Home » Suryadevara rammohan rao » మొగలి బాకు

  

    "ఏంటి మారిపోయింది" అడిగింది సంధ్య.
   
    "ఏంటి..... మారిపోవడం ఏంటి__ఏదీ మారలేదు.....అంతా బాగానేవుంది...... ఇక్కడంతా క్షేమమన్నమాట అదంతే."
   
    "అంటే నేను నచ్చానా?" మెల్లకన్నుతో, కన్ను గొడుతూ అంది సంధ్య.
   
    "నచ్చడం అంటే....." ఏదో చెప్పబోయిన నారాయణరావు నోటిని తన చేతితో మూసేసి హనుమాన్లు-
   
    "చూడండి పెళ్ళిపెద్దలూ, ఆడపిల్లకు వినయం, వందనంముఖ్యమన్నారు. మీ పిల్ల ప్రశ్నకు ప్రశ్నా, జవాబుకు జవాబు చెబుతోంది. రేపు మా ఇంటికొచ్చాక ఇలాగే ప్రవర్తిస్తే.....మా వాడికి మనశ్శాంతి లేకుండా పోతుంది.
   
    అంచేత__మా బడుద్దాయి తరుపున నేను చెప్పేస్తున్నాను......మాకు.....మీ సంబంధం ఇష్టంలేదు" నారాయణరావు కోపంగా హనుమాన్లు వేపు చూసి-
   
    "పీక పిసికి కాలవలో పారేస్తానన్న వెధవ......నువ్వెవడివిరా నా యిష్టాయిష్టాలు గురించి చెప్పడానికి .....నాకు ఆ పిల్ల" నారాయణరావు మాటను నోట్లోంచి రాకుండా హనుమాన్లు చేసేసరికి నారాయణరావుకి విపరీతంగా కోపం వచ్చేసింది.
   
    అంత లడ్డూల పళ్ళాన్ని కాలితో దభ్ మని తన్నాడు.
   
    అదెల్ళీ పెళ్ళికూతురు ఒడిలో పడింది. వాంటెడ్ గాన్ తన మీదకు ఆ పళ్ళాన్ని షారుఖ్ విసిరాడనుకొని సంధ్య తన దగ్గరున్న మైసూర్ పాకుల పళ్ళాన్ని విసిరికొట్టింది.
   
    దాంతో పెళ్ళిపెద్దల మధ్య కూడా రోషాలు పెరిగి పోయాయి.
   
    "తలతిక్క ప్రశ్నలు, తలతిక్క పెళ్ళికొడుకును నాలుగు తగిలీయండర్రా వీడ్ని" ఎవరో అరిచి పసుపు ప్లేటును ఎత్తి కొడతారు. దాంతో పెళ్ళి కొడుకు మనుషులు కూడా వీరంగం ఆడడం ప్రారంబించారు. తనొచ్చిన కార్యం నూటికి నూరుపాళ్ళూ విజయవంతం కావడంతో గబగబా లేచి పరిగెత్తింది లోపలి గదిలోకి సంధ్య.
   
    అప్పుడు చూసాడు నారాయణరావు ఆమెను-
   
    ఆమె కుంటికాలుతో పరుగెత్తలేదు__మామూలుగానే పరుగెడుతోంది.
   
    "హమ్మ....ఇదేదో డ్రామాలా వుందే......" అని లేచి, ముందుకి పరుగెత్తబోయాడు.
   
    సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుండో వచ్చిన కుంకుమభరిణ తన కళ్ళద్దాలకు తగిలింది.
   
    దాంతో రేబాను గ్లాసు పగలడం, నుదుటికి గుచ్చుకోవడం, రక్తం కారడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఆ వెంటనే స్పృహ తప్పింది అతనికి.
   
    "వీడ్ని హాస్పిటల్ కు తీసికెళ్ళండి" ఎవరో అరిచారు. అంతే ఎవరో నారాయణరావుని ఎత్తి కారులో పడేసారు. వెంటనే కార్లన్నీ వరసగా ఆ ఊర్నించి విశాఖపట్నానికి బయల్దేరాయి.
   
    మధ్యలో మెలుకువ వచ్చిన నారాయణరావు పక్కనే ఉన్న హనుమానల వేపు చూసి-
   
    "వెధవ నోరు.... వెధవ నోరని.... వస్తున్నప్పుడు చావుయాత్రని దీవించావుగా..... చూడు ఎలాగయిందో.... ఈ నెల జీతం, టి.ఎ.,డి.ఎ. అన్నీ కట్.... అఘోరించు....." అని బాధగా మూలిగి పడుకుండిపోయాడు.
   
    "ఆ జాలినాయుడు దగ్గర్నుంచి బిల్లులన్నీ వసూలు చేయాల్సింది నేను.....జాగ్రత్త....." గొణుకున్నాడు హనుమాన్లు.
   
                                        *    *    *    *
   
    పాత కాలపు ఫ్యాన్ రెక్కలు టపక్ టపక్ మని కొట్టుకుంటుంటే ఫట్ మన్నట్టుగా తెలివొచ్చింది నారాయణరావుకి.
   
    తను చచ్చిపోయి స్వర్గలోకంలో వున్నాడో, బతికి భూలోకంలో వున్నాడో అర్ధం కాలేదు. ఎదురుగా నర్స్ చెవిలో గుసగుసలాడుతూ హనుమాన్లు కనిపించేసరికి ఆ గుసగుసలు విషయమై అనుమానంగా హనుమాన్లవేపు చూసాడతను.
   
    "మా గురూ లేచాడు" కన్నీటి బాష్పాలులేని ఆనందాన్ని వ్యక్తంచేసి, నర్స్ పక్కనుంచి బెడ్ పక్కకొచ్చి-
   
    "పరవాలేదుగురూ! గుండెలో ట్యూబులేవో తెగడంతో నువ్వు చచ్చిపోతావేమోనని డాక్టరుగారు డౌట్ ను వ్యక్తం చేయగా నువ్వు బతకాలని, బతికితే, బావుంటుందని అన్ని దేవుళ్లకూ దండం పెట్టుకున్నాను. ఈ నర్సమ్మకూడా నా వెనక సదరు గుళ్ళకు వచ్చిందిలే కావలిస్తే అడుగు" కిచకిచమని నవ్వుతూ చెప్పాడు హనుమాన్లు.
   
    గుండెలో ట్యూబులెందుకుంటాయో, అవ్వెందుకు తెగాల్సిన అవసర మొచ్చిందో అర్ధంకాక, హనుమాన్ల పక్కన అంత మందంగా నవ్వుతూ, నల్లముద్దబంతి పువ్వులా వున్న పిల్లవేపు చూశాడు నారాయణ రావు.
   
    "అవునండి......పాపం మీరు బతకాలని, హనుమాన్లుగారు, నారదుడిగుడి కెళ్ళి నలభై కొబ్బరికాయలూ, అరవై అరటిపళ్ళూ కొట్టారండీ....." ముద్దుముద్దుగా చెప్పింది ఆ ముద్దబంతి.
   
    "అరటిపళ్ళుకూడా కొట్టారా....." అనుమానంగా అడిగాడు నారయణరావు.
   
    "బైదిబై మైబాస్ నారాయణరావు ఈవిడి ప్రస్తుతానికి నర్సు బాల సుబ్బలక్ష్మి......మధురానగర్__ ఎల్. ఐ. జీ క్వార్టర్స్ లో ఒంటరిగా ఉంటోంది" ముసిముసిగా బాలసుబ్బలక్ష్మివైపు చూసి చెప్పాడు హనుమాన్లు_సదరు సుబ్బలక్ష్మి కూడా అదే ఎఫెక్టుతో చూసింది హనుమాన్లవేపు.
   
    "డాక్టర్ని తీసుకొస్తాను" గబగబా ఆ రూమ్ లోంచి బయటికెళ్ళి పోయింది నర్స్ బాలసుబ్బలక్ష్మి.
   
    "ఎవర్రా.....ఈ బాలసుబ్బలక్ష్మి......చుట్టరికం కలిపేసావా" మంచంమ్మీద లేచి కూర్చుంటూ అడిగాడు నారాయణరావు.
   
    "గురూ.....అదో పెద్ద కథ.....మా ఇద్దరి కలయికకూడా నువ్వే కారణం......ఇప్పుడు మా సుబ్బలక్ష్మి నేనూ ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో.....నీకు తర్వాత తీరుబడిగా చెప్తాను__ముందు నువ్వు ఓ వారం రోజులు రెస్టు తీసుకో" సానునయంగా అన్నాడు హనుమానులు.
   
    "వారం రోజులు రెస్టా__అసలు నాకేం అవలేదుగదా?" నీరసంగా అన్నాడు నారాయణరావు.
   
    "నీకేం అవలేదు గురూ....చిన్న దెబ్బ అంతే....కానీ ఈ నర్సింగ్ హోంకి వచ్చాక, మా బాలసుబ్బలక్ష్మిని చూసాక, నా హార్ట్ లో పెద్ద గాయం అయిపోయింది బాస్......ఆ గాయం మానాలంటే"
   
    "ఆ గాయం మానాలంటే.....నువ్విక్కడ తగలడు......నేవెళతా" బెడ్ మీంచి లేచాడు విసురుగా నారాయణరావు.
   
    "అయితే నువ్వు వెళ్ళడానికే నిర్ణయించుకున్నావా.....మా లవ్ ఇంకా పక్వానికి రాకముందే వెళ్ళిపోతావా" బాధగా అడిగాడు హనుమానులు.
   
    "తప్పదు....." ఈ నిర్ణయానికొచ్చేసి, గబగబా ముందు కడుగేసాడు నారాయణరావు.
   
    "నర్సింగ్ హోం బిల్లు" గొణిగాడు హనుమానులు.
   
    "నువ్వూ, బాలసుబ్బలక్ష్మి కల్సియిచ్చుకోండి.....నే వెళుతున్నా" అప్పుడే లోనికి రాబోతూ, విసురుగా బయటికెళ్ళిపోతున్న నారాయణ రావు వేపు ఏం జరిగిందో అర్ధంకాక చూస్తుండిపోయింది నర్స్ బాల సుబ్బలక్ష్మి.
   
    రేపు కలుస్తాను......బిల్లు గురించి చర్చిద్దాం" బాలసుబ్బలక్ష్మితో చెప్పేసి నారాయణరావు వెనక పరుగెత్తాడు హనుమానులు.
   
                                             *    *    *    *
   
    ఆటో కొత్తరోడ్ మీదుగా వెళుతోంది__
   
    హాస్పిటల్ గొడవలో పడి, అంతవరకూ మరిచిపోయిన జాబాలినాయుడు అనే జాలి నాయుడి..... ఇతివృత్తం జ్ఞాపకానికొచ్చింది నారాయణరావుకి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra