Home » Vasundhara » మా ఊళ్ళో మహానుభావుడు

   

   అప్పటికి చలమయ్య కాస్త పుంజుకున్నాడు __ "పోనీండి రాజారావుగారూ _ అలాంటి దుర్మార్గుడికలాంటి శాస్తి కావలసిందే __" అన్నాడు. ప్రత్యేకంగా పైకి చెప్పకపోయినా, రాజారావు పట్ల కృతజ్ఞతాభావం అయన కనులలో స్పష్టంగా కనబడుతోంది.

    రాజారావు గంభీరంగా చలమయ్య వంక చూసి _ "దుర్మార్గుల గురుంఛీ, వాటికి శాస్తి  గురించీ మాట్లాడే అర్హత ఇక్కడేవరికుందో నాకు తెలియదు. కానీ గాయబపడిన సాటి మనిషికి సాయపడక పోవడం దుర్మర్గమే అవుతుంది __" అన్నాడు.

    చలమయ్య తలవంచుకున్నాడు.

    రాజారావు నెమ్మదిగా గుమ్మం దగ్గరకు వెళ్ళి తలుపులు తీశాడు. లీలాసుందరి ఆశగా అటే చూస్తోంది. తలుపులు తెరచుకుని రాజారావు తనింటివైపు వేడుతూంటే ఆమె నిప్రుహగా చూసింది.

    రాజారావు తన వాటా దగ్గర ఆగి తలుపు తట్టబోయి _ విషయం గుర్తురాగా ముందు గొళ్ళెం తీసి అప్పుడు __ తలుపు తట్టాడు. అతడిలా తలుపు తట్టగానే _ కొద్ది క్షణాల్లో లోపల లైటు వెలిగింది. ఆ వెనువెంటనే తలుపులూ తెరుచుకున్నాయి.

    వసంత ముఖంలో ఆత్రుత. అంతవరకూ ఆమె నిద్ర పోలేదని చూడగానే తెలుస్తుంది. తలుపు తట్టినది భర్తే కావడమూ. అతడి కళ్ళలో విజయగర్వం కనిపిస్తూండడమూ చూసి ఆమె ముఖంలోకి కొత్త జీవం వచ్చింది.

    "జగ్గారావు గాయపడ్డాడు. రక్తం చాలా పోయింది. డాక్టరుకి చూపించేలోగా ప్రధమ చికిత్స అవసరం...." అననడతడు.

    వసంత రాజారావు వెనుకనున్న వ్యక్తిని చిత్రంగా చూస్తోంది. అయన చలమయ్య. రాజారావును దాటుకుని ముందుకు వచ్చి ఏదో చెప్పాలని తాపత్రపాయపడుతున్నాడు రాజారావు ఆగగానే, అయన చటుక్కున రాజరావును దాటించుకుని వెళ్ళి _ "అమ్మా _ ఈ రోజున మీవారు చేసిన మేలు ...." అని ఏదో అనబోతూండగా రాజారావు ఆపి __ "చలమయ్యగారూ! అనవసరంగా నన్ను పొగడోద్దు. అంతా మీ అదృష్టం. తప్పనిసరిగా మీ కళ్ళెదుట మీ భార్యకు జరగవల్సిన   అవమానం తప్పిపోయింది . చిత్రవధకు గురికానున్న మీరు చిత్రంగా తప్పించుకున్నారు. ఇంతటి అదృష్టం లభించిన మీరు అదృష్టమూర్తి. ఇప్పుడు మీరు పొందుతున్న అనందం _ మీమ్మల్ని ఆనందమూర్తి ని చేస్తుంది" అన్నాడు.

    చలమయ్య ఉలిక్కిపడి __ "ఆనందమూర్తి .... అదేం పేరు? ఎవరా మనిషి?' అంటూ తడబడ్డాడు.

    రాజారావదోలా అయన వంక చూసి __ "అలా ఉలిక్కిపడ్డారేమిటి? ఆనందమూర్తంటే మనిషి పేరెంకాదే __ చచ్చే టంత దుఃఖంలో ఉన్నవాళ్ళని విషాదమూర్తులన్నట్ట్లే నేను మిమ్మల్ని ఆనందమూర్తి అన్నాను. కొమ్పడేసి మీకు తెలిసిన మిమ్మల్ని ఆనందమూర్తి అన్నాను. కొంపదీసి మీకు తెలిసిన ఆనందమూర్తి అనే వ్యక్తి ఉన్నాడేమిటి? అందులోనూ ఇటువంటి సందర్భంలో గుర్తు తెచ్చుకోవలసిన వాడు ....." అన్నాడు.

    ఎందుకో చలమయ్య ముఖం పాలిపోయింది.

                                                                          24

    మర్నాడు ఊరు ఊరంతా చలమయ్య ఇంటిదగ్గరుంది. ఊళ్ళోవాళ్ళ కబుర్లలో రాజారావు, గరవయ్యలిద్దరూ పెద్ద హీరోలయిపోయారు. ఊళ్ళోకల్లా విచార సంఘటన _ సుదర్శనం దారుణ హత్య!

    అతడి తల శరీరం నుంచి వేరుచేయబడి, ఒక బల్లమీద పెట్టబడింది. ఆ తలక్రింద ఒక కాగితం . ఆ కాగితం మీద __ "మన యువతరానికి శత్రువు ...." అని రాసి ఉంది.

    సుదర్శనం ఇంట్లో మావో సూక్తులు రాసి ఉన్న కాగితాలు  చాలా కనబడ్డాయి. అతడి శవం తాలూకు మొండెం ఓ గదిలో దూలానికి వ్రేలాడుతోంది. వంటమనిషి రాధమ్మ నీళ్ళ గదిలో బంధితురాలయి పడి ఉంది. ఆమెకు ముక్కూ, చెవులూ కోసేశారు.

    రాజారావు పంపగా వెళ్ళిన గరవయ్య నలుగురయిదుగురు యువకుల సాయంతో సుదర్శనం ఇల్లు సోదా __ చేశాక __ ఉదయం వచ్చిన యాభైమంది యువకుల గురించీ కట్టుదిట్టం చేయడానికి ఊరంతా చకచకా తిరిగి జనాన్ని పోగుచేసి, యాభైమంది మీదా నిఘా వేసి __ వాళ్ళు జట్లు జట్లుగా విడిపోయి వెళ్ళిపోతూంటే _ ఒక్కొక్కణ్ని నలుగురు చొప్పున పట్టి బంధించడం చాలా చిత్రంగా జరిగిపోయింది. అలా వాళ్ళన్నీ ముగించుకుని చలమయ్య ఇంటికి వెళ్ళేసరికి __ అదృష్ట వశాత్తూ అక్కడ రాజరావుయ్ అసహాయ శూరడయిపోయాడు.

    అతితక్కువ వ్యవధిలోనే ఊళ్ళో యీ విశేషాలన్నీ రకరకాల కథలుగా ప్రచారమయిపోయాయి. జనాలందరూ లీలాసుందరి, జగ్గారావు, రాజారావు, గరవయ్యలను చూడాలని విపరీతమయిన కూతుహలానికి గురికావడంతో _ చలమయ్య ఇంటిముందు తీర్ధంలా తయారయింది.

    ఊళ్ళోకి నక్సలైట్లు అడుగుపెట్టడం, వాళ్ళెంతో ఆలోచించి వేసిన పథకం నెరవేరడం, ఒకే ఒక దారుణ హత్యతో ఊరంతా తప్పించుకోవడం __ అందరకూ ఇది కాలో, కథో తెలియకుండా ఉంది.

    వివిధ రాష్ట్రాల్లో విపరీతమయిన కల్లోలాన్ని లేవాదీస్తూ _ ధనిక వర్గానికి సింహస్వప్నమని చెప్పుకోబడే నక్సలైట్ల ప్రతిబింబాలను _ ఎదురుగా కనబడే లీలాసుందరి, జగ్గారావులలో చూడ్డం _ అందరికీ అదోలా ఉంది. అమాయకమయిన వారి ముఖాల వెనుక _ అంతటి కఠోర దీక్షను ఊహించడం కూడా కహ్స్తం!

    వచ్చిన వాళ్ళముందు లీలాసుందరి నిర్భయంగా నిలబడింది. ఆమెలో తను పట్టుబడ్డానన్న విశారం తప్పితే, చేసిందానికి పశ్చత్తాపం లేదు. పైగా ఆమె ఇలా అంది __ "సుదర్శనాన్ని చంపడం వల్లనే మేము దిరికిపోయాం. మా జాబితాలో అతడు లేదు భోస్వామిగా ఘోరాలు చేసినట్లు గానీ, వడ్డీవ్యాపారంలో ప్రజల్ని దోచుకున్నట్లుగానీ అతడి గురించి మకేక్కడా నిదర్శనాలు లేవు. కానీ అతడు నన్ను కోరిఆహ్వానించాడు. ఆహ్వానించిన తీరునిబట్టే అతడు _ తనకు మదిర, మగువ _- ఈ రెండో జీవితమని చెప్పాడు. ఎందరో యువకులు తనని గురువుగా ఆరాధిస్తున్నారనీ, తన కారణంగా ఎందరో యువతీ యువకుల్లో  స్వేచ్చాశ్రుంగారభావాలు వ్యాపిస్తున్నాయనీ గర్వంగా చెప్పుకున్నాడు అతడి కారణంగా ఈ ఊళ్ళోని యువతరం చెడిపో౦తోందన్న భావం నాక్కలిగింది. మన దేశపు భవిష్యత్తు యువతరం మీదనే ఆధారపడి ఉంది. వారి ప్రగతికి ఆటంకంగా నిలిచినా సుదర్శనాన్ని టోలగిస్తే __ శ్రమజీవులు విశ్రాను జీవులుగా మారే ప్రమాదం తప్పుతుందని భావించాను. లాగే రాధమ్మ విషయం ..... ఆమె అందం హరిస్తే తప్ప, ఆమెను వ్యభిచారమార్గంనుండి తప్పించలేనని అర్ధమై ఆ పని చేశాను. పేదల రక్తాలను జలగల్లా పీలుస్తున్న  చాలామంది భూస్వాముల్ని అంతం చేయడానికి నాటు బామ్బులిచ్చి మనుషుల్ని నియమించాను. ఈ ఊరి దుస్తులలో అగ్రగణ్యుడయిన చలమయ్యను నేనే స్వయంగా చిత్రబాధచేయాలనుకుని, అందుకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాను. ఆవేశంలో అనుకోకుండా సుదర్శననికి తుదమిట్టి౦చడం వల్ల ఈ ఊళ్ళోని అసలయిన దుష్టులందరూ తప్పించుకో గలిగారు. ఏదిఏమయినా మాకింకా రోజులు కలసిరాలేదు. మీరంతా మమ్మల్నెదో చేస్తారని నాకేమీ భయంలేదు. మ ఆశయాలు మంచివన్న దృఢవిశ్వాసం మాకుంది. ఆశయాల కోసం సంతోషంగా మా ప్రాణాలర్పింస్తాం. కానీ మమ్మల్ని నక్సలైట్లని పిలవద్దు. మాకూ ఆ పేరుకీ ఏమీ సంబంధంలేదు. మమ్మల్ని దేశభక్తులని పిలవండి. భగత్ సింగ్ బ్రిటీష వారి నెదిరించి అనేక ఘోరాలు చేసిన నేరానికి ఊరిశిక్ష పాలయ్యాడు. ఆనాటి ముద్దాయి నేడు దేశభక్తుడిగా గౌరవించబడుతున్నాడు. అలాంటి గౌరవమే మాకూ ఏదో ఒకరోజున లభించకపోదు. మేము ప్రజాశత్రువులం కాదు. ప్రజశాత్రువుల శత్రువులం .... అదే మా పేరు ...."

    ఆమె మాట్లాడుతూంటే అక్కడున్న వారందరూ ముగ్ధులైవిన్నారు. ఆమె మాటలు ముగియగానే _ "ఎంత గొప్పగా చెప్పింది?" అని అప్రయత్నంగా అనుకున్నారు.

    అయితే అంతలోనే శరీరాన్నుంచి వేరు చేయబడ్డ సుదర్శనం శిరస్సు _ ఎందరికో కళ్ళముందుమెదిలింది. ఆ ఊహా కలిగించిన ఆవేశంలో చాలామంది లేలాసుందరినీ, జగ్గారావునూ తన్నడానికి సిద్దమయ్యారు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra