Home » Vasundhara » వరమివ్వని దేవత

    "రాత్రి కేసు చాలా సీరియస్ గా ఉంది. ఇప్పుడు ప్రమాదం తప్పినట్ట్లే. అయినవాళ్ళు వచ్చి ఆదరిస్తే బాగుంటుంది. ఈ సమయంలో అతని మనసు ఉల్లాసంగా ఉండాలి " అన్నాడు డాక్టర్.
    డాక్టర్ రామరావుకూ, మోహన్ కూ ఉన్న అనుబంధాన్ని గురించి అడిగి తెలుసుకున్నాడు. "కాస్త నాయమయ్యాక ఇతన్ని మీ ఇంటికెందుకు తీసుకెల్లాకూడదు?" అన్నాడు డాక్టర్.
    "నాకా అవకాశం లేదు డాక్టర్! కాస్త ఇవతలకు రండి, విషయం చెబుతాను" అన్నాడు రామారావు.   
    ఇద్దరూ ఆ గదిలోంచి బయటకు వచ్చేక, "రాత్రి మీరు కబురంపారు చూడండి. _ లతా, అని కలవారిస్తున్నాడని! ఆ లాట్ ఎవరో మీకు తెలుసా?" అన్నాడు రామారావు.   
    "నాకు తెలియదు. కానీ ఆమెకోసం ఇతను తపించిపోతున్నాడు. ఆమెకోసమే ఈ  ఘోరప్రయత్నం తలపేట్టినట్లుంది. ఆమెను తీసుకురాగలరా మీరు?" అన్నాడు డాక్టర్.   
    "తీసుకురాగలడమేమిటి? ఆమె నాభార్య దకత్ర్!" అన్నాడు రామారావు.   
    డాక్టర్ షాక్ తిన్నట్లు నటించి, "కాస్త వివరంగా చెప్పండి" అన్నాడు.   
    రామారవు క్లుప్తంగా మోహన్ గురించి చెప్పి, "ఈరోజైతే మొండితనంతో ఆత్మహత్యా ప్రయత్నం. చేసుకున్నాడు. ఏదో రోజున ఎవరో వీణ్ని  దారుణంగా హత్యచేసినా చేయవచ్చు. ఈ బుద్ధి వాడికి ప్రాణంతకమై కూర్చుంది. ఇందుకు డాక్టర్ గా మీరేదైనా ఉపాయం చెప్పగలారా?" అన్నాడు.   
    డాక్టర్ తీవ్రంగా ఆలోచించినట్లు నటించి, "ఒక ఉపాయముంది. సైకాలిజిస్టుకు చూపిస్తే అతన్నిలా మార్చిన పరిస్థితులు అరా తీసి, వాటికి విరుగుడు సూచించగలుగుతాడు" అన్నాడు.   
    "మీకు తెలిసిన సైకలిజిస్టు ఎవరయినా వుంటే పిలిపించండి డాక్టర్!" అన్నాడు రామారావు.   
    "మీ సూచన మంచిదే. నేనే అందుకు ఏర్పాట్లుచేస్తాను. మీరు వెళ్ళినిశ్చింతగా  వుండండి. కానీ ట్రీట్ మెంట్ జరుగుతున్నంత కాలమూ మీ సహాకారం అవసరముంటుంది." అన్నాడు డాక్టర్.  
    "అలాగే" అన్నాడు రామారావు. తర్వాత అతను మిత్రుడ్నీ కలుసుకుని దుడుకుపనులు చేయవద్దని మందలించి అధైర్యపడవద్దని  ఓ దార్చి అక్కణ్నుంచి వెళ్ళిపోయాడు.
     రామారావు వెళ్ళిపోయాక డాక్టర్ మోహన్ టో, "కధ నీకు అనుకూలంగా తిరుగుతోంది"అన్నాడు.   
    "ఎలా ?" అన్నాడు మోహన్ ఆశగా.   
    "రామారావు సైకలిజిస్టుకు చూపించమని కోరాడు. నాకు తెలిపిన సైకాలజిస్టు ఒకాయన వున్నాడు. నువ్వు కాస్త డబ్బు పారేస్తే అయన లతను నీకు అనుకూలంగా మార్చగలడు" అన్నాడు డాక్టర్.   
    "లత ఆ సైకాల్లిజిస్టు నిరాకరిస్తే ?" అన్నాడు మోహన్.   
    "నీ ట్రీట్ మెంటుకు సకకరించడం అనే పేరుతో  ఆ సైకలిజిస్టు రామారావు దంపతులతో  ప్రవైటుగా  మాట్లాడతాడు.  అయన మెంటల్ పవర్ అమోఘం. అయన లతను తప్పక నీ దారికి తీసుకురాగలడు" అన్నాడు డాక్టర్.   
    "డాక్టర్! మీ మేధాశక్తికి నా జోహార్లు. అలాగో అలా పని సానుకూలం చేయండి" అన్నాడు మోహన్ ఆనందంగా.   
    ఆ సాయంత్రం మోహన్ అంతకంటే ఎక్కువగా ఆనందించే సంఘటన  జరిగింది. రామారావుతోపాటు లత కూడా అతన్ని చూడానికి వచ్చింది.   
    లతను చూపిన డాక్టర్ _ మోహన్ అంతకంటే ఎక్కువగా అనందించే సంఘటన జరిగింది. రామారావుతోపాటు లత కూడా అతన్ని చూడడానికి వచ్చింది.   
    లతను చూపిన డాక్టర్ _ మోహన్ వెర్రికి అర్ధముందని అనుకున్నాడు.   
    మోహన్ లతవంక జాలిగా చూశాడు. లత కూడా అతనివంక జాలిగా చూసింది.   
    "నీ నోటిని అదుపు చేసుకో గలిగితే రోజూ వచ్చి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళాలనే ఉంది మా ఇద్దరికీ" అన్నాడు రామారావు. లత మళ్ళీ రావటం కోసమని మోహన్ తన నోటిని బాగా అదుపు చేసుకున్నాడు.   
    వాళ్ళోఇరవై నిముషాలు మాట్లాడలేక పేషెంట్ కి విశ్రాంతి అవసరమని డాక్టర్ వాళ్ళను పంపించేశాడు.   
                               13   
     ఆ ఉత్తరం చదువుకుని ఆశ్చర్యపడింది. అమెరికా నుంచి కాదు, ఇండియానుంచే! అత్తవారి ఊర్నుంచి ఉత్తరం వచ్చింది.   
    వెంకట్ అమెరికాలో సెటిలై పోయాడు. వారం రోజుల క్రితం అతను ఇండియా వచ్చాడు. వచ్చినప్పుడు మాధవి గురించి విన్నాడు. ఆమె ఇంకా పునర్వివాహం చేసుకోనందు కతనికి ఆశ్చర్యం కలిగింది. తానామేను చోడ్డానికి వస్తున్నట్లుత్తరం రాశాడు.   
    అన్నప్రకారం వెంకట్ వచ్చాడు. గుమ్మంలో అతన్ని మామగారు రిసీవ్ చేసుకున్నారు. ముక్తసరిగా పలకరించి లోపల కాహ్వానించారు. లోపల అతను కూర్చున్నాక  అయన అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. కొద్ది క్షణాల పాటు చూసుకున్నారు.
    వెంకట్ మనిషి కాస్త లావయ్యాడు. మనిషి బాగా రంగోచ్చాడు. అదివరకు లేనివి _ గెడ్డం మీసాలోచ్చాయి. మొత్తం మీద ఇదివరకటి కంటె బాగున్నాడు.   
    "నేనే _ వెంకట్ ..." అన్నాడతను.   
    "గుర్తు పట్టాను. నన్ను  గుర్తు పట్టారా?" అంది మాధవి.   
    "నేను పెళ్ళి చేసుకున్నప్పుడు నీకు పద్దెనిమిదేళ్ళనుకుంటాను. ఇప్పుడు చోడ్డానికి పదహారేళ్ళ పిల్లలా ఉన్నావు...." అన్నడామే వంక అబ్బురంగా చూస్తూ.   
    "న్యూట్రిజన్ పుడ్ తినక థర్డ్ వరల్డ్ దేశాలల్లో ప్రజలు  వయసు మీరుతున్నా, కలకాలం వరకూ చిన్నపిల్లల్లాగే. అగుపిస్తారు.   ఆ తర్వాత కొద్ది కాలానికే భరించలేని సమస్యలతో సతమతమై వయసు మీరక పోయినా వృద్దుల్లా కనబడతారు. ఇది చాలా కాలంగా జరుగుతున్నదే" అంది మాధవి.   
    "నే నేలాగున్నాను?"   
    "అమెరికన్లా ఉన్నారు...." అంది మాధవి.   
    ఇద్దరి మధ్యా కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది.   
    మాధవి అలోచిస్తోంది. 'అతన్ని చాలాకాలం తర్వాత కసులుకుంది. తను. అతన్ని చూస్తుంటే తన కళ్ళు చేమర్చవేం? తనకు దుఃఖం ముంచుకు రాదేం? తనకు తాళికట్టి తనతో ఆర్నెల్లు కాపురం చేసి, తననో బిడ్డతల్లిని చేసిన ఈ పురుషుడి రాక తనలో ఏ విధమైన సంచాలనాన్నీ కలింగించదెం?"   
    "బాబున్నాడా?" అనడిగాడు వెంకట్.   
    "ఉన్నాడు " అంది మాధవి.   
    "ఒకసారి చూడాలని ఉంది."   
    "పిలుస్తాను. కానీ మీరు వాడికి తండ్రి అని చెప్పకూడదు."   
    "తండ్రినే కదా_ చెబితే తప్పేముంది?"   
    "వాడి ఊహల్లో ఒక తండ్రి ఉన్నాడు. అమాయకమైన వాడి మనసు తండ్రికి ఏ రూపాన్ని ఇచ్చిందో నాకు తెలియదు. వాడికి నేనెప్పుడూ  మీ ఫోటోని కూడా చూపలేదు. ఇప్పుడు వాడి మనసు లోని రూపం మీదిగా మారకూడదని  నా కోరిక" అంది మాధవి.   
    "నా మీది ప్రేమతో పునర్వివాహం కూడా చేసుకోలేదని విన్నాను వెంకట్.   
    "ఇప్పుడు నేను చెప్పిన మాటలు బాబుమీది ప్రేమతో చెప్పినవి ..." అంది మాధవి.   
    వెంకట్ దెబ్బ తిన్నాడు. 'తను వివాహమాడినప్పటి ముగ్ధకాదు ఈమె!  వయసులోనూ,   తెలివిలోనూ  అనుభవంలోనూ రాటు దేలిన  ప్రౌఢ  ఈ మాధవి'!   
    "ఒక్కసారి బాబును పిలు"అన్నాడు వెంకట్. అతని కంఠంలో అర్ధింపు ఉంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra