Home » Kommanapalli ganapathi rao » అసురవేదం

   

     కొద్దిగా త్రోటుపడ్డాడు ఆమె నిశిత దృక్కుల్ని చూడగానే . "అదే ... సో ... పార్టీ యివ్వబోతున్నారు."

    అతని సాహసానికి అభినందనో లేక అంతదాకా దర్పాన్ని ప్రదర్శించిన అతనిలో కనిపిస్తున్న కంగారుని చూసి ఆనందమో మరి పంటిబిగువున నవ్వుకుంటూ అంది "ఎప్పుడు కావాలి?"

    గొంతు తడారిపోతుంటే "వ ... వద్దు " అన్నాడు.

    ఇప్పుడిక నవ్వాపు కోలేకపోయింది "ఇస్తానులెండి! కాని ఇప్పుడు కాదు."

    "మ ... మరి?"

    "నన్ను చూస్తూ మీరలా త్రోట్రపడటం మానేసినప్పుడు " హానిత వెళ్ళిపోయింది.

    చాలాసేపటిదాకా తేరుకోలేకపోయాడు. తన తొందరపాటుకి ఉక్రోషమో లేక ఆమెని మరికొంచెంసేపు మాటల్లోకి దింపి అక్కడే ఉండేట్టు చేయనందుకు ఉద్వేగామూ మరి ఆవేశంగా పిడికిలితో టేబుల్ అంచుపైన గుద్దాడు.

    "ఎస్" కిరీటి చేయి తాకిడితో బజర్ మోగిన వెంటనే లోపలి వచ్చింది ఓ యువతి చేతిలో పెం తో.

    "గుడ్ మానింగ్ సర్!" అనబావుయిన ఆమె "హాయ్!" అంటూ గాలి అల్లా అతన్ని చేరుకొని "యూ .... నువ్వా? నేను నీ పియ్యేని " అంది ఆనందంతో ఊగిపోతూ.

    ఫ్రాక్ లో ఉన్న ఆమె నున్నటి పిక్కల్నే అంతవరకూ చూస్తున్న కిరీటి ఇప్పుడు పియ్యేనంటూ సమీపంలో నిలబడ్డ అమమయిని చూసి ఎంతగా అప్రతిభుడయ్యాడూ అంటే "మొనీ ..... నువ్వా?" అన్నాడు గుటకలు వేస్తూ.

    "ఎస్ డాళింగ్ " ఇంచుమించు అతన్ని చుట్టేయబోతుంటే హఠాత్తుగా తన పొజిషన్ గుర్తుకొచ్చినట్టు ఆమెకు చేటులడ్డం పెట్టాడు.

    "కిట్టూ హౌ నైస్ టు సీ  యూ?"

    "మొనీ .... ప్లీజ్ " ఆమెను విడిపించుకొని దూరంగా జరిగాడు.

    "ఎంత అదృష్టం! అప్పుడు తప్పించుకున్నావు. ఇక దగ్గరే ఉంటావు కాబట్టి సరదా పుట్టినప్పుడల్లా లోపలికి పోవచ్చు ...." వెనుక వున్న బెడ్ రూమ్ వేపు చూపించింది మోనీ.

    పెద్ద కంపెనీల టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ రిలాక్స్ కావటానికి ఇలా బెడ్ రూమ్ ఉండటం సంప్రదాయమని కిరీటికి తెలసినా, అది కాలు జారతానికి కన్వినేంటు గా కట్టినట్టుంది అనుకున్నాడు.

    ఎప్పుడో యూనివర్సీటిలో ఇంజనీరింగ్ చదివేటప్పుడు మోనీ యింట్లోనే అద్దెకుండేవాడు కిరీటి 'ఒక్కసారి' అంటూ వెంటపడే మోనీని అన్నాళ్ళూ తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడిలా ఈ స్థానంలో ప్రత్యక్ష మౌతుందని ఊహించలేకపోయాడు.

    "ఒక్కసారి" మోనీ మళ్ళీ మొదలుపెట్టింది విరహంతో.
       
                                                             *    *    *    *

    సరిగ్గా మూడు గంటల ప్రాంతంలో ......

    బోర్డు డైరెక్టర్స్ ఉన్న హాల్లోకి అడుగుపెట్టాడు కిరీటి.  అతని కోసమే  అంతదాకా ఎదురు చూస్తున్నట్టు ఓ మూలగా కూర్చున్న హనిత కిరీటిని మృదువుగా ఆహ్వానించి ఒక్కొక్కరికీ పరిచయం చేస్తుంటే కరచాలనం చేస్తూ ఒక్కో వ్యక్తినుంచి నెమ్మదిగా కదులుతున్నాడు.

    చేతులు కలుసుకునేటప్పుడు ఒక్కో వ్యక్తి ముఖకవళికల్నీ గమనించడం అతను మరచిపోలేదు.

    హనిత టెన్షన్ తో చూస్తూంది కీరీటినే.

    కరచాలనంతో ఏ స్పర్శను గుర్తుచేసుకోడానికో అన్నట్టు సర్వెంద్రియలన్నీ కేంద్రీకరించి చాలా ఏకాగ్రతగా ఒక్కో అడుగూ ముందు కేస్తున్న కిరిటీ టక్కున ఆగిపోయాడు.

    అదే!

    బాల్కానీ పైనుంచి జారిపోతూ బలంగా తను ఒడిసిపట్టుకున్న స్పర్శయిదే!

    కుడిచేతిని కరచలానం కోసం అందించిన ఆ వ్యక్తి కళ్ళలో ఇప్పుడు అందోళన స్పష్టంగా కనిపిస్తూంది.

    అతను సత్యానంద్!

    కిరీటి అక్కడ ఆగిపోలేదు.

    "సర్ .... టైమెంతయింది?"

    ఇప్పుడు సత్యానంద్ జరుగుతున్నదేమిటో గుర్తించేలోగానే అమాంతము అతని చేతిని పైకెత్తి మోచేతిదాకా ఉన్న అతని కోటును వెనక్కీ జరిపాడు కిరీటి.

    విదిలించుకోవాలనుకున్న సత్యానంద్ ప్రయత్నం ఫలించలేదు. కిరీటి పిడికిళ్ళు మరింత బలంగా బిగుసుకున్నాయి.

    "మీ రిస్ట్ వాచ్ అయిదు నిముషాలు పాస్టుంది" ఓ రహస్యం చెబుతున్నట్టు నెమ్మదిగా అన్నాడు కిరిటీ. "బహుశా రాత్రినుంచీ ఇలాగే ఉండి వుంటుంది."

    కొద్దిగా పట్టు సడలించడంతో సత్యానంద్ చేతిని వెనక్కీ లాక్కుని " ఈ నాస్నేన్ ఏమిటి?" అన్నాడు విసుగ్గా .

    అక్కడ ప్రభంజనరావు ఎలిజిబెత్, శివరావులు మాత్రమె కాదు, హనిత కూడా ఏం ఆశించి కిరీటి ఇదంతా చేస్తున్నదీ అర్ధం కానట్టు చూస్తోంది.

    "వెల్! నేను వెళ్ళాలి" మామూలుగా ప్రసన్నత నటిస్తూ సత్యా నంద్ తో అన్నాడు. "మరేం లేదు. ఎందుకయినా మంచిది మీ టైమ్ కరెక్ట్ చేసుకోండి. ఈ స్థాయిలో ఉన్న మీకు ఇది చెప్పాల్సిన అగత్యం రావడం దురదృష్టం" తన ఉద్దేశాన్ని నిగూడంగా వ్యక్తం చేయడాన్ని సత్యానంద్ సులభంగా గ్రహించేశాడు.

    కేవలం ఒక వాస్తవాన్ని తెలుసుకోవడానికి కిరీటి ప్రోద్భలం పైనే హనిత ఈ సమావేశం ఏర్పాటు చేసి౦దని ఒక్క సత్యానంద్ తప్పఅక్కడ మరెవరూ గుర్తించలేకపోయారు.

    "గౌరవనీయులైన మీ అందరికి యీ సందర్భంలో ఒక విన్నపం." వెళ్ళబోతూ ఆగిన కిరీటి ఇప్పుడందర్నీ చాలా నిశితంగా చూస్తూ అన్నాడు. "ఈ సంస్థ మీది! సంస్థలో సర్వసానికీ అధిపతులు మీరు. నేనో ఉద్యోగిని మాత్రమె. ఒక అసాధారణమయిన బాధ్యతని నాకు అప్పజెప్పిన మీ ఊహామేరకి ఎదిగే నా ప్రయత్నంలో మీ అందలేని నేను ఒక్క అంగుళం సైతం ముందుకు సగాలేను. ఈ ప్రోసెస్ లో ఎక్కడయినా మీకు ఇష్టం కలిగేట్టు నేను ప్రవర్తించినట్టు అనిపించినా సంస్థ నష్టాన్ని ఆశించక మాత్రమే అని మీరు నమ్మితీరాలి. బహుశా యిలా మిమ్మల్ని మరోసారి కలిసే అవకాశం రాకపోవచ్చు" కిరీటి ఇప్పుడు సత్యానంద్ వేపు దృష్టిని సారించాడు. "ఇలా రప్పించుకోరనే నేనూ బలంగా విశ్వసింస్తున్నాను. ఒక్క మూడు ఇల్లు అవకాషమివ్వండి. నేనేమిటో ఇంకా మిరూపిస్తాను. బై!"

    కిరీటి సెలవు తీసుకుంటున్నట్టు విష్ చేసి గది బయటికి నడిచాడు. ఇప్పుడతను చెప్పింది అందరికీ అర్ధమైనట్టే ఉంటూ కొంత అర్ధంకానట్ట అనిపించింది. ఎంత జాయింట్ జనరల్ మేనేజర్ అయినా కిరీటి తనుకింద ఓ ఉద్యోగి మాత్రమే. అందుకే  అతని మాటల్లో అస్పష్టంగానైనా కనిపించిన కొద్దిపాటి అహం ఒక వ్యక్తిని మాత్రం చాలా ఇద్రేకపరిచింది కాని, నిభాయించుకున్నాడు.

    హనిత అప్పటికే బిల్డింగ్ పోర్టి కోలో కారెక్కబోతున్న కిరీటిని చేరుకుంది.

    అది అనుకూలమైన ప్రదేశం కాదని ఆమెకీ తెలుసు. కిరీటితో తన చనువు ఎందరికి కన్నేర్రగా మారేదీ కూడా ఆమె గ్రహించగలిగే విషయమే అయిన తమాయించు కోలేకపోయింది.

    ఇందాక సత్యానంద్ తో చేతిని కలుపుతూ కిరీటి ప్రవర్తించిన తీరులో ఒక చిక్కుప్రశ్నకు జవాబు దొరికినట్టనపించినా _ ప్రత్యేకించి అతన్నే కిరీటి ఎందుకు అవమానించింది ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంది.

    "ఎక్స్ క్యూజ్ మీ" హనిత కంఠం వింటూ కారెక్కబోయిన కిరీటి ఆగి వెనక్కీ తిరిగాడు.

    "యూ హేవ్ టు ఎక్స్ క్యూజ్ మీ ఫార్ మై బి హేవయర్ విత్ యువర్ బోర్డ్ డైరెక్టర్స్ " చిద్విలాసంగా నవ్వుతూ అన్నాడు.

    "అదే . అలాంటి స్థితిలో సైతం అతనిలోని ఆ ప్రసన్నతే ఆమెను మరింత అక్జట్టుకుంటున్న విషయం. తను అందుకే ఆకర్షితురాలవుతుందా అన్న సత్యం ఆమెకు స్పష్టంగా స్పురించటం లేదు. చాలా విషయాల్లో హుందాగా ప్రవర్తించగలిగే  హనిత ఇప్పుడిప్పుడు అతని ముందు శ్రోతగా మారడంలో ఆసక్తి ప్రదర్శించడం ఆమెకి బోధపడి పోతూనే ఉంది.

    "మిస్ హనితా .... ఒక విషయం చెప్పనా?" రెండు చేతుల్లో తలని సవరించుకుంటూ రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తూ అన్నాడు. "ఇచ్చిన మాట ప్రకారం హంతకుడేవరో తెలుసుకోగలిగానన్నది మీరీపాటికి అర్ధం చేసుకునే వుంటారు."

    తల ప౦కించింది మృదువుగా.

    నాకు తెలుసు. నేను సత్యానంద్ గారినే ఎందుకు అనుమానిస్తున్నానూ, ఏ వాస్తవం, తెలుసుకోవడానికి అతణ్ణి టైమ్ అడిగానూ అన్నది మీరు తెలుసుకోవలనుకుంటున్నారు. వెల్ .... నిన్నరాత్రి బాల్కనీ పైనుంచి జారిపడుతూ నన్ను నెత్తిన ప్రత్యర్ధి చేతులనే ఆసరాగా తీసుకుని పైకి వచ్చిన నేను ఇందాక ఏకాగ్రతగా చేతుల్ని కలుపుతూ పరిశీలించి౦ది ఆ స్పర్శని గ్రహించాలని. ఇది నాకు సత్యానంద్ లో దొరికింది. మరింత వివరంగా సంగతేమిటో గ్రహించాలనే అయన చేతి రిస్టువాచీ చూడాలని చేతిని కాస్త పైకెత్తాను. మోచేతిపై నున్న కొటుని కాస్త వెనక్కీ జరిపాను." ఓ క్షణమాగి అన్నాడు. "సత్యానంద్ గార్ని మొదట నేను ఇంటర్వ్యూ లో చూసినప్పుడు అయన పుల్ హేండ్స్ షర్టులో లేడు."

    అప్పుడు గుర్తొచ్చింది హనితకి అయన అసలు ఏనాడూ పుల్ హేండ్స్ షర్టు వేసుకుని విషయం. "ఎప్పుడూ స్టాక్ లోనే వుంటారాయన."

    "కాని ఈ రోజు పనిగట్టుకుని సూట్ లో వచ్చారాయన. ఇంట ర్వ్యూలు నిర్వహించడంలాంటి ప్రత్యెకమయిన కార్యక్రమానికి సూట్ లో రానివాడు ఈ రోజు అలాంటి అలంకరణలో రావడమే ముందు నన్ను ఆకట్టుకున్న విషయం కూడా. అందుకే అక్కడ అనుమానం మొదలైన నేను చివరకి కోటు మోచేతి పైనుంచి వెనక్కీ జరిపేదాకా వెళ్ళాను. ఎందుకంటే __ నా గోళ్ళ రాపిడితో అయిన స్క్రేచేస్ చెక్ చేయడానికి ." 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra