Home » Suryadevara rammohan rao » మయసభ

    రాష్ట్రమంతా రాజకీయ వాతావరణం బాగా వేడెక్కిపోయింది.

    ఎమ్. ఎల్. ఏ. క్వర్దార్స్ లో హడావుడి ... సందడి ఊపందుకున్నాయి.

    మాణిక్యం  సలహాతో శంభుప్రసాద్ నుంచి మారుతీ కారు, ఐదులక్షలు నొక్కేసిన ప్రజా ప్రతినిధులు  వీలు చిక్కినప్పుడల్లా నందకిషోర్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు.

    ప్రజల్లోనే కాకా మేధావి వర్గంలో కూడా నందకిషోర్ ... మాణిక్యం చర్చానీయశంమై పోయారు.

    ఎవరు ఉంటారో....?

    ఎవరు ఊడిపోతారో ....?

    అధిష్టాన వర్గం ఎటు మొగ్గు చూపుతుందో?

    ఆపైన ప్రధానమంత్రి ఏమంటారో ? అని రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాల్లో సమాలోచనలు, ఊహాగానాలు వేడెక్కిపోతున్నాయి.

    పత్రికా కార్యాలయాల్లో సబ్ ఎడిటర్స్, న్యూస్ ఎడిటర్స్ , రిపోర్టర్స్ , కర్ స్పాండే౦ట్స్ వేడి వేడి వార్తల కోసం ఆత్రుత కనబరుస్తున్నారు.

    ఒక్క ఎమ్. ఎల్. ఏ. ఢిల్లీ కి బయలుదేరినా ఊహాగానాలు మొదలవుతున్నాయి.

    అయివున్న మంత్రులు .... కావాలనుకునే వాళ్ళు ఏం చెబుతారో అని పవర్ లాబీలోని వ్యక్తులు, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లోని అధికారులు ఆసక్తిని కనబరుస్తున్నారు.

    అందుకు తగట్టుగానే అధికార పీఠానికి కొమ్ము కాచే అతి ముఖ్యమైన వ్యక్తులు కొంపలు అంటుకుపోతున్నట్లు, హైదరాబాదు కి _ ఢిల్లీకి మధ్య తెగ తిరగేస్తున్నారు.

    బ్లాక్ మనీ చాపల క్రింద నుంచి బయటకు ప్రవాహంలా రాసాగింది.

    ఆపైన అది తన ప్రభావాన్ని చూపించసాగింది.

    క్రమంగా నందకిషోర్ శిబిరంలోని వ్యక్తులు మాణిక్యం వేపు మొగ్గు చూపటం బహాటంగానే మొదలయింది.

    గోడమీది పిల్లి వాటం లాంటి అవకాశవాదులు మాణిక్యం పెరటి వేపుకి కళ్ళను చాపారు. ఏదో అద్భుతంకాని, అత్యంత ప్రమాదకరమైన సంఘటన జరిగితే తప్ప నందకిషోర్ తన పదవిని నిలుపుకోలేడని రాజకీయ పండితులు తేల్చిపడేసారు.

    చిన్న వార్త గుప్పుమంటే చాలు....

    దానికి లక్ష  చిలువలు ... కోటి పలువులు....

    గ్రేవ్ వైన్ కమ్యునికేషన్ .....

    అణువంత వార్త అణుబాంబ౦త బర్తగా మారిపోతుంది.....

    సరీగ్గా అలాంటి రాజకీయ కుంపటి రాచుకుంటున్న రోజుల్లో __ ఒక రోజు రాత్రి తోమిదిన్నర గంటలకు రిషి అతి కష్టంమీద అలక్ నిరంజన్ ని తన కస్టడీలోకి తీసుకున్నాడు.

    ఆ వార్తా ఇంకా పేపర్స్ కి ఎక్కలేదు.

    రిషి అలక్ నిరంజన్ ఖైతరబాదు పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్ళాడు.

    ఆ స్టేషన్ లో అందరికి రిషి డి.ఐ. జి. చూడప్పగారి మనిషిని తెలుసు.

    అందుకే వాళ్ళు రిశికి తమ పూర్తీ సహకారాన్ని అందించారు.

    రాత్రి పదిగంటలకు లాకఫ్ లో అలక్ నిరంజన్ బంధించబడి వుంటే అతనికి ఎదురుగా రిషి నించుని వున్నాడు.

    "ఏం జరుగుతుందో వున్నది ఉన్నట్లు చెప్పు.... దాచావో..... దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కో౦టావ్ ....!" రిషి కంఠం నిశ్సబ్దంగా వున్న ఆ సెల్ నలుగు గోడల మధ్య ఖంగుమంది.

    ఇంటరాగేషన్ మొదలయింది.

    అలక్ నిరంజన్ పెదవి విప్పలేదు.

    చట్టానికి అమాయకంగా __ నోట్లో వేలు పెట్టినా కోరకలేనంత అర్భాకుడిగా కనిపిస్తాడు.

    మామూలు __ మంత్రాలు __ తంత్రాలు __ గుండాచారి అంటే తెలీవి వదిలా కనిపిస్తాడు.

    "నీకు , షానవాజ్ కి మధ్య వున్న సంబంధం ఎలాంటిది ....?" రిషి తిరిగి ప్రశ్నించాడు.

    అమాయకంగా తనకేమీ తెలీనట్ట్లుగా చూసాడు. అలక్ నిరంజన్ .

    "ర౦గం సిద్దం అయింది..... ఎవరు సిద్దం చేసారు? ఎవరి కోసం? కట్రాక్ట్ కిల్లర్ ఎవరు?  అతన్ని ఎక్కడి నుంచి రప్పిస్తున్నారు? ఎందుకు రప్పిస్తున్నారు.....?" రిషి కంఠంలో ఒకింత కురుకుదానం చోటు చేసుకుంది.

    అలక్ నిరంజన్ నోరు విప్పలేదు....

    దెయ్యం పట్టిన వాడిలా చూస్తుండిపోయాడు.

    "నువ్వేం చేస్తుంటావ్ ?" రిషి సౌమ్యంగా అడిగాడు.

    "ట్రీ ఏసేస్  క్లబ్ లో డ్రమ్స్ వాయిస్తుంటాను" తిలక్ నిరంజన్ ఏ భావమూ వ్యక్తపరచకుండా అన్నాడు.

    అసలేమీ మాట్లాడడనుకున్న వ్యక్తి నోటినుంచి వివరాలు రావటం ఆరంభమైంది.

    "అదికాక మరేం చేస్తుంటావ్ ....?"
   
    "ఇంకేం చేయను."

    "డ్రమ్స్ వాయిస్తే నీకెంత వస్తుంది?"

    "షుమారు పదిహేను వందలు."

    "రోజుకా? నెలకా?"

    లాకఫ్ బయట ఒకింత దూరంలో వున్న ఆ స్టేషన్ కానిస్టేబుల్స్ ఒక చెవిని ఇటు పడేసి వింటున్నారు.

    "నెలకి."

    "నెలకా?!" ఆశ్చర్యపోయాడు రిషి.

    "అవును" అన్నాడు అలక్ నిరంజన్ .... బలంగా, ఆరోగ్యంగా కనిపిస్తున్న రిషిని తేరిపార జూస్తూ.

    "కిలోమీటర్లు అంటే ఏమిటి?"

    "తెలీదు."

    "కేసేట్స్ అంటే?"

    "కేసేట్స్ ... కిలోమీటర్లుతో దూరాన్ని కొలుస్తారు."

    అలక్ నిరంజన్ వ్యంగ్యంగా అన్నాడా అని ఒక్కక్షణం అతని మొఖంలోకి పరీక్షిగా చూసాడు రిషి.

    అలాంటి భావమేమీ కనిపించలేదు.

    "అది నాకూ తెలుసు.... వాటిని నువ్వు డీ కోడ్  చేయాలి"

    "డీకోడ్ అంటే?"

    రిషిలో సహనం అంచులకు చేరింది.

    కుడిచేతిని స్టిఫ్ గా చేసి, పిడికిలి బిగించాడు.

    "హైర్ అంటే ...?"

    మెరుపు వేగంతో కదిలింది రిషి కుడిచేయి ఫట్ మన్న శబ్దం స్పష్టంగా వినిపించింది.

    రిషి కొట్టిన దెబ్బకు మరికరయితే ప్రాణ భయంతో పెనుకేక వేసి వుండేవాళ్ళు . రౌడీయుజంలో రాటుతేలిన నిరంజన్ కి ఆ దెబ్బ ఒకింత చురుక్కుమనే అనిపించింది. "హైర్ చేసుకోవటమంటే ... తేలేదు పాపం __ నువ్వు పైకి కనిపించేంత మంచివాడివి కాదని అందరికీ తెలుసు నేలకు పదిహేను వందలతో నువ్వు సర్దుకుపోతున్నావా? ఇప్పుడు నీ ఒంటిమీదున్న డ్రస్ ఖరీదు ఐదారొందల దాకా వుంటుంది. నీ జేబులో పర్స వుంది. అదీ పెద్ద పర్సు ... డబ్బు బాగా చేతుల్లో ఆడితేనే అంతలావు పర్స పెట్టుకు౦టారు? నీ చేతికి సిటిజన్ వాచీ వుంది. వెళ్ళకు రెండంగుళాలు ... కాళ్ళకు నిక్ ఘాస్ .... ఆ ఘాసే రెండువెల ఖరీదుంటాయి మీ క్రిమినల్స్ కున్నవి చావు తెలివితేటలు పోలీసులకు లేకపోవచ్చేమో కానీ.... దద్దమ్మలు మాత్రం కాదు నిజం చెప్పు..... ప్రతిరోజూ రాత్రి పదకొండు గంటలకు భాస్కార్ ప్యేలస్ అశోకా నుండి బయటకోస్తున్నావ్.... అక్కడవర్ని కలుస్తున్నావ్ ? నీతో ఆ హొటల్ లో గడుపుతున్న వ్యక్తి ఎవరు? ఫైవ్ స్టార్ హొటల్ కి ప్రతిరోజూ లిక్కర్ టైం లో వెళ్ళగల స్తోమత నీకుందా?"

    సీనియర్ పోలీస్ అయిన స్టేషన్ సి.ఐ రిషి తెల్సుకున్న విషయాల పట్ల విస్మయ పడ్డాడు.

    నిరంజన్ లాకఫ్ కటకటాల్లోంచి ఆ స్టేషన్ సిబ్బందిని గమనించాడు. కాని పెదవి విప్పలేదు.

    "నీకు ,మరో పేరుంది కదూ?" రిషి తిరిగి ప్రశిమ్చాడు.

    అతను తలూపాడు.

    "ఏమిటది ....?"

    "ప్రిన్స్" నిరంజన్ నెమ్మదిగా అన్నాడు.

    "డి.డే ఎప్పుడు....?|

    "డి.డే ఏమిటి?"

    "డై.డ్ లైన్ డే.... ఎంత గొప్పగా ఏమీ తెలీనట్లు నాటకం అడుతున్నావ్ ....?" రిషి సర్ క్కాస్టిగ్గా అన్నాడు.

    "నాకేమీ తెలీదు.... మీరేం అడుగుతున్నారో నాకర్ధం కావటం లేదు." నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు నిరంజన్.

    ఫట్.... మంటూ నిరంజన్ దవడ పేలిపోయింది.

    ఈసారి ఒకింత తూలీపడ్డాడు రిషీ దెబ్బకు.

    "వీడిలా సమాధానం ఇవ్వడు. వీడ్ని జాగ్రత్తగా గమనిస్తూ వుండండి. వీడి వెనుక చాలా పెద్దమనుష్యులున్నారు. బహుశా ఈపాటికి ఈ సంగతి వాళ్ళకు తెలిసిపోయి వుంటుంది. నేను వీడి ఇంటికి వెళ్ళివస్తాను __" అని ఆ స్టేషన్ సి.ఐ.కి చెప్పి వేగంగా బయటకు వెళ్ళి జీఫ్ ఎక్కాడు.

    అది మరుక్షణం ముందుకు దూకింది.

                                                              *    *    *    *   

    "సార్... " చూడప్ప పి.ఏ ఆయనతో ఏదో చెప్పేందుకు సందేహిస్తున్నాడు.

    అప్పుడు సమయం రాత్రి పదిగంటలు.....

    చూడప్ప ఇంటికి వెళ్లేందుకు సిద్దమవుతున్న క్షణాలవి.....

    "ఎస్..... చెప్పు...." చూడప్ప సిగార్ లోని మసిని ఏష్ ట్రేలోకి వంపుతూ అన్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra