Home » D kameshwari » Aruna

    "వేణూ నీకర్ధం కాదు....... నీవూ ఒక డాక్టరవయి ఉండి కూడా నన్ను సమర్ధించకపోవడం నా దురదృష్టం."
    "వద్దు అరుణా, ఇంకా చెప్పకు నీవు నాకు పూర్తిగా అర్ధం అయ్యావు. నీవన్నట్లు మన ఆలోచనలు, మనదృక్పథం వేరు కలవనిమనబాటలు కలపడానికి ప్రయత్నించి లాభంలేదు. సమానాంతర రేఖలు ఎన్నటికీ కలవవు. హు! ప్రయోజనం లేని దానిని గూర్చి చించిఇంకా మనసు పాడుచేసుకోవద్దు:" సంభాషణ తుంచేశాడు.
    గంభీరంగా ఫాంటు జేబులోచేతులు పెట్టుకుని తల వంచుకుని నడవసాగాడు వేణు...... పక్కన అరుణ ఉన్నదన్నసంగతే గుర్తులేనట్లు. ఎప్పుడూ నవ్వుతూ, చేతులు కలుపుకుని రోడ్డుమీద వరకు నడిచేవాళ్ళు ఇద్దరూ. వేణు గంభీరత చూసి ఏదో చెప్పాలని ప్రయత్నించి చెప్పలేక, ఊరుకుంది అరుణ.
    రోడ్డుమీదకు వచ్చే వరకు ఎవరూ మాట్లాడలేదు. నాలుగు అడుగులు వేయగానే ఎదురయిన ఓ రిక్షాని ఆపాడు వేణు. "రిక్షాలో ఇంటికి వెళ్ళు అరుణా నాకు కాస్త పని ఉంది తరవాత వెడతాను" అన్నాడు.
    అరుణ మొహం తిప్పుకుని ఎక్కి కూర్చుంది మౌనంగా ఎప్పుడూ ఇద్దరూ అరుణ ఇంటివరకు నడిచేవెళ్ళేవారు.
    మహారాణి పేటడౌనులో అఫిషిల్ కాలనీకి బీచి దగ్గిర. ఇద్దరూ నడిచి వెళ్ళడం, రావడం అలవాటు: ఆ అలవాటుకు భిన్నంగా రిక్షాలో వెళ్ళమన్నాడంటే తనతో రావడం ఇష్టం లేదన్నమాట. అరుణ మనసు చివుక్కుమంది అందుకే మారు మాట్లాడకుండా రిక్షా ఎక్కింది.
    "గుడ్ నైట్ కాదు గుడ్ బై అరుణా!" అని చెప్పి గిరుక్కున వెనుదిరిగాడు వేణు.
    అరుణ రిక్షా దిగి ఇంట్లోకి అడుగుపెడుతూంటే గేటుదగ్గరే పక్కింటినించి ఏడుపులు వినిపించి, ఒక్కక్షణం అయోమయంగా చూస్తూ నిలుచుంది. అంతలోనే కమలమ్మవాళ్ళింట్లోంచి వచ్చింది గుమ్మంలో కూతురిని చూస్తూనే......."పాపం వాళ్ళ జానకిపోయిందట. పలుకరించివస్తున్నాను" అంది.
    అరుణ ఒక్కక్షణం తెల్లబోయింది"జానకి...... జానకి చనిపోయిందా? ఎలా పోయిందమ్మా? ఏం జరిగింది" ఆందోళనగా అడిగింది.
    "పాపం: పెళ్ళయిన ఏడేళ్ళకి కానుపు వచ్చిందని సంతోషించారు అందరూ. ఇంకా ఏడోనెలవెళ్ళకుండా, పసుపు కుంకుంఇచ్చి పురిటికి తీసుకొద్దామని అనుకుంటూనే ఉన్నారు ఈ లోపలే ఈ ఘోరం......"
    "ఏమయిందమ్మా? ఎలా పోయింది?"
    "ఏడో నెలట ఇప్పుడు. నొప్పు లొచ్చాయిట. పురుడొస్తుందని మంత్రసానినిపిలిచారట. అదో వెధవ ఊరు...... డాక్టరు ఎవరూ లేరట. ఆ మంత్రసానికి సరిగా ఏం తెలుసు? ప్రాణాలమీదికి వచ్చేవరకు అదేం చెప్పలేదట. నొప్పులు సరిగా రాక, బిడ్డ అడ్డం తిరిగి ఎగఊపిరి పుట్టిప్రమాదం ముంచుకువచ్చాక అప్పుడు తనవల్లకాదని చెప్పిందట వీళ్ళు అప్పటికప్పుడు ఏం చేస్తారు? డాక్టరు ఎవరూ లేరట....... చుట్టూపక్కల ఇరవై మైళ్ళవరకు. ఆ డాక్టరుని తీసుకొచ్చేలోపలే....." అరుణస్థాణువై ఉండిపోయింది. ఈ మాత్రం దానికి మనిషి చచ్చిపోవలసినంత ప్రమాదం ఏం లేదు ఇలా ఎన్నో కేసుల్లో జరుగుతూనే ఉంటుంది.
    కేవలం సరి అయిన వైద్య సహాయం లేక జానకి చచ్చిపోయింది.....బలవంతంగా చంపేసినట్లేనిండు ప్రాణం నూరేళ్ళు బ్రతకవలసిన మనిషి అన్యాయంగా చచ్చిపోయింది. అరుణ మనసు బాధగా మూలిగింది. జానకీ, తనూ స్కూల్ ఫైనల్ వరకు కలిసి చదువుకున్నారు. పక్క పక్క ఇళ్ళు కావడంవల్ల చాలా సన్నిహితంగా ఉండేవారు. జానకిని స్కూల్ ఫైనల్ కాగానే పైకి చదివించకుండా ఓ భూ కామందు గారిసుపుత్రుడితో పెళ్ళిచేసేశారు. జానకి ఇంకా చదువుకుంటానని గోల పెడుతున్నా: తనింకా చదువుకుంటూనే ఉంది అప్పుడే జానకికి పెళ్ళి చావు...... అన్నీ అయ్యాయి ఆమె జీవితం అసంపూర్తిగా ముగిసింది. పాపంజానకి ఆ పల్లెటూరిలో కాకా ఇక్కడే ఉంటే తప్పక బ్రతికి ఉండేది. ఈ రోజు జానకి తనకి తెలిసిన మనిషి కాబట్టి ఇలా విచారిస్తూంది.
    రోజుకి ఇలా జానకి లాంటివారు ఎంతమంది అనవసరంగా మృత్యువాత పడుతున్నారో తగిన వైద్య సహాయంతగిన సమయానికి లభించక ఎన్నివందల మందిరోజు రోజుకి ప్రాణాలుపోగొట్టుకుంటున్నారో! ఇలాంటి స్థితిలో ఉన్న పల్లెటూళ్ళ నితను సదుద్దేశంతో ఉద్దరించుదామని నడుం కట్టుకుంటేతనకి ప్రోత్సాహమిచ్చేవారే కనబడటంలేదు. తన ఆలోచనలన్నీ సమర్ధించేవారు లేరు. తను చేయబోయేదిమంచిపని అన్నవారేలేరు. ఏం మనుషులో? నిట్టూర్చింది అరుణ ఆ రాత్రి ఆలోచిస్తూ అసలే వేణుతో సంభాషణ తరువాత కలతబడిన అరుణ మనసు జానకిమరణంతో దానికి కారణం తెలుసుకున్నతరువాత మరింతకలతబడింది. ఆ రాత్రంతా జాగారమేఅయింది అరుణకి.
                                                            *    *    *
    తరువాత పదిహేనురోజుల వరకు అరుణమామూలు మనిషికాలేకపోయింది. తనువేణుని నిరాకరించి పొరపాటు చేశానేమోనన్నభావం ఆమెకి శాంతినీయడం లేదు. నిలుచున్నా కూర్చున్నా వేణు రూపమే సాక్షాత్కరించసాగింది. సంవత్సరం నించి ఏర్పరచుకున్న మమతానురాగాలని తన చేత్తోతనే తుంచేసుకుంది: తుంచడం అంటే తుంచింది కాని, ఆ జ్ఞాపకాలు ఆమెని విడిచిపెట్టడంలేదు. వేణుజ్ఞాపకాలని మనసులోంచితుడిచేయడం ఆమె అనుకున్నంత సులభం కాలేదు. తనుచేయబోయేది చాలా మంచి పని అని, దాని కోసం వేణుని వదులుకోవడంలో తప్పేం లేదని తనని తను నమ్మించుకోడానికి ప్రయత్నించేది.
    ఆరోజునించి వేణుతనతో మాట్లాడకపోవడం, తనని చూసి మొహంతిప్పుకుని వెళ్ళిపోవడం, ఎదురుపడినా పలకరించకపోవడం అరుణకి అన్నింటికన్నా ఎక్కువ కష్టం కలిగించాయి. అరుణ డ్యూటీలో ఉండగా రౌండ్స్ కి వచ్చే వేణు, ఆమెని విష్ చేయడంకూడా మానాడు. ఎప్పటిలా నవ్వుతూ మాట్లాడటంలేకపోగా గంభీరంగా మొహం పెట్టేవాడు. మాట్లాడవలసి వస్తే ఓ డాక్టర్ హౌస్ సర్జన్ తో మాట్లాడినట్లు, ప్రశ్నించి నట్లు మాట్లాడేవాడు రోగుల గురించి. అరుణ ఎంతో నొచ్చుకుంది. మూడేళ్ళ పరిచయమేతమది ఏం, వివాహం చేసుకోనంత మాత్రాన కనీసం స్నేహితులుగానైనా ఉండకూడదా? తనేదోతప్పు చేసినట్టు అలా తప్పించుకుని ఎందుకు తిరగడం?
    వారంరోజులు చూసి ఇంక ఓర్చుకోలేకపోయింది అరుణ. ఆ రోజు నైట్ డ్యూటీ సర్జికల్ వార్డు నించి వస్తూంటే, పేడియాట్రిక్స్ నించివస్తూ ఎదురుపడ్డాడు వేణు. అరుణని చూసి మొహం తిప్పుకుని పక్కకి తిరిగి మెడికల్ వార్డులోకి వెళ్ళబోయాడు వేణు. అరుణ ఇటుఅటు చూసి ఎవరు లేరని నిర్ధారణ చేసుకుని వేణు దగ్దరికి గబగబవెళ్ళింది. "వేణూ! నీతో కాస్త మాట్లాడాలి. అలా రూముకి వెళదాం, వస్తావా?" అంది వేణుచిత్రంగా చూశాడు. "నాతో మాటలా? ఇంకా ఏమున్నాయి మన మధ్యమాటలు?" అదోలా అన్నాడు. హర్ట్ అయింది అరుణ "ఎందుకలామాట్లాడతావు వేణూ: ఇంకే భావంలేకపోయినా మనమధ్య స్నేహభావానికన్నా చోటు ఉండకూడదా? ఈ వారం రోజులనించి ఎందుకునన్ను తప్పుకుని తిరుగుతున్నావు? అంత చేయరాని అపరాధం నేనేం చేశాను?" కంపిస్తున్న గొంతుతో అడిగింది. ఒక్క క్షణం వేణు అరుణ ముఖంలోకి చూశాడు.
    "అరుణా: నీతో స్నేహంగా ఉంటూ ఇంకే భావాలకి చోటీయకపోవడం నా చేతకానిపని: అంత హృదయవైశాల్యం నాకు లేదు. నిన్ను స్నేహితురాలిగామాత్రం చూడడం అసంభవం: ఎక్స్యూజ్ మీ: వస్తా ఐసాలేషన్ వార్డునించి మెమో వచ్చింది. వీళ్ళకి:" గబగబవెళ్ళిపోయాడు వేణు.
    అవమానంతో అరుణ మొహంఎర్రబడింది: పెదాలుబిగబట్టి లోనించి ఉబికి వచ్చే దుఃఖోద్వేగాన్ని అదిమిపట్టింది. ఎంతలా మారిపోయాడు వేణు ఒక్కసారిగా తనింతశత్రువయిపోయిందా? తనుమంచిపని చేద్దామని ఆశిస్తే అందరూ తనని ఎన్ని విధాల నిష్టూరపరుస్తున్నారు?
    ఇంట్లో తల్లి, తండ్రి, అన్న....... అందరూ ఈ వారం పదిరోజులుగా తనచేత ఆ ఉద్దేశంవిరమింపచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వేణైనా తన పక్షం నిలుస్తాడన్న తన ఆశ. అతడు మొదట్లోనే తుంచేశాడు: తన ఆశయానికి అన్ని విధాల ఆదిలోనే ఆటంకాలు ఎదురుపడడం తన దురదృష్టం నిట్టూర్చి నెమ్మదిగా డ్యూటీరూము వైపు నడిచిందిఅరుణ.
    హు ఇలాంటి వాటికేతను బెదిరిమనసు చెదిరితే ఇకముందు తనేం చేస్తుంది?
    ఏమిచెయ్యగలుగుతుంది? ఇలాంటి వన్నీ మనసుకి పట్టించుకుని బాధపడడం మొదలిడితేతన ఆశయానికి తిలోదకాలిచ్చేసి, నాన్న, అమ్మ చెప్పినట్లుబుద్దిగా పెళ్ళాడి, ఆ భర్తగారు చెప్పినట్లునడుచుకోవాలి.
    వీల్లేదు. తనెవరిని లెక్కచెయ్యదు యెవరి మాటలు లక్ష్య పెట్టదు. ఎవరెన్ని నిష్టూరాలు ఆడినా తను పట్టించుకోదు, తన ఆశయం నెరవేర్చుకోవడమే ఒక్కటే తన ధ్యేయం:
    "అమ్మగారూ:"
    పిలుపు విని ఈ లోకంలోకి వచ్చింది అరుణ. ఫిమేల్ వార్డునించి మెమో పుస్తకం పుచ్చుకుని ఆయా వచ్చి నిలుచుంది. పుస్తకం అందుకుని చూసింది. సాయంత్రం అడ్మిట్ అయిన బర్ న్స్ కేసు ఆవిడికి సీరియస్ గా ఉందని మెమో: సంతకం పెట్టి "వస్తున్నాపద" అంది అరుణ.
                                                             * * *
    కూతురు తో పెళ్ళి ప్రసక్తి తీసుకురావాలని రామారావుగారు ఈ వారం పదిరోజులనించీ అనుకుంటూనే ఉన్నారు. ఆ రోజునించి అరుణ అదోలా ఉండడం గమనించారు ఆయన. గంభీరంగా ఎవరితోమాట్లాడకుండా, మౌనంగా ఆలోచిస్తూ ఇంట్లో ఉన్నంత సేపూ గదిలోనే గడుపుతూండడం చూసి, కూతురు మూడ్ ఎందుకోబాగులేదని ఆయనగ్రహించారు. ఆ సమయంలో పెళ్ళి ప్రసక్తి తీసుకువస్తే అరుణ సవ్యంగా జవాబు చెప్పేదేమో ననిపించింది ఆయనకి. ఎలా ఆ ప్రసక్తి తీసుకురావడం అని ఆయనమధన పడుతున్నారు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra