"ఎక్కడికీ?" సన్నగా, మెల్లగా సాగదీసింది మహతి. "మూవీకి" "ఏ మూవీ?" "పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే" "మళ్ళీ నా..." ఆమె తప్పు చేసినట్టు చటుక్కున నాలుక కరచుకుంది. అతని కళ్ళల్లో చీకటి నీడలు కదిలాయి. మరుక్షణంలో, ఆ చీకటి నీడల్ని చీల్చుకుంటూ నిప్పురవల్ని చిమ్మాయి అతని చూపులు. "ఏం అలా అయ్యావే? నేనా సినిమా చూశానంటే నువెందుకంత బాధపడిపోతావ్?" "వంటరిగా వెళ్ళావా?" "కాదు జంటగానే" "యూ డర్టీ...." పెదం కొరుక్కున్నాడు. హఠాత్తుగా లేచి, ఒక్కసారిగా ఆమె చెయ్యి పట్టుకుని గుంజాడు. సోఫాలో నుంచి లేచి మహతి అతడి మీద దాదాపు పడినంతపనైంది. "పద! నువు మళ్ళీ అదే సినిమా నాతో చూడాలి. పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రేయే చూడాలి" ఆమె చెయ్యిపట్టుకొని డ్రాయింగ్ రూం నుంచి బయటకు లాక్కెళ్ళాడు. "కిరణ్ ఆగు. ఆ సినిమా నిన్ననే ఎత్తేశారు" అతని చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అంది మహతి. "పురజనుల కోర్కె మీద ఈరోజు కూడా ఆడిస్తున్నాడు" అంటూ మహతిని కారు దగ్గరకు లాక్కెళ్ళాడు.    
    ఆమెను తన పక్కన కూర్చోబెట్టి కారుస్టార్టు చేశాడు. కారు మెయిన్ రోడ్డు ఎక్కింది. వేగం పెంచాడు. ముందుపోతున్న అనేక కార్లను సునాయాసంగా దాట వేస్తున్నాడు. ఎంతో ఆత్మ స్థయిర్యం తోకారు నడుపుతున్న కిరణ్ ను ఆశ్చర్యంగా చూస్తూ కూర్చుంది మహతి. రవికీ కిరణ్ కూ ఎంత తేడా? ముందున్న దాన్ని దాటుకు పోవడం కిరణ్ లక్ష్యం. ముందున్న దాని వెనుకనే వెళ్ళడం రవి లక్ష్యం. ప్రపంచాన్ని తనదారిలో నడిపించాలనే పట్టుదల కిరణ్ అణువణువునా కన్పిస్తుంది. అందుకు విరుద్దంగా నలుగురు వెళ్ళిన దారి వెంటే వెళ్ళాలనే మనస్తత్వం రవిది. అనుకున్నది సాధించాలనే పట్టుదల కిరణ్ ది. తనకు కావాల్సిన దానికోసం ఇతరుల సహాయ సహకారాల మీద ఆధారపడే తత్వం రవిది. సినిమాకు తీసుకెళ్ళడానికి రవిని తను ఎంతో బలవంత పెట్టాల్సి వచ్చింది. కాని కిరణ్! తనను..... కారు కీచ్ మంటూ సర్రున తిరిగి పార్కింగ్ ప్లేసులో ఒక్కసారిగా ఆగింది.    
    మహతి ఆలోచనలకు కూడా సడన్ బ్రేక్ పడింది. కిరణ్ దిగి మహతి కూచున్న వైపు డోర్ తెరిచి పట్టుకున్నాడు. మహతి దిగింది. మహతిని తీసుకొని బుకింగ్ కౌంటర్ వైపుకు కదిలాడు. "సర్! సర్!" ఓ కుర్రాడు కారు పార్కింగ్ టికెట్ పట్టుకొని వెనకే వచ్చాడు. "ఇంతసేపూ ఎక్కడున్నావ్? నీ కోసం ఎదురుచూస్తూ నిల్చోవాలా?" అంటూ విసురుగా రూపాయి నోటు కుర్రాడి చేతిలో పెట్టి, టికెట్ తీసుకొని ముందుకు సాగాడు విసురుగా. "రవి అయితే!" ఆమెకు గుర్తొచ్చింది. నిన్న కారు పార్కు చేసి టికెట్ ఇచ్చే కుర్రాడు వచ్చేదాకా నిలబడ్డాడు. కిరణ్ గబగబా కౌంటర్ దగ్గరకెళ్ళి రెండు టికెట్లు తీసుకొని మహతి దగ్గరకొచ్చాడు. "కమాన్ మహతీ!" అంటూ ముందుకు నడిచాడు. మహతి అతన్ని అనుసరించింది. నిన్న తనే టికెట్లుకొన్నది. రవి కారు పార్కుచేసి వచ్చి "నువు టికెట్లు తీసుకొన్నావా?" అన్నాడు. వీరిద్దరి వ్యక్తిత్వాలలో ఎంత వ్యత్యాసం? ఆలోచిస్తూ అతని వెనకే మెట్లెక్కసాగింది. క్రితంరోజు అతను తన వెనకే మెట్లెక్కడం గుర్తొచ్చి తనలో తనే నవ్వుకొంది మహతి. ఇద్దరూ సినిమా చూస్తున్నారు. సగం వరకు చూసిన పిక్చరే అయినా మహతికి ఇంట రెస్టింగ్ గానే వుంది. శ్రద్దగా చూస్తోంది. మధ్య మధ్య కిరణ్ ఏదో వ్యాఖ్యానిస్తూ మాట్లాడుతున్నాడు. మహతి వింటూనే సినిమా చూస్తోంది.    
    వెనక సీట్లో కూర్చున్న ఓ యువకుడు మహతి కూర్చున్న కుర్చీ మీద కాళ్ళు మోపి కదిలిస్తున్నాడు. మహతికి చిరాకుగా ఉంది. అయినా చాలా సేపు పట్టించుకోలేదు. వెనక కాళ్ళ ఊపు జోరుగా ఉంది. ఇక మహతి ఉండబట్టలేక పోయింది. వెనక్కు తిరిగి చూసింది. అది కిరణ్ గమనించాడు. "ఏమిటి మహతీ?" "ఏం లేదు కిరణ్!" మహతి సర్దుబాటుగా అంది. ఆమెకు తెలుసు అసలు సంగతి తెలిస్తే కిరణ్ ఏం చేస్తాడో మరో పది నిముషాలు మహతి ఓపిక పట్టి కూర్చుంది. కుర్చీ ఇంకా కదులుతూనే వుంది. మహతి వెనక్కు తిరిగి చూడలేదు. కాని కుర్చీలో ఇబ్బందిగా కదిలింది. అది గమనించిన కిరణ్ వెనక్కు చూశాడు. "మిస్టర్ ఈ కాళ్ళెవరివి? జాగ్రత్త! విరిగిపోగలవు. దగ్గరకు పెట్టుకో". కిరణ్ లేచి ముందుకు వంగి వెనక సీట్లో కూర్చున్న యువకుడ్ని దబాయిస్తున్నాడు. మహతి గాభరాపడింది. అక్కడ సీన్ క్రియేట్ కావడం ఆమెకు ఇష్టం లేదు. "కిరణ్ ప్లీజ్! కూర్చో!" చెయ్యి పట్టుకొని కూర్చోపెట్టింది. "మానర్స్ లెస్ బ్రూట్" గట్టిగా అంటూ కూర్చున్నాడు. చుట్టుపట్ల కూర్చున్నవారు తలలుతిప్పి చూశారు. మహతికి గుండెలు వేగంగా కొట్టుకొన్నాయి. ఆ తర్వాత ఆ వెనక వాడు నిజంగా వాడికి కాళ్ళు లేనట్టే కూర్చున్నాడు. కిక్కురు మనలేదు.    
    మహతి వాడిని తల్చుకొని ముసిముసిగా నవ్వుకొన్నది. ఇంటర్వెల్ లో లైట్లు వెలిగాయి. కిరణ్ లేచి వెనక వాడికేసి చురచుర చూశాడు. వాడు మాత్రం ఏమి జరగనట్టే తల వంచుకొని బయటికి వెళ్ళాడు. కాళ్ళు నిజంగా తనకుర్చీ కిందే వదిలేసినట్టు వంగి వంగి వెళ్ళాడు. "స్నీకీ బాస్టర్డ్" మహతి ఖంగారుపడింది. "కిరణ్, ఇహ ఊరుకోబాబూ! వాడు నోరుమూసుకొని వెళ్ళిపోయాడుగా? అనవసరంగా సీన్ క్రియేట్ చెయ్యకు. నీకు పుణ్యముంటుంది". "వీడూ వాడిలాంటి బాస్టర్డే" కసిగా అన్నాడు కిరణ్. "వాడెవడు?" మహతి అయోమయంగా అడిగింది. "ఇంకెవరు? ఆ రవిగాడు" మహతి త్రుళ్ళి పడింది" ఇప్పుడు రవి సంగతెందుకూ?" "వీడూ వాడిలాంటి స్నీకీ బాస్టర్డు". "కిరణ్ యు మస్ట్ స్టాపిట్. నువు మాటమాటకూ రవిని బాస్టర్డు అనడం నా కిష్టం లేదు". "అసభ్యంగా మాట్లాడితేనీ గురించి అందరూ ఏమనుకొంటారు చెప్పు?" అనునయంగా అంది. "ఓ.కే. ఓ.కే. టేకిట్ ఈజీ" "మళ్ళీ రవిని ఎప్పుడూ అలా అననని ప్రమాణం చెయ్యి" "అలాగే ఆ స్నీకీ బాస్టర్డును పూర్తిగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను" "అదిగో మళ్ళీ అదేమాట?"    
    పక్క సీట్లలో వాళ్ళు వచ్చి ఒక్కొక్కరే కూర్చోవడం చూసి ఆగిపోయింది మహతి. "సరేలే! మజా? లింకా?" "నాకు ఏదీ వద్దు" రెండు లిమ్కాలు అందుకొన్నాడు. ఒకటి బలవంతంగా ఆమెచేతిలో పెట్టాడు. లైట్లారిపోయాయి. వెండి తెర మీద భయంకరమైన వెలుగు నీడలు. రంగుల దృశ్యాలు. ఆమె ఊపిరి బిగబట్టిచూస్తోంది. ఆమె మస్తిష్కంలో ఏవేవో ఆలోచనలు. మనిషి మనసు ఇంత జటిలంగా ఉంటుందా? వెన్నకంటే మెత్తనైన మనసు ఒక్కోసారి పాషాణ తుల్యంగా ఎలా మారిపోతుంది. మనసు చెదిరిది మనిషి ఏమైపోతాడు? ఆ మనిషికి ఆ చిక్కునుండి విడిపోయే అవకాశం లేదా? "కిరణ్!" పక్కన ఉన్నవాళ్ళు కూడా తలలు తిప్పి ఆమెకేసి చూశారు. అంత పెద్దగా పిలిచినందుకు ఆమెసిగ్గుతో కుంచించుకొనిపోయింది. "మహతీ! ఏమిటి" అడిగాడు. "వెళ్దాం!" "భయంగా ఉందా?" "ఐ కాంట్  బేరిట్. నేను చూడలేను" తీరా ఆ మాట అన్న తర్వాత రవి గుర్తొచ్చాడు ఆమెకు. రవి కూడా నిన్న సరిగ్గా ఇలాగే అన్నాడు. అతడన్న మాటే తనూ అంది. అతను కూడా తనలాగే ఫీలయ్యాడా? లేక అతనిలో రేగిన భావ పరంపరలు తన మనసును ఇంకా చుట్టుకొనే ఉన్నాయా? "ఆల్ రైట్, వెళ్దాంపద" కిరణ్ లేచాడు. అతని వెనకే నడిచి మహతి థియేటర్ బయటికి వచ్చింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra