Home » Kommuri venugopala rao » విరాజి

   

   ఉదాహరణకు.

     ఆమె కారు డ్రయివ్ చేస్తోంది. ఎదురుగా ఓ లారీ వస్తోంది. పగబట్టినట్లు పూనకం వచ్చినట్టు  మీదకు వస్తోంది.కారు ప్రక్కకు తీసుకుందామంటే ఎడమ వైపు పెద్ద గొయ్యి బ్రేక్ వెయ్యటానికి అవకాశంలేని స్థితిలో ..... లారీ మీదకు వచ్చేసింది. అక్కడ ఆ సంచిక ముగుస్తోంది.

    పాఠకులు ఏం జరుగుతుందా అని ఉత్కంఠతతో వచ్చేవారం కోసం ఎదురు చూస్తూ వుంటారు. ఆ వచ్చే వారం మొదటి వాక్యంలోనే చాలా సునాయసంగా యీ సమస్య విడిపోతుంది.

    బ్రేకు మీద కాలు అలాగే వుంది. గేరు మార్చే వ్యవధి లోపల లారీ ప్రక్కనుంచి వెంట్రుక వాసిదూరంలో ప్రమాదంనుంచి తప్పిస్తూ వెళ్ళి పోయింది.

    అనకూడదుకానీ __ నేస్టీ సస్పెన్స్ లో ఒక రకంగా పాఠకుని వెర్రివాళ్ళని చేస్తూ ఆడించటమే.

    కొన్ని కొన్ని సినిమాల్లో కధల్లో సస్పెన్స్ గాని భయానికరమైన వాతా వరణముగాని ఉండదు. ఊరికినే ఫోటోగ్రఫీ , రీకార్దింగ్ సౌండ్స్ తో కధలోలేని సస్పెన్స్ భయానికమైన వాతావరణము సృష్టిస్తూ వుంటారు. అలాగే రచనల్లో కూడా యితివృత్తంలో లేని సస్పెన్స్ కేవలం కొన్ని కొన్ని వ్యాక్యాల్లో సృష్టించవచ్చు.

    చాలా తేలిగ్గా యీ ట్రిక్కులన్నీ నేర్చుకున్నాడు గౌతమ్.

    అతను పూరించిన నాదమునిగారి నవలన్నీ అద్భుతంగా అమ్మాయి, పాఠకులు అవన్నీ నాదమునిగారే రాశారనుకుంటున్నారు.

    ఒకరోజు ఉదయం ఎనిమిదిగంటలవేళ అతను టేబుల్ ముందు కూర్చుని శ్రద్దగా రాసుకుంటున్నాడు. బయట కారేదో ఆగిన చప్పుడైంది. రాసే ధ్యాసలో వుండి అతను పట్టించుకోలేదు.

    ఓ నిముషం గడిచాక గుమ్మం దగ్గర అలికడయ్యేసరికి తలయెత్తి చూశాడు. తలుపువతల నాదమునిగారు నిలబడి వున్నారు.

    "రండి అన్నాడు గౌతమ్ లేచినిలబడుతూ . నాదమునిగారు లోపల కొచ్చాక" కూర్చోండి సార్" అన్నాడు.

    ఒకరకంగా ఆయన్ని చూడాలంటే అతనికి చాలా సిగ్గుగా , చిన్న తనంగా వుంది. ఇన్నాళ్ళూ ఆయన్ని కలుసుకోకుండా వుండటంకోసమే ప్రయత్నిస్తూ వచ్చాడు. తాను సమాజానికి అద్దంపట్టే కొన్ని రచనలు చెయ్యటం, అది చదివి పులకించి అయన అభినందిస్తూ ఉత్తరం రాయటం అతనికేప్పుడూ గుర్తువస్తూవుంటాయి.

    "నువ్వు రాసింది చదువుతున్నాను గౌతమ్" అన్నాడాయన కుర్చీలో కూర్చుంటూ.

    గౌతమ్ ఏమీ జవాబివ్వలేదు.

    "నువ్వు ఒకరకంగా  పైకి వస్తానని అనుకున్నాను. ఇంకో రకంగా వస్తున్నావు సంతోషం."

    అయన మాటల్లో వ్యంగ్యం లేదు. వేటకారంలేదు. అంతవరకు తల వంచుకుని వున్నవాడల్లా , తలెత్తి అయన మాఖంలోకి చూశాడు. త్రిపుర మరణంవల్ల అయన జీవితంలో ఏర్పడ్డ దిగులు, విషాదం ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాని కళ్ళలో తేజస్సు మాత్రం తగ్గలేదు.

    "తప్పలేదు" అన్నాడు చిన్నగా.

    "తప్పులేదు" అన్నారు నాదమునిగారు "ఒకదశ దాటాక జీవితం మన చేతుల్లో వుండదు. దాని దారిన అది పరిగెడుతూ మానని తనతో లాక్కువేడుతూ వుంటుంది."

    కొన్ని క్షణాలు నిశ్సబ్దంగా గడిచాయి.

    "సెక్స్, వయోలెన్స్ క్రైం యివన్నీ నేటి సమాజంలో ఒక ముఖ్య భాగమైపోయాయి గౌతమ్. ఒకరకంగా చూస్తె అదే సమాజమేమోనన్న భ్రాంతి కూడా కలుగుతుంది. అది భ్రాంతో, నిజమో కూడా తెలీని పరిస్థితి ఏర్పడుతుంది."

    అయన మాట్లాడే విధానంలోని నిజాయితీ అతనిని విచలికుతుడిని చేసింది.

    "కొన్నాళ్ళపాటూ విదేశాల్లో ముఖ్యంగా విదేశాల్లలో పల్లెసీమలో గడిపి వద్దామానుకుంటున్నాను గౌతమ్ . నాకెందుకో విదేశాల్లోకి సిటీలకన్న చిన్న ఊళ్ళు చాలాయిష్టం అలాగే, అమెరికా , జపాన్ లాంటి పెద్ద పెద్ద దేశాల కన్నా నార్వే , మెక్సికోలాంటి దేశాలు చూడాలని వుంటుంది.

    గౌతమ్ కు చాలా బాధనిపించింది . అయన మనసులో ఎంత వేదన వున్నదో అ మాటలు వ్యక్తం చేస్తున్నాయి.

    రచనా వ్యాసంగం .....?

    "ఇప్పట్లో రాయలేను గౌతమ్. నాకు కొన్నళ్ళపాటు జీవితాన్ని పుస్తకాలనూ చదువుతూ ఒంటరిగా జీవించాలనివుంది. ఇది వైరాగ్యం కాదు. మౌనం . మళ్ళీ తిరిగివస్తాను. చేపట్టవచ్చు. కాని దానిరూపం ఏవిధంగా వుంటుందో యిప్పుడే చెప్పలేను."

    మళ్ళీ మౌనం, విషాద౦లాంటి నిశ్శబ్దం,

    "రచనా వ్యాసంగంలో నా అంత విజయం సాధించిన రచయితా యింకొకరు లేరు గౌతమ్. నాలాగా డామినేట్ చేయగలిగిన రచయితా మరొకరు లేరు. నా వారసుడిని నువ్వే అవుతావు నన్నధిగమిస్తావు."

    తర్వాత కొంతసేపటికి నాదముని వెళ్ళిపోయాడు.

                         *    *    *    *   

    నాదముని పేర అతను పూర్తీచేసిన నవలలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పూర్తయిపోయాయి.

    ఒకరోజు అతన్ని వెతుక్కుంటూ "ఆక్రందన" నవల ఆ ఆతర్వాత నాదమునిగారి పేరిట నవల పభ్లిష్ చేసిన సంపాదుకుడు వచ్చాడు. అతని అతని పేరు రమణమూర్తి.

    "మీరు కంప్లీట్ చేసిన నవలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాదముని గారి నవల రాసింది. మీరేనని కూడా మెల్లమెల్లగా పాఠకలోకానికి తెలిసి పోయింది. పాఠకుల్లో మీమీద గ్లాసులో పెరిగింది" అన్నాడు.

    గౌతమ్ నవ్వి ఊరుకున్నాడు.

    "వెంటనే మీ సీరియల్ ఈసారి మీ పేరుతోనే ప్రారంభించాలనుకుంటున్నారు."

    "నా దగ్గర యితివృత్త మేదీ రెడీగా లేదే?" అన్నాడు గౌతమ్ అతనబద్ధం చెప్పలేదు నిజం కూడా అదే.

    "ఇతి వృత్తం ఎంతసేపు వస్తుంది? మీరు తయారుచేస్తూ వుండండి. ఈలోపల మేము పభ్లిసిటీ యిస్తూవుంటాము. రచయితా పేరు వెయ్యకుండా ఒకహరం చిన్న డ్రాయింగ్ యిచ్చి ఇంకోవారం యిఇలోగా మీకు కొంచెం అపుత్ లైన్ యిస్తే అది మకుటంగా పేట్టి మరోవారం మీరు మెల్లగా రెండుమూడు యిష్యూల మేటర్ తాయారుచెయ్యండి.

    "పభ్లిసిటీ పుల్ పేజీ కవర్ చేస్తూ యివ్వండి" అన్నాడు అతను.

    సంపాదుకుడు ఆశ్చర్యంగా చూశాడు. ఈ కొద్దిరోజుల్లోన్నే ఎంత ఎదిగాక అన్నట్లు. మళ్ళీ వెంటనే రచనా ప్రక్రియలో అతను చెయ్యగల ట్రిక్కులు శైలిలో, కథను మెలికలు త్రిప్పటంలో , అవసరమొస్తే ఎంత కాలమైన పోడిగించగల నేర్పు, సర్క్యులేషన్స్ బాధలు అన్ని గుర్తువచ్చి బలవంతాన నవ్వుతూ "అలాగే" చేద్దాం" అన్నాడు.

    "పభ్లీసిటీ ఆరువారాలయినా యిస్తే బావుంటుంది."

    "ఆలాగే!"

    "నవల మొదట్లోనే కాకుండా సీరియల్ పూర్తయ్యేవరకూ మధ్యలో మిగతా సీరియల్స్ మొదలుపెట్టినా మొదటి  పేజీల్లోనే వేస్తూ వుండాలి."

    "అలాగే!"

    "సీరియల్స్ కు సంబంధించిన కాప్షన్స్ నవల క్లిక్ అవటానికి ఉపయోగపడే చిట్కాలు అన్నీ నేనే యిస్తూవుంటాను .... లేకపోతే నాతో సంప్రదించివేస్తూ చిట్కాలు అన్నీ నేనే యిస్తూవుంటాను.... లేకపోతే నాతో సంప్రదించివేస్తూ ఉండాలి."

    "అలాగే!"

    "నవలను అభినందిస్తూ వచ్చిన ఉత్తరాలే ప్రచురించాలి, విమర్శిస్తూ వచ్చినా ఉత్తరాలు ప్రచురించకూడదు."

    "అలాగే!"

    అవసరాన్నిబట్టి అప్పుడు  కొన్ని ఉత్తరాలు ( నాకు పర్సనల్ గా వచ్చినవి, లేక యింప్రోటైజ్ చేసినది ఈ మాట బయటకు అనలేదు) పంపిస్తూ వుంటాను అది ముఖ్యంగా బాక్స్ కట్టివేస్తూ ఉండాలి.

    "అలాగే!"

    "ఇహా పేమెంట్ విషయం."

    "చెప్పండి."

    గౌతమ్ ఓ ఫిగర్ చెప్పాడు, సంపాదుకుడు కాసేపుబేరంచేసి, చివరకు ఒప్పుకున్నాడు.

    తర్వాత రెండు సంవత్సరాలపాటు ఏం జరుగుతున్నదో , అసలు తానేక్కడికి కొట్టుకు పోతున్నాడో తెలియనంత వేగంగా దొర్లిపోయింది. గౌతమ్ జీవితం.

    ఒకప్పుడు కళ అనుకున్నవన్నీ యదార్దలవుతున్నాయి. అతను తీసుకునే కథా సంవిధానం , చక్కని శైలి, పాఠకుల్ని కవ్వించేసంభాషణలు, ఊపిరి సలపకుండా విరుచుకుపడే సన్నివేశాలు , సంభ్రమం కలిగించే బలీయమైన సంఘటనలు ... నవలా ప్రపంచంలో అతన్ని మకుటంలేని మహారాజుని చేశాయి. 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra