Home » Vasundhara » వరమివ్వని దేవత

    "దాన్ని అభ్యంతర పెట్టడం అనరు. అభ్యంతర మందిర సంబాషణ అంటారు. పరాయి ఆడపిల్లలతో అలా మాట్లాడ్డం ఎంత తప్పు?" అంది లత నవ్వునాపుకుంటూ.   
    అప్పట్ట్నుంఛీ రామారావు శశికళ నైకసారి ఇంటికి పిలవాలని అనుకుంటున్నాడు. అందుకు సరైన సమయం రాలేదు. ఇప్పుడు మాధవి వచ్చేక కాసేపు  ఆమెకు ఉల్లాసకరంగా  కూడా ఉంటుందాన్న ఉద్దేశ్యంతో ఒక రోజున అతనామేను ఇంటికి ఆహ్వానించేడు.   
    "ఎందుకు?" అంది శశికళ ఆశ్చర్యంగా.   
    "మా వదినగారు, అంతే శ్రీమతి అక్క అన్నమాట_ ఆవిడవచ్చింది. ఆవిడ భర్త చాలా కాలంగా అమెరికాలో ఉంటున్నాడు. అయన తిరిగి ఎప్పుడోస్తాడో తెలియక ఆవిడ డల్ గా ఉంటూంటు౦ది. మీరు చాలా సరదా అయిన మనిషి. ఆవిడ ఒక ఈవినింగ్ మీతో గడిపితే మనసు తేలికపడుతుందని నా ఆశ" అన్నాడు  రామారావు.   
    శశికళ రామారావు ఆహ్వానాన్ని మన్నించింది.   
    ఆమెను ఆహ్వానించడంలో రామరావుకు కొన్ని ఆశయాలు నెరవేరుతాయి. శశికళ ఎలా డ్రస్ చేసుకుంటుందీ చూసి తనే ఆమెకు డ్రస్ విషయంలో సలహా నివ్వవచ్చును లత! మాధవి కాసేపు తెలికగా నవ్వగలుగుతుంది. శశికళ తన నిర్మోహమాటత్వంతో మాధవి ఆలోచనల్లోని మూర్ఖాత్వాన్నీ ఎత్తి చూపించి, రేండో వివాహానికి ఆమెను సుముఖరాలిని చేయవచ్చును.   
    అన్న ప్రకారం అన్న టైముకి శశికళ  వచ్చినప్పుడే రామారావు మొదటి ఆశయం చెడిపోయింది. ఆమె చక్కటి సిల్కు చీర కట్టుకుని పైట నిండుగా కప్పుకుని ఆరిందిలా అక్కడికి వచ్చింది. ఆమె నావిధంగా ఊహించని రామారావు అలా ఆమె అందాన్ని చూసి మరింత అచ్చెరువంచాడు.   
    లత శశికళను సాదరంగా ఆహ్వానించింది. మాధవిని పరిచయం చేసింది.   
    శశికళ బాబును పలకరించింది. బాబు ఆమె చుటూ తిరుగసాగాడు.   
    సంబాషణ కాసేపు బాబు ముచ్చట్లు మీద నడిచింది. తన ఆఫీసు కబుర్లు రాకుండా రామారావు జాగ్రత్తపడ్డాడు. బాబు కాసేపు విద్యా ప్రదర్శన చేశాడు. శశికళ  వాణ్ణి బాగా మెచ్చుకుంది. బాబు సంతోషి౦చాడు.
    అతి తక్కువ వ్యవధిలో వాళ్ళు ఒకింట్లో మనుషుల్లా కలపి పోయారు. శశికళ తన చలిక్తులతో వాళ్ళను బాగా నవ్వించింది.   
                                 9   
    శశికళ తరుచుగా రామారావింటికి వచ్చి వేడుతూండేది. ఆ ఇంట్లో ఆమెకు ఆత్మీయత కనబడింది. మంచి కాలక్షేపం జరుగుతోంది.'   
    ఐదారోజుల్లో శశికళకు మాధవి కధ తెలిసింది. అయితే ఆమె మాధవి నిర్ణయాన్నభినందించి, "ఏదో విధంగా మగాణ్ణి దూరంగా వుంచడం ఆడదానికి మంచిది" అంది   
    మాధవి ఆమె అభిప్రాయానికి సంతోషించింది. "అయితే మీరు పెళ్ళి చేసుకోరా?" అనడిగిందామె.   
    "ఎందుకు చేసుకోనూ __ సరైన వాడు దొరకాలిగానీ?" అంది శశికళ.   
    సరైన వాడంటే?" అనడిగింది లత.   
    "మీ అయన్నడగండి" అంది శశికళ.  
    రామారావు వెంటనే చెప్పాడు. అందరూ నవ్వారు.   
    "ఈ జన్మకు మీకు పెళ్ళి  కాదు" అంది లత.   
    "అదే నాక్కావలసింది" అంది శశికళ.   
    లతకీ జవాబు నచ్చలేదు . "మీకు తగ్గవాణ్ణి నేనే వేడికి పెడతాన్లెండి. లోకంలో మగవాళ్లంతా దుర్మార్గులు కారుగదా?"   
    "సరే _ అయితే నా పెళ్ళి బాధ్యత మీకు వదలి నేను నిశ్చింతగా వుంటాను" అంది శశికళ.      
    "అన్నట్లు ...." అన్నాడు రామారావు _ "మోహన్ ని శశికళకు పరిచయం చేస్తే ఎలా ఉంటుంది?"
    లత అప్రయత్నంగా "మార్వలెస్!" అంది.   
    "మోహన్! వాడేవాడు?" అంది. శశికళ వెంటనే. ఎదుటలేని  మనుషుల గురించి అది, వాడు అనడం ఆమెకు అలవాటు.   
    "బుద్దిమంతుల్లోకెల్లా బుద్ధిమంతుడు" అన్నాడు రామారావు.
    లతకు మోహన్ గుర్తుకువచ్చి మళ్ళీ బెంగా పట్టుకుంది. కొద్ది రోజులుగా తమకు అతడి పీడలేదుగానీ, ఎప్పుడైనా అతను తమ ఇంటికి రావచ్చునని ఆమెకు తెలుసును. అతను వస్తాడంతే ఆమెకు బెంగగానే వుంటుంది.   
    'ఆ మోహన్ ని ఈ శశికళకు అప్పజేప్పితే బాగా బుద్ధి చెబుతుందేమో?శశికళ బుద్ధిచెప్పితే మాత్రం తనను అతను వదుల్తాడా? సిగ్గులేని మనిషి అతను. తన సమస్యను తనే పరిష్కరించుకోవాలి."   
    మాధవి ఉండగానే అక్కడికి మోహన్ మరోసారి వచ్చాడు. లత అక్కకు అతన్ని గురించి ఏమీ చెప్పలేదు. మాధవి వంటింట్లో పనిచేసుకుంటూ౦టే లత తప్పనిసరిగా డ్రాయింగ్ రూంలోకి వెళ్ళింది.
    "నమస్కారం!" అన్నాడు మోహన్.   
    "నమస్కారం !" అంది లత.   
    "నా గురించి ఆ మాత్రం గుర్తుపెట్టుకున్నందుకు థాంక్సు! కానీ నేనింకా చావలేదు. బ్రతకాలని నాకు లేకపోయినా మీ అయన నన్ను దామోదరం అనే ఆయన్ను కలుసుకోమని సలహా ఇవ్వడంవల్ల ఆ పనిచేసి రావడంకోసం  ఆత్మహత్యను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాను. ఇప్పటికా పని అయింది."   
    "మీరు దామోదరాన్ని   కలుసుకున్నారా?"   
    "కలుసుకున్నాను అప్పుడే నాకు హృదయవిదారకమైన మీ అక్కగారి కధ తెలిసింది."   
    "దామోదరం ఏమన్నాడు?"
    "అయన ఈ జన్మకు పెళ్ళి చేసుకోమన్నాడు " అన్నాడు మోహన్.   
    లత నిట్టూర్చి "అదో విచిత్ర ప్రేమ." అంది.   
    "నేను మిమ్మల్నీ ప్రేమించడం లేదూ__ అలాగే" అన్నారు. మోహన్.   
    "మీ ప్రేమను దామోదరం ప్రేమతో పోల్చకండి" అంది అతనితో మాట్లాడుతూంటే ఆమెకు ముళ్ళమీద కూర్చిన్నట్ట్లుంది.   
    "పోనీ లేండి __ కనీసం నాడి ప్రేమ అని ఒప్పుకున్నారు" అని. "ఒకసారి మీ అక్కను పిలుస్తారా? దామోదరం తరుపున ఆవిడ కేదో చెప్పాలి " అన్నాడు.   
    లత లోనికి వెళ్ళి "దామోదరం నీకేదో కబురు పంపించాట్ట _ ఒకసారి రా" అని పిలిచింది.   
    మాధవి బట్టలు సవరించుకుని  చేల్లిలితో కలసి డ్రాయింగ్ రూంలోకి వెళ్ళింది. ఇద్దరూ కూర్చున్నారు.  
    దామోదరంగారు మీ కధ చెప్పారు. నా గుండె చేరువై పోయింది." అన్నాడు మోహన్.   
    మాధవి మందహాసం చేసింది.   
    "ఇది మగవాడి మోసం. దీనికి ప్రతి క్రియగా వివాహానికే వ్యతిరిక్తత వహించిన మిమ్మల్నభినందిస్తున్నాను" అన్నాడు. మోహన్.   
    మాధవి మళ్ళీ మందహాసం చేసింది.   
    నేనొక సంఘ సంస్కర్తను. మగవాడు సృష్టించిన ఎన్నో సమస్యలు ఆడదానికి మనుగడ అన్నది లేకుండా చేశాయి. వివాహం అన్నది మగవాడు ఆడదానిపై ప్రాతినిధ్యం వహించడం కోసం ఏర్పాటు చేసిన పద్దతి. దీనికి నేనూ మీకులాగే వ్యతిరేకిని ."
    "దామోదరం ఏదో చెప్పడన్నారు...." అంది లత. మధ్యలో కలగజేసుకుని.   
    "అదే చెబుతున్నాను, నన్ను పూర్తీ చెయ్యనివ్వండి" అంటూ "దీనికి నేనూ మీకులాగే వ్యతిరేకిని. వివాహ బంధాన్ని వ్యతిరేకిస్తూ   విప్లవం తీసుకోద్దాం. స్రీ పురుషుల మధ్య స్వేచ్చాశృంగారాన్ని బలపరుద్దాం. ఉదాహరణగా మనమే నిలుద్దాం. ఈ విషయంలో మీ చెల్లెలు లత నాకు పూర్తీ సకరాన్నీస్తుంది. మీ నుంచి కూడా అనబోవడం గమనించి, "అని దామోదరం మీకు చెప్పమన్నాడు" అని పూర్తీ చేశాడు మోహన్.   
    "ఛీ! దామోదరం  ఎన్నటికీ ఇలా చెప్పాడు." అంది లత గట్టిగా.  
    మాధవి మాట్లాడకుండా మందహాసం చేసింది.   
    "కానీ _ దామోదరం నాతో అలాగే చెప్పాడు" అన్నాడు మోహన్.   
    "అవి _ దామోదరం మాటలు కాదు. మీ మాటలే. అంది లాట.   
    "పోనీ __ నా మాటలే అనుకోండి. మీ అభిప్రాయమేమిటి ?" అన్నాడు మోహన్.   
    భర్త ఇచ్చిన చనువును ఆసరాగా తీసుకుని అతనెంత హద్దు మీరినా సహించాగలిగినది కానీ, తన అక్క ఎదురుగా అతనింత పచ్చిగా మాట్లాడేసరికి లత సహించ లేకపోయింది_ "యూ యూ గెటౌట్ !" అంది ఆవేశంగా.   
    "లతా! నువ్వు లోపలకు వెళ్ళు" అంది మాధవి చటుక్కున.   
    "అక్కా!" అంది లత ఆశ్చర్యంగా.
    "అవును _ నువ్వెళ్ళు . ఇతనితో నేను ప్రయివేటుగా మాట్లాడాలి" అంది మాధవి.   
    ఏమనుకుందో లత చటుక్కున అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది.   
    మోహన్ మెరిసే కళ్ళతో మాధవి వంక చూస్తూ __ "లతకంటె అద్భుతమైనది మీ సౌందర్యం . మీ అందం అడవి గాచిన వెన్నెల కావడం నేను సహించలేను" అన్నాడు.   
    "సహించక ఏం చేస్తావ్ ?" అంది.   
    "కొన్నాళ్ళ పాటు నాతో సరదాగా గడిపి _ ఆ తర్వాత మీ చెల్లెల్ని కూడా ఒప్పిస్తే మీరు కోరిన డబ్బిస్తాను. నా పిరులకు అంతం లేదు. ఇందుకు నా స్నేహితుడు రామారావు అంగీకారం ఉంది. మీ సహకారమే కావాలి!"  తొందరగా తన నోటిని పలికించాడు మోహన్.     

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra