏకీభవించాడు.
    "ఏం జరిగింది?" అన్నాడా బొంగురు గొంతువ్యక్తి.
    ఇనస్పెక్టర్ జరిగింది చెప్పాడు.
    "ఏమో-మీరంటూంటే నా కనుమానంగా ఉంది. రూంనంబరు ఇరవైనాలుగులోని వ్యక్తి తానొచ్చేదాకా తన గదిలో ఉండమని నన్ను రిక్వెస్టుచేస్తే ఒప్పుకున్నాను. కాసేపటిక్రితం అతడు హడావుడిగా వచ్చాడు. నేను నా గదికి వచ్చేశాను...." అన్నాడు రాజకుమార్.
    అందుకవకాశమున్నదని రిసెప్షనిస్టూ పోలీసు మనిషీ కూడా అంగీకరించారు. పోలీసుమనిషి రిసెప్షనిస్టుతో మాట్లాడి అక్కడకు రావడానికి కాస్త వ్యవధివుంది.
    "నేరస్థుడు చాలా తెలివిగా వ్యవహరించాడు. తనే గదిలో దూరుతున్నదీ మనకు తెలియకుండా చేశాడు...."అన్నాడినస్పెక్టర్.
    "కానీ ఇరవైనాలుగో నంబరు గదినుంచి కూడా ఎవ్వరూ బైటకు రాలేదుసర్-నేరస్థుడింకా ఆ గదిలోనే ఉండొచ్చు-" అన్నాడు పోలీసుమనిషి.
    ఇన స్పెక్టర్ పోలీసు మనిషిని రాజకుమార్ దగ్గిరుండమని తనువెళ్ళి ఇరవై నాలుగో నంబరు గది తలుపు తట్టాడు. గులాబి గురవయ్య అతడి వెనుకనే ఉన్నారు.
    తలుపు తెరుచుకుందుక్కాసేప్పట్టింది.
    ఓ వ్యక్తి ఆవులిస్తూ-'ఇంత రాత్రివేళ-ఎవరు మీరు?" అన్నాడు.
    అతడిమాట, ముఖం-గులాబి గుర్తుపట్టింది.
    "అతడే-రాజకుమార్-"అందామె ఆ వెనువెంటనే...."కానీ...." అని ఆగిపోయిందామె.
    గురవయ్య కూడా ఆ యువకుడివంకే ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
    అతడి ముఖం రాజకుమార్ దే అనడంలో సందేహం లేదు. కానీ ఇతడు బాగా సన్నగా-మరింత పొడవుగా వున్నాడు.
    "ముఖం సరిపోయింది కదా-మిగతా విషయంలో పొరపడి ఉంటారు" అంటూ ఇన్ స్పెక్టరతడి గదంతా శోధించాడు. అనుమానించతగ్గదేమీ దొరకలేదు.
    ఇన్ స్పెక్టరతన్ని పోలీసు మనిషికి చూపించాడు.
    "వెనుకనుంచి చూస్తూంటే ఇరవై రెండో నంబరు గదిలోని వ్యక్తినే నేననుసరించినట్లు తెలుస్తూంది. ఇరవైనాలుగో నంబరు గది వ్యక్తి ఆకారం నేను చూడలేదు."
    "ఎలా చూస్తావు? నేను ఎనిమిదింటినుంచి వళ్ళెరక్కుండా నిద్రపోతూంటే?" అన్నాడా వ్యక్తి కోపంగా. అతడు రాజకుమార్ చెప్పినదంతా అబద్దమన్నాడు.
    రాజకుమార్ గది శోధించా డినస్పెక్టర్.
    అక్కడా అనుమానించ తగ్గవేమీ దొరకలేదు.
    "నేరస్థుడు వీళ్ళిద్దరిలోనే ఉన్నాడు. రాజకుమార్ ఇరవై నాలుగో నంబరు గదిలోని వ్యక్తి మేకప్ లో మీ యింటికి వచ్చి ఉండవచ్చు. కానీ ఋజువు చేయడమెలా?" అన్నాడినస్పెక్టర్ దిగులుగా.
    జరిగింది గులాబీ కర్ధమయింది. రాజకుమార్ మారువేషంలో తమ యింటికొచ్చి-తిరిగి తన హోటలు గది చేరుకొని వేషం మార్చుకున్నాడు. రూపంతో తామందర్నీ కంగారు పెడుతున్నాడు.
    గురవయ్య చటుక్కున ఇన స్పెక్టర్ చెవిలో-"అయ్యా! నా యింట్లో రాజకుమార్ ని కత్తుల బోనులో పెట్టానుగా గోడలో ఆ కత్తులువేసిన గుర్తులన్నీ ప్రెష్ గా ఉన్నాయి. ఇతడా గుర్తుల్లో ఇమిడిపోతే ఇతడే రాజకుమార్. నా కత్తులబోను ....... వేలిముద్రలకంటే నిఖార్సైనదని ఏ కోర్టులోనైనా ఋజువు చేయగలను...." అన్నాడు.
    ఆధారం కోసం వెతుకుతున్న ఇన్ స్పెక్టర్ కీ మాట లపరిమితానందం కలిగించాయి. తాత్కాలికంగా రాజకుమార్ నరెస్టు చేయడాని కీ ఆధారం చాలు.
    గురవయ్య కత్తులబోను-ఇరవై రెండో నంబరు గది వ్యక్తినే రాజకుమార్ గా నిరూపించింది. ఆ తర్వాత అతడే నేరస్థుడని పోలీసులు నిరూపించగలిగారు.
    "నా కత్తులబోనే నేరస్తుణ్ణి పట్టిచ్చింది" అని గురవయ్య ఎంతో సంతోషించాడు.

                
                                    -:అయిపోయింది:-

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra