Home » Kommanapalli ganapathi rao » అసురవేదం

  

     ఎలిజిబెత్, శివరావు తటస్థంగా ఉండి కూడా యిక చేసేదేమీలేనట్టు యాంత్రికంగా సంతకాలు చేసి వెళ్ళిపోయాడు.

    హనితకి బోధపడింది ఒక్క డాడీ తప్ప తన అభిప్రాయాన్ని మరెవరూ అమోదించినట్టు.

    ఇప్పుడా గదిలో కొన్ని క్షనక్రితం ఇంటర్వ్యూ జరిగినట్టు లేదు. ఉద్వేగంగా లేచిన అసహనంగా తనూ సంతకం చేసి బయట పడ్డాడు.
   
    అందరూ యింత బాహాటంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే హనిత కూడా నిర్విర్ణులైంది. తనకు తెలసీ యింత సూటిగా అంతా తమ అయిష్టాన్ని వ్యక్తం చేయడం తొలిసారి.

    ఇప్పుడా గదిలో మిగిలింది ప్రభంజనరావు మాత్రమె.

    తన ఉద్రేకాన్నీ ఆవేశాన్నీ ధైర్యంగా ప్రకటించడానికి యింతకన్నా మంచి అవకాశం రాదన్నట్టు చూశాడు. ఇక్కడ తన కేండిడేట్ శశిధర్ సెలెక్ట్ కాలేదన్న భావంకన్నా నిన్నగాక మొన్న అమాయకంగా సామ్రాజ్యంలో అడుగు పెట్టిన ఒక ఆడపిల్ల క్రమంగా తమ శక్తిల్ని విచ్చిన్నం చేసి తమ సమర్ధతలని చాలెంజ్ చేస్తుందన్న ఆలోచనే అతన్ని డామినేట్ చేస్తూంది.

    మొన్న రణధీర్ .....

    తరువాత యిది ....

    ఇది ఇలాగే కొనసాగితే .....

    "మిస్ హనితా!" అనారోగ్యంతో బాధపడే తండ్రికి యిక్కడ జరిగేదేమీ చెప్పదన్నంత ధీమాతో పిలిచాడు. ఇప్పుడతడి గొంతులో శ్రావ్యత లేదు. "యూ ఆర్ ఎక్సిడింగ్ యువర్ లిమిట్స్."

    హానితలో ఎలాంటి భావమూ ద్యోతం కాలేదు. యధాలాపంగా చూస్తూంది.

    "ఇప్పుడు నేను సంతకం చేయదలుచుకోలేదు" కర్కశంగా అన్నాడు తనను తాను నిభాయించుకోలేనట్టు.

    "ఇప్పుడిక అవసరం లేదనుకుంటా నంకుల్! బోర్డు చైర్మెన్ బాటు మెజారిటీ మేమ్బర్సు ఆమోదముద్ర వేశారు" ఆమె కళ్ళలో అదే ప్రశాంతత!

    ప్రభంజనరావు మరింతగా సహనాన్ని కోల్పోయాడు. "అసలు నీ ఉద్దేశం ఏమిటి> బోర్డు మేమ్బర్సు గా మాకు ఏ అధికారం లేకుండా చేద్దామనుకుంటున్నావా?"

    "లేకపోవడమేమిటి అంకుల్? ఇందులో నాకు వ్యక్తిగతమయిన ఇష్టమేదో ఉన్నట్టు ఎందుకనకుంటున్నారు .....? నేను అలోచిస్తున్నది న అగురిమ్చి కాదు. మనందరికీ చెందిన సంస్థ గురించే."

    "నాకలా అనిపించడంలేదు."

    "దానికి నేను బాధ్యురాల్నా?'

    "ఎస్ ..... నువ్వే .... యిది నీ సొంత ఫ్యాక్టరీలా  భావిస్తున్నావు."

    హానిత మనసు చివుక్కుమన్నా నిగ్రహించుకుంది.

    "అందరికన్నా నీమేదే అపారమైందీ ఉన్న బహావ్మ్తావు బోర్డుమెంబరుగాకాక ఎం.డి. కూతురుగా నీ నిర్ణయాలని తీసుకుంటూమ్మమ్మల్ని వుత్సవ విగ్రహాలుగా మార్చాలనుకుంటున్నావు ...." అగాడే క్షణం.

    "కమ్ అవుట్ అంకుల్! మీ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పండి చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో అతని సైకలాజికలుగా డీల్ చేయడం మొదలుపెట్టింది.

    "ఇది ఇలా కొనసాగితే...."

    "కొనసాగితే?' యిలాంటి సన్నివేశం తను ఎదుర్కోవాల్సి వస్తు౦దని ఆమెకీ తెలుసు కానీ యింత త్వరగా ఎదురవుతుందని ఊహించలేక పోయింది. "చెప్పండి  ...  ఏం జరుగుతుంది?"

    "కంపెనీలన్నీ మూతబడతాయి."

    "అది కాకూడదనే నేనిప్పుడు ప్రక్షాళన కార్యక్రమం మొదలు పెట్టింది."

    "మాకూ బాధ్యతులున్నాయి."

    "కానీ అవి సకాలంలో నిర్వర్తించాలి!"

    "హనితా!" అతడి ఎలాగూ కారాస్థాయికి చేరుకుంది.

    "ఆవేశపడకు అంకుల్! ఎలాగూ అడిగావు కాబట్టి చెప్పేది విను. ఇది అంతటితో ఆగదు. ఈ సంస్థకి పట్టిన చీడపురుగుల్ని సమూలంగా పెరికేస్తే తప్ప నేను విశ్రమించకూడదునుకుంటున్నాను"

    ప్రభంజరావు రొప్పుతున్నాడు ఆవేశంగా __ "నాకూ షేర్సు వున్నాయి."

    "కానీ మీరు మీకు మాత్రయే షేర్సున్నట్టు మాట్లాడుతున్నారు"

    "హనితా!"

    "అరవకు" ఇప్పుడామె ఓర్పు నశించిందేమో ఆవేశంగా లేచి తన పర్సనల్ కఫ్ బోర్డ్ తెరచి ఓ ఫైలు తెచ్చి అతని ముందుంచింది.

    "ఇంత బాధ్యతగా మాటలాడుతున్న మిష్టర్ ప్రభంజరావ్ ! ఒక్కసారి ఆ ఫైలులోకి చూడండి."

    ప్రభంజనరావు నుదుట చెమట పట్టేసింది అప్పటికే.

    "అమ్నేస్టీ ఫర్ వయోలెటర్స్ గురించి తెలుసానుకుంటాను. పార్లమెంటులో 1987 మార్చి 31 వ తేదిన ఓ నిర్ణయం జరిగింది" అంది హనిత.

    ఆమె చెబుతున్నదేమిటో అతని కర్ధంకావడంలేదు ద్రిగ్భంతితో చూస్తూండిపోయాడు.

    "విదేశాలల్లో స్గేర్సు గాని, రహస్యంగా డిడెంచర్స్ బాండ్స్ ఆస్థులు గాని ఉన్నవాళ్ళు చట్టరీత్యా నేరస్థులు! మీకు స్విచ్ బ్యాంక్ లో ఓ అకౌంట్ వుంది. అది కూడా మీ స్వార్ధ్జితం కాదు. మన సంస్థ జపాన్ మిత్స్ బిషి నుంచి రెండు షిప్స్ కొనుగోలు చేసే భాద్యత మీకు అప్పజేపితే లవాదీవీలలో మీరే రెండు శతం లంచం తీసుకుని ఆ డబ్బుని స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేయించారు. ఆ ఫైల్లో మొదటి పేపరుందే _ నేను ఎంప్లాయ్  చేసిన 'బ్లూఫాక్స్ ' ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ, అధికారి ఎడ్వర్డ్ మీ జాతకాన్ని వివరిస్తూ పంపిన లేఖ. ఆ మిగతా డాక్యూమెంట్స్ శిప్పిమ్గ్స్ వేస్సల్స్ అసలు ధరా, అందులో మీకు  ముట్టిన లంచం వివరాలు"

    కొన్ని రోజులుగా తాత్సారం చేసిన హనిత ఇలా యిప్పుడు ప్రభంజనరావు కాహ్సిన్ బాక్సుకి ఆఖరు మేకుని దించేసింది.

    ఇంతసేపూ గావు కేకలు పెట్టిన ప్రభంజనరావు  ఇప్పుడు చేష్టలడిగి నిలువునా కంపించిపోతున్నాడు.

    "ఇది చాలు ప్రభంజనరావుగారూ! ఈ విషయం బోర్డు మీటింగ్ లో నేను బట్టబయలు చేస్తే చాలు. మీకు స్థానభ్రంశం కలగటమే కాదు, ఇంత పరమత వున్న మీరు కటకటాకాలు లెక్కపెట్టె దుస్థతీకలుగుతుంది, అప్పుడుడప్పుడూ మీరు అద్దంలో చూసుకున్నట్టుంటుంది. అవి జెరాక్స్ కాఫీలే కాబట్టి కావాలంటే తీసుకు వెళ్ళండి."

    అన్ని మార్గాలూ మూసుకుపోయిన ప్రభంజనరావుకి ఇప్పటికిగాని పూర్తిగా అర్ధంకాలేదు హనిత ఏమిటీ అన్న విషయం.

    నిజానికి ఆమె గురించి ఎక్కువగానే అంచనా వేశాడు కానీ ఇంత ఎక్కువగా వూహించలేకపోయాడా.

    ఏళ్ళతరబడి పేరుకున్న తన భవంతి పునాదుల్ని బలహీనం చేసింది హనిత. ఒక్క మాటలో చెప్పాలంటే తన గొంతు శాశ్వతంగా నొక్కేసింది.

    సరీగ్గా అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఈ విషయం బయటకి రాకూడదు. ఇంతవరకూ ఈ వాస్తవాన్ని వెల్లడి చేయని హనిత రేపు అలాంటి తెలివిని ప్రదర్శించకముందే సమాధి చేయాలి.

    ఆధారాల్ని కాదు __ ముందు హనితనే!

                                                                    *    *    *    *

    మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తూంది.

    తొలిసారి హనితకు కూడా కొద్దిపాటి టెన్ షన్ గా వుంది. ప్రభంజనరావు సంబంధించిన ఆ ఫైలు అంతత్వరగా అతనికి చూపించాల్సివస్తుందని ఆమె కూడ వూహించలేదు. ఇలా గెలిచానని ఆమె అనుకోవడం లేదు. ఇది పరిష్కారం కాదు. పెరిగే సమస్యలకి మూలం మాత్రమె.

    ఈ తీగ ఏ డొంకని కదిలిస్తుందీ ఆమె ఆ క్షణంలో ఊహించలేక పోతూంది.

    గదిలో ఎయిర్ కండిషనర్ చప్పుడను మించి ఆమె గుండె వేగంముగా కొట్టుకుంటూ౦ది. గ్రీకు హీరా స్నానమాడిన నీటిలా హనిత పాలబాగం నుంచి స్వేదం నిశ్శబ్దంగా జారిపోతుంటే చీఫ్ పర్సనల్ మేనేజర్ అర్జెంటుగా పిలిపించి వెంటనే ఏపార్ట మెంట్ ఆర్డర్ తయారుచేయింది.

    మరో పది నిముషాల తర్వాత ఇంటికి చేరిన హనిత తండ్రితో బాటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. కాని లంచ్ పైన ఎక్కువ ఆసక్తిని చూపించలేకపోయింది.
   
    ఆ విషయాన్ని సునాయాసంగా గ్రహించాడు సుదర్శనరావు గారు. సామాన్యంగా అయన లంచ్ చేసేటప్పుడు నౌకర్లు కాక తనే స్వయంగా వడ్డీస్తుంది హనిత. కాని యిప్పుడు ఆ దినచర్యలో మార్పు వచ్చింది.

    రెండు దశాబ్దాల పైచిలుకు తనే  అయి పెంచిన హనిత ప్రస్తుతం ఎల్మతి మానసిక సంఘర్షణకు లోనయిందీ తెలుసుకున్న సుదర్శనరావుగారు ఈ రోజు ఆమె బాధ్యత తను తీసుకుంటున్నట్టు ప్రక్కకు వచ్చారు.

    "బోంచెయ్ బేబీ!"

    ఆమె కొద్దిగా త్రోటుపడింది దొరికిపోయినట్టుగా .

    "నిర్ణయాలు తప్పు కాదమ్మా! తీసుకున్న నిర్ణయాలను శంకిస్తూ తిరిగి ఆలోచించడం తప్పు. నో సెకండ్ థాట్"    
    ఒక పారిత్రామికవేత్తగా మూడు దశాబ్దాల తన అనుభవాన్ని ఒక్క వాక్యంలో ఇమడ్చి పరోక్ష్యంగా ఆమె ఆలోచనల్నీ అడ్మయిర్ చేస్తూనే మందలించాడు.

    ఒక తారకమంత్రం విన్నట్టు చూసింది. చాలా ఆలోచనలకి  యిమ్డులో జవాబు దొరికింది. ఇప్పుడామె జరిగిందాన్ని గురించి అలోచించడం లేదు. జరగాల్సిన వాటి గురించి మననం చేసుకుంటూ౦ది.

                                                                    *    *    *    *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra