Home » Suryadevara rammohan rao » మయసభ

   

   అవసరానికి స్నేహం చేయటంలోనూ, ప్రజలను తనకు అనుకూలంగా తిప్పుకోవటంలోనూ నందకిషోర్ వ్చూసే శక్తియుక్తుల అపూర్వం. అతన్ని దించివేయటానికి పార్టీలో ఎలాంటి ప్రయత్నం జరిగినా అది వాళ్ళ పార్టీనే రాష్ట్రంలో కూలదోస్తు౦దని ఆ పార్టీ సీనియర్ నాయకులు భయపడుతున్నారు. అవసరమానుకుంటే అరవై, డైభై మంది ఎమ్. ఎల్. ఏ. లతో విడిపోయి తన పార్టీ ని కూలదోసీ వేరే పార్టీకి మంత్రిపదవుల్ని ఆశ చూపి తిరిగి తనే ముఖ్యమంత్రి కాగలడు.

    ప్రపంచ రాజకీయాల్లో నందకిషోర్ అంత తెలివితేటలు కలవాళ్ళు అరుదుగా ఉంటారనటంస్వతహాగా ధైర్యస్తుడయినా రామరాజు ఒకింత జంకాడు.

    "మర్డర్ ఎటేమ్ద్ లాంటిది....." రామరాజు సందేహిస్తూ అడిగాడు.

    "నో.... నో... నందకిషోర్ అంత తెలివితక్కువ వాడు కాడు. మనిషిని భౌతికంగా ఏమీం చేయడు __ మానసికంగా చిత్రహింస పాలయ్యేలా చేయగల సమర్ధుడు కాస్త వెనుకాముందు చూసుకుంటూ ఉండు " అ వెంకనారాయణకు నిజాయితీపరులైన రిపోర్టర్స్ అంటే చాలా గౌరవం, అభిమానం.

    ఒక కన్నతడ్రిలా తన క్షేమం పట్ల వెంకటనారాయణ చూపుతున్న అపెక్షకు రామరాజు కృతజ్ఞతాభావాన్ని తన కాళ్ళ ద్వారానే వ్యక్తంచేసాడు.

    "అలా అని వదిలేయటం....": రామరాజు సందేహాన్ని వెంకటనారాయణ మధ్యలోనే అడ్డుకుంటూ .

    అలా అని ఎవరన్నారు ? నందకిషోర్ పట్టానభూముల విషయంలో ప్రపంచంలో ఏ నాయుకుడు చేయనన్ని అక్రమాలు చేసాడు. నిధుల దుర్వినియోగం, వారి నుంచి అతనికందుటున్న పెద్ద మొత్తాలు, అతని స్థానాన్ని సుస్థిరం చేస్తున్నాయి. కోర్ట్ స్టే ఇచ్చినా  నగరంలో భవనాల నిర్మాణం ఆగటంలేదు. 285 భవంతుల నిర్మాణంపై కోర్ట్ ప్లే ఇచ్చింది. దానివల్ల బిల్డరు ఏమీ జంకలేదు. కారణం నందకిషోర్ . స్టేతో నిర్మాణాలాగిపోలేదు. కోర్ట్ ఆదేశాల్ని సయితం ధిక్కరించి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అదీ నందకిషోర్ ఖలేజా.... మహా మేధస్సును మొరటు రాజకీయవేత్త . అందుకే మనం కూడా ఆచి తూచి అడుగు వేయాలి. అదనుచూసి అయువు పట్టుమీద దెబ్బ కొట్టాలి. అతను పదవిలోంచి తప్పుకుంటే తప్ప మన రాష్ట్రానికి పట్టుకున్న శని వదలదు. బైదిబై శంభుప్రసాదు ప్రస్తుతం ఢిల్లీలో తన అనుచరులతో, ధనరాశులతో మకాం చేసినట్టు తెలిసింది. మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు చిత్ర విచిత్రమైన మలుపులు అతి తక్కువ కాలంలోనే తిరగనున్నాయి. నీకు సహయుకుడిగా మరో ఇద్దరు రిపోర్టర్స్ ని తీసుకో. పాలో అవ్ స్టోరీ ని అలక్ష్యం చేయకు.... ఉంటాను మరి" అంటూ ఎవరికో ఫోన్ చేసి పనిలో నిమగ్నమయ్యాడు వెంకటనారాయణ

    రామరాజు బయటకు నడిచాడు.

                               *    *    *    *  

                   
        మాణిక్యం శిబిరంలో ఆనందోత్సహాలు ఉరకలు వేస్తున్నాయి. ప్రధానమంత్రి , అధిష్టానవర్గం  నందకిషోర్ ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వంపట్లఅస్మత్రుప్తితో వున్నట్టు వార్తలు రావటం ఆరంభమైంది.

    నందకిషోర్ చేసిన అవినీతిపనులపై పెద్ద ఫైలు సిద్దమైంది

    రామదాసుకి మరికొంత సొమ్ము శంభుప్రసాద్ శిబిరం నుంచి చేరవేయబడింది
   
    దాంతో అతను ప్రతిరోజూ ఏదో ఒకటి పత్రుకలముందు చెప్పేస్తున్నాడు. ప్రతి విషయంపై విరుచుకు పడుతున్నాడు.

    ఢిల్లీలో  ఆంధ్రభవన్  __ ఇక్కడ స్టార్ హొటల్స్ లో డబ్బు, సుఖాలు ఎక్కువయిపోయాయి.

    అప్పటివరకు విలువ ఉన్నట్లుగా కనిపించని ఒక సాధరమైన ఎమ్. ఎల్ . ఏ కి  కూడా  మంచి, మర్యాద, మగువ, మధిర దండిగా అందుబాటులోకి వచ్చాయి. ఎంతో  విలువ పెరిగిపోయింది.

    ప్రజలకు ఎలక్షన్స్ ముందు విలువ పెరిగినట్లే ఎమ్. ఎల్. ఏలకు రాజకీయ సంక్షోభంతో వులువ పెరిగిపోతుంది.

    ఓటరు తన ఓటుని వందకో రెండో౦దలకొ అమ్మేస్తే మేం రెండు మూడు లక్షలకు అమ్ముకుంటే తప్పేమిటనే ఆర్గ్యూమెంట్ వారిలో బయలుదేరింది.

    రాష్ట్రమంతటా వేడివేడి చర్చలు.....

    ఇవ్వాలా? రేపా? నందకిషోర్ డిగిపోయేది?

    దిగితే కొత్త ముఖ్యమంత్రిఎవరు?

    ఎలా దించుతారు?

    అవినీతి పనుల్ని వేలెత్తి చూపించా?        

    అవి ఎవరు మాత్రం చేయటంలేదు ఈ రోజుల్లో అవి అంటే, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికోడిలేసారని అంటే, ప్రజల సంక్షేమం ఎవరికీ మాత్రం పడుతోంది? ఎవరికీ వారే తాము పదవుల్లోకి వస్తే చాలానే నీచమైన స్థాయికి ఇండియన్ పొలిటీషయన్స్ డిగిపోయాక ఆ పాయింట్ కి విలువేది?

    ఇలా రాష్ట్రస్థాయిలో విమర్శకుల మెదళ్ళు హీటెక్కిపోయాయి.

                               *    *    *    *   

    వెంకట నారాయణ అల్లుడు తన తప్పు ఒప్పుకుని మున్సిపాలిటీ స్థలాన్ని వదిలేసేందుకు పెనాల్టీ చెల్లించేందుకు సిద్దమైపోయాడు.

    ఆ మరుసటిరోజు శుబోధయం పేపరులో మరి వార్త వచ్చింది.

    వరద ప్రతంలకు, ప్రపంచ బ్యాంకు నుదులు కేటాయించిన ప్రాంతాలకు వెళ్ళేందుకు ప్రభుత్వాధికారుల ఆరాటం __ అనే బ్యానర్ క్రింద ప్రభుత్వోద్యోగమంటేదండుకోవటమే అని ఉద్దేశంతో కొందరు అధికారులు తమ ట్రాన్స్ ఫార్స్ కై లక్షలు లంచాలుగా ఇస్తున్న వైనం ... అంటూ ఆ వార్త సాగిపోయింది.

    నందకిషోర్ పదవిలోమ్చి దించేందుకు భయపడుతున్న ప్రధాని అధిష్టాన వర్గం అనే బ్యానర్ క్రింద మరికొంత విశ్లేనాత్మకమైన వార్తా ప్రచిరించబడింది.

    ఏ క్షణంలోనయినా ఎలక్షన్స్ రావచ్చు.....

    ఈ స్థితిలో ముఖ్యమంత్రిని మార్చి కొత్తవారిని ఆ పదవిలోకి తెల్సుకునేందుకు కొత్త ముఖ్యమంత్రికి చాలా సమయం పడుతుంది . పుణ్యకాలం కాస్తా  ఇలా గడచిపోతే ఎలక్షన్స్ నిదులేలా సమకూరుతాయి ....? అందుకే నందకిషోర్  పదవి పదిలం కావచ్చు అని మరో వార్త.

    ఇవన్నీ ఇలా ఉండగా నందకిషోర్ మాత్రం ఏమాత్రం తోణక్కుండా , బెణక్కుండా యధావిధిగా తన పనులు తాను చేసుకుపోతూన్నాడు. ఏం చేస్తారు? ఏం చేయగలరన్న ధీమాని తన ప్రవర్తన ద్వారా, చర్యల ద్వారా వ్యక్తం చేస్తున్నాడు.

    అతని ధైర్యంమేమిటో అర్ధంకాక పరిశీలికులు విస్తుపోతున్నారు.
   
                              **    **    **    **   

    మొత్తానికి అవంతి మద్రాసు వదిలి హైద్రబాదు వచ్చేందుకు అంగీకరించింది. ఆ సాయంత్రం చూడప్ప రిషిని తీసుకుని హైదరాబాదు బయలుదేరాడు. తన రిజిగ్నేషన్ ని అవంతి చాలా కష్టం మీద మేడికర్ యజమాన్యంతో ఒప్పిమ్చుకోగలిగింది.

    ఆమెకు రిషికి ఉద్యోగం వస్తోందని ఓ ప్రక్క సంతోషం __ తండ్రి అధికార పరిధిలోకి తిరిగి వెళ్ళవలసి వచ్చినందుకు అయిష్టంగానూ వుంది.

    అయినా తప్పలేదు.

    సామాన్లు సర్దుకోనారంభించింది.

    ప్రస్తుతానికి డి.ఐ.జి. చూడప్పగారి ఇంట్లోని రిషి, అవంతి మకాం అని అంతకుముందు రోజే నిర్ణయింపబడింది.

    ఇద్దరూ ఉద్యోగాల్లోకి చెరక, పెళ్ళి, చేసుకుని వేరే ఇళ్ళు తీసుకో వాలనే అభిప్రాయానికి అందరూ వచ్చారు.,

                              *    *    *    *   

    "అతనెళ్ళేపొతే మా కంపెనీల షేర్లు బాగా పుంజుకుంటాయి. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం రోజే షేర్ కి వంద పెరిగినా ఆశ్చర్యపోనఖ్హర్లేదు. నేను లాభపడితే మీరూ లాభపడినట్లేగా ...? డబ్బుకి వెనుకాడవద్దు. ఈసారి ఎలాగయినా నందకిషోర్ దిగిపోవాలి . ఏం చేస్తారో నాకైతే తెలీదు. పని జరగిపోవాలంతే " శంభుప్రసాద్ పైస్ లో పోగాకుని దట్టిస్తూ అన్నాడు.

    అధిష్టాన వర్గంలోకి సీనియర్ నాయకుడు సేరియాస్ గా పచార్లు చేస్తూ నందకిషోర్ ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తున్నాడు.
   
     "నందకిషోర్ ని పదవి నుంచి దింపటం ప్రధానమంత్రికి కూడా ఇష్టమే. కానీ రాష్ట్రంలో మన తార్తీ దెబ్బతినకుండా, చెక్కు చెదరకుండా ఆ పని జరిగిపోవాలని అయన అభీష్టం. ఇది చాలా డెలికేట్ సిట్యుయేషన్ . ఏమాత్రం అటూ, ఇటూ అయినా మరో పార్టీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నందకిషోర్ వెనుకాడదు.
   
    గుడ్డికంటే మెల్ల మేలు. అసలు పార్టీ అధికరంలోంచి దిగిపోయే కన్నా, నందకిషోర్ నాయతకత్వంలో నయిన పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటమే మంచిదని సి.ఎమ్. అభిప్రాయం. అయన ఆర్గ్యుమెంట్ ని కాదనలేం . నందకిషోర్ టక్కరి __ కపటి వేలికేస్తే కాలికేస్తాడు. కాలికేస్తే వేలికేస్తాడు.

    రాష్ట్ర రాజకేయాల నుంచి గ్రామ రాజకీయాల వరకు అందేవేసిన చేయి... ఆఖరి క్షణాన్ని సయితం తనకు అనుకూలంగా మార్చుకోగలడు మేధావి. చూద్దాం ఏం జరుగుతోందో?

    ఎప్పటికప్పుడు నందకిషోర్ కదలికలపై కన్ను వేసి మనకు తెలియ పరచేందుకు అక్కడ కొంతమంది ఎమ్. ఎల్. ఏ. లు ఉన్నారన్న విషయంపై అంచనా తయారవుతున్నాయి. అది జరగగానే మన స్ట్రాజీ సిద్దమవుతుంది" రాజకీయాల్లో అపార అనుభవం వున్న ఆ సీనియర్ నాయుకుడు అన్నాడు సాలోచనగా.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra