Home » Vasundhara » వరమివ్వని దేవత

    రామారావు చటుక్కున లతను దగ్గరగా తీసుకుని, "చాలా థాంక్స్ లతా!" అన్నాడు.   
    "ఎందుకు?" అంది లత ఆశ్చర్యంగా.   
    "నా మాటలతో నీ మనసుకు కష్టం కలిగించి ఉంటే నన్ను మన్నించు, నీ మనసు కొంతవరకైనా  అతని పట్ల మెత్తబడిందేమో నన్న అనుమానం నాకు లేకపోయినా, నీ మనసు ప్రకారం నువ్వు మసాలడానికి స్వేచ్చనివ్వడం కోసం నేనెలా మాట్లాడాను. నా అడ్డు లేకపోతె, నా గురించి మొహమాట పడకపోతే, కొంతైనా అతనికి పంపతీ చూపించగలనేమో ననుకున్నాను. నీ మనసుఎంత మెత్త నైనదో నాకు తెలుసు. కానీ ఆశయాల దగ్గరకు వచ్చేసరికి అది కఠిన శీల అని ఇప్పుడే గ్రహించాను. ఏ విషయంలోనైనా సరిపెట్టు కావచ్చును. కానీ ఆశయాల విషయంలో సరిపెట్టుకోకూడదు. ఈ చిన్న విషయాన్ని అశ్రద్ధ చేయడంవల్లనే మనదేశం అద్వాన్నపు స్థితిలో ఉంది. బలహీనతలు సర్వసాధారణంగా భావించి ప్రతివారూ తప్పుచేయడమూ, అది సమాజమేనని సమర్ధించుకుంటూ మరన్ని తప్పులు చేయడమూ. అది సమాజమేనని సమర్ధించుకుంటూ మరన్ని తప్పులు చేయడమూ జరుగుతోంది. నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. ఎవరో చస్తానని బెదిరిస్తే మనం చాలించనవసరం లేడు" అన్నాడు రామారావు.   
    లత భర్తవంక అదోలా చూసి, "మీ మాటలు నిజంగానే నన్ను కలవర పరిచాయి. ఇంకా చెప్పాలంటే మీరూ, మోహనూ కలసి ఏదైనా నాటక మాడుతున్నారేమోనని అనుమానం కూడా వచింది. మా అక్కయ్య చాలా కంగారు పడుతోంది. వాడి ప్రసక్తి అసహ్యంగా ఉంది. అది బాగా షాక్ తింది. మీరు వాణ్ణి౦క మనింటికి రానివ్వద్దు" అంది.   
    "రానివ్వను. రేపు నేను స్వయంగా కలుసుకుని సమస్యను శాశ్వతంగా పరిష్కరించేస్తాను....." అన్నాడు రామారావు.   
                                                           11   
    మర్నాడుదయం లేచీ లేవగానే మాధవి లత దగ్గరకు వెళ్ళి,  "ఈ రోజు నేను వెళ్ళిపోతాను. ఒకటి రెండు గంటల్లోనే నా ప్రయాణం . మీ ఆయనకు చెప్పు" అంది.   
    "అదేమిటే ! అర్దాతంరంగా ఈ ప్రయాణ మెందుకూ?" అంది లత ఆశ్చర్యంగా.   
    "నేను బాగా అప్సెట్ అయ్యాను. మనసును కలవర పరిచే వార్తలేవీ వినదల్చుకోలేదు. ఈ విషయంలో ఇంక నువ్వు నాతో వాదించోద్దు. నేను వెళ్ళాక కూడా మోహన్ గురించి ఏ ఉత్తరాల్లోనూ రాయొద్దు ...."అంది మాధవి.
   
    "అలాగే" అంది లత.   
    ఆ రోజు మాధవి కొడుకుతో సహా బయలేదేరి వెళ్ళిపోయింది. రామోహనరావును బస్సు ఎక్కించి అక్కణ్ణుంచిపహీసుకి వెళ్ళాడు. ఆఫీసు నించి అతను మోహన్ బస చేసిన హొటల్ కి ఫోన్ చేశాడు. మోహన్ లైన్లోకి వచ్చేక _ "నేను, రామారావుని మాట్లాడుతున్నాను. నిన్న మా ఇంట్లో నీ ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది. మా వదినగారీరోజు బయల్దేరి ఊరెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా నువ్వు మా ఇంటికొచ్చే పక్షంలో తను ఉరిపోసుకు చచ్చిపోతానని మా ఆవిడ నన్ను బెదిరించింది. జీవితాతం గడపాలనుకుంటున్న నా శ్రీమతి కంటె మన స్నేహంఎక్కువైనది కాదు కాబట్టి చేబుతునాను. మళ్ళీ నువ్వు నన్ను గానీ, నా శ్రీమతినీగానీ కలుసుకోవడానికి ప్రయత్నించోద్దు. నా గడప తొక్కద్దు. నువ్వేక్కడైనా నా కెదురుపడ్డా ఎరగనివాణ్ణి చూసినట్టు పోతాను. తప్పితే పలకరించాను. వినిపిస్తోందా?" అన్నాడు.     
    "చక్కగా వినిపిస్తోంది. కానీ ఇదంతా నా కెందుకు చెబుతున్నవో తెలియదు. ఈ రోజు సాయంత్రం నేను ఊరి చివర కొండమీంచి దూకి ఆత్మహత్య  చేసుకోబోతున్నాను" అన్నాడు మోహన్.
    "వీలుంటే ఇప్పుడే చేసుకో! నేనూ, శ్రీమతీ కూడా సంతోషిస్తాము. అన్నాడు రామారావు.   
    అవతల క్లిక్ మంది. రామారావు కూడా ఫోన్ పెట్టేశాడు.   
    తర్వాత రామారావు ఆఫీసు వర్కులో పడ్డాడు. మోహన్ గురించి ఎంత అలోచించకూడదనుకున్నా అతని బుర్రలోకి ఆలోచనలు రాకుండా వదలడం లేదు. అతను నిజంగా చనిపోతాడా _ అని అతనికి భయంగా ఉంది.   
    మధ్యాహనం అతనికి లత దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. మోహన్ మళ్ళీ ఇంటికి వచ్చేట్ట. అయితే అమర్యాడుగా ప్రవర్తించలేదుట. లత ఫోన్లో వివరాలు చెబుతూంటే జరిగింది జరిగినట్లుగా రామారావు కళ్ళ ముందు మెదుల్తోంది.   
                       *    *    *    *      
    అతన్ని చూసి లత తలుపు వేసేయబోయింది.   
    ప్లీజ్ ! నన్ను లోపలకు రానివ్వండి నేనేమీ కెదు తలపెట్టను" అన్నాడు మోహన్.   
    "లోపలకు రానివ్వను. అడుగు ముందుకు వేశావా _ గతిఇగా అరిచి చుట్టూ పక్కల వాళ్ళందర్నీ పిలుస్తాను" అంది లత.   
    "అయితే లోపలకు రాను. ఇక్కణ్ణించే మాట్లాడి వెడతాను" అన్నాడు మోహన్.
    "త్వరగా చెప్పు __ నాకు పనుంది." అంది లత.   
    "పరాజయమేరగుని జీవితం నాడి. అటువంటి నన్ను మీరు బాగా పరాభావించారు. మీరు నన్నెంతగా అసహ్యహించుకున్నా తృప్తి నాకుంది. మరొకొన్ని గంటల్లో నేను తనువు చాలించనున్నాను. చచ్చేముందు ఇక్క సందేహం తీర్చుకుపోవాలనుంది. ఆడవాళ్ళది సున్నితమైన మనసు, అనీ, జాలి గుండె అనీ చెప్పుకుంటారు. కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా, చచ్చిపోతానని  ఏడ్చినా మీ గుండె కరగలేదు. ఇది నేను చేసుకున్న పాపమూ లేక మీ మనసు కఠిన శిలా సదృశమా?" అన్నాడు మోహన్.   
    అతనడిగిన పద్దతి చూస్తుంటే లతకు నవ్వు వచ్చింది. కానీ నవ్వలేదు. "నా మనసు సున్నితం. నాది జాలి గుండె . అందులో సందేహం లేదు. కానీ నువ్వు  నా ప్రాణాలు కోరుతున్నావు. నా ఆశయాలు నక ప్రాణం. కాబట్టి నువ్వు నాకు హంతుకుడిలా కనబడుతున్నావు. కత్తిచేత పట్టుకుని మీదకు వచ్చే వాణ్ణి ఎంత జాలి గుండె కలవాడైన కాలితో తన్నక తప్పదు. ప్రాణాల మీద తీపి ఎటువంటి పనినైనా చేయిస్తుంది." అంది.   
    మీ ముందు నేను పూర్తిగా ఓడిపోయాను. ఈ జన్మ నాకు వ్యర్ధం. వచ్చే జన్మలోనైనా నా కోరికలు తీరగాలవని ఆశిస్తాను" అన్నాడు మోహన్.
    "నేను తలుపులు వేసుకోవచ్చా ?" అంది లత.   
    మోహన్ ఆమెకు నమస్కరించి _ "మీరు దేవతా స్వరూపులు. నా బలహీనతతో మీ మనసును కష్టపెట్టి ఉంటే మన్నించండి. ఇక మీకు నా బాధ ఉండదు" అన్నాడు.   
    లత తలుపులు మూసింది.   
                    *    *    *    *      
    రామారావుకి వివరాలు వింటూంటే లత కఠినత్వం పట్ల ఆశ్చర్యమూ, మోహన్ పట్ల కొద్దిగా జాలీ కలిగాయి. మరోసారి మోహన్ కి ఫోన్ చేద్దామా అనుకున్నాడు గానీ, తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నాడు.   
    అతను ఆఫీసు నించి తిన్నగా ఇంటికి వెళ్ళాడు. లత గుమ్మ౦లోనే ఎదురైంది.   
    "రావణాసురుడికీ  రోజుతో స్వస్తి!" అన్నాడు రామారావు.
     లత నవ్వి _ "దుర్మార్గులంత సులభంగా చావరు. రావణసురుడికి ఒక తలకొడితే మరో తల మొలిచేదిట. ఇప్పుడు మనకు వాడి ప్రసక్తి ఎందుకుగానీ _ మనం సరదాగా ఎక్కడికైనా వేడదామా?" అంది.    

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra