Home » Suryadevara rammohan rao » Erra Samudram

 

    కర్తవ్యం గుర్తుకొచ్చిన దీపక్ వడివడిగా సత్తెయ్య ఇంటి ముందు కొచ్చి తలుపు తట్టాడు. మరోరెండుసార్లుతలుపు తట్టాక తెరుచుకున్నాయి.
    ఎదురుగా సత్తెయ్య.
    సత్తెయ్య ఓ అడుగు బయటకు వేసి రెండు వేపులా చూసి నిశ్శబ్దంగా లోపలకు రమ్మనట్లుగా సైగచేసాడు.
    ఇద్దరూ లోపలకెళ్ళి ఎదురెదురుగా కూర్చున్నారు.
    దీపక్ రాజ్  జేబులోంచి నిట్లకట్ట బయటకు నర్మగర్భంగా  సత్తెయ్య వేపు చూస్తూ  అతని  ఒళ్ళోకి విసిరేశాడు.
    సత్తెయ్య  ఓసారి  ఆ నోట్లకట్టను రెండు  చేతులతో ఆప్యాయంగా తడిమి చూసుకొని బెడ్ లైట్ వెలుగులో దీపక్ రాజ్  మొఖంలోని భావాల్ని వెతికేందుకు ప్రయత్నిస్తున్నాడు.
    "ఈ  కట్టేకాదు- ఇంకా ఇలాంటి కట్టలు నీకు చాలా అందుతాయి" దీపక్ రాజ్  పాము బుసకొడుతున్నట్లుగా  మాట్లాడుతున్నాడు.
    "నిజమే-మీరెన్ని  కట్టలైనా ఇవ్వగలరు. అయితే నేను చేయగలిగేది చాల కష్టం మీద చిన్న పని కాని ఆ సామంత్ విషయంలో మాత్రం నేనేం  చేయలేను. నేనే కాదు-ఎవరూ ఏం చేయలేరు___" మెల్లగా అంటున్నా స్పష్టంగా వున్నాయి సత్తెయ్య  మాటలు.
    దీపక్ రాజ్  మౌనంగా  ద్వారబంధంలోంచి దూరంగా కనిపిస్తున్న స్మశానంవేపే చూస్తున్నాడు.
    ఆ ఇంటి బయట  జీప్ లో  బిర్క్ , సరస్వతి, హసీంఖాన్  దీపక్ రాజ్  కోసం  ఎదురుచూస్తూ క్షణాలు లెక్కిస్తున్నారు.
    దీపక్ రాజ లేచాడు-
    "నీవు చేయగలిగింది నీవు చేయ్. సామంత్ సంగతి నేను చూసుకుంటాను."
    "అదంత తేలిక కాదు."
    "ఇది భారతదేశం, జపాన్, కొరియా, లైవాన్ కాదు____"
    "అయినా సరే. పై పెచ్చు మనమీ ప్లాన్ వేస్తున్నట్లుగా పసిగట్టారంటే మనల్ని  ఇక్కడే సమాధి  చేసి నా ఇంటిని  స్మశాన ప్రాంగణంలో కలుపుతారు" సత్తెయ్య భయపడుతున్నాడు.
    "అంత అండ ఉందా సామ్రాట్ కి?"
    "చిటిక వేస్తే  చాలు లక్షలు చేతులు నిప్పుపిడికిళ్ళవుతాయి. ఐనా మా యజమాని మరేబాధ  లేకుండా, అన్ని బెనిఫిట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ వస్తున్నారు. సమ్మె ప్రారంభించటానికి ఏ కారణాన్ని చూపాలి?"
    "కారణాలుండే ఈ దేశంలో సమ్మెలు జరుగుతున్నాయా? జీతాలు పెరగటానికి స్టేట్ లో రాష్ట్ర పతిపాలన విధించటానికి సంబంధంవుందా?"
    సత్తెయ్య మౌనంగా వింటున్నాడు.
    "ఆర్రూపాయల ఇంక్రిమెంట్ కోసం అరవై  ఆరు బస్సుల్నీ  తగల బెట్టె దేశభక్తులున్న దేశం మనది. ఎంతోమంది ప్రజలు ఎన్ను కొన్న ప్రజా ప్రభుత్వాన్ని ఓ అల్పసంఖ్యావర్గం జీతాలు పెంచలేదని రాష్ట్రపతి పాలన విధించాలనే స్థితికి వెళ్ళిన అరాచకత్వం మనది. ఇది మన  మాతృదేశం-ఇది బాగుపడాలి-జపాన్, కొరియాలా కావాలి అన్న ఆలోచన ఏ ఒక్కడిలో లేదు.
    ఎవరి పబ్బం వారు గడుపుకుంటె చాలు. సందట్లో సడేమియా గాళ్ళు- అంటే మనలాంటి వాళ్ళే ఎక్కువ. ఈ బురదగుంటలో సామ్రాట్  ఒక్కడూ  మిగలిపోగలడా?" పరిహసిస్తున్నట్లుగా అంటూ పైకి లేచాడు దీపక్ రాజ్.
    "ప్రయత్నంచి  చూస్తాను....." అన్నాడు సత్తెయ్య.
    "జాగ్రత్త....చాపకింద నీరులా  మన పధకం ముందుకు  సాగాలి. వస్తాను" అంటూనే  రెండంగల్లో బయటకెళ్ళిపోయాడు దీపక్ రాజు.


                                                            *    *    *


    (బొంబాయి టెక్స్ టైల్ పరిశ్రమలోవున్న లక్షలాదికార్మికులకు ఏరోజు ఎందుకుతాముసమ్మె చేయాలో ఎవరికీ తెలియదు . ఎక్కడి  నుండో ఓ వార్త వస్తుంది. ఆ మరుక్షణం తాము పనులు  మానేసి బయటకు వచ్చేయాలి-కారాణాలు వెతికేవారు మరుసటి రోజుకు ఉద్యోగాన్నయినా పోగొట్టుకుంటారు-లేదా శవాలుగానైనా మారతారు, టెక్స్ టైల్  అండర్ వరల్డ్ అట్టడుగు పొరల్లో కదలికలను తెచ్చే అతి  ప్రమాదకరమైన ఆ  వ్యక్తి ఒకప్పుడు మహామేధావి, మానవతావాది.
    కోట్లకు పడగలెత్తిన బట్టలపరిశ్రమ యజమానులైనా అతన్ని మంచిచేసుకుని ముందుకుసాగాల్సిందే.
    విమల్ కంపెనీ ధిరూభాయి అంబాని అయినా, ఆర్కే (O R K A Y) కంపెనీ చైర్ మెన్ కపాల్ మెహ్రా అయినా,  డి.సి.ఎమ్ (ది ఢిల్లీ క్లాత్  అండ్ జనరల్ మిల్స్  కంపెనీ లిమిటెడ్) భరత్ రామ్ అయినా,  ఆ వ్యక్తితో సామరస్యంగా మెలగాల్సిందే.
    కంపెనీలున్నా. యంత్రాలున్నా, పెట్టుబడులున్నా, లైసెన్స్ లిచ్చే ప్రభుత్వలున్నా అప్పులిచ్చే బ్యాంకులున్నా, అండగా నిలిచే ఆర్థిక సంస్థలున్నా (పైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్), కొనే వినియోగదారులున్నాకోట్లకు కోట్లు లాభాలున్నా, దేశసంపద  పెరిగే అవకాశాలున్నా ఫలితం శూన్యం వీటన్నింటిని కో ఆర్డినేట్ చేసే బలమైన  శక్తి కార్మికవర్గానిది
    ఆ కార్మిక వర్గం ఆ వ్యక్తిచేతిలో ఆటబొమ్మలు-జీవంవున్న ముడి పదార్ధాలు.
    అతనంటే లోలోపల కసి, కోపం, ద్వేషంవున్నా వాటిని లోలోనే  సమాధి చేసుకొని ముందుకు సాగాలి ఎవరైనా.
    అతడు తలుచుకుంటే కొత్త ఫ్యాక్టరీల్ని స్థాపించగలడు. ఉన్న వాటిని  కనుసైగతో మూయించనుగలడు.
    కట్టల కట్టల కరెన్సీ నోట్లపై నడుస్తున్నా, ఖరీదైనా కార్లలో తిరుగుతున్నా అతని కర్ర పెత్తనానికి భయపడాల్సిందే.
    అతనే దిగ్రేట్ యూనియన్ లీడర్ దత్తా సామాంత్ (బొంబాయి).
    అపారమైన వనరులున్నా ఆర్థికంగా ముందుకు రాలేకపోతున్న దేశ ఆర్ధిక వ్యవస్థ కాళ్ళను ఎవరు  విరగ్గొడుతున్నట్లు?.......)
    ఉదయం  తొమ్మిది గంటలు కావటానికి మరొక్కనిమిషమే వుంది. కార్ల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.
    ఈ రోజుకి ఆ కంపెనీ చరిత్ర ఓ ప్రముఖ స్థానం ఏర్పడబోతోంది.
    కొన్ని వేలమంది కార్మికుల కలలపంట కోరూపం ఏర్పడబోతున్న రోజు.
    మరికొన్ని వేళమంది నిరుద్యోగులకు బతుకు తెరువు చూపించబోతున్న  అతి ముఖ్యమైన రోజు.
    ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టరర్స్ ఎనిమిదిమందీ వారివారి వ్యక్తిగతమైన పనుల్ని వాయిదా వేసుకొని అటెండ్ అవుతున్నారు.
    అందరూ  అప్పటికే బోర్డ్ హాల్లో సమావేశమయ్యారు. చైర్ మెన్  సీటుమాత్రమే ఖాళీగా ఉంది.
    ఎజెండాలో ఆ రోజు సమావేశంలో చర్చించబోయే పాయింట్స్ ముందే తెలిసినా, అప్పటికప్పుడు చైర్ మెన్ భూపతిరావు స్పెషల్ చైర్ పవర్స్ ఉపయోగించి తీసుకొచ్చే కొత్త పాయింట్స్ పైనే ఆ ఎనిమిది మంది డైరెక్టర్స్ దృష్టి
    భూపతిరావు బిగ్ బిజినెస్-అతని ఆలోచనలన్నీ  ఎవరూ పసిగట్ట లేని విధంగా ఉంటాయి.
    బిజినెస్ లో బాధ్యత -కార్మిక సంక్షేమం- దేశసంపద....నేషనల్ ప్రోడక్టవిటి- క్వాలిటి స్టాండర్డ్స్ అంటూ అప్పుడప్పుడే అనే అతని మాటలే డైరెక్టర్స్ లో  కొంతమందికి ఇబ్బందిగా ఉంటాయి.
    అయినా భూపతిరావు సామర్థ్యం తెలిసిన వాళ్ళు కావటం, అతనికి బిజినెస్  సర్కిల్లో, ప్రభుత్వం ఉన్న పలుకుబడి మూలంగానే కిమ్మనకుండా ఉండిపోతారు.
    భూపతిరావు కంపెనీల చరిత్రలో సమ్మె అనే మాట ఎప్పుడూ వినిపించలేదు. సత్యరాజులాంటి యూనియన్ లీడర్ సయితం ఒక్క సారన్నా సమ్మె తీసుకురావాలని ప్రయత్నించి విఫలమైపోయాడు.
    అప్పటినుండి సత్యరాజు విషపుచూపులన్నీ భూపతీరావుకంపెనీల మీదే.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra