Home » Kommanapalli ganapathi rao » అసురవేదం

   

  ఆ వాక్యంలో భావన అతనికి పూర్తిగా అర్ధంకాలేదు. కాని సరాసరి 'శృ౦గారం' అన్న పదాన్ని ఉపయోగించి అతని వయసు తగ్గించడంతో పరవశంగా అనిపించింది.

    "ఆ వ్యవహారమేమిటో చేపోచ్చుగా ?" గాలికి ఎగురుతున్న పావడా హఠాత్తుగా మోకాళ్ళదాకా లేవడంతో పసిమిచాయలో కనిపించిన కాళ్ళ నునుపు అరక్షణంపాటు అతన్ని వివశుణ్ణి చేసింది.

    "రణధీర్ చెబుతుండేవాడు" మోకాళ్ళను ముడుచుకుంటూ అంది __ "మీ అందరి గురించీ."

    "ఏమని?"

    "బయట మగాళ్ళలా బొర విరుచుకునే మీరంతా హానితముందు హఠాత్తుగా నపుంసకులై పోతుంటారని."

    ప్రభంజనరావు మొహం వివర్ణమైపోయింది.

    "ఏం కోపమొచ్చిందా?" నవ్వేసింది ఒళ్ళు విరుచుకుంటూ _ "ఆఫ్ కోర్స్ _ కాస్త అప్పుడప్పుడైనా మగాడిలా వ్యవహరించగలిగేది నువ్వే అని కూడా చెప్పాడు."

    పైకి లేచి రెండడుగులు ప్రభంజనరావువైపు నడిచింది.

    "నిజం చెప్పనా. కేవలం అది తెలుసుకున్నాకనే నీతో ఫోన్ లో మాట్లాడాలనిపించింది. నీకు మాత్రమే న ఆనికిని తెలియచేసింది. కూడా."

    ఇప్పుడు కొద్దిగా తేరుకున్నాడు. "ఆశ్చర్యంగా ఉంది సాకేతా "

    "దేనికి?"

    "నిన్నగాక మొన్నరణధీర్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నందుకే అంత రియాక్టయిన నువ్వు ఇప్పుడు రణధీర్ పోయినా ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నందుకు ."

    "ప్రశాంతంగా ఉంటే హానితకెలా ఫోన్ చేసేదాన్ని?"

    "నిజమా?" ఇప్పుడు ప్రభంజనరావు ఆశ్చర్యాన్ని అభినయించాడు. "నువ్వు హానితతో మాట్లాడావా?"

    "మాట్లాడడమే కాదు , కలసుకున్నాను కూడా" ఓ స్వప్నంలోలా అంది.

    "దేనికోసం?"

    "రణధీర్ ని హత్య చేయించిన ఆమెకు వ్యక్తిగతంగా కనిపించి ముందు కంగారు పెట్టాలని . ఆ తరువాత నేనెవరో, నాకూ రణధీర్ కీ ఉన్న సంబంధంమేమిటో తెలియచేసి, ఆమె తండ్రి నా తల్లికి చేసిన అన్యాయాన్ని వివరించాలని...."

    "చెప్పవా?"

    "ఎస్ .... చెప్పడమే కాదు. చాలా త్వరలో ప్రతికాముఖంగా నా తల్లి ఎలా మోసపోయిందీ బయటపెట్టి పరువు తీస్తానన్నాను కూడా."

    "నమ్మిందా?"

    "నన్ను చూడగానే ముందు ఉలిక్కిపడింది. నేను చెప్పింది నమంబట్టే ఈ విషయాన్ని బయట పెట్టోద్దని డబ్బు ఆశ చూపించింది. కూడా."

    హనిత ఈ మధ్య అస్పష్టంగానయినా అందోళన చెందుతూ౦డడం అతనూ కనిపెడుతూనే ఉన్నాడు.

    "డబ్బు తీసుకున్నావా?"

    "తీసుకుంటే నామీద హత్యా ప్రయత్నాలు ఎందుకు ప్రారంభింస్తుంది?"

    ప్రభంజనరావు భృకుటి ముడిపడింది. అసూర్యంపశ్యలా బ్రతుకుతూ చాలా నైతికవిలువలున్న ఆడపిల్లలా కనిపించే హనితా, ఇలాంటి ప్రయత్నానికి పూనుకుందీ అంటే నమ్మశక్యంగా లేదు. ఆమెకున్న పరిమితమైన పరిచయాలతో ఎవరి అండతో ఇదంతా చేయించగలదని?

    హఠాత్తుగా అతనికి స్విస్ ఫైలు గుర్తుకొచ్చింది.

    ఒక్క పేరుతో తన గొంతు నొక్కేసిన హనిత, చాలా నిశ్సబ్దంగా తన గురించే ఇన్ని వివరాలు సేకరించిన హనిత ఇంత స్వల్ప విషయాన్ని సునాయాసంగా సాధించగలదు. ఉక్రోషంగా __ "హనిత చాలా నెట్ వర్క్ ఉన్న ఆడపిల్ల సాకేతా .... అనుకున్నది ఏదన్నా చేసి తీరుతుంది. తన ఉనికితో ద్వజ స్థంబాన్ని కుడిపేయగలుగుతున్నా హనిత నీ విషయంలోనూ అనుకున్నది పూర్తీ చేస్తుంది."

    "మిస్టర్ ప్రభంజనరావ్!" సాకేత కళ్ళినప్పుడు నిప్పుల్ని వర్షిస్తున్నాయి. "నిన్ను పిలిచింది ఆమె గొప్పతనాన్ని ఏకరుపు పెట్టమని కాదు. డబ్బుతో, పరపతితో తను ఏమైనా చేయగలదన్న నమ్మకానికి నేను వారధి అయ్యేట్టు నాకు అండగా నిలబడమని."

    "తట్టుకోగలవా?" నిశితంగా చూస్తూ అన్నాడు.

    "మానసికంగానా? వెల్ ..... అదే అయితే నాకు పుష్కలంగా ఉంది. కాని నేనొక మధ్యతరగతి ఆడపిల్లని. మోసపోయిన ఒక తల్లికికూతురుగా బ్రతుకుతెరువే ఒక సమస్యగా మారిన __ లేనిదాన్ని కాబట్టి నీ సహాయాన్ని అర్దిస్తున్నది. చెప్పు అడుగడుగునా మృత్యువులా వెంటబడుతున్న ఓ ముఠానుంచి నన్ను కాపాడగలవా? నాకు రక్షణఇచ్చి ఆ ఇంటి పరువు తీసే నా యజ్ఞంలో నీ సంస్థ ప్రతిష్ట సమిధంగా మరేదాకా  అయినా ....."

    "నో!" అసహనంగా వారించాడు. "ఇప్పుడు నువ్వు చేయాల్సింది అది కాదు. సుదర్శనరావు ప్రతిష్టని వ్యక్తిగతంగా దిగజార్చిన మరుక్షణం నిజంగా అది సంస్థకి గొడ్డలిపెట్టు అవుతుంది. అప్పుడు నష్టపోయేది అతడొక్కడే కాదు. ఆ సంస్థలో భాగస్వామ్యులమైన మేం కూడా."

    "సరే" ఇక మాట్లాడేదేమీ లేనట్టు ఆమె రెండడుగులు నడిచింది. "నీతో సాధ్యం కానప్పుడు ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు."

    "సాకేతా ....." వారించాడు ప్రభంజనరావు. "మరో పద్దతి ఆలోచిద్దాం."

    "బహుశా అంతవరకూ నేను మిగలను ." సాకేత నేత్రాలిప్పుడు కవోష్టరుధిరాంబరాలలాఉన్నాయి. "ప్రభంజనరావ్! రణధీర్ మరణంతో మిగిలిన ఒక్క అసరానీ పోగొట్టుకున్నదాన్ని- ఇక నేను బ్రతికే అవసర మంటూ ఉంటే వృద్దురాలయిన నా తల్లి కోసం మాత్రం. ఆమె సైతం ఏనాడో మానసికంగా చచ్చిపోయింది అలాంటి స్థితి నేను కోరనిదాన్ని కాబట్టే మొ౦డిగా ఇక్కడ తిరుగుబాటుకి సిద్దపడింది."

    "నీకు రక్షణే అవసరమైతే అది నేను ఏర్పాటు చేస్తాను."

    "కాని హనిత నీకన్న బలవంతురాలు . నీ రక్షణవలయాన్ని చేధించినాదాకా రాగలదు. నువ్వు నాకు సహకరింస్తున్నానని తెలిస్తే నీ అంతుచూడగలదు."

    "ఆ చివరి వాక్యానికే పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు. ఆమె చెప్పింది తిరుగులేని సత్యం. తన రహస్య పుటల్ని చదివిన హనిత చేతిలో ఉన్న ఫైలు చాలు, ఈ యజ్ఞంలో తనను ముందు సమిధని చేయటానికి.......

    ఇదమిత్ధంగా ఇదీ అని తోచడంలేదు. కాని సాకేత అవసరం తనకి చ్గాలా ఉందనిపిస్తూంది. సుదర్శనరావుని ఆప్రతిష్టపాలు చేయడం కాకా మరో మార్గంలో హనితనే సరాసరి సాధించడానికి సాకేత ఉనికి అనవసరమనిపిస్తూంది.

    "సాకేతా ....." నడుస్తున ఆమెను అనుసరిస్తున్నాడిప్పుడు. "నీకు శాశ్వతంగా రక్షణ వెళ్ళనియ్" ఆమె నడకవేగాన్ని పెంచింది. "జీర్ణంచుకోలేని నిప్పుల స్మృతుల్ని మింగుతున్న ఒక చకోరంలాంటి నాకు నువ్వేం సహాకరించగలవు?"

    ప్రభంజనరావు     మరేదో చెప్పబోతూ చూశాడు.

    సరిగ్గా అదే సమయంలో రోడ్డుమీద ఓ జీఫ్ ఆగింది.

    అదికాదు ఆ క్షణంలో ప్రభంజనరావునంతగా ఆకట్టుకున్నది దృఢకాయులయిన కొందరు వ్యక్తులు జీపు డదిగి తమవేపే వస్తున్నారు.

    సాకేత చెప్పిన విషయం స్పురణకు రావడంతోబాటు వారు హనితమనుషులే అయితే యిక ఆ క్షణమే సాకేతకి శాశ్వతంగా చివరిక్షణం అవుతుందని స్ప్రురించడానికి అట్టే సమయం పట్టలేదు.
   
    ఇప్పుడు సాకేతని రక్షించడమొక్కటే కాదు, తన ఉనికి బయట పడకూడదు.    

    అమాంతం సాకేత చేతిని పట్టుకున్నాడు ప్రభంజనరావు. అప్పటికే ప్రమాదాన్ని పసిగట్టునట్టు ఆమె నేత్రాల్లోనూ అందోళన స్పష్టమౌతుంది.

    మరో రెండు నిముషాలు చాలు అగంతకులు సమీపించడానికి. సరిగ్గా అప్పుడే కొందరు వ్యక్తులు శాంతి ఆశ్రమంలో నుంచి గుంపుగా బయటకి వచ్చారు.

    అదే అగంతుకుల్ని కాని, ప్రభజనరావు అవకాశం తీసుకునే అవకాశం కల్పించింది గానీ __

    అంతే ....

    మరో మూడు నిముషాల్లో సాకేతతోబాటు తన కారును చేరుకున ప్రభంజనరావు, సాకేత కారులో కూర్చోగానే వేగంగా ముందుకు పోనిచ్చాడు.

    ఏనాడూ కారునంత వేగంగా నడపని ప్రభంజనరావు నుదురు ఇప్పుడు స్వేదంతో తడిసిపోయింది.

    రియర్ వ్యూ మిర్రర్ లో చాలా స్పష్టంగా కనిపిస్తూంది వే౦టాడుతున్న జీపు.

    ఇప్పుడు ప్రభంజనరావు ఆలోచిస్తున్నది సాకేత గురించి కాదు. తన కారు నెంబరు నోట్ చేసివుంటారు. అది హనితదాకా వెళ్ళిపోతుంది. తన ప్రత్యర్ధితో చేతులు కలిపినా నేరానికి రేపిపాటీకల్లా బహుశా హనిత తనపై కక్ష తీర్చుకుంటుంది.

    కారు న్యూకాలనీ పైనుంచి కంచరపాలెంవేపు దూసుకుపోతూంది.

    మర్రిపాలెం చేరుతుండగా ఓ పశువుల మంద రోడ్డుకి అడ్డంగా రావడంతో తప్పనిసరయినట్టు కారాపాడు.

    సుమారు పదినిముషాల ప్రయాణంలో విపరీతమయిన అలజడికి లోనైన ప్రభంజనరావు తేరుకుని బెక పైనుంచి పాదం తీస్తూ చూశాడు.

    వేగంగా కారులోనుంచి దిగిన సాకేత పరుగులాంటి నడకతో సమీపంలోని ఇళ్ళమధ్యగా వెళ్ళిపోతూంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra