Home » Vasundhara » వరమివ్వని దేవత

    "నేను నీకు దాసుణ్ణి. నీ ఆజ్ఞకు బద్దుణ్ణి" అన్నాడు రామారావు.   
    "అయితే ముందు లోపలకు రండి" అంది లత.
    "మీ అక్క బాబు లేకపోతే ఇల్లు చిన్నబోయింది" అన్నాడు రామారావు లోపలకు వచ్చేక.   
    "అవును. అందుకే బయటకు పోవలనుంది. జనం లేని ఇల్లు ఇల్లు కాదు" అంది లత నిట్టూరుస్తూ.   
    ఆమె మెదడు డైవర్షన్ కోరుతోందని రామారావు గ్రహించాడు. అతనింక అట్టే వాదించకుండా వెంటనే అంగీకరించాడు. కాసేపట్లో ఇద్దరూ తెమిలి బయటకు వెళ్ళి హొటల్లో టిఫిన్ చేశారు. కాసేపు పార్కులో కూర్చున్నారు. తర్వాత ఓ సినిమాకు వెళ్ళారు. అదృష్టవశత్తూ సినిమా చాలా బాగుంది. హాల్లోంచి బయటకు వచ్చే సరికి ఇద్దరి మనసులూ తేలిగ్గా ఉన్నాయి. ఆ తర్వాత ఇద్దరూ ఓ హొటల్లో భోంచేసి రాత్రి పదిన్నరయఎసరికి ఇల్లు చేరుకున్నారు.   
    ఇల్లు చేరగానే లతకు మోహన్ గుర్తుకు వచ్చాడు కానీ, భర్తకు చెప్పలేదు.  
    మోహన్ ఏమయ్యాడోనన్న కుతుహాలం లత మనసులో ఉంది. దాన్ని తుడుచి పెట్టడానికి ఆమె చాలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది కానీ, సాధ్యపడలేదు.   
    ఇద్దరూ పక్కమీదకు చేరాక ఆమె ఉల్లాసంగా లేదు. రామారవు కబుర్లతో ఆమె నుల్లస పరచడానికి ప్రయత్నించాడు. కానీ, ఆమె అన్యమనస్కంగా ఉన్నాడని గమనించి తర్వాత ఊరుకున్నాడు. ఆమె అన్యమస్కంగా ఉండడానికి కారణం లత నూహించగలడు.  అయితే ఆ విషయం చర్చించడం అతని కిష్టం లేదని అతనికి తెలుసును.   
    ఇద్దరూ మౌనంగా ఉన్నారు. క్రమంగా రామారావు కళ్ళు మూతలు పడ్డాయి.   
    లతకు నిద్ర రావడం మంచం మీద ఆమె అసహనంగా  అటూ ఇటూ కదులుతోంది. ఉన్నట్టుండి కాలింగ్ బెల్ మ్రోగింది.
    లత ఉలిక్కిపడింది. టైంఫీసు రాత్రి పదకొండూ ఇరవై అయినట్లు చూపిస్తోంది.
    'నిజంగా కాలింగ్ బెల్ మ్రోగింది.   
    లత రామారావును కుదిపింది.   
    అతనికి అప్పుడే బాగా నిద్ర పట్టినట్లుంది. ఉలిక్కిపడి __ "ఊం" అన్నాడు.  
    "ఎవరో కాలింగ్ బెల్ మ్రోగిస్తున్నారండీ!" అంది లత.
    రామారావు కళ్ళు నలుమూకున్నాడు __ టైము చూసి బద్దకంగా వళ్ళు విరుచుకుని _ "అబ్బా! ఇప్పుడేవారు లతా?" అన్నాడు కానీ లేచే ప్రయత్నం చేయటంలేదు. అతని కళ్ళు మళ్ళీ మూతలుపడుతున్నాయి.   
    లత అతన్ని కుదపడమూ   కాలింగ్ బెల్ మరోసారి మ్రోగదమూ ఒక్కసారే జరిగాయి.   
    రామారావు ఈసారి లేచి కూర్చున్నాడు. అతని నిద్ర మత్తు వదిలిపోయింది. విసుక్కుంటూ మంచం దిగాడు. తనూ అతన్న్తో పాటే వెళ్ళి ఆ వచ్చిన మనిషేవరో చూడాలని లత అనుకుంది.   
    రామారావు కళ్ళు నులుముకుంటూ బెడ్రూంలోంచి కదిలాడు. లత అక్కడే ఉండిపోయింది. 'ఆ వచ్చింది మోహనే అయితే తానెందుకు అతని కళ్ళబడాలి?   
    భర్త అతనితో కబుర్లలో పడితే, మోహనే వచ్చినట్లు తనకు తొందరగా ఎలా తెలుస్తుంది? తనకు అత్రుతుగా ఉన్నాడని తెలిస్తే భర్తే ఆ విషయం త్వరగా చెబుతాడు. కానీ ఆతృతను భర్తకు చెప్పదలచుకోలేదు. అతడి దృష్టిలో తన మనసును శిలాదృశంగానే ఉండనివ్వాలి.
    రామారావు వెళ్ళాడు. లత అత్రుతుగా ఎదురు చూస్తోంది.   
    అతను త్వరగానే వెనక్కువచ్చినా, చాలాసేపు పట్టినట్లు ఆమెకు అనిపించింది.   
    "లతా! నువ్వనుకున్నంతా జరిగింది" అన్నాడు రామారావు.  
    "ఏం జరిగింది?" ఆమె ఊహా ఇంకా చాలా దూరం వెళ్ళింది.   
    "మోహన్ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఎవరో అతన్ని రక్షించి ఓ ప్రవేయివేట్ నర్సింగ్ హొమ్ లో చేర్చారు. అతను నే పేరే కలవారిస్తున్నాట్ట. అతడి జేబులో మనింటి అడ్రస్ ఉన్నాడట. ఆ డాక్టరు మనింటికి కబురు పంపించాడు" అన్నాడు రామారావు.   
    "ఎలా ఉన్నాట్ట?" అంది ఆప్రయత్న్మగా లత.   
    "చావు బ్రతుకుల్లో ఉన్నాట్ట" అన్నాడు రామారావు.   
    "ఏం చెప్పరా మనిషికి?"   
    "నిన్నడక్కుండా ఏం చెప్పను?" అన్నాడు రామారావు.   
    "మీకు చూడాలనుందా?" అంది లత.   
    "నీకు లేదా?" అన్నాడు రామారావు.   
    "లేదు. చూడాలనుకుంటే మీరు చూసి రండి" అంది లత.   
    "నేను వెళ్ళి చూసి రావడానికి నీ కభ్యంతరం లేదా?" అనడిగాడు రామారావు.   
    "మోహన్ కీ మీకూ సంబంధించిన ఏ విషయంలోనూ నా ప్రసక్తి ఉండకూడదు. అది అభ్యంతరం కానీండి, అనుమతి కానీండి" అంది లత.
    "అయితే నేను వెడుతున్నాను" అన్నాడు రామారావు.   
    "ఇప్పుడు వేడతారా?" అంది లత కంగారుగా.   
    "ఇప్పుడు కాకపోతే సావకాశంగా తెల్లరేక లేచి వెడతానా?" కాస్త విసుగ్గానే అన్నాడు రామారావు.   
    "వెళ్ళండి! వెళ్ళగానే అతడు మిమ్మల్ని చూసి లత రాలేదా అనడుగుతాడు. అది చూసి సంతోషించడం కోసం అక్కడకు వెళ్ళండి. ఆ తర్వాత దాకత్రు ఈలతెవ్వరండీ అనడుగుతాడు. న్క పెళ్ళాం అని చెప్పకండి. మోహన్ కూడా ఆమెను కోరుతున్నాడని తాపీగా చెప్పండి. అప్పుడా డాక్టరు నేను కూడా మీ భార్యను కోరితే అభ్యంతరమా అనడుగుతాడు. ఆ ప్రశ్నకు జావాబివ్వడంకోసమైనా అక్కడకు వెళ్ళండి" అంది లత.   
    "ఎందుకు లతా! అంత కోపంగా మాట్లడతావు. నిన్ను ఏ దివ్యభవనాలలో దాచి నాకా స్తోమత లేదు. నువ్వొక అందాల రాణివి, దేవతవు. నిన్నుచూడగానే ఆశ పడ్డది మోహన్ ఒక్కడేనని నేననుకొను. అతనికి మర్యాద తెలియదు కాబట్టి తన మనోభావాన్ని బాహాటం చేశాడు. అలా బాహాటం చేయనివాళ్ళు కొన్ని వందలుంటారు. నువ్వు  నా దానివి కావడం  నా అదృష్టం . అయితే ఇతరులు నిన్ను ప్రేమించారని నే నసూయాపడను" అన్నాడు రామారావు.   
    "మీరు చెప్పిందాన్నిబట్టే తెలుస్తోంది __ కొన్ని అలోచనలను నాగరిక ప్రపంచంలో బాహాటం తిట్టారనుకోండి _ ఆయన్ను చంపాలనిపిస్తోంది ఆవేశాన్నణచుకుని ఆయన్ను చంపకపోతే మనిషి అనిపించుకుంటారు. చంపినా,  అందుకు ప్రయత్నాలు చేసినా హంతకులౌతారు. ఆడదాన్ని మగాడూ, మగాణ్ణి ఆడదీ చూసి లక్షరకాల అనుభూతలకు లోను కావచ్చు. కానీ వాటిని అదుపు చేసుకోకపోయినా, చేసుకోవాలనుకాకపోయినా, ఆ మనిషిమీద సానుభూతి అనవసరం" అంది లత.   
    "సరే __ నేను మొహాన్ని చూడ్డానికి వెళ్ళడం లేదు" అన్నాడు రామారావు.   
    ఆ నర్సింగ్  హొమ్  అడ్రస్ తీసుకొండి. రేపుదయం వెళ్ళిచూడొచ్చు" అంది లత.
    రామారావు ఆ విషయం చెప్పడానికి వీధివైపు వెళ్ళాడు. తిరిగొచ్చిన పది నిముషాల్లో అతను నిద్రపోయాడు కానీ, ఆ రాత్రి తెల్లవార్లూ లతకు నిద్ర పట్టలేదు.   
                                  12   
    "డాక్టర్! లత రాలేదు కదూ?" అన్నాడు మోహన్ నీరసంగా.   
    డాక్టర్ మోహన్ ని చూసి నవ్వి, "నీ స్నేహితుడు వద్దా మనుకున్నాట్ట" అన్నాడు.   
    "ఆమెది పాపాణ హృదయం ......"గోణుక్కున్నాడు మోహన్.   
    "తప్పు ఆమెది కాదు. ఆమెకోసం ప్రయత్నిస్తున్న నీది" అన్నాడు డాక్టర్.   
    ఆత్మహత్యకోసం అతనీ డాక్టర్ని కలుసుకున్నాడు. డాక్టర్ అతనిదగ్గర కొంత డబ్బు తీసుకుని అతనాడే  నాటకానికి సహకరించదల్చుకున్నాడు. ఆ ప్రకారం మోహన్ డాక్టర్ తోటలో కాంపౌండ్ వాల్ మీదనుంచీ, దూకి ఒంటికి కాసీనిగాయాలు చేసుకున్నాడు.  ఒళ్ళు కూడా నెప్పులు చేశాయి. డాక్టర్ అతనికి గాయాలకు మించిన బ్యా౦డేజీలు వేశాడు. బాగా రాత్రి సమయంలో రామారావింటికి కబురంపించాడు. కానీ ఆ దంపతులు చూడ్డాన్నికి రాలేదు.
    మోహన్ కు చాలా బాధగా వుంది. పెయిలౌతున్నకొద్దీ  అతని పట్టుదల పెరుగుతోంది.
    'తననీస్థితిలో చూస్తె కరుగిపోయి తీరాలి ! డాక్టర్ కూడా అలాగే అభిప్రాయపడుతున్నాడు. 'మోహన్ కు ఆలస్యంగా నిద్రపట్టింది.   
    మర్నాడుదయం తొమ్మిది గంటల ప్రాంతాన రామారావు మోహన్ ని చూడానికి వెళ్ళాడు. అతని కూడా లత రానందుకు చాలా నిరుత్సాహ పడ్డాడు మోహన్.   
    "ఒక్కడివే వచ్చావా?" అన్నాడు మోహన్ చాలా నీరసంగా.   
    "అనుబధం మనిద్దర్నీని కదా! అందుకే నేను వచ్చాను. లతను రామ్మతే రానుంది" అన్నాడు రామారావు. మిత్రుడి పరిస్థితి చూసి అతడి కడుపు కరుక్కుపోయింది. "చాల పెద్ద ప్రమాదమే తప్పినట్ట్లుంది" అన్నాడతను డాక్టర్ వంక చూసి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra